Followers

కార్మిక సమస్యల పరిష్కారానికి అవిశ్రాంత పోరాటం

కార్మిక సమస్యల పరిష్కారానికి అవిశ్రాంత పోరాటం




కళ్యాణిఖని,పెన్ పవర్


సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తామని, పోరాట కార్యక్రమాల్లో కార్మికులందరూ భాగస్వాములు కావాలని సింగరేణి కోల్ మైన్స్(బిఎంఎస్) అధ్యక్షులు యాదగిరి సత్తయ్య పేర్కొన్నారు. శుక్రవారం మందమర్రి ఏరియాలోని కాసీపేట 1 గనిపై బిఎంఎస్ ఆద్వర్యంలో నిర్వహించిన ద్వార సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 12 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని,లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) 9 సంవత్సరాలుగా గుర్తింపు సంఘంగా పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.టీబీజీకేఎస్ హయాంలో సింగరేణి వ్యాప్తంగా విచ్చలవిడిగా ప్రైవేటీకరణ జరుగుతోందని, ప్రైవేటీకరణను అడ్డుకోకుండా టీబీజీకేఎస్ నాయకులు యాజమాన్యానికి వత్తాసు పలుకడం మూలంగానే భూగర్భ గనులలో,పర్మినెంట్ పనిస్థలాల్లో కాంట్రాక్ట్ కార్మికుల విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.అన్ని కోల్ శాంప్లింగ్ విధానంలో, సింగరేణి ఆస్పత్రులలో వార్డ్ బాయ్స్, స్టాఫ్ నర్స్, స్కావెంజర్,ఎస్ అండ్ పిసి సెక్యూరిటి విభాగంలో సెక్యూరిటీ గార్డులను ప్రైవేట్ పరం చేశారని, డిస్పెన్సరిలు,వివిధ విభాగాలను,భూగర్భ గనులను మూసివేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు సంస్థ వ్యాప్తంగా 62 వేల మంది కార్మికులు ఉండగా ప్రస్తుతం 45 వేల మంది మాత్రమే ఉన్నారని దీనికి పూర్తిగా గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ వైఫల్యమే కారణమని పేర్కొన్నారు. సింగరేణి సంస్థలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీర్ఘకాలికంగా బిఎంఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండ రమాకాంత్, డోనికేన రమేష్,జివై ప్రదీప్ కుమార్, మొటపోతువ శ్రీనివాస్,మంద రజనీకాంత్, కస్తూరి రవి కుమార్, పెండెం సత్యనారాయణ, సిరిపురం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో మాదిగ సాధికార సర్వే పూర్తి చేయాలి

 గ్రామాల్లో మాదిగ సాధికార సర్వే పూర్తి చేయాలి 



పెన్ పవర్, కరప

గ్రామాల్లో మాదిగ సామాజిక వర్గం వారు ఎంతమంది ఉన్నది తెలియజేసేందుకు చేపట్టిన మాదిగ సాధికార సర్వే వెంటనే పూర్తి చేయాలని కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఇంచార్జ్ పలివేల నవీన్ మాదిగ అన్నారు.వాకాడ లో శుక్రవారం జరిగిన ఎమ్మార్పీఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందా కృష్ణమాదిగ ఇచ్చిన పిలుపు మేరకు గ్రామాల్లో మాదిగ సాధికార సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు.  మందా కృష్ణ మాదిగ ఈనెల 15,16 తేదీలలో జిల్లాల్లో పర్యటించనున్నట్లు  ఆయన తెలిపారు.మండల శాఖ ఇన్చార్జ్ పలివేల రమేష్ బాబు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ మహాజన సోషలిస్టు పార్టీని ప్రతి గ్రామంలో బలోపేతం చేసేందుకు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు.అనంతరం వాకాడ లో సాధికార సర్వే నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు రాంబాబు, తాతపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెంలో విశాఖ ఉక్కు బందు విజయవంతం...

తాడేపల్లిగూడెంలో విశాఖ ఉక్కు బందు   విజయవంతం..



పెన్ పవర్,తాడేపల్లిగూడెం

విశాఖఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన ఉపసంహరించుకునే వరకూ ఐక్య పోరాటం కొనసాగిస్తామని వివిధ కార్మిక సంఘాల, రాజకీయ పార్టీల నేతలు స్పష్టం చేశారు.  విశాఖఉక్కు పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు పట్టణంలో బందు విజయవంతం అయ్యింది. కార్మికులు వందలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆర్టీసిడిపో  వద్ద జరిగిన బహిరంగసభలో నాయకులు మాట్లాడారు.ఏ.ఐ.టి.యు.సి. జిల్లా గౌరవాధ్యక్షుడు డి.సోమ సుందర్ మాట్లాడుతూ విశాఖఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ రోజుజరిగిన బందుకు ప్రజలు పెద్ద ఎత్తున  స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతుఇచ్చారని, దీన్ని చూసయినా  రాష్ట్రప్రజల మనోభావాల్ని  కేంద్ర ప్రభుత్వం అర్థంచేసుకోవాలని పేర్కొన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15,16 తేదీల్లో జరగనున్న సమ్మెకుకూడా  కార్మిక సంఘాలు పూర్తిగామద్దతు ఇస్తున్నాయన్నారు.సి.ఐ.టి.యు. జిల్లాకార్యదర్శి కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ అత్యంతవిలువైన విశాఖస్టీల్ ఫ్యాక్టరీసంపదను దక్షిణకొరియా పొస్కో సంస్థకి కారుచవకగా కట్టబెట్టాలన్న మోదీప్రభుత్వ దుర్మార్గచర్యను ప్రజలు ప్రతిఘటిస్తారన్నారు.కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు  వ్యతిరేకంగా ప్రజాఉద్యమం మొదలయ్యిందన్నారు.నేటి బంద్ విజయవంతం కావడమే అందుకు నిదర్శనమని అన్నారు.తెలుగుదేశంపార్టీ నియోజకవర్గ  ఇన్ చార్జి వలవలబాబ్జీ మాట్లాడుతూ విశాఖఉక్కు ప్రైవేటీకరణకు రాష్ట్రప్రభుత్వం అంగీకరించినట్లు  కేంద్రమంత్రి  పార్లమెంటులోనే వెల్లడించారని గుర్తుచేశారు.విశాఖ ఉక్కు పరిరక్షణకు రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేయడం లేదన్నారు.రాష్ట్రవిభజన హామీలనన్ని  కేంద్రం తుంగలోకి తొక్కిందని, దానికితోడు  విశాఖఉక్కును ప్రైవేటీకరణ చేయడం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని  బాబ్జీ పేర్కొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్షాలు,కార్మికసంఘాలు చేపట్టిన పోరాటానికి తెలుగుదేశం పార్టీ  పూర్తిమద్దతు ఇస్తున్నదన్నారు.ఐ.ఎఫ్.టి.యు. జిల్లా కార్యదర్శి మామిడి దానవర ప్రసాద్ మాట్లాడుతూ రైల్వేలు, బ్యాంకులు, గనులు, బీమా, వంటి ప్రభుత్వ రంగ  సంస్థలను ప్రైవేటు వారికి కట్టబెడుతున్న మోదీ ప్రభుత్వ విధానాలని వ్యతిరేకించాలన్నారు. జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాదచౌదరి మాట్లాడుతూ విశాఖఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని గ్రామీణ ప్రాంతాలకుకూడా విస్తరింప చేస్తున్నామన్నారు.విశాఖఉక్కు పరిరక్షణ ఐక్య కార్యాచరణకమిటీ ఇచ్చినపిలుపు మేరకు తాడేపల్లిగూడెంలో శుక్రవారం బంద్  పూర్తిగా విజయవంతంఅయ్యింది. ఏ.ఐ.టి.యు.సి., సి.ఐ.టి.యు., ఐ.ఎఫ్.టి.యు. అనుబంధ కార్మిక  సంఘాలసభ్యులు,బ్యాంకు ఉద్యోగుల సమన్వయకమిటీ, తెలుగుదేశం,సి.పి. ఐ., సి.పి.ఎం., సి.పి.ఐ. ఎం ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల కార్యకర్తలు పెద్దఎత్తున   బందులో పాల్గొన్నారు.దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, హోటళ్ళు, విద్యాసంస్థలు, స్వచ్ఛందంగా మూతపడ్డాయి.కార్మికసంఘాల కార్యకర్తలు దళాలుగా తిరుగుతూ పట్టణంలోని  ప్రభుత్వరంగ, ప్రైవేట్, సహకారబ్యాంక్ శాఖలను మూయించారు.దాంతో బ్యాంకింగ్ కార్యకలాపాలుపూర్తిగా స్తంభించి పోయాయి.పలు ప్రభుత్వ కార్యాలయాలను  కూడా కార్యకర్తలు మూయించారు.ఆర్టీసిసంస్థ నిలిపివేయడంతో మధ్యాహ్నంవరకూ  బస్సులు తిరగలేదు.




భారీ ర్యాలీ:

బందులోపాల్గొన్న వివిధ కార్మిక సంఘాల, రాజకీయపార్టీల కార్యకర్తలు జయలక్ష్మిధియేటర్ నుండి భారీర్యాలీ నిర్వహించారు.  బ్రహ్మానందరెడ్డిమార్కెట్, ఓవర్ బ్రిడ్జి, ఎన్.టి.ఆర్.చౌక్, తాలూకా ఆఫీస్ సెంటర్ మీదుగా ర్యాలీ ఆర్టీసి డిపోవద్దకు చేరింది. కార్యక్రమంలో  బ్యాంకుఉద్యోగుల సమన్వయకమిటీ నాయకులు  ఎస్.ఎస్.ప్రసాద్, సిద్దాబత్తుల సూర్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు వలవల బాబ్జీ, పాతూరి రాంప్రసాదచౌదరి, కిలపర్తి వెంకట్రావు, దాసరిఅప్పన్న, పోతుల అన్నవరం, ముత్యాల సత్యనారాయణ,పాలూరి వేంకటేశ్వరరావు, నల్లమిల్లి చిన గోపిరెడ్డి, ఎఐటియుసి నాయకులు డి.సోమసుందర్, ఓసూరివీర్రాజు, తాడికొండ శ్రీనివాసరావు, పాలూరి లక్ష్మణరావు, పడాలశ్రీనివాస్, పోలి రాతి ఆదినారాయణ,  కే.ముత్యం, ఏడిదనానీ, మండేల్లిఅంజి,  ఎర్రగోగులవీర్రాజు, గోకానాగరాజు, అర్జున,మాదాసుసత్యనారాయణ, ఆంజనేయులు, కే.నాగరాజు, బి.శ్రీనివాసు, కర్రి వీరవెంకట సత్యనారాయణ, అంగిన శ్రీనివాస్, అప్పలరాజు, సి.ఐ.టి.యు. నాయకులు సిరపురపురంగారావు, కరెడ్లరామకృష్ణ, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, పందల సన్యాసి రావు, మడకరాజు, ధనాల వెంకట్రావు, జగ్గునిరంజన రామారావు, ఐ.ఎఫ్.టి.యు. నాయకులు మామిడి దానవర ప్రసాద్, ఆర్.ప్రసాద్, టి.నాగేశ్వర రావు, డి.నాగేశ్వరరావు, సి.పి.ఐ.నాయకులు మండల నాగేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.

జొన్నాడ లో నూతన ట్రాన్స్ ఫార్మర్ నిర్మాణం

 జొన్నాడ లో నూతన ట్రాన్స్ ఫార్మర్ నిర్మాణం    

పెన్ పవర్,ఆలమూరు  

 ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో నూతన ట్రాన్స్ ఫార్మర్ ని గురువారం  ప్రారంభించారు స్థానిక ఆంధ్రా బ్యాంక్ సమీపంలో దీనిని ఎలక్ట్రికల్ సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి పనులు పూర్తి చేశారు గ్రామంలో విద్యుదీకరణ లో భాగంగా పియుసి  చైర్మన్, కొత్తపేట శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఆదేశాలతో 12 నూతన ట్రాన్స్ఫార్మర్స్ మంజూరు చేశారని సిబ్బంది తెలిపారు అందులో భాగంగా బ్యాంక్ అవసరాలను  దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన టాన్స్ ఫార్మర్  నిర్మించారు ఈ కార్యక్రమంలో  సర్పంచ్ కట్టా శ్రీనివాస్ ,ఉప సర్పంచ్ నాండ్ర నాగమోహన్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు తాడి ఆదిత్య రెడ్డి, మాజీ సర్పంచ్ ద్వారంపూడి దొరబాబు,డి ఇంద్రారెడ్డి వైసిపి కార్యకర్తలు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ సీనియర్ సాఫ్టబాల్ జట్టు సాయి సిందూజ ఎంపిక

 జాతీయ సీనియర్ సాఫ్టబాల్ జట్టు సాయి సిందూజ ఎంపిక

పెన్ పవర్, కరప 

అంతర్జాతీయ సాఫ్టబాల్ పోటీలలో ప్రతిభ చూపిన కరప మండలం పెద్దాపురప్పాడు బిరుదా సూర్యనారాయణ (ఫకిర్రావు) జడ్పీ ఉన్నతపాఠశాలకు  చెందిన విద్యార్థిని సాయిసిందూజ (10వ తరగతి) జాతీయ సీనియర్ సాఫ్టబాల్ జట్టుకు ఎంపికైనది. అనంతపురం జిల్లా ఆర్ టిడి క్రీడామైదానంలో ఫిబ్రవరి  26 నుండి ఈ నెల 2 వరకు జరిగిన 7వ సీనియర్ అంతరాష్ట్ర సాఫ్టబాల్ పోటీలలో జిల్లా జట్టు తరపున ప్రతినిధ్యం వహించిన సిందూజ విశేష ప్రతిభ కనబరచినట్టు సాఫ్టబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి, ప్రసాద్ శుక్రవారం తెలిపారు. అంతరాష్ట్ర పోటీలలో నెల్లూరూపై 0-2, ప్రకాశంపై 2-9, వైజాగ్ పై 0-10 రన్సలో జిల్లా జట్టు విజయమ్ సాధించటానికి సాయి సిందూజ తన పిచ్చింగ్ తో అత్యధిక ఔట్స్, అత్యధిక స్ట్రైకరేట్ తో జాతీయజట్టు లో స్థానమ్ సంపాదించినట్టు పి డి తెలిపారు. ఈ నెల 9వ తెధి నుండి 19వ తేదీ వరకు అనంతపురం ఆర్ టి డి క్రీడామైదానంలో జరిగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొటుందన్నారు. ఈ నెల 20 నుండి 24వ తేదీ వరకు రాజస్థాన్ లోని భరతపూర్ లో జరిగె 43వ జాతీయస్తాయి సోదట్బాల్ పోటీలలో పాల్గొంటుందని పిడి ప్రసాద్ తెలిపారు. జాతీయజట్టుకు ఎంపికైన క్రీడాకారిణి సాయిసింధుజ, శిక్షణ ఇచ్చిన పిడి ప్రసాద్ తెలిపారు.వారిని సర్పంచ్ బి.సరస్వతి, తల్లిదండ్రులకు కమిటీ చైర్మన్ రంగారావులు అభినందించారు.

తాళ్ళపూడి మండల శాఖ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్దిక సాయం

 తాళ్ళపూడి మండల శాఖ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్దిక సాయం



తాళ్ళపూడి, పెన్ పవర్

 తాళ్ళపూడి మండలంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకి వేగేశ్వరపురంలో  కిడ్నీ సమస్యతో  అనారోగ్యంతో బాధ పడుతూ కాకినాడ కేజిహెచ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న  గంగుల వెంకటేశ్వరరావుకి వైద్యం కోసం వారి కుటుంబ సభ్యులకు మానవత స్వచ్చంద సేవా సంస్థ తరపున రూ.4000,  డెంటిస్ట్ సాగర్ రూ.500, చదలవాడ మోజేశ్ రూ.500 కలిపి మొత్తం రూ.5,000 అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బారనాల శంకరరావు, సెక్రటరీ జోడాల వెంకటేశ్వరరావు, కోశాధికారి చెరుకు ఆంజనేయులు, ఉపాధ్యక్షులు తుంపూడి నాగ భూషణ గుప్త, జాయింట్ సెక్రటరీ అంకెo సురేష్, రీజనల్ ఛైర్మన్ వాసిబోయిన చంద్రయ్య, ఈసి మెంబర్  జంగా లక్ష్మీపతి, సభ్యులు టి.రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

వామపక్షాల పిలుపుమేరకు బంద్ విజయవంతం

వామపక్షాల పిలుపుమేరకు బంద్ విజయవంతం



 కేంద్ర ప్రభుత్వా మొండి వైఖరికి నిరసనగా                                 

   పెన్ పవర్,కూనవరం

 విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును పెట్టుబడి దారులకు ధనా దత్తం చేయడానికి నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వా వ్యతిరేక విధానానికి నిరసనగా వామపక్షాల పిలుపుమేరకు శనివారం నాడు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మేకల నాగేశ్వరరావు అధ్యక్షతన టేకులబోర్ సెంటర్ నందు రాస్తారోకో నిర్వహించగా స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు, ఆటో కార్మికులు, కాలేజీలు స్వచ్ఛందంగా పాల్గొని బందును విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరంi పెంటయ్య మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్లాంటును ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజానీకం ఉద్యమంలో భాగస్వాములై విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఓకే నినాదంతో ఉద్యమం ఎగిసిపడుతోందని పెడుతుందని, ఉక్కు ను పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టడం కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని పిలుపునిచ్చారు. టిడిపి సీనియర్ నాయకులు ఎడవల్లి భాస్కర్ రావు మాట్లాడుతూ ఏపీ రాష్ట్రానికి ఆర్థిక వనరుగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ని కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి పూనుకుందని విమర్శించారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించడంనికి రాష్ట్ర ప్రజల హక్కు పెట్టుబడిదారులకు దాన దత్తం చేస్తే  ఊరుకోరని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతుందని హెచ్చరించారు. ఇకనైనా  ప్రైవేటీకరణను విరమింప చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాయం సీతారామయ్య సిఐటియు, శ్యామల కృష్ణ వ్యవసాయ కార్య సంఘం, కాంగ్రెస్ నాయకులు బత్తుల నరసింహారావు, జనసేన పార్టీ నాయకులు బండారు సాంబశివరావు, హేమంత్, టిడిపి నాయకులు ప్రకాష్ రావు, సిపిఐ నాయకులు తాలూరు శ్రీనివాసరావు, తలగాని నాగరాజు, బి ప్రసాద్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...