Followers

వాలీబాల్, టోర్నమెంట్ ప్రారంభించిన - వైస్ ఎంపీపీ

 వాలీబాల్, టోర్నమెంట్ ప్రారంభించిన - వైస్ ఎంపీపీ

పెన్ పవర్ ,మందమర్రి 


మందమర్రి మండలం లోని ఆదిల్ పేట్, గ్రామంలో ఆదే, రవి, స్మారకార్థం, వాలీబాల్ టోర్నమెంట్, ప్రారంభించడం, జరిగింది, ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ,  రాజ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ మండల, అధ్యక్షుడు, సంజీవ రావు, మాట్లాడుతూ, యువతకు, అటలు, అడటం, వల్ల, క్రీడాకారులు, ఎంతో ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిల్ పేట్ గ్రామ సర్పంచ్ పున్నం, శంకర్ పల్లి సర్పంచ్, సది, మామిడి గట్టు, సర్పంచ్, రాయ లింగు సారంగ పల్లి, సర్పంచ్ పర్వీన్ సుల్తానా, ఫిరోజ్, బొక్కల గుట్ట యూత్ అధ్యక్షులు,  సంజీవ్, వార్డు సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు, పట్టణ యూత్ తదితరులు పాల్గొన్నారు.

బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలి..

 బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలి......

పెన్ పవర్, ఆలమూరు 

  బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలని ఆలమూరు మండల సీఆర్పీలు అన్నారు. మండల పరిధి మడికి, చెముడులంక, జొన్నాడ గ్రామాలలో గల ఇటుకల బట్టీలు, వీధుల్లో ఖాళీగా తిరిగే బాలలు, పలు వాణిజ్య సంస్థల నందు పని చేసేవారిని సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు శనివారం పిల్లల గుర్తింపు, బడిబయట ఉన్న వీధిబాలల సర్వే నిర్వహించారు. దీనిలో భాగంగా జొన్నాడలో సుమారు ఆరుగురు విద్యార్థులను బడి బయట పిల్లలను (ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారిని ) గుర్తించారు. అలాగే మడికి గ్రామంలో కపిలేశ్వరపురం మండలానికి చెందిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను అదే గ్రామంలో గల సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు సన్నాహాలు  చేపట్టారు. ఈ కార్యక్రమంలో. సీఆర్పీలు పెద్దిరెడ్డి శ్రీనివాసు,  గంటి శ్రీను, ఒప్పంద ఉపాధ్యాయులు మేడపాటి వీరలక్ష్మి, వడ్డి విజయలక్ష్మి, కె రామకృష్ణ, డిఎన్ లక్ష్మి, డి సత్యలు  పాల్గొన్నారు.

సింగరేణిలో నో అబ్జెక్షన్ ధ్రువీకరణ కోసం జాతీయ కార్మిక సంఘాలు చర్చించాలి

 సింగరేణిలో నో అబ్జెక్షన్ ధ్రువీకరణ కోసం జాతీయ కార్మిక సంఘాలు చర్చించాలి

సింగరేణి అపరేటర్స్ సంఘం అధ్యక్షులు బేడ్డల విజయ్

బెల్లంపల్లి,పెన్ పవర్

 నో అభ్జెక్షన్ పత్రం కోసం అన్ని జాతీయ  కార్మిక సంఘాలు మరియు ప్రాంతీయ సంఘాలు యాజమాన్యం తో చర్చించి కార్మికులకు న్యాయం చేయాలని సింగరేణి ఆపరేటర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బెడ్డల విజయ్ కోరారు.శనివారం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్యకు తమ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.అనంతరం బెడ్డల విజయ్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి లో పని చేస్తున్న  కార్మికులకు ఎన్ ఓ సి సర్టిఫికెట్ విషయంలో జాతీయ సంఘాలు అన్ని సంఘాలు యాజమాన్యంతో చర్చించి 1800 మంది కార్మికులకు న్యాయం చేయాలని అని అన్నారు.ఎన్ ఓ సి కారణంగా రేపు రాబోయే నోటిఫికేషన్ లలో చాలా మందికి అర్హత కోల్పోతారని, అలా జరగకుండా వెంటనే యాజమాన్యానికి తెలియజేసి రాబోయే నోటిఫికేషన్ లో కార్మికులకు అవకాశం కల్పించాలని అని కోరారు. మొన్న ఇచ్చిన సర్కులర్  కొంతమందికి కి వర్తించింది.ఇంకా చాలా మంది కార్మికులకు ఎన్ఓసి కోసం దరఖాస్తు చేసుకోవడానికి సర్కులర్ ఉపయోగపడలేదు కావున మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కింద ఎన్ ఓ సి తీసుకోవడానికి మళ్ళీ ఒక సర్కులర్ తీసుకువచ్చి కార్మికులకు న్యాయం చేయాలని అన్నారు..

16వ వార్డులో సైకిల్ స్పీడ్...

 16వ వార్డులో సైకిల్ స్పీడ్.....

నర్సీపట్నం, పెన్ పవర్ 

  నర్సీపట్నం మున్సిపాలిటీ 16వ వార్డులో టిడిపి అభ్యర్ధి జంపన స్వరాజ్యలక్ష్మి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కేంటిన్ రాజుగా పట్టణ ప్రజలకు సుపరిచితుడైన జంపన నాగేంద్రరాజు, అయ్యన్నపాత్రుడుకు అత్యంత సన్నిహితుడు. ఈ  సాన్నిహిత్యం వల్లే క్యాంటీన్ రాజు భార్య స్వరాజ్యలక్ష్మికి అయ్యన్నపాత్రుడు అవకాశం ఇచ్చారు. బి-ఫారం పొందిన రోజు నుండి వార్డులో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.  క్యాంటీన్ రాజు రోటరీ క్లబ్ లో అనేక పదవులు నిర్వహించి,  సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. ప్రజలకు మరింత సేవ చేయాలంటే రాజకీయాలే ప్రధాన వేదికని,  అయ్యన్న  పిలుపు మేరకు కౌన్సిలర్ గా పోటీలో నిలబడ్డారు. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రజావ్యతిరేఖ విధానాలను వివరిస్తున్నారు. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజలను చైతన్య పరుస్తున్నారు. కౌన్సిలర్ గా తనను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వార్డు సమస్యల పట్ల వెంటనే స్పందిస్తానన్నారు. వార్డు శివారు వీధులకు సిమెంట్ రోడ్లు వేయిస్తానని, వీధులలో చెత్తకుండీలు ఏర్పాటు చేస్తానన్నారు. నిరంతరం పారిశుద్య పనుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. వైసిపి నాయకుల మాయమాటలు నమ్మవద్దని, ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి, ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని పెట్టారన్నారు. టిడిపి అభ్యర్ధిని జంపన స్వరాజ్యలక్ష్మిని గెలిపించి వార్డు సర్వతోముఖాభివృద్దికి సహకరించాలని కోరారు.

బాధితులకు అండగా ఎమ్మెల్యే వెన్నెల చేతుల మీదుగా.. నిత్యావసరాలు పంపిణీ

 బాధితులకు అండగా ఎమ్మెల్యే వెన్నెల  చేతుల మీదుగా.. నిత్యావసరాలు పంపిణీ 




బొండపల్లి, పెన్ పవర్

 మండలంలోని దేవుపల్లి పంచాయితీ కొండవాని పాలెం లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాద బాధితులకి ట్రిపుల్ ఈ సర్వీసెస్ సంస్థ అధినేత వెన్నెల చంద్ర శేఖర్ అండగా నిలిచారు. అగ్ని ప్రమాదంలో 40 కుటుంబాలు సర్వం కోల్పోయి నిరాశ్రయులైన విషయాన్ని తెలుసుకున్న ఆయన ఆ కుటుంబలన్నింటికీ నిత్యావసరాలను అందించడానికి ముందుకు వచ్చారు. గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య చేతుల మీదుగా శనివారం ఒక్కో బాధిత కుటుంబానికి వస్త్రాలు, దుప్పట్లు,  బియ్యం బస్తాలు తదితర నిత్యావసరాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అప్పల నర్సయ్య  మాట్లాడుతూ ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా మానవత్వంతో తన వంతు సాయం అందించడంలో వెన్నెల చంద్రశేఖర్ ముందుంటారని ఎమ్మెల్యే అభినందించారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో విశేషమైన సేవలందించిన చంద్ర శేఖర్ అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలిచి మరోసారి తన దాతృత్వం చాటుకున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

జాయిన్ హాండ్స్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో మధ్యాహ్నం బడి

 జాయిన్ హాండ్స్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో మధ్యాహ్నం బడి

మందమర్రి,పెన్ పవర్

వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చదువుకోవాలని చదువుతో మానసిక  వికాసంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని జాయిన్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సంజయ్ కుమార్ అన్నారు. రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అల్లూరి సీతారామరాజు నగర్ లో మధ్యాహ్నం బడిని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు సంజయ్ కుమార్ మాట్లాడుతూ, అందరికీ చదువు అందించాలని, సొంతంగా రాయడం చదవడం నేర్చుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సంతకం పెట్టడానికి మరొకరి సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉండదని అందుకోసమే వయస్సుతో సంబంధం లేకుండా విద్యను అందరికీ అందించాలని, మధ్యాహ్నం బడిని రామకృష్ణ పూర్ పట్టణంలోని అల్లూరి సీతారామరాజు నగర్ లో సుమారు 50 మందికి ఉచిత విద్య కార్యక్రమన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రతి పేదవాడికి తాము అండగా ఉంటామని ఎక్కడ ఎవరికి బాధ కలిగిన వారికి తమ వంతు సాయం చేస్తూ, మంచి మనసుతో ఆదరించి వారికి అన్ని విధాలా తోడుంటూ వారి కష్టసుఖాల్లో పాలు పాలుపంచుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయవాది మల్లయ్య, తిరుపతి, ఉపాధ్యాయురాలు స్రవంతి, భాగ్య, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ సన్యాసుల మాటలు నమ్మొద్దు..

రాజకీయ సన్యాసుల మాటలు నమ్మొద్దు..

విజయనగరం,పెన్ పవర్

విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 30వ డివిజన్ (ధర్మపురి) లో మాజీ కేంద్రమంత్రి వర్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారు మరియు విజయనగరం నియోజకవర్గ ఇంచార్జి అదితి గజపతి రాజు గారు పాల్గొన్నారు.  


  శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారు మాట్లాడుతూ :  

  నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలో, జిల్లాలో ప్రతి ఇంటికి, ప్రతి సెంటుకు నీరు అందించింది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. జిల్లాలో జంఝావతి, తోటపల్లి మొదలగు నదుల కాలువలు అభివృద్ధి చేసి త్రాగు నీరు, సాగు నీరు అందించాం.అదేవిధంగా అప్పలకొండయంబ గారు త్రాగునీరు ప్రాజెక్ట్ ప్రారంభించి విజయనగరం పరిసర ప్రాంతాల ప్రజలకు నీరు అందించారు.అంబేడ్కర్ వ్రాసిన రాజ్యాంగం, ప్రభుత్వ సంక్షేమ పధకాలు పూర్తి స్థాయిలో  అమలు చేసింది టీడీపీ ప్రభుత్వం అన్న ఎన్టీఆర్ మరియు చంద్రబాబు.ఇదివరకు కొంతమంది ఈసారి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామని అన్నారు, కానీ తీసుకోలేదు, అలాంటి రాజకీయ సన్యాసుల మాటలు నమ్మొద్దు,ఈ ఓటు తో వారు శాశ్వతంగా రాజకీయా సన్యాసులుగా మార్చే అవకాశం మీకు ఉంది. ఇప్పుడు పిట్టకథలు చెప్పుకుంటూ వస్తున్న నేతల మాటలను నమ్మకండి, నమ్మితే మన జీవితాలు ఓ పిట్టకధగా మారిపోతాయి.బెదిరించే వారికి  భయపడకండి, ఒకవేళ భయపడితే 5 ఏళ్ళు వారికి భపడాల్సి వస్తుంది. రానున్న ఎన్నికకాలలో టీడీపీ మేయర్ అభ్యర్థి శమంతకమణి గారిని గెలిపించాలి, అలాగే మీ డివిజన్ టీడీపీ అభ్యర్థి గేదెల ఆదిబాబు గారిని గెలిపించవలసిన బాధ్యత మన అందరిపై ఉంది. టీడీపీ ఇన్ ఛార్జి అదితి గజపతిరాజు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ అసమర్ధత వలన రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. పెరిగిన నిత్యవసర ధరలను నియంత్రించలేని స్థితిలో వైకాపా పాలకులు ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే టీడీపీ గెలుపునకు సోపానాలన్నారు. పోలీసు, అధికార వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పధకాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారని, ఎవరి సొమ్ముతో పధకాలు ఇస్తున్నారో చెప్పాలన్నారు.  వైకాపా పాలనలో ఇసుక, సిమ్మెంట్, గ్యాస్, డీజిల్, పెట్రోల్, వంటనూనె ధరలు పెరుగుదలతో సామాన్య ప్రజలపై భారం పడుతోందన్నారు. పట్టణాల్లో భారీగా ఆస్తి పన్ను పెంచేందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...