Followers

మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాధ్యానిలకు సన్మానం

 మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాధ్యానిలకు సన్మానం

 పరవాడ,పెన్ పవర్

 గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు,పరవాడ నూతన సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు ముందుగా  మహిళ సోదరీమణులును అభినందించి , అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు మాట్లాడుతూ  మహిళలు అన్ని రంగాల్లో రాణించిన సమాజమే అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మహిళలకు యావత్‌ సమాజం అండగా నిలవాలని, మహిళలు స్వయం సమృద్ధి సాధించి పురోగమించాలని కొనియాడారు.స్త్రీ లేకపోతే అసలు జననమే లేదని,స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదని పేర్కొన్నారు.మహిళలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుంది అని చెప్పారు.మన ఆంద్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసిన నేరుగా మహిళల ఖాతాలు లోకే జమ చెయ్యడం చాలా అభినందనీయం అని చెప్పారు.ఈ యొక్క ఘనత మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దక్కింది అని చెప్పారు. అనంతరం నుతన సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు ని ఉప సర్పంచ్ బండారు రామారావు ని ఉపాద్యాయులు ఘన సన్మానం చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న  పిఎంసి చైర్మన్ పయిల హరీష్ ,రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి గెడ్డం ఉమ,14 వ వార్డు మెంబెర్ సిరిపురపు రాజేష్, పయిల పైడం నాయుడు, ఉపాధ్యాయులు,పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

దేశపురోభివృద్ధిలో మహిళలదే కీలకపాత్ర....

 దేశపురోభివృద్ధిలో మహిళలదే కీలకపాత్ర...

పెన్ పవర్,విశాఖపట్నం

దేశపురోభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని మానవహక్కుల కమిటీ రాష్ట్ర కన్వినర్, ఉత్తరాంధ్ర మహిళా కమిటీ సభ్యురాలు శుభ అలియాస్ (చిన్ని) అన్నారు. సోమవారం మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని పాడేరు డివిజన్ పరిధిలో పలు గ్రామాలలొ మహిళలకు సన్మానకార్యక్రమం చేపట్టారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ  గిరిజన ప్రాంతాలలోని గ్రామాలలొ మహిళలకు మహిళాదినోత్సవంపై అవగాహనలేదన్నారు. గిరి మహిళలకు మహిళా చట్టాలపైన వారి హక్కులపైనా అవగాహన కల్పించే దిశగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సమాజంలో వస్తున్న ఆధునిక పోకడల దృష్ట్యా మహిళల భద్రత ప్రశ్నార్ధకంగా మారుతున్న పరిస్థితులలో తమను తాము రక్షించుకునే 'దిశ ' గా అవగాహన చేపట్టామన్నారు.తల్లిగా,చెల్లిగా భార్యగా,ఉద్యోగినిగా పలు రంగాలలో మహిళలు రాణిస్తూ దేశానికి దశ-దిశగా దిక్సూచిగా నిలుస్తున్నారన్నారు. పాడేరు మేజర్ పంచాయితీ సర్పంచ్ గా ఎన్నికైన మహిళ ఉషారాణిని సన్మానించినట్లు తెలిపారు. ఆరోజుల్లో బస్ లో టిక్కెట్టు తీసుకోవడానికి భయపడే స్థాయి నుండి విమానాలు, ఓడలు నడిపే స్థాయికి మహిళ ఎదగడం ఆనందదాయకమన్నారు. ప్రతి మహిళ విజయం వెనుక కుటుంబ సభ్యులు తండ్రి, సోదరుడు భర్త ప్రోత్సాహం వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విశాఖజిల్లా కన్వినర్ రాణి అలానే గిరిజన మహిళలు పాల్గొన్నారు.

ఓటు వేయమంటూ పాదాభిషేకం.

 ఓటు వేయమంటూ పాదాభిషేకం

నెల్లికుదురు,పెన్ పవర్

మహుబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం లో తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని తోర్రూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జిలుకర యాలాద్రి మండల కేంద్రం లో సీనియర్ ప్రైవేట్ ఉపాద్యాయుడైన కొరియవుల కృష్ణ య్య సార్ ని  కలసి శాలువాతో సత్కరించారు  అనంతరం పాదాభివందనం చేసి తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి కి ఓటు వేసి గిలిపించాలని ప్రాధేయపడ్డారు.

విద్యార్థినిలు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలి...

 విద్యార్థినిలు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలి...

వి.మాడుగుల,పెన్ పవర్

  విద్యార్థినిలు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని మాడుగుల జె ఎఫ్ సి ఎం  మెజిస్ట్రేట్ శ్రీమతి  అన్నారు. సోమవారం  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థుల డిబేట్ కాంపిటీషన్ లో గెలు పొందినవారికి   ఆమె మెరిట్ సర్టిఫికేట్ మెమొంటో లు బహూకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కౌమారదశలో  అవగాహనతో అడుగులు వేయాలని సూచించారు. మహిళలకు ఎన్నో చట్టాలు ఉన్నాయని  వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోటీతత్వం అలవర్చుకున్నాడు భవిష్యత్తు  బాగుంటుందని అన్నారు.  విద్య పట్ల  శ్రద్ధ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ పి రామారావు మహిళా పోలీసులు  విద్యార్థినిలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి;జిల్లా కలెక్టర్

 పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి;జిల్లా కలెక్టర్

వనపర్తి, పెన్ పవర్

మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో  ఎదగాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు. సోమవారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మహిళా దినోత్సవ  కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లాఎస్పీ అపూర్వ రావు  తో పాటు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు వారు చేసే పనిని చాలెంజిగా స్వీకరించి చేయాలన్నారు. మారుతున్న సాంకేతిక పద్ధతులను బట్టి మహిళలు కూడా ఎదగాలని సూచించారు. కోవిడ్  సమయంలో మహిళా ఉద్యోగుల విశేష సేవలందించారని ప్రశంసించారు. మహిళలు చదువుకుంటేనే అన్ని రంగాలలో ఎదగడానికి వీలుంటుంది అన్నారు.ఎస్పీ అపూర్వ రావు మాట్లాడుతూ మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని అన్నారు. ఒక మహిళ చదువుకుంటే సమాజం ఇల్లు బాగుంటుందని అన్నారు. అనంతరం ప్రభుత్వ శాఖలో విశేష సేవలు అందించిన మహిళా ఉద్యోగినులకు అవార్డులు అందజేశారు. డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డి డబ్ల్యూ ఓ పుష్పలత, డి ఆర్ డి ఎ కోదండం, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, డబ్ల్యూ కృష్ణ చైతన్య, సిడిపిఓలు సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

వనపర్తిలో ఆర్టీసీ డిపోలో మహిళా దినోత్సవం

 వనపర్తిలో ఆర్టీసీ డిపోలో మహిళా దినోత్సవం

వనపర్తి, పెన్ పవర్

టి ఎస్ ఆర్ టి సి వనపర్తి డిపో లో ఇంచార్జ్ డిపో మేనేజర్     కె.వి రాజశేఖర్  ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  మహిళా ఉద్యోగస్తులకు క్రీడా పోటీలు మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్, బెలూన్ గేమ్స్ నిర్వహించారు. కేకు కట్ చేసి, భోజన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ వి.   దివ్య తేజ, డాక్టర్ జి. సుధీంద్ర పాల్గొన్నారు. మహిళ  ఉద్యోగినులను  సన్మానించారు, క్రీడలలో గెలుపొందిన ఉద్యోగినులకు అవార్డులు ఇచారు. ఈ కార్యక్రమంలో  శ్రీలత (ఎస్.టి.ఐ), ఫాతిమా బేగం (సీనియర్ అసిస్టెంట్),   రాజేష్ (ఏడీసీ), రవీందర్ (ఎడిసి), విమలమ్మ, అరుణమ్మ, ప్రభ రాణి, వనజ, భాగ్యలక్ష్మి, మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు.

ప్రజల మన్ననలు పొందుతున్న 37వ వార్డు టి.డి.పి కార్పొరేటర్ అభ్యర్థి బంగారి రవి శంకర్

 ప్రజల మన్ననలు పొందుతున్న 37వ వార్డు టి.డి.పి కార్పొరేటర్ అభ్యర్థి బంగారి రవి శంకర్


మహారాణి పేట,పెన్ పవర్

జి.వి.ఎమ్.సి, దక్షిణ నియోజకవర్గం 37వ వార్డ్ టి.డి.పి, కార్పొరేటర్ అభ్యర్థి బంగారి రవి శంకర్ వీధి వీధి తిరుగుతూ ప్రజల సమస్యలపై  శుక్రవారం పర్యటన చేపట్టారు.వార్డు టి.డి.పి అభ్యర్ధి అయిన బంగారి రవి శంకర్ వార్డు పర్యటనలో నిమిత్తం పెయిన్ దొర పేట, రెల్లి వీధి,జబ్బరి తోట, స్కీమ్ బిల్డింగ్స్, గొల్ల వీధి,తదితర ప్రాంతాల్లో పర్యటించి, వార్డు ప్రజలు యొక్క సమస్యలను తెలుసుకొని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బంగారి రవి శంకర్ చేస్తున్న  కార్యక్రమాలకు వార్డు ఆయన ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈకార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ కె.చిన్న,తెలుగు యువత ఉపద్యక్షులు తాతాజీ,వార్డు వైస్ ప్రెసిడెంట్ హేమలత,గంగమ్మ, సీనియర్ నాయకులు కనక రాజు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...