Followers

మధ్యాహ్న భోజన పథకంలో ఇదేనా నాణ్యమైన పదార్థాలు...

 మధ్యాహ్న భోజన పథకంలో ఇదేనా నాణ్యమైన పదార్థాలు...



పాలిథిన్ కు  పూత పూసినట్లు ఉన్న  బెల్లం చెక్కిలు..

పెన్ పవర్,విశాఖపట్నం

  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు బలవర్ధకమైన ఆహార పదార్థాలు అందించాలని ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం  కాంట్రాక్టర్ల స్వార్థం వెరసి నాణ్యమైన పదార్థాలకు తిలోదకాలు ఇస్తున్నారు.  పాఠశాలలో నాణ్యమైన ఆహార పదార్థాలతో మధ్యాహ్న భోజనం మరియు పుష్టినిచ్చే వేరుశనగ చెక్కిలు,గుడ్లు అందజేస్తున్నారు. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లిస్తున్నా  నాణ్యమైన సరుకులు మాత్రం పిల్లలకు అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యమైన  బెల్లం వేరుశెనగ  గుళ్ళతో  తయారుచేసిన చెక్కిలకు  కాంట్రాక్టు కుదుర్చుకోవాలసి  ఉంది. కానీ అధికారులు కాసులకు కక్కుర్తిపడి  కాంట్రాక్టర్ తో చేతులు  కలుపుతున్నారు అన్నది బహిరంగ రహస్యం. కాంట్రాక్టర్లు తమకు నచ్చిన విధంగా చెక్కిన లు  చేయించి సరఫరా చేస్తున్నారు. దీనికి  అనేక సంఘటనలు రోజూ చేస్తున్నాయి. 2 రోజుల క్రితం మాడుగుల మండలం జె డి పేట పాఠశాలలో  పాలిథిన్   పేపర్ కు అతికించి ఉన్నా  వేరుశనగ చెక్కిలు  పిల్లలకు అందజేశారు. ఇచ్చిందే తడవుగా పిల్లలు  నోట్లో పెట్టేసి చెప్పడం చేశారు. వేరుశెనగ పలుకులు బెల్లం పాకం కరిగిపోయే  నోట్లోకి  పాలదిన్  పేపర్ వచ్చింది. తీరా పరిశీలిస్తే  పాలదిన్  పేపర్ కు బెల్లం పాకం వేరుశనగ పప్పు పూసినట్లు ఉంది. వేరుశనగ పప్పు కూడా చెడిపోయిన ట్లు ఉండటం విశేషం. ఈ విషయం ఒకరిద్దరు ఉపాధ్యాయుని ప్రశ్నించగా  ఈసారి అలా రాకుండా చూసుకుంటాం  అన్న సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. ఒక్కో విద్యార్థికి   బెల్లం వేరుశనగ పప్పు చెక్కి పరిమాణం  బరువు  ఇంత మేర కేటాయించాలని ఉంది. కానీ అవేమీ కనిపించడంలేదు. బెల్లం  వేరుశెనగ చెక్కి  ఇచ్చేశాం  అంతే.. మధ్యాహ్న భోజన పథకం అమలు పై పర్యవేక్షణ కొరవడింది అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అమలు జరుగుతున్న ఈ పథకం ద్వారా నాణ్యతలేని  పదార్థాలు అందజేస్తున్నారు అని  విమర్శలు వినిపిస్తున్నాయి. మండల విద్యాశాఖ అధికారులు  ఆ వైపు కన్నెత్తి అయినా చూడటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పాలిథిన్  పేపర్లు పిల్లలకు హాని కలిగిస్తాయని తల్లిదండ్రులు వాపోతున్నారు.

విశాఖ ఉక్కు కోసం కదంతొక్కిన విలేఖరులు

 విశాఖ ఉక్కు కోసం కదంతొక్కిన విలేఖరులు




నర్సీపట్నం, పెన్ పవర్ 

  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న విశాఖ జిల్లా బంద్ కు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మద్దతు తెలిపింది. వామపక్షాలు, ట్రేడ్ యూనియన్లు జిల్లా వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నర్సీపట్నంలో  జాబ్ యూనియన్ సభ్యులు,  వారికి మద్దతుగా ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ముందుగా జాప్ రాష్ట్ర కార్యదర్సి యలమంచిలి వేణు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోసూరి రామకృష్ణ అబీద్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, మానవహారంగా ఏర్పడ్డారు. రాస్తారోకో నిర్వహించారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ కొద్దిసేపు నినాదాలు చేశారు. అనంతరం జాప్ నాయకుడు వేణు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ నష్టాలలో ఉంటే, దానికి సొంత గనులు కేటాయించి ఆదుకోవాలి గానీ, ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగా ఈ కర్మాగారం ఏర్పడిందని గుర్తు చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీనియర్ పాత్రికేయుడు కె.రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు పేరుతో జరిగిన భారీ ఉద్యమ ఫలితమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటన్నారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, దశల వారీగా  ఉద్యమ నిర్మాణం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ గౌరవ అద్యక్షులు ఎం.అప్పలరాజు, అద్యక్షులు గొర్లి రాజు, కార్యదర్సి లంక శివకుమార్, కోశాధికారి కోట్ని రాజశేఖర్, ప్రెస్ క్లబ్ గౌరవ అద్యక్షులు వర్రే రమణ, కార్యదర్సి జామిశెట్టి శ్రీధర్ మరియు పులిగా మురళి, జె.శంకర్, రవిశేఖర్, కడిమిశెట్టి తాతాజీ, పి.గోవింద్, ఎల్.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.

మోడీ కేసీఆర్ లు తోడు దొంగలు: రేవంత్ రెడ్డి

 మోడీ కేసీఆర్ లు తోడు దొంగలు: రేవంత్ రెడ్డి

కూకట్ పల్లి,పెన్ పవర్


కేసీఆర్ ది కల్వకుంట్ల కుటుంబం కాదు నల్లికుంటల కుటుంబం అని మల్కాజిగిరి ఎం.పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్, రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి. కేసీఆర్, మోదీ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. ఆసియాలో లొనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి నుండి గెలిపించి గల్లీ నుండి ఢిల్లీ కి పంపించడం లో యువత పాత్ర ఎంతో కీలకమైనదని, మోదీ తెలంగాణ రాష్ట్రాన్ని  మోసం చేశారని అంటున్న తెరాస పార్టీ  జి.ఎస్.టి బిల్లుకి మరియు మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరికొన్ని  బిల్లులకు ఎందుకు మద్దతు ఇచ్చారు అని ప్రశ్నించారు. మోడీ, కేసీఆర్ ఇద్దరు తోడుదొంగలే అనీ రైల్వే కోచ్, తెలంగాణకు రావాల్సిన ఐ.టి.ఐ.ఆర్  రాలేదు అంటున్న కేటీఆర్ కి సూటిగా సవాల్ విసురుతున్నామని ఇద్దరం ఢిల్లీకి కలిసి వెళ్లి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటికోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చి అయినా సరే సాధించుకోవడానికి  వస్తావా అని సవాలు విసిరారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నియామకాలు రావడానికి కాంగ్రెస్ పార్టీ తరుపున సోనియా గాంధీ, రాహుల్ గాంధీని మిగిలిన నాయకులను ఒప్పిస్తాం. పార్లమెంట్ లో తమతో  కలిసి కొట్లాడడానికి రావాలి అని సూచించారు. నువ్వు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే ఇంకా లక్ష ఉద్యోగాలు ఎందుకు ఖాళీగా ఉన్నాయి అన్నారు.

2013 పునర్విభజన చట్టంలో ఉన్న వాటిని బీజేపీ వారు పూర్తి చేసారా అని విమర్శించారు. ఎన్నికలలో టి.ఆర్.ఎస్ పార్టీ ఓడితే కేసీఆర్ కుర్చీకి వచ్చిన అపాయం ఏమి లేదనీ, కెసిఆర్ కి తన కూతురు, కొడుకు వల్లే అపాయం ఉందనీ,యువత, విద్యార్థులు, విద్యావంతులు అందరూ కలిసి ప్రశ్నించే గొంతుక అయిన చిన్నారెడ్డి ని గెలిపించాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్, ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, స్పోక్స్ పర్సన్ సత్యం శ్రీరంగం, రాఘవేందర్, కూకట్ పల్లి డివిజన్లకు చెందిన ప్రెసిడెంట్లు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో బిజెపిలోకి చేరికలు..

 కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో బిజెపిలోకి చేరికలు..

కుత్బుల్లాపూర్,పెన్ పవర్

సుభాష్ నగర్ డివిజన్ లోని అపురూప కాలనీ లోనీ కమ్యూనిటీ హాల్ లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర బిజెపి నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుభాష్ నగర్ డివిజన్ కు సంబంధించిన కూన శ్రీశైలం గౌడ్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు టిఆర్ఎస్ నుంచి కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో బీజేపీ పార్టీలో పెద్ద ఎత్తున చేరి ఆయన చేతుల మీదుగా కండువా కప్పుకున్నారు. అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి బిజెపి పార్టీలో కష్టపడి పని చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు నుంచి అందరం కలిసి సుభాష్ నగర్ డివిజన్ సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బూత్ స్థాయి లో అందరం కలిసి పని చేసే విధంగా ముందుకు వెళ్లాలని టిఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మనం అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో రాష్ట్రంలో బండి సంజయ్ నాయకత్వంలో బిజెపి పార్టీ రానున్న రోజుల్లో మరింత బలపడుతుందని కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కంది శ్రీరాములు, మాజీ రాష్ట కార్యవర్గ సభ్యుడు ఏం ఎస్ వాసు, లక్ష్మీపతి రాజు, సాయి, గుబ్బల లక్ష్మి నారాయణ, శ్రీధర్ రెడ్డి , బి రవి, బిజ్జిలి సంభైయ్యా, శంకర్, మల్లేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, అనిల్, అమర్, సౌరబ్ సింగ్, చక్రి, జోగురాజు, రమణ, హన్మాన్ కచ్చావా, మల్లేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

పరిగిలో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం జోరు

 పరిగిలో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం జోరు


వికారాబాద్ జిల్లా, పెన్ పవర్ 

పరిగి మున్సిపల్ లో  జోరుగా ఎమ్మెల్సీ పట్టభద్రుల ప్రచారం వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోగల నాలుగో వార్డులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్  సందర్భంగా వార్డు కౌన్సిలర్ వారాల రవీంద్ర తో కలిసి ప్రచారంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీ ముకుంద అశోక్ కుమార్ మాట్లాడుతూ పివి నరసింహారావు కుటుంబానికి మంచి పేరు ఉన్న వ్యక్తి ప్రదానమంత్రిగా దేశానికి ఏతో మేలుచేశారని ఇలాంటి వ్వక్తులకు తమ ఓటు వెయాల్సిందిగా మున్సిపల్ చ్తెర్మన్ ఆశోక్ కోరారు.   తెరాస  పార్టీమండల అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ పరిగిపట్టణ లోని విద్యావంతులుయెదావులు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురబి వాణీదెవికి తమ ఓటువేసి గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు  ముకుంద శేఖర్ నాయకులు రవికుమార్  పాల్గొనడం

పలు చోరీకేసులో ఇద్దరు నిందితుల అరెస్టు..

పలు చోరీకేసులో ఇద్దరు నిందితుల అరెస్టు..

 47 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం 

 ఐదు రోజులకే చోరీ కేసును ఛేదించిన పోలీసులు 

త్వరితగతిన విచారణ చేయడంతో చోరీ సొత్తు స్వాధీనం 

రెండు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు , వెండి వస్తువులు రికవరీ 

సత్యవేడు పోలీస్ అధికారులకు బాధితులు జేజేలు...




పెన్ పవర్,సత్యవేడు

  చిత్తూరు జిల్లా సత్యవేడు పోలీస్ స్టేషన్లో నమోదైన పలు చోరీకేసులో ఇద్దరు నిందితులను స్థానిక పోలీసు అధికారులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 47 గ్రాముల బంగారు ఆభరణాలు ,20 గ్రాముల వెండితో పాటు చిన్నపిల్లల హీరో సైకిల్ , ఒక ఐరన్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు .శుక్రవారం చోరీకేసులో స్వాధీనం చేసుకున్న బంగారు వస్తువులను స్థానిక పోలీస్ స్టేషన్లో పుత్తూరు డిఎస్పి యశ్వంత్ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బీవీ శ్రీనివాసులు ,ఎస్సై నాగార్జున రెడ్డి బృందం మీడియా ముందు ప్రవేశ పెట్టారు .ఈ సందర్భంగా డిఎస్పి యశ్వంత్ మాట్లాడుతూ గత నెల 27వ తేదీన సత్యవేడు మండలం అల్లపుగుంట అంకమ్మ దేవాలయంలో కొందరు దుండగులు ప్రవేశించి బంగారు ఆభరణాలను అపహరించినటు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది అన్నారు .దీనిపై జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక పోలీసు అధికారులు పుత్తూరు నేరవిభాగ బృందంతో కలిసి విచారణ ప్రారంభించినట్టు చెప్పారు .గంగమ్మ గుడిలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసులకు సంబంధించిి పాత నేరస్తుల పాత నేరస్తుల ఫోటోలతో నిందితులను గుర్తించడం జరిగిందన్నారు .ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో తమిళనాడు సరిహద్దు ఆర్బి ఫ్యామిలీ డాబా వద్ద నిందితులు ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లడం జరిగింది అన్నారు .అప్పటికే ఒకరు తప్పించుకుని పరారు కాగా మిగిలిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు .ఇందులో సత్యవేడు మండలం వెంకటాపురం ఎస్టి కాలనీకి చెందిన తుపాకుల వెంకటేష్(21), తమిళనాడు గుమ్మడిపూడి తాలూకా మానెల్లూరు ఎస్టి కాలనీకి చెందిన చిన్న(25) ఉన్నట్టు ఆయన వివరించారు .వీరిని విచారించగా సత్యవేడు పట్టణం గాంధీ రోడ్డు ,కోటమిట్ట కాలనీలో చోటు చేసుకున్న దొంగతనాలు తామే చేసినట్టు అంగీకరించినట్టు ఆయన చెప్పారు . అల్లపుగుంట గుడి చోరీకి సంబంధించి ముప్పై రెండు గ్రాముల బంగారు ఆభరణాలలో మూడు బంగారు గిన్నె బిట్లు , రెండు బంగారు బూట్లు ,మూడు బంగారు ముక్కు పుడకలు , మరో రెండు కేసులు 12 గ్రాముల బంగారు చైను ,మూడు గ్రాముల బంగారం నిందితులు నుంచి స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు .వీటి విలువ దాదాపు రెండు లక్షల రూపాయలు ఉంటుందన్నారు . పరారైన నిందితుని త్వరలో పట్టుకుంటామని స్పష్టం చేశారు .అన్ని దేవాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా దొంగతనాల కేసులను ఫిర్యాదు అందిన రెండు మూడు రోజుల్లోనే చేధించడానికి వీల్ అయిందన్నారు .అలాగే ప్రతి గ్రామంలోనూ విలేజ్ డిఫెన్స్ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు .ఇప్పటికే పుత్తూరు నగిరి ప్రాంతాల ప్రధాన రోడ్డు మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా , త్వరలోనే నాగలాపురం ,వరదయ్యపాలెం ప్రాంతాలలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు .అయితే నాగలాపురం మండలంలో సురుటుపల్లి , నాగలాపురంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో పనిచేసే ఆటోమేటిక్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో దీని ద్వారా వాహనాలు నెంబర్ను కూడా గుర్తించడానికి సులువు  అయింది అన్నారు .ఈ సమావేశంలో ట్రైనింగ్ ఎస్ఐ మధు రామచంద్రుడు , ఏఎస్ ఐ భాస్కర్ ,దయానిధి నాయుడు , రెడ్డి శేఖర్ , గంగాధరం ,మురళి ,దేవేంద్రనాయక్ , మనీ తదితరులు పాల్గొన్నారు.

పిడి ఎస్ ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వితంతువు నిరు పేదలకు చీరల పంపిణీ ,,,,

 పిడి ఎస్ ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వితంతువు నిరు పేదలకు చీరల పంపిణీ ,,,,

ప్రతి ఒక్కరూ సేవా గుణం కలిగి ఉండాలి ఎమ్మార్వో సరిత రాణి 

క్రీతిక పటేల్(లెకన) పుట్టినరోజు సందర్భంగా

కేసముద్రం,పెన్ పవర్


పి డి ఎస్ ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ బన్నీ శెట్టి విజయ వెంకటేష్ ఆధ్వర్యంలో విలేజి లోని అగాపే ఫుల్ గాస్పల్ చర్చి లో వీరి మనుమరాలు క్రీతిక పటేల్( లేఖన) పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పేద వితంతు మహిళల కు చీరలు పిల్లలకు బట్టలు స్వీట్స్ 20 మందికి అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మార్వో సరిత రాణి హాజరయ్యారు,, స్థానిక ఎమ్మార్వో సరిత రాణి మాట్లాడుతూ పి డి ఎస్ ఎస్ స్వచ్ఛంద సంస్థల ద్వారా పుట్టిన రోజులు పెళ్లి రోజులు ఈ విధంగా జరుపు కోవడం చాలా మంచి సంకేతమని ప్రతి ఒక్కరు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని తమకు తోచినంత సహాయం పేదవారికి అందించాలని నేను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని ప్రతి ఒక్కరు సేవ గుణం కలిగి సహయం చేయాలని వీరిని ఆ దేవుడు దీవించాలని అన్నారు ఆ సంస్థ చైర్మన్ బనిశెట్టి విజయ వెంకటేష్ మాట్లాడుతూ మాకు సంపాదనలో కొద్దిగా పేదవారికి సహాయం చేయాలని సంకల్పంతో చేస్తున్నామని ఆ దేవుని ఆశీర్వాదం మాపై ఉండాలని మీ అందరి దీవెనలు కూడా మాకు కావాలని ముందు ముందు మరిన్ని ఎక్కువగా ప్రోగ్రామ్స్ చేసే అవకాశం ఆరోగ్యం ఐశ్వర్యం కోసం దేవుని ఆశీర్వాదం మీ దీవెనలు ఎల్లప్పుడూ మాకు ఉండాలని వారన్నారు.  లయన్స్ క్లబ్ ఆఫ్ కేసముద్రం ఎక్స్ జెడ్ చిర్ర ఏకాంతం గౌడ్ మాట్లాడుతూ వీరి కుటుంబం గత కొద్ది సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలుపేదరికం లో ఉండి కూడా స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తున్నారని ఆ దేవుని కృప వీరికి ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు,, ఈ కార్యక్రమంలో లో పాస్టర్ పిల్లి కుమారస్వామి ,ఇజ్రాయిల్ ,బనిశెట్టి లోకేష్ ,అల్లం గణేష్ ,సాయి నిఖిల్, లక్ష్మీనారాయణ ,తదితరులు పాల్గొన్నారు....

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...