Followers

రైఫిల్ షూటింగ్ లో సత్తా చాటిన స్వరూప్

రైఫిల్ షూటింగ్ లో సత్తా చాటిన స్వరూప్



రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంతో సిల్వర్ మెడల్ కైవసం

 పెన్ పవర్, కరప

రైఫిల్ షూటింగ్ లో కరపమండలం నడకుదురు గ్రామానికి చెందిన ముమ్మిడి సాయిరాం స్వరూప్ సత్తా చాటి సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ లో గత నెల 24 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు 21వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైఫిల్ షూటింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తణుకు పట్టణానికి చెందిన ఎం.రామరాజు కు బంగారు పతకం లభించగా తనకు సిల్వర్ మెడల్ లభించినట్టు స్వరూప్ తెలిపారు. ముమ్మిడి శివసాయిరాంస్వరూప్ ఎంసీఏ  చదివి ప్రస్తుతం వ్యాపారం చేస్తున్నారు. రైఫిల్ షూటింగ్ పట్ల ఉన్న అభిరుచితో ఆంధ్రప్రదేశ్ లో 2017లో సభ్యత్వం తీసుకుని ముమ్మర సాధన చేసినట్టు అతను తెలిపారు. ఈ ఏడాది పోటీల్లో పాల్గొని మొదటిసారే రెండో స్థానంలో నిలవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. రైఫిల్ షూటింగ్ లో సత్తా చాటిన స్వరూప్ ను  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఫోన్ లో అభినందించారు. నడకుదురు మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైసీపీ నాయకుడు జవ్వాది సతీష్ , ఇతర గ్రామ పెద్దలు స్వరూప్ ని అభినందించారు.

డిసిసి అధ్యక్షులు భరత్ చంద్రా రెడ్డి ....

 తెలంగాణాలో కెసిఆర్ పాలనకు చరమగీతానికే ఈఎమ్మెల్సీ ఎన్నికలు..


డిసిసి అధ్యక్షులు భరత్ చంద్రా రెడ్డి ....



నెల్లికుదురు,పెన్ పవర్

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలన అంతానికి ఎమ్మెల్సీ ఎన్నికలు నాంది పలుకుతాయని డిసిసి అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి అన్నారు.ఖమ్మం వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీఅభ్యర్థి గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ప్రభావతి రాము నాయక్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతూనియోజకవర్గ ఇంచార్జ్ డా. మురళి నాయక్ డిసిసి ఉపాధ్యక్షులు ఎదెల్ల యాదవ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని సత్యపాల్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ తో కలిసి మండల కేంద్రం నెల్లికుదురు మేచ రాజు పల్లి, శ్రీరామగిరి,రాజుల కొత్తపల్లి తదితర గ్రామాల్లో నిఉద్యోగులు నిరుద్యోగ పట్టభద్రులను కలిసి రాములు నాయక్ ను గెలిపించాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు.నిరుద్యోగ సమస్య తీరక పోగా నిరుద్యోగసమస్య తెలంగాణాలో జటిలమవుతుంది అని విమర్శించారు.నియంతలా వ్యవహరిస్తూ హక్కుల కోసం ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారని దుయ్యబట్టారు.ప్రస్తుతం జరుగుతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమి తప్పదు అన్నారు.రెండు చోట్లా కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం ఖాయం అన్నారు. కార్యక్రమంలో వెలిశాల దేవేందర్ రావు శ్రీరామగిరి సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్ శ్రీరామగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొల్లపెల్లి ప్రభాకర్ గౌడ్,నాయకులు డొనికెనిశ్రీనివాస్ గౌడ్ గిరగాని బిక్షపతి గౌడ్ తూల్ల ప్రణయ్ సీనియర్ నాయకులు పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

మానసిక వ్యాధిగ్రస్తులకు వైద్య సదుపాయాలు...

 మానసిక వ్యాధిగ్రస్తులకు వైద్య సదుపాయాలు....



పెన్ పవర్,తాళ్ళూరు

   తాళ్ళూరు మండలం లోని తూర్పు గంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో  మానసిక రుగ్మతలు ఉన్న వారికి మానసిక వైద్య నిపుణులు  డా. చంద్ర శేఖర్ ( సైకియాట్రీస్ట్)  ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించబడతాయి అని డాక్టర్ బంక రత్నం తెలిపారు. డాక్టర్  జె. చంద్ర శేఖర్ మాట్లాడుతూ  వెల్ నెస్ సెంటర్స్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మానసిక రుగ్మతలకు వైద్య సేవలు .ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల నాలుగవ సోమవారం మానసిక రుగ్మతలు, నిద్ర లేమి, మూర్ఛ రోగం, సైకోసిస్, మొదలగు రోగులకు వైద్యసేవలు అందించబడతాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో  సోషల్ వర్కర్ అనిల్, ఆసుపత్రి సిబ్బంది అనిత, అంజిరెడ్డి, వాణి, సుశీల పాల్గొన్నారు.

ఉత్తమ సేవలకు గుర్తింపు...

 ఉత్తమ సేవలకు గుర్తింపు...




నెల్లికుదురు,పెన్ పవర్


మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాలగ్రామం లో  తెలంగాణ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు. జాటోత్ హుస్సేన్ నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకొని రావిరాల గ్రామం లో కరోనావైరస్ కాటేస్తున్న కష్టకాలంలోగ్రామాలలోని ప్రజలకు  ఉత్తమ సేవలు అందించి తన ప్రాణాలను లెక్కచేయకుండా నిరంతరం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉత్తమ సేవలు అందించిన గ్రామ ఏఎన్ ఎం  యశోదమ్మ ను సన్మానించ డం జరిగింది. అనంతరంరావిరాల  యాదవ సంఘం కుల పెద్ద ఆకుల మల్లయ్య   కేక్ కట్ చేసి. స్వీట్లు మిఠాయిలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీ.జే.వై.ఎం. మండల అధ్యక్షులు. తాళ్లపల్లి వాసు గౌడ్ గ్రామ బూత్ అధ్యక్షులు రాసయా కీరెడ్డి . తాళ్లపల్లి అశోక్. ప్రధాన కార్యదర్శి చట్ల నరేష్. తుమ్మనపల్లి అశోక్. రాస ఉమేష్. అరె విద్యాసాగర్. మండ వీరస్వామి. పెండెం పుల్లయ్య. యాకూబ్. మురళి పాల్గొనడం జరిగింది.

రైతు వేదికలు రైతులకు అధ్యయన కేంద్రాలు -మంత్రి కొప్పుల ఈశ్వర్

 రైతు వేదికలు రైతులకు అధ్యయన కేంద్రాలు  -మంత్రి కొప్పుల ఈశ్వర్



ప్రతి 5 వేల ఎకరాలకు   రైతు వేదిక ఏర్పాటు

దేశానికే ఆదర్శంగా రైతు సంక్షేమ పథకాల అమలు

పంట మార్పిడి విధానాన్ని రైతులు  పాటించాలి

నూతనంగా 24 లక్షల మెట్రిక్ టన్నుల గోదాంల నిర్మాణం

నూతన వ్యవసాయ చట్టం  పట్ల రైతుల తీవ్ర ఆందోళన

సంక్షేమం, అభివృద్ధి రెండు చక్రాలుగా తెలంగాణ అభివృద్ధి లో దూసుకుపోతోంది

కరోనా సంక్షోభ సమయంలో  ఆగని సంక్షేమ పథకాలు

గొల్లపల్లి ,పెన్ పవర్

గొల్లపల్లి మండలం చందోళీ గ్రామంలో రైతు వేదిక,CC  రోడ్లు, 40 లక్షల తో జంగిల్ నాల ప్రాజెక్టు వెళ్లె బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, వైకుంఠ ధామం, దాదాపు 1కోటి 20 లక్షల తో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ దేశానికే ఆదర్శవంతంగా  మన రైతాంగాన్ని తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృత నిశ్చయంతో   పనిచేస్తుందని మంత్రి  అన్నారు.రైతు సంక్షేమ ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.600 కోట్లు ఖర్చు చేసి 2601 రైతు వేదికలను నిర్మించామని, ప్రపంచంలో ప్రభుత్వం రైతులకు వేదికలు నిర్మించడం తెలంగాణలో మాత్రమే జరిగిందని తెలిపారు. 


2014 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో రైతులు 2 పంటలు కలిపి 30 లక్షల ఎకరాల మాత్రమే వరి సాగు చేసారని, అక్కడి నుంచి ప్రస్తుతం రెండు పంటలు కలిపి రాష్ట్రంలో 1 కోటి 30 లక్షల ఎకరాల వరి సాగు జరిగిందని అన్నారు. గత ఆరు సంవత్సరాలుగా రైతు అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను  అందిసుతన్నాయని అన్నారు.నూతన రాష్ట్రం ఏర్పడిన 6 మాసాలో విద్యుత్ సమస్యను అధిగమించి రైతులకు నాణ్యమైన 3 ఫేస్ విద్యుత్ 24 గంటల పాటు ఉచితంగా రైతులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. ప్రతి సంవత్సరం రూ.1200 కోట్లు ఖర్చు చేసి రైతుకు భద్రత కల్పించే దిశగా రైతు బీమా పథకం అమలు చేస్తున్నామని, కరోనా సంక్షోభ సమయంలో సైతం రైతు బంధు పథకానికి కోతలు విధించకుండా 15 వేల కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాలో జమ చేసామని మంత్రి అన్నారు.గత 6 సంవత్సరాలుగా ప్రభుత్వం రైతుల వద్ద నుండి మద్దతు ధరకు పూర్తి స్థాయిలో ధాన్యం కోనుగొలు చేస్తుందని, మన సరిహద్దు రాష్ట్రాలైన మహరాష్ట్ర, చత్తీస్ ఘడ్  రాష్ట్రాలో అక్కడి ప్రభుత్వాలు ధాన్యం కొనుగొలు చేయవని మంత్రి తెలిపారు. రైతు భూ హక్కులను సంపూర్ణంగా రక్షించేందుకువారికి ఉన్న సమస్యలు తొలగించేందుకు వీలుగా ధరణి పోర్టల్ రుపొందించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి రైతు వ్యతిరేక వైఖరి ఆవలంభిస్తుందని, రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి  సీఎం కృషి చేస్తుంటే, నూతన వ్యవసాయ చట్టాలతో కేంద్రం రైతులను గందరగోళానికి గురి చేస్తుందని   మంత్రి అన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రాజేక్టులు వేగవంతంగా పూర్తి చేసుకుంటున్నామని,  కాళేశ్వరం వంటి భారి ఎత్తిపోతల పథకం నిర్మించామని తెలిపారు.రైతుల సంక్షేమం కోసం లక్ష  కళ్లాలను సైతం నిర్మించామని, వచ్చే సంవత్సరం మరిన్ని కళ్లాలు నిర్మిస్తామని తెలిపారు.కరోనా సంక్షోభ సమయంలో  సైతం  ప్రజా సంక్షేమ పథకాలకు ఎలాంటి కోత విధించ లేదని కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్,  ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలను కొనసాగించామని మంత్రి  తెలిపారు. రైతుల కోసం నిర్మించిన రైతు వేదికలను, కల్పిస్తున్న సదుపాయాలను  రైతులు వినియోగించుకోవాలని  మంత్రి సూచించారు.  



రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లాలో 54 రైతు వేదికల నిర్మాణ పనులు పూర్తి చేసామని, ప్రతి వ్యవసాయ క్లస్టర్ లో వ్యవసాయ విస్తరణ అధికారి విధులు నిర్వహిస్తున్నారని, రైతులకు అవసరమైన సలహలు సూచనలు అందిస్తారని తెలిపారు. రైతు వేదికల నిర్వహించే శిక్షణ  కార్యక్రమాలకు రైతులు  హజరుకావాలని, వారి సందేహలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. రైతు వేదికలను వినియోగించుకుంటూ రైతులు మార్కెట్ లో పంట డిమాండ్, గిట్టుబాటు ధర, పంటలు పండించడంలో మెలుకవులు, ఎరువులు, విత్తనాల వినియోగం వంటి వాటి  పై చర్చించాలని, మంచి పద్దతులను తెలుసుకొని పాటించాలని సూచించారు.చందోలి గ్రామం లో  తెలిసి ఈ పది సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి.ముఖ్యమంత్రి  మనం అడక్కుండానే ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. ఒంటరి మహిళలకు పెన్షన్ వస్తుంది వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ వస్తుంది, రైతు బీమా వస్తుంది రైతుకు సంబంధించిన రైతుబంధు వస్తుంది దాదాపు ఒక గ్రామానికి ఒక కోటి కోటి రూపాయలు ఒక గ్రామానికి ప్రభుత్వం నిధులు వస్తాయి కల్యాణలక్ష్మి కింద డబ్బులు వస్తున్నాయి. అదే విధంగా మరి మాతా శిశు ప్రోగ్రామ్ కింద ఆడపిల్ల పుడితే 13 వేల రూపాయలు మగబిడ్డ పుడితే 12 వేల రూపాయలు వస్తాయి అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవింధర్, ఉప సర్పంచ్ రమేష్, MPP నక్క శంకర్, ZPTC గోస్కుల జలెంధర్, PACS  ఛైర్మన్ లు, AMC వైస్ చైర్మన్ గంగాధర్, రాజ సుమన్, మాధవరావు, మండల పార్టీ అధ్యక్షులు బొల్లం రమేష్ మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు క్రిష్ణ రెడ్డి కలెక్టర్ రవి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మహిళలు ఐక్యంగా పోరాడాలి

మహిళలు ఐక్యంగా పోరాడాలి

.


చిన్నగూడూరు, పెన్ పవర్

స్థానిక మండల కేంద్రంలోని శనివారం నాడు కస్తూర్బా పాఠశాలలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు తమ హక్కులకోసం ఐక్యంగా పోరాడాలని కస్తూర్బా ఎస్ ఓ ఉషారాణి అంగన్వాడి సూపర్వైజర్ విజయ అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ... మహిళలపై జరుగుతున్న అన్యాయాలను మహిళా సంఘాలు కలిసికట్టుగా అరికట్టాలని వారు తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలన్నారు. కస్తూర్బా పాఠశాలలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు కవిత, అన్ని, కస్తూర్బా టీచర్స్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యవర్గం నియామక పత్రాలు అందచేత

 కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యవర్గం నియామక పత్రాలు అందచేత




బెల్లంపల్లి రూరల్, పెన్ పవర్

పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం డిసిసి అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు,ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు నగిరి ప్రీతం ఆదేశాల మేరకు ఎస్సీ సెల్ పట్టణ,మండల కమిటీల నియామకాలకు సంబంధించి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు రామగిరి బానేశ్  నియామక పత్రాలు అందచేసారు. బెల్లంపల్లి పట్టణ అధ్యక్షునిగా మిట్టపల్లి సురేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కడప శంకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి దుర్గం మహేందర్, బెల్లంపల్లి మండల అధ్యక్షుడిగా దగం వెంకటేష్, బెల్లంపల్లి ఎస్సీ సెల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా మల్లేష్, ప్రధాన కార్యదర్శిగాసనారఖరి సంతోష్, ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బండి ప్రభాకర్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి,పట్టణ అధ్యక్షులు కంకట శ్రీనివాస్, టిపిసిసిఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జమ్మికుంట విజయ్ కుమార్, బెల్లంపల్లి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ముడిమడుగుల మహేందర్, మంచిర్యాల జిల్లా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సల్ల మహేష్ మంచిర్యాల డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సంజీవ్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఆదర్శ్ వర్ధన్, బెల్లంపల్లి మండల్ యూత్ ప్రెసిడెంట్ చాంద్ పాషా, బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఎలుక ఆకాశ్ , యూత్ నాయకులు పంబాల దుర్గాప్రసాద్, అక్క పాక నరేష్, జక్క విద్యాసాగర్, ఏనుగు మహేష్,ఏనుగు రాజేష్, అంజు, జూపాక సునీల్, కాళిదాస్,సునీత, నాయకుల, కార్యకర్తలు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...