విశాఖ ఉక్కు రక్షణ ఆంధ్రుల హక్కు
Followers
విశాఖ ఉక్కు రక్షణ ఆంధ్రుల హక్కు
ఖమ్మం, వరంగల్, నల్గొండ శాసన మండలి
*ఖమ్మం, వరంగల్, నల్గొండ శాసన మండలి
ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారిధి రెడ్డి గెలుపు ఖాయం.*
ఖమ్మం,పెన్ పవర్
మార్చి 14న జరగబోయే ఖమ్మం, వరంగల్, నల్గొండ నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు బలపర్చిన సీనియర్ జర్నలిస్టు బి. జయసారధి రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యదిక మెజారిటితో గెలిపించాలని కోరుతూ మంగళవారం ఖమ్మం నగరంలో టూటౌన్ ఏరియా లో గల ఎమ్మెల్సీ ఎన్నికల 284,85,86,87,88, 89,90,91, పోలింగ్ కేంద్రాల్లో గల ఓట్లు కలిగిన పట్టభద్రులను సిపిఐ, సిపిఎం పార్టీలు ప్రజా సంఘాల నాయకులు కలిసి ఓట్లు అభ్యర్ధించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్ధానం చేసి అమలు చేయలేదని. బ్యాంకులను, ఎలైసీ, బొగ్గు గనులను, విశాఖ ఉక్కుతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవైటు దారులకు కారుచౌకగా కట్టబెడుతున్నది. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ లకు మంగళం పాడుతుంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి కార్మికులను, పెట్టుబడి దారులకు కట్టుబానీసలను చేసింది. నీళ్ళు, నిధులు, నీయామాకలు అని చెప్పి అధికారంలో వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఉద్యోగులకు పీఆర్సీ. ఇవ్వలేదని కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ వాళ్ళను పర్మినెంట్ చేయలేదు.అంగన్వాడీ ఉద్యోగులకు పనిభారం పెంచారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.తెలంగాణ విభజన చట్టం ప్రకారం ఈ ప్రాంతానికి రావాల్సిన ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు కర్మాగారం స్థాపన కోసం కనీస ప్రయత్నాలు జరపలేదని తీవ్రంగా విమర్శించారు. చట్ట సభల్లో ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నించే గొంతుకలు లేకుండా చేయాలని కుట్రపన్నుతున్నారు. బిజేపి, టిఆర్ఎస్ పార్టీలు పట్టభద్రులను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. శాసన మండలిలో ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నించే శక్తి సామర్థ్యాలు కలిగిన సీనియర్ జర్నలిస్టు బి.జయసారధి రెడ్డి కే మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు యానాల సాంబశివరెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వై. విక్రం, సిపిఐ జిల్లా సమితి సభ్యులు మేకల శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు కె. సతీష్ రెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బుర్రి వెంకట్ కుమార్, సిపిఐ నగర నాయకులు వి. రమణ, సిపిఎం నగర నాయకులు గంటా బీమయ్య, సదానందం,సి.హెచ్. వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆదర్సవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతా...
ఆదర్సవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతా..
24వ వార్డు వైసిపి అభ్యర్ధి ఏకా శివప్రసాద్
నర్సీపట్నం, పెన్ పవర్
24 వ వార్డు లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఏక శివ ప్రసాద్ ప్రచారంలో దూకుడు పెంచారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలను అనుసరిస్తూ పరిమితమైన అనుచరగణంతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా తమ కష్ట సుఖాలలో అందుబాటులో ఉండే శివప్రసాద్ ను వార్డు ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. వార్డు అభివృద్ధి కోసం శివప్రసాద్ ను గెలిపించుకుంటామని వార్డు పెద్దలు, యువకులు మద్దతు ఇస్తున్నారు. విద్యావేత్త, వార్డు సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకుడు అవసరం ఎంతైనా ఉందని శివప్రసాద్ ను ఆశీర్వదిస్తున్నారు. తనను గెలిపిస్తే వార్డు మొత్తం ఎల్ఈడీ లైట్లు వేయిస్తానని, పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగేలా చూస్తానని, ఇంటింటికి కొళాయిలు ఇచ్చే ఏర్పాటు చేస్తానని, మున్సిపాలిటీలోనే 24వ వార్డును ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఎమ్మెల్యే సహకారంతో సిమెంట్ రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తానన్నారు. అన్ని వర్గాల ప్రజల నుండి సహకారం లభిస్తుండటంతో శివప్రసాద్ ప్రచారంలో జోష్ పెరిగింది.
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేను కలిసిన ఎంసీడబ్ల్యుఏ సంఘం సభ్యులు..
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేను కలిసిన ఎంసీడబ్ల్యుఏ సంఘం సభ్యులు...
జీడిమెట్ల,పెన్ పవర్
సోవాలమ్మ ఆలయం వద్ద భారీ అన్నదానం
సోవాలమ్మ ఆలయం వద్ద భారీ అన్నదానం
జగ్గంపేట పెన్ పవర్
ఫోటోగ్రాఫర్ల అభ్యున్నతికి అహర్నిశలు కష్టపడతా - పోసిన వీరేంద్ర కుమార్..
ఫోటోగ్రాఫర్ల అభ్యున్నతికి అహర్నిశలు కష్టపడతా - పోసిన వీరేంద్ర కుమార్...
గండేపల్లి పెన్ పవర్
గండేపల్లి గ్రామంలో మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షులు పెనుగాడి సూరిబాబు అధ్యక్షతన ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు పోసిన వీరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విషయంలో ఫోటోగ్రాఫర్లు ఎంతో నష్టపోయారని వారిని ప్రభుత్వం అన్ని విధాలుగానూ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వారి సంక్షేమానికి కృషి చేయడానికి అన్ని విధాల అందుబాటులో ఉంటానన్నారు. జిల్లాలో ఏ ఒక్క పేద ఫోటోగ్రాఫర్ మరణించిన వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి అనేక ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. ఎలక్షన్లో పనిచేసిన ఫోటోగ్రాఫర్లకు ప్రభుత్వం వెంటనే డబ్బులు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా సహాయ నిధికి కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు . అనంతరం జిల్లా కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కోటేశ్వరరావు, నా మాన భాస్కర్, కోనే శ్రీను , రమణ, అప్పారావు , రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
నీటిని ప్రతి ఒక్కరూ పొదుపుగా వాడాలి...
నీటిని ప్రతి ఒక్కరూ పొదుపుగా వాడాలి...
జగ్గంపేట పెన్ పవర్
నీటిని వినియోగించే ప్రతీ ఒక్కరూ పొదుపుగా వాడాలని , నీటిని ఆవశ్యకతను తెలుసుకోవాలని నెహ్రూ యువకేంద్ర జిల్లా అధికారి ఎస్. కీర్తన పేర్కొన్నారు . స్థానిక నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి యువజన సంఘాలకు మరియు నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్లకు భారత ప్రభుత్వ యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ వారు క్యాచ్ ద రెయిన్ అనే కార్యక్రమాన్ని ఆన్లైన్ లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంజిఎన్ఆర్ఇజిఎస్ (డో మ) ఏపిడి జీ. రమేష్ మాట్లాడుతూ వర్షాధార నీరును పొదుపు చేస్తూ దానికోసం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు ఈ ప్రచారం కింద, చెక్ డ్యామ్లు, నీటి పెంపకం గుంటలు, పైకప్పు RWHS మొదలైనవి చేయడానికి డ్రైవ్లు; ఆక్రమణల తొలగింపు మరియు ట్యాంకుల నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి వాటిని తొలగించడం; పరీవాహక ప్రాంతాల నుండి నీటిని తీసుకువచ్చే ఛానెళ్లలోని అడ్డంకులను తొలగించడం; మెట్ల-బావులకు మరమ్మతులు చేయడం మరియు నీటిలో తిరిగి నీటిని ఉంచడానికి పనికిరాని బోర్-బావులు మరియు ఉపయోగించని బావులను ఉపయోగించడం వంటివి ప్రజల చురుకైన భాగస్వామ్యంతో చేపట్టాలి.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...
-
గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు. సంతబొమ్మాలి, పెన్ పవర్ మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అధికారులు కరోనా నివారణ చ...