Followers

ప్రైడ్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డు

 ప్రైడ్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డు

చెన్నూరు , పెన్ పవర్

జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన దుర్గం రఘునాథ్ గత 7 సంవత్సరాలుగా సామాజిక సేవలో భాగంగా  నిరుపేదలకు అన్నదానం నిత్యవసర సరుకులను అందిస్తూ రక్తదానం అవయవ దానం పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో రక్త దాతలను పంపడం వంటి సేవలు చేస్తున్నందుకు మంగళవారం ఢిల్లీలో పూర్వర్ అచీవర్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో దుర్గం రఘునాథ్ కు బాలీవుడ్ నటుడు కునాల్ సింగ్ రాజ్ పుథ్ చేతుల మీదగా ప్రైడ్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా దుర్గం రఘునాథ్ మాట్లాడుతూ, నిరుపేదలకు సేవ చేసినందుకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

ఎక్సైజ్ పోలీసుల మెరుపుదాడులు.

 ఎక్సైజ్ పోలీసుల మెరుపుదాడులు.

నాటుసారా స్వాధీనం.

 బెల్లం పానకం ధ్వంసం.

గంభీరావుపేట్ ,పెన్ పవర్

 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటమండలంలోని ముచ్చర్ల తండా శివారు ప్రాంతంలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంపీఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 100 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసారు. ఈ నాటు సారా తయారీ కి బాధ్యులు అయినటువంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ఫోర్స్ ఎస్ఐ కిషన్, ట్రైనీ ఎస్సై శ్రీకాంత్ తో పాటు  హెడ్కానిస్టేబుల్స్ వెంకటేశ్వర్ రావు, హఖాని మరియు సిబ్బంది హమీద్, శంకర్, సుమన్, కృష్ణా నాయక్, రాజేందర్, రూప, సుమలత పాల్గొన్నారు.

21వ వార్డులో సిపిఎం కార్యాలయం ప్రారంభం

21వ వార్డులో సిపిఎం కార్యాలయం ప్రారంభం

 పెద్దాపురం,పెన్ పవర్

  పెద్దాపురం మున్సిపల్ ఎన్నికల్లో 21 నుండి సిపిఎం అభ్యర్దిగా పోటీ చేస్తున్న నీలపాల సూరిబాబు ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడే సిపిఎం పార్టీ తరపున పోటీలో ఉన్నామని. పట్టణంలో 4 వార్డులో పోటీ చేస్తున్నామని తెలిపారు. ప్రజలకోసం పోరాడడం సిపిఎంకే సాధ్యమని అన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు నాడోమాట, నేడోమాట చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని అన్నారు. సిపిఎం గెలుపు ప్రజల గెలుపని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మెార్త రాజశేఖర్,  బొట్టా సూరీడు, తణుకు సత్తిబాబు, దేవళ్ళ గోపాలం, జి సత్తిబాబు, ఎ.శ్రీను, పి. వినోద్, గంగరాజు, బాబ్జి, బాబురావు, ముంగర గోపి, గనేడి రామానాయుడు, సిపిఎం నాయకులు సిరిపురపు శ్రీనివాస్ పాల్గోన్నారు. ప్రజానాట్యమండలి కళాకారులు డి.సత్యనారాయణ, రాంబాబు, కృష్ణ, వీర్రాజు, తదితరులు పాల్గోన్నారు.

ఆరుళ అభివృద్ధికి కృషి... మాకి రెడ్డి వరలక్ష్మి

ఆరుళ అభివృద్ధికి కృషి... మాకి రెడ్డి వరలక్ష్మి



పెన్ పవర్,తాడేపల్లిగూడెం

  తాడేపల్లిగూడెం మండలం ఆరుళ  గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని గ్రామ సర్పంచ్ మాకి రెడ్డి వరలక్ష్మి తెలిపారు గ్రామంలో పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు విద్యాభివృద్ధికి చర్య లు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు సర్పం చిగా విజయం సాధించిన వరలక్ష్మి ని పలువురు అభినందించారు ‌ఇందులో మాకి రాజు సతీష్ మాకిరాజు చలపతిరాజు  నలి నాగముని వార సంజీవరావు ఎర్రి చర్ల కృష్ణ వారా దొరబాబు వారా వెంకట్రావు తదితరులు అభినందించారు.

రాష్ట్ర బందుకు మద్దతుగా తాడేపల్లిగూడెంలో మోటారుసైకిల్ ర్యాలీ!

 రాష్ట్ర బందుకు మద్దతుగా తాడేపల్లిగూడెంలో మోటారుసైకిల్ ర్యాలీ!



పెన్ పవర్,తాడేపల్లిగూడెం

విశాఖఉక్కు ప్రైవేటీకరణకు  వ్యతిరేకంగా  5 వతేదీన   తలపెట్టిన రాష్ట్రబందును విజయవంతం చేయాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం మోటారుసైకిలుర్యాలీ జరిగింది.విశాఖఉక్కు పరిరక్షణ ఐక్య కార్యాచరణకమిటీ పిలుపుమేరకు జరిగిన కార్యక్రమంలో ఏ.ఐ.టి.యు.సి., సి.ఐ.టి.యు., అనుబంధ కార్మిక సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.స్థానిక హౌసింగ్ బోర్డు సెంటరులోని  ఎస్వీరంగారావు విగ్రహంవద్ద ప్రారంభమైన ర్యాలీఆర్టీసిడిపో,తాలూకాఆఫీసుసెంటర్, ఎంటీఆర్ చౌక్, ఓవర్ బ్రిడ్జి, విజయాటాకీస్ సెంటర్, తాళ్ళముదునూరుపాడు మీదుగా పెంటపాడుగేటు, మార్కెట్, ప్రభుత్వ డిగ్రీకళాశాల మీదుగా తిరిగి తాడేపల్లిగూడెం ఓవరుబ్రిడ్జి వద్దకుచేరింది.ర్యాలీ ప్రారంభానికి ముందు కార్మికులను ఉద్దేశించి సి.పి. ఎం. జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు, ఏ.ఐ.టి.యు.సి. జిల్లా గౌరవాధ్యక్షుడు డి.సోమసుందర్, సి.ఐ.టి.యు.జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, సి.పి.ఐ. జిల్లా కౌన్సిలుసభ్యుడు కళింగ లక్ష్మణ రావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు  వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవంతో విశాఖ ఉక్కు ముడిపడి ఉందని, రాష్ట్ర ప్రజల హక్కులను కాలరాసే   కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతిఘటించాలని పిలుపుఇచ్చారు. 5 వ తేదీ తలపెట్టిన బందును జయప్రదం చేయాలని కోరారు.కార్యక్రమానికి  ఏ.ఐ.టి.యు.సి.  నాయకులు ఓసూరివీర్రాజు, తాడికొండశ్రీనివాసరావు, కర్రి వీర వెంకట సత్యనారాయణ, ఎస్.సూర్యనారాయణ, అప్పలరాజు, అంగిన శ్రీనివాస్, ఎర్రగోగులవీర్రాజు, అర్జున, వెంకటేష్, కే.ముత్యం, మండేల్లి అంజి, రామకృష్ణ, అల్లంనరేంద్ర, పోలి రాతి  ఆది నారాయణ, సి.ఐ.టి.యు నాయకులు సిరపురపు రంగారావు, కరెడ్ల రామ కృష్ణ, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, జవ్వాదిశ్రీను, మడకరాజు,  ధనాలవెంకట్రావు, జగ్గు నిరంజనరామారావు, బి.శ్రీనివాసు, సి.పి.ఐ. నాయకులు మండల నాగేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు.

బాక్సయిట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలి

బాక్సయిట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలి



జీవోనెంబర్ 89 ని రద్దుచేయాలి

గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి  : పి.అప్పలనర్శ

పెన్ పవర్,విశాఖపట్నం


భాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానంచేయాలని ,తీసుకువచ్చిన జీవోనెంబర్ 89 ని రద్దుచేయాలని గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్శ డిమాండ్ చేశారు.జికెవిది మండలం లోని అమ్మవారిధారకొండ పంచాయతీ సర్పంచ్ ముర్ల సత్యవతి ఏకగ్రీవంగా ఎన్నికైన సంధర్భంగా బుధవారం పెబ్బంపల్లి గ్రామంలోగిరిజన సంఘం మండల అధ్యక్షుడు ముర్ల చంటిబాబు అధ్యక్షతన నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన ముఖ్యాతిధిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ..విశాఖ మన్యంలో అపారమైన ఖనిజ సంపదను బాక్సయిట్ ను దోచుకొనుటకు రాజకీయ పార్టీలు జీవోల రద్దు నాటకం ఆడుతున్నాయని,పర్యాటక శాఖ అనుమతులు రద్దు చేయలేదని ,  జీవోలు రద్దు చేశామని గిరిజనులకు మొసంచేస్తున్నాయని మండిపడ్డారు.టిడిపి జీవోనెంబర్ 22 ను రద్దు చేసి,97 జీవోతీసుకువచ్చింది.వైకాపా ప్రభుత్వం 97ను రద్దుచేసి  జీవోనెంబర్ 89 నితీసుకు వచ్చిందని అందుకు కమిటీని నియమించిన సంగతి తెలిసిందే,గిరిజన సంఘలూ,సిపిఎం పార్టీ నాయకులు ఆందోళనలు చేస్తే ఒరిస్సా నుంచి తెచ్చుకుంటామని మంత్రి విజయసాయిరెడ్డి  తెలిపారన్నారు.అందుకే రాష్ట్ర ప్రభుత్వం భాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి జీవోనెంబర్ 89 ని రద్దు చెయ్యలనికోరారు.   కేంద్రంలో మోడీ ప్రభుత్వం వ్యవసాయంపై కొత్త చట్టాలు తీసుకురావడంతో రైతులు ఆందోళనలు,నిరాహారదీక్షలు చేస్తూ చలిలో, 150 మంది   రైతులు చనిపోయారని  పేర్కొన్నారు. అమ్మవారి దారకొండ పంచాయతీ గిరిజనులకు మీ గ్రామానికి ఏ సమస్యపైన అయిన గిరిజన సంఘం గా మేము ఆదుకునేందుకు ముందుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోనంగి చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ.. మోడీ తీసుకువచ్చిన  ప్రయివేటు విధానాలు తో గిరిజనులకు పెను ప్రమాదం గా మరనుందని ,దేశాకార్మికుల పోరాటాలులో గిరిజనులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అల్ ఐ సి, రైల్వే,విద్యుత్, బ్యాంకింగ్,స్టీల్ ప్లాంట్, ఓడరేవుల పరిశ్రమలో ఇప్పుటివరకు రిజర్వేషన్ లో ఉద్యోగులు వచ్చాయని ప్రయివేటు పరం అయితే భవిష్యత్ లోఉద్యోగం కలగానే మరనుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సలిమితి శాంతి, సిపిఎం మండల కార్యదర్శి అంపురంగి బుజ్జిబాబు, జి.సత్యనారాయణ,ఏ దారకొండ సెక్రెటరీ రాధ,వార్డు సభ్యులు,కుమారి,చంద్రమ్మ, అనంద్,మాజీ సర్పంచులు సంధ్యకుమారి, వండలం పండన్న,పన్నెండు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

విద్యార్థి సంఘాల బైటాయింపు

 విద్యార్థి సంఘాల బైటాయింపు

కూకట్ పల్లి,పెన్ పవర్ 


కూకట్ పల్లి కె.పి.హెచ్.బి కాలనీలోని జవహర్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బి.ఎన్ బండారి ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులపై చేస్తున్న దౌర్జన్యం, బెదిరింపులకు నిరసనగా బుధవారం విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఛాంబర్లో బైఠాయించి ధర్నా చేసిన ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు నెలలుగా ప్రిన్సిపాల్ బండారి కొందరిని బినామిగా ఏర్పాటు చేసుకొని, తన సొంత నిబంధనలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులను బెదిరిస్తూ, కక్ష్య పూరితంగా వ్యావహారిస్తున్నాడని, అన్యాయంపై ప్రశ్నిస్తున్న వారిని లేపేస్తా అని, అంతు చూస్తా అని, నా  ప్రవర్తన ఇలానే ఉంటుంది, మీరు ఎవ్వరికి చెప్పుకుంటారో చెప్పుకొండని ఉద్యోగులను కలవకుండా, వారికి చెలించాల్సిన జీతాలలో కూడా అవకతవకలు పాల్పడుతున్నారని, తనకు నచ్చిన వారికి ఒక జీతం, నచ్చని వారికి  ఒక జీతం ఇస్తూ తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తునడాని ఆరోపించారు. ప్రిన్సిపాల్ వ్యవహారంపై రెండు నెలల క్రితం ఎస్.సి, ఎస్.టికమిషన్ లో ఉద్యోగులు పిర్యాదు చేసారని దీనితో వారిపై మరింత కక్ష్యతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో జె.ఎన్.టి.యూ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు,  విద్యార్థి సంఘాల జేఏసీ, తెలంగాణ టెక్నాకల్ విద్యార్థి సంఘం, ఎస్.సి, ఎస్.టి విద్యార్థి సంఘం, బంజారా విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...