Followers

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

 ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

పెన్ పవర్, మల్కాజిగిరి


 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ దుర్గ భవాని దేవాలయం, ఐఎన్ నగర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా ఏర్పటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్ సునీత రాముయదవ్ కలిసి కేక్ కట్ చేసి మహిళాలకు తినిపించి వారికి శుభాకాంక్షలు తెలిపి వారిని సత్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మట్లాడుతూ మహిళాలు అన్ని రంగలో ప్రతిభ చాటుకున్నారని అన్నారు. రాష్ట ప్రభుత్వం మహిళాలకు రక్షణగా షీ టీం ఏర్పాటు చేసి వారికి మరింత రక్షణగా నిలిచారని అన్నారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మట్లాడుతూ ప్రభుత్వం శాఖలో, ప్రవేట్ రంగంలో, పోలీస్ శాఖలో, మేయర్, డిప్యూటీ మేయర్ గా కార్పొరేటర్ గా మహిళాలకు ప్రధన్యత ఇస్తున్న రాష్ట ప్రభుత్వం కెసిఆర్ గారికి, స్దానిక ఎమ్మెల్యే మైనంపల్లి గారికి ఆభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాముయదవ్, జి.ఎన్.వి.సతీష్, పిట్ల శ్రీనివాస్, మోహన్ రెడ్డి, మహిళలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వైజాగపటమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అంతర్జాతీయ ఉమెన్స్ డే సెలెబ్రేషన్స్

 వైజాగపటమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అంతర్జాతీయ ఉమెన్స్ డే సెలెబ్రేషన్స్

విశాఖపట్నం, పెన్ పవర్

ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, విశాఖపట్నం చాప్టర్ ఈరోజు ది వైజాగపటమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నందు అంతర్జాతీయ ఉమెన్స్ డే సెలెబ్రేషన్స్ జరిపారు. ఈ ఉమెన్స్ డే సందర్బంగా ఇన్స్టిట్యూట్ తొలి మహిళా ఛైర్పర్సన్ సి.ఎస్. స్వరూప మేరువ వినూత్నంగా ఫుల్ డే సెమినార్  నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా విచ్చేసిన  జీజవలసరాజ్ ,డైరెక్టర్ ,కోస్టల్ కార్పొరేషన్ లిమిటెడ్, విశాఖపట్నం వారు  మాట్లాడుతూ కార్పొరేట్ రంగం లో కుడా మహిళలు రాణించాలి అందుకు గాను కంపెనీ సెక్రటరి కోర్స్ ఎంతగానో ఉపయోగపడతాది అని తెలిపారు. ఇందు కు స్పీకర్ సుధీంద్ర పుట్టి ,కంపెనీ సెక్రటరీ, సైయింట్ లిమిటెడ్ , హైదరాబాద్ వారు  కంపెనీ యందు మినిట్స్ ఎలా డ్రాఫ్ట్స్ చేయాలి వివరించారు మరియు ప్రొఫెసర్  సంగీత రెడ్డి,పాన్ ఇండియా,కార్పోరెట్  ట్రైనర్ ,హైదరాబాద్ వారు స్ట్రెస్ మానేజ్మెంట్ కోసం వివరించారు.ఈ కార్యక్రమానికి సంస్థ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు తో ప్రముఖ కంపెనీల కంపెనీ సెక్రటరీ లు  మరియు విద్యార్థులు హాజరయ్యారు.

డప్పు చెప్పు కు పెన్షన్ మాదిగల హక్కు

 డప్పు చెప్పు కు పెన్షన్ మాదిగల హక్కు

 యం అర్ పి ఎస్ టీ ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గంగాధర నరేష్ మాదిగ

ఇబ్రహింపట్నం, పెన్ పవర్

ఇబ్రహింపట్నం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న,రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ గార్ల పిలుపు మేరకు  కోరుట్ల నియోజక వర్గ ఇంఛార్జి  బండ ప్రవీణ్ మాదిగ ఆధ్వర్యంలో  డప్పు కొట్టే, చెప్పులు కుట్టే వాళ్ల కు పెన్షన్  ఇవ్వాలని  కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ టీఎస్ జగిత్యాల జిల్లా అద్యక్షులు గంగాధర నరేష్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు  2018 అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా డప్పు చెప్పులు కుట్టే వాళ్లకు నెలకు రెండు వేల పెన్షన్ ఇస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నాం ఈ మార్చి నెల లో జరగబోయే అసెంబ్లీ సమావేశం లోనే నెలకు రెండు వేలు రూపాయలు పెన్షన్ ఇస్తానని అసెంబ్లీలోనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం మాదిగ జాతి బిడ్డల కు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే రాబోయే రోజుల్లో మీకు మంచి రోజులు వస్తాయని గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు బ్యాంక్ ల తో సంబంధం లేకుండా నేరుగా కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమం లో  ఎమ్మార్పీఎస్ తెలంగాణ నాయకులు  చిట్యాల వినోద్ ,నక్క అరుణ్, నక్క గణేష్ , మద్దూరి నవీన్ జేరిపోతుల అనిల్, వినయ్,కొమ్ముల లక్ష్మను, తదితరులు పాల్గొన్నారు

విధులకు గైర్హాజరయిన ఉపాద్యాయుడు సస్పెండ్

 విధులకు గైర్హాజరయిన ఉపాద్యాయుడు సస్పెండ్

చింతపల్లి,పెన్ పవర్ 

మండలంలోని చౌడుపల్లి పంచాయతీ బౌర్తి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుల్లెల సత్యరాజును ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల సస్పెండ్ చేశారు. సోమవారం మండలంలో పర్యటించిన ఆయన బౌర్తి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మనబడి నాడు నేడు పనులను తనిఖీ చేశారు. మనబడి నాడు పనులు అసంపూర్తిగా నిలిచిపోవడాన్ని గమనించారు. అలాగే ఉపాధ్యాయుడు రూ.5వేలు వేతనం ఇచ్చి వ్యక్తిగత వలంటీర్ ను నియమించి ఆయన విధులకు గైర్హాజరవుతున్నట్లు అదేవిధంగా పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న 5వ తరగతి విద్యార్థులు కనీసం అ, ఆ,లు కూడా చెప్పలేకపోతున్నారని విద్యా ప్రమాణాలపై పిఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు పాఠశాలకు వస్తున్నదీ లేనిది గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం భోజనం పై ఆరా తీశారు. పిల్లలకు యూనిఫామ్ కుట్టించాలని తల్లిదండ్రులకు సూచించారు.

మహిళలు ఆత్మ దైర్యం తో ముందుకు సాగాలి

 మహిళలు ఆత్మ దైర్యం తో ముందుకు సాగాలి

 సిరికొండ , పెన్ పవర్ 


సిరికొండ మండలంలోని ధోబి గూడాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని ఆశా కార్యకర్తను  సన్మానించడం జరిగింది.ఈ సందర్బంగా 24హావర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు విశ్వ బోది మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండి ఆత్మ స్టైర్యంతో ముందుకు సాగుతూ మహిళ సాధికారత దిశగా అడుగులు వేయాలని అన్నారు.అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా కరోనా సమయంలో అనేక రకాలుగా సేవలు అందించిన సిరికొండ మండలంలోని ధోబిగుడ గ్రామానికి చెందిన  ఆశా కార్యకర్త కౌసల్య ను24 అవర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో  సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాకు, అంగన్వాడీ టీచర్ సూర్యజల్, తథాగత సాహెబ్, కిషోర్ మానిక్ రావ్   పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

జాతి నిర్మాణంలో మహిళామణులదే కీలక భూమిక

 జాతి నిర్మాణంలో మహిళామణులదే కీలక భూమిక

పెన్ పవర్,ఆలమూరు

  భారతీయ మహిళలు దేశ నిర్మాణం, జాతీయ సమగ్రత, శాంతి సామరస్యాలను పెంపొందించటంలో ఎల్లప్పుడూ కీలక భూమికను పోషిస్తూ వచ్చారని ఆలమూరు మండల ప్రజాపరిషత్తు పరిపాలనా అధికారి టీవీ సురేందర్రెడ్డి ప్రశంసించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండలంలో గల మహిళా పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ మహిళా సిబ్బందిని ఆయన ఘనంగా సన్మానించారు.

 ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మహిళలు ఎప్పుడూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కరోనాపై పోరులో సైతం ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, వైద్యులతో పాటు మహిళలు సైతం ముందు వరుసలో ఉన్నారని ప్రస్తుతించారు. భారత సామాజిక స్దితిగతుల మేరకు సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్న వారు ఎంతో సహనంతో తమ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నారని, ఇది దేవుడు వారికి ఇచ్చిన గొప్ప బహుమతి అని ఆయన కొనియాడారు.సమాజంలో మహిళలు తిరుగులేని నాయకత్వ పాత్ర పోషిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ రాజ్ కుమార్, పంచాయితీ కార్యదర్శులు ఆర్ వీ సత్యనారాయణ, విజయ రాజు, సంజీవ్ రెడ్డి, వీర్రాజు పలువురు పాల్గొన్నారు.

మహిళా దినోత్సవం వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జోనల్ కమీషనర్..

 మహిళా దినోత్సవం వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జోనల్ కమీషనర్..

కుత్బుల్లాపూర్,పెన్ పవర్


అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసి సర్కిల్ కార్యలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. గాజులరామారం మరియు కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్లకు సంబందించిన పట్టణ సమైఖ్య ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్ వి.మమత ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జోనల్ కమీషనర్  మాట్లడుతూ మహిళలు అన్నిరంగాల్లో ముందు వుండాలని అన్నారు. మహిళలు పట్టుదలతో ముందుకు సాగితె ఏదైనా సాదించవచ్చని.. అంతరిక్షంలోకి 1963 లోనే సోవియెట్ కాస్మోనట్ అనే మహిళ వెళ్ళిందని.. ఇప్పటికే భారతదేశంలో మహిళలకు సమానంగా హక్కులు కల్పించాలని రిజర్వేషన్ 50 శాతం కేటాయించి అన్ని రంగాలలో రాణిస్తున్నారని మమత తెలియజేశారు..ఈ కార్యక్రమం లో కుత్బుల్లాపూర్ ఉప కమిషనర్ మంగతాయారు. జంట సర్కిళ్ల ప్రాజెక్టు ఆఫీసర్ లు శ్రీ.శ్రీనివాస్.హరిప్రియ, సిఓ లు, పట్టణ సమైక్య అధ్యక్షులు .పద్మ , విజయలక్ష్మి మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...