Followers

తాళ్ళపూడి మండల శాఖ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్దిక సాయం

 తాళ్ళపూడి మండల శాఖ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్దిక సాయం



తాళ్ళపూడి, పెన్ పవర్

 తాళ్ళపూడి మండలంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకి వేగేశ్వరపురంలో  కిడ్నీ సమస్యతో  అనారోగ్యంతో బాధ పడుతూ కాకినాడ కేజిహెచ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న  గంగుల వెంకటేశ్వరరావుకి వైద్యం కోసం వారి కుటుంబ సభ్యులకు మానవత స్వచ్చంద సేవా సంస్థ తరపున రూ.4000,  డెంటిస్ట్ సాగర్ రూ.500, చదలవాడ మోజేశ్ రూ.500 కలిపి మొత్తం రూ.5,000 అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బారనాల శంకరరావు, సెక్రటరీ జోడాల వెంకటేశ్వరరావు, కోశాధికారి చెరుకు ఆంజనేయులు, ఉపాధ్యక్షులు తుంపూడి నాగ భూషణ గుప్త, జాయింట్ సెక్రటరీ అంకెo సురేష్, రీజనల్ ఛైర్మన్ వాసిబోయిన చంద్రయ్య, ఈసి మెంబర్  జంగా లక్ష్మీపతి, సభ్యులు టి.రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

వామపక్షాల పిలుపుమేరకు బంద్ విజయవంతం

వామపక్షాల పిలుపుమేరకు బంద్ విజయవంతం



 కేంద్ర ప్రభుత్వా మొండి వైఖరికి నిరసనగా                                 

   పెన్ పవర్,కూనవరం

 విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును పెట్టుబడి దారులకు ధనా దత్తం చేయడానికి నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వా వ్యతిరేక విధానానికి నిరసనగా వామపక్షాల పిలుపుమేరకు శనివారం నాడు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మేకల నాగేశ్వరరావు అధ్యక్షతన టేకులబోర్ సెంటర్ నందు రాస్తారోకో నిర్వహించగా స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు, ఆటో కార్మికులు, కాలేజీలు స్వచ్ఛందంగా పాల్గొని బందును విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరంi పెంటయ్య మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్లాంటును ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజానీకం ఉద్యమంలో భాగస్వాములై విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఓకే నినాదంతో ఉద్యమం ఎగిసిపడుతోందని పెడుతుందని, ఉక్కు ను పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టడం కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని పిలుపునిచ్చారు. టిడిపి సీనియర్ నాయకులు ఎడవల్లి భాస్కర్ రావు మాట్లాడుతూ ఏపీ రాష్ట్రానికి ఆర్థిక వనరుగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ని కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి పూనుకుందని విమర్శించారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించడంనికి రాష్ట్ర ప్రజల హక్కు పెట్టుబడిదారులకు దాన దత్తం చేస్తే  ఊరుకోరని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతుందని హెచ్చరించారు. ఇకనైనా  ప్రైవేటీకరణను విరమింప చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాయం సీతారామయ్య సిఐటియు, శ్యామల కృష్ణ వ్యవసాయ కార్య సంఘం, కాంగ్రెస్ నాయకులు బత్తుల నరసింహారావు, జనసేన పార్టీ నాయకులు బండారు సాంబశివరావు, హేమంత్, టిడిపి నాయకులు ప్రకాష్ రావు, సిపిఐ నాయకులు తాలూరు శ్రీనివాసరావు, తలగాని నాగరాజు, బి ప్రసాద్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. 

అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి నిధి సేకరణ

అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి నిధి సేకరణ



తాళ్ళపూడి, పెన్ పవర్

శ్రీరామ జన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరామ మందిర నిర్మాణ సమర్పణ అభియాన్ లో జనవరి 16 నుండి ఫిబ్రవరి 28 వరకు నిధి సేకరణ కార్యక్రమం జరిగింది. ఆర్ యస్ యస్ మరియు సంఘ్ పరివార సంస్థల కార్యకర్తలు తాళ్ళపూడి, పోలవరం, గోపాలపురం  మండలాలలో గ్రామగ్రామానికి, ఇంటింటికి, వ్యక్తి వ్యక్తి ని కలిసి నిధి సేకరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. తాళ్ళపూడి మండలం నుండి 9,53,000 రూపాయలు, పోలవరం మండలం నుండి 5,00,000 రూపాయలు, గోపాలపురం మండలం నుండి 3,20,000 రూపాయలు, మొత్తం కలిపి సుమారు 17,73,000 రూపాయల వరకు ఖండ స్థాయిలో నిధి సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహ్ బొర్రా చైతన్య మూర్తి, జిల్లా గోరక్ష ప్రముఖ్ శ్రీరామమూర్తి, నాళ్ళం గోపి, అడ్డా శ్రీరాoమోహన్, యలకల కనకం, చిరువూరి పోసిబాబు, వేగేశ్వరపురం నుండి ఇండుగుల రామకృష్ణ, సూలా తేజ, పెద్దేవం గ్రామం నుండి రాముడు, రాంబాబు, దూమవరపు సత్యనారాయణ, కొవ్వూరుపాడు నుండి సుబ్రహ్మణ్యం, వాదాలకుంట నుండి రాఘవులు, తదితరులు పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్త సమాజానికి, భక్త బృందానికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు

 విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు



తాళ్ళపూడి, పెన్ పవర్

 విశాఖ ఉక్కు ప్రయివేటికరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక రాష్ట్ర వ్యాప్త బంద్ లో భాగంగా తాళ్ళపూడి మండలంలో  జేఏసి, సిఐటియు అనుబంధ సంస్ధలు అయిన  భవన నిర్మాణ కార్మిక సంఘాలు, అంగన్వాడీ టీచర్లు మరియు వర్కర్లు, ఆశావర్కర్లు, మిడ్ డే మీల్స్ వర్కర్లు, కార్మిక ఉద్యోగులు, ఉపాద్యాయులు, ర్యాలీలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, విశాఖ ఉక్కు  ప్రైవేటీకరణ చేయరాదు అనే నినాదంతో తాళ్ళపూడి బస్ స్టాండ్ సెంటర్ నుండి ప్రక్కిలంక సెంటర్ వరకు ర్యాలీ చేయడం జరిగింది. వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మూసివేశారు. జేఏసి చైర్మైన్ జోడాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీరోచిత ఆందోళన ఫలితంగా 32 మంది తెలుగు వారి ప్రాణత్యాగాలతో నెలకొల్పబడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవలసిన భాధ్యత తెలుగు వారందరి పైనా ఉంది అని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కారు చౌకగా  కార్పొరేట్  సంస్థలకు  కేంద్ర ప్రభుత్వం అప్పగిస్తూ  ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, దాన్ని ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు.

ఎఎస్ఓ జోడాల వెంకటేశ్వరరావుకి కోవిడ్ సెకండ్ డోస్ వ్యాక్సిన్

 ఎఎస్ఓ జోడాల వెంకటేశ్వరరావుకి కోవిడ్ సెకండ్ డోస్ వ్యాక్సిన్

తాళ్ళపూడి, పెన్ పవర్

తాళ్ళపూడి పిహెచ్సి లో శుక్రవారం ఎఎస్ఒ జోడాల వెంకటేశ్వరరావు కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేయించుకున్నారు. జోడాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒక నెల క్రితం మొదటి డోస్ వేయించుకున్నానని, ఈ రోజు సెకండ్ డోస్ వేయించుకోవడం జరిగిందని అన్నారు. మొదటి డోస్ వేయించుకున్న తరువాత ఆరోగ్యపరంగా ఏ ఇబ్బందులు లేవని తెలిపారు.  అపోహలు పడకుండా అర్హత ఉన్న ప్రతీఒక్కరు వేయించుకోవచ్చునని తెలిపారు. అందరూ భయపడకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.

హక్కుల సాధనకోసం మార్చి 7న జర్నలిస్టుల మహాసభ.......

 హక్కుల సాధనకోసం మార్చి 7న జర్నలిస్టుల మహాసభ.......

 ఆదిలాబాద్ ,పెన్ పవర్ 

జర్నలిస్టులకు ఇండ్ల స్థలలతో పాటు ప్రధాన సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ తో ఈ నెల 7న హైద్రాబాద్ జల విహార్ లో జరిగే జర్నలిస్టుల ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని  టి యూ డబ్ల్యూ జేయూ డబ్ల్యూ జే  ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బేత రమేష్ అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షులు బేత రమేష్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల మృతి చెందిన   6గురు జర్నలిస్ట్ లకు మీడియా అకాడమీ తరపున ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, ఫెన్షన్ మంజూరు చేయడం జరిగిందన్నారు.ఇప్పటి వరకు 26మంది మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ అండగనిలిచిందని తెలిపారు.జర్నలిస్టుల సంక్షేమం కోసం కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న 17.5 కోట్ల రూపాయల విడుదలకు సంబంధించి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ లు కలిసి మంత్రి కేటీఆర్ తో చర్చించి 24 గంటలు గడవకముందే పదిహేడున్నర కోట్లు మీడియా అకాడమీ ఖాతాలో జమ చేయించినందుకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికే 34.5  కోట్ల రూపాయలను జర్నలిస్ట్ సంక్షేమ నిధికి  తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. మరో 17.5 కోట్ల రూపాయలను గురువారం విడుదల చేయడంతో మొత్తం సంక్షేమ నిధి 52 కోట్ల కు చేరడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ నిధితో జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నోకార్యక్రమాలు  చేపట్టాలని ఆకాంక్షిస్తూ, నిధి పెరుగుదలకు కృషి చేసిన అల్లం నారాయణకి, నిధుల విడుదలకు వెంటనే ఆదేశాలు జారీ చేసిన మంత్రి కేటీఆర్ కి, ఇంత వేగంగా రావడానికి సహకరించిన జర్నలిస్ట్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లోని జలవిహార్ లో జరిగే జర్నలిస్ట్ ప్రతినిధుల మహాసభ కు జర్నలిస్ట్ మిత్రులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి లక్ష్మీపురం రాజు, ఉపాధ్యక్షులు అన్వర్, కోశాధికారి ప్రవీణ్,నాయకులు తేజ శంకర్ పాల్గొన్నారు.

హైద్రాబాద్ లో జుగ్ను సేవలు

 హైద్రాబాద్ లో జుగ్ను సేవలు

కూకట్ పల్లి,పెన్ పవర్


2014 సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా తన సేవలను అందిస్తున్న జుగ్ను సంస్థ హైదరాబాద్ లో తన సేవలను ప్రారంభించింది. కూకట్ పల్లిలోని తబలా రెస్టారెంట్ లో బ్రోచర్ ఆవిష్కరణ, యాప్ ఆవిష్కరణలను నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ సినీ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండల సతీష్ గౌడ్ లు హాజరై బ్రోచర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఉత్తర భారతదేశంలో నలభై ఐదుకు పైగా నగరాలలో జుగ్ను సంస్థ ద్వారా బైక్, కార్, ఆటోలను నడుపుతున్నామని, హైదరాబాదులో కూడా సేవలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. స్మార్ట్ క్లూస్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో జుగ్ను యాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్యాబ్ సర్వీస్ ధరలకంటే తక్కువ ధరకే జుగ్ను సంస్థ వాహనాలను నడపనునట్లు తెలిపారు. తమ సేవలను పొందడానికి వినియోగదారులు ప్లేస్టోర్, ఐస్టోర్ ల ద్వారా జుగ్ను యాప్ డౌన్లోడ్ చేసుకుని రైడ్ బుక్ చేసుకునే సమయంలో జుగ్ను50 అనే కోడ్ వాడటం ద్వారా యాభై శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చని తెలిపారు. అలాగే తమ సంస్థలో బైకులు, కార్లు, ఆటోలు అటాచ్ చేసుకొని డబ్బు సంపాదించాలి అనుకునేవారు జుగ్ను డ్రైవర్ యాప్ ద్వారా కేవలం ఐదు పత్రాలను సమర్పించి తమ సంస్థలో డ్రైవర్లుగా కొనసాగవచ్చని, మార్కెట్లో ఉన్న వివిధ సంస్థలు అందిస్తున్న దానికంటే రెట్టింపు లాభాలు తమ సంస్థ ద్వారా డ్రైవర్లు పొందగలరని తెలిపారు. ఈకార్యక్రమంలో హైదరాబాద్ మేనేజింగ్ పార్ట్ నర్స్ అశోక్, విష్ణు హైదరాబాద్ ఆపరేషన్ మేనేజర్ హర్షవర్ధన్ పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...