Followers

ఓయూ లో ముమ్మురంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

 ఓయూ లో ముమ్మురంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం 

తార్నాక , పెన్ పవర్ 

ఉస్మానియా యూనివర్సిటీ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఎన్నికలప్రచారం జోరుగా సాగుతుంది. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఓయూ  పరిధిలోని ఉద్యోగస్తులను, విద్యార్థులను కలిసి టీఆర్ఎస్ అభ్యర్థులు సురభి వాణి దేవి, మరియు పల్లా రాజేశ్వర్ రెడ్డి లకు  మొదటి ప్రాధాన్యత ఓటు వేసి  అధిక మెజారిటీతో గెలిపించాలని విద్యార్ధి నేతలు  కోరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ శ్రేణులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు  పెద్దపీట వేస్తుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ విద్యార్ధి నేతలు చటారి దశరథ్, శ్రీకాంత్ గౌడ్, జంగయ్య, కాటం శివ, బొల్లు నాగరాజు, రమేష్ గౌడ్, రవీందర్, రాజు, సురేష్, రాజేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారం

 ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారం

చిన్నగూడూరు, పెన్ పవర్




స్థానిక మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా మంగళవారం నాడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి చెందే విధంగా అడుగులు వేస్తుందని దానికి సీఎం కేసీఆర్ కారణమని తెలిపారు. ఇందులో భాగంగా డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు డీఎస్ రెడ్యానాయక్ మరియు ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ గుడిపూడి నవీన్ రావు, డోర్నకల్ యువజన నాయకులు డి ఎస్ రవి చంద్ర ఆదేశాల మేరకు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించడం జరిగింది అని అన్నారు. మండల తెరాస యూత్ అధ్యక్షులు దుండి మురళి, బాదావత్ సురేష్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్, హై స్కూల్ కార్యాలయాలలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారాన్ని చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ నాయకులు గుదే నవీన్ ,గుదే  ఉపేందర్, మండల యూత్ సభ్యులు శమ కురి మనోహర్, డానియల్, రవి, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ గెలుపు కోసం కదిలిన కాంగ్రెస్ వాదులు.

 ఎమ్మెల్సీ  అభ్యర్థి రాములు నాయక్  గెలుపు కోసం కదిలిన కాంగ్రెస్ వాదులు.

కురవి ,పెన్ పవర్

మండల కేంద్రంలోని  నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు నారాయణ రాజేంద్ర కుమార్  , మాజీ జెడ్పిటిసి అంబటి వీరభద్రం ఆధ్వర్యంలో మంగళవారం కార్యాలయాలు, విద్యాసంస్థలు, విద్య వంతులను కలిసి ఓటును అభ్యర్థించారు, టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న  మోసాన్ని ఎండగడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే మీ అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యత రాములు నాయక్ కే వేసి గెలిపించాలని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని వారు ప్రచారంలో భాగంగా విద్యావంతులను కోరారు. అదే విధముగా వివిధ గ్రామాలలోని బాధ్యులు గెలుపే లక్ష్యంగా పట్ల పట్టభద్రుల ఇళ్ల లోనికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ఓటు వేయవలసిందిగా కోరారు. అదే విధముగా సుధనపల్లి, కండికొండ తదితర గ్రామాల్లో పట్టభద్రుల ఇండ్లలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు బండి శ్రీనివాస్, వార్డు సభ్యులు బలగాని శ్రీనివాస్, తరాల వీరభద్రం, అవిరె మోహన్ రావు,అంగడి నర్సయ్య, కామిండ్ల వీరన్న, బాదే వీరభద్రమ్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అంటున్న రాజవర్ధన్ రెడ్డి

 బిజెపి బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అంటున్న రాజవర్ధన్ రెడ్డి

 పెన్ పవర్,మరిపెడ 

మరిపెడ మండలంలోని పట్టభద్రుల ఎన్నికల ప్రచారం భాగంగా మంగళవారం రోజున ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాల కాలేజీలో ఉపాధ్యాయ సిబ్బంది ని గాడ్యుయేట్ ఓట్ల  ప్రచారంలో బీజేపీ నాయకులు కలవడం జరిగింది. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు  రాజవర్ధన్ రెడ్డి పాల్గొని అనంతరం మాట్లాడుతూ ఉద్యోగులకు పిఆర్ సి రావాలన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్ రావాలన్న   బీజేపీ అభ్యర్థి  గుజ్జుల ప్రేమిందర్ రెడ్డి  మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే తెలంగాణ మలిదశ ఉద్యమనేత బీజేపీ నాయకుడు బుల్లెట్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా కెసిఆర్ పరిపాలన సాగుతున్నదని కుల  కుటుంబ రాజకీయం చేస్తున్న  కెసిఆర్ ఉద్యమ ద్రోహిగా మిగిలిపోతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బాధరబోయిన  రాఘవులు, వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు భూక్యా శ్రీనివాస్, భద్రిసెనాగౌడ్, పెంటయ్య, వెంకట చారి,  పండు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

మరొకసారి అవకాశం ఇవ్వండి

 మరొకసారి అవకాశం ఇవ్వండి: ఎమ్మెల్సీ రామచంద్రరావు

కూకట్ పల్లి,పెన్ పవర్

ఎమ్మెల్సీ ఎన్నికలు  సమీపిస్తున్న వేళ బీజేపీ అభ్యర్థి రామచందర్ రావు స్పీడ్ ని పెంచారు. కూకట్ పల్లి కోర్టు బార్ అసోసియేషన్ లో మంగళవారం విరమల్ల. కేశవరావు ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయవాదులతో చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల గొంతుగా మారేందుకు మరొక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈసారి పెద్ద ఎత్తున  గ్రాడ్యుయేట్ అయిన న్యాయవాదులు ఓట్లు నమోదు చేసుకోవడం జరిగిందని, గత కొన్ని రోజులుగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, జడ్చర్ల, నాంపల్లి కోర్టులతో పాటు కూకట్ పల్లి కోర్ట్ ని కూడా సందర్చించడం జరిగిందని, కూకట్ పల్లి కోర్టును త్వరగా నిర్మించాలని కౌన్సిల్ లో మాట్లాడటం జరిగిందని, హైకోర్టు విభజన, న్యాయమూర్తుల పంపకాలలో సైతం స్పందించడం జరిగిందని, లాయర్లకు అందాల్సిన సంక్షేమ పథకాలుపై  న్యాయశాఖ మంత్రికి కూడా వినతిపత్రం అందజేసమని తెలిపారు. అలాగే వామన్ రావు దంపతుల హత్య  లాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని చేస్తున్న ఆందోళనకు తాను పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు రామచంద్రరావు తెలిపారు. కేంద్రానికి ఈ విషయంపై సిఫార్సు చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో న్యాయవాదులు నరేందర్ రెడ్డి, శ్రీకర్ రావు, రఘు, దేవ్, ధర్మేష్, యాదయ్య, శివగౌడ్, మహిళ న్యాయవాదులు, మరియు జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు

గౌడవెల్లి లో అంగరంగ వైభవంగా మల్లన్న జాతర జరిగింది..

 గౌడవెల్లి లో అంగరంగ వైభవంగా మల్లన్న జాతర జరిగింది..

పెన్ పవర్,మేడ్చల్

మండల పరిధిలోని గౌడ వెల్లి గ్రామంలో మల్లన్న జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణం, అగ్ని గుండాలు నిర్వహించారు. కొండపోచమ్మ కు యాదవ్ మహిళలు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించారు. జాతర సందర్భంగా ఎంపీపీ పద్మజగన్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అప్పమ్మాగారి పద్మజగన్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. ప్రతియేటా వైభవోపేతంగా జాతరను నిర్వహిస్తున్న యాదవ సంఘం సభ్యులను ఎంపీపీ ప్రశంసించారు. స్వామివారు గ్రామస్తులు అందరికీ సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెంటమ్మ, టిఆర్ఎస్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి  లహరి రెడ్డి, యాదవ సంఘం నాయకులు యాదగిరి యాదవ్, దయానంద్ యాదవ్, సింహాలు యాదవ్, వెంకటేష్ యాదవ్, యాదయ్య యాదవ్, ఐలయ్య యాదవ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ కృష్ణ యాదవ్, మాజీ ఎంపిటిసి నవనీతా రాంరెడ్డి, వార్డ్ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు  పాల్గొన్నారు.

సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా గ్రామదేవతల వేడుకలు

సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా గ్రామదేవతల వేడుకలు

వి.మాడుగుల,పెన్ పవర్

 సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా గ్రామ దేవతల  వేడుకలు శోభిల్లుతూ ఉన్నాయని ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు అన్నారు. మంగళవారం మాడుగుల ఇలవేల్పు ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం శ్రీ మోదకొండమ్మ తీర్థ మహోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎడ్ల బళ్ళ పందాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పల్లెల్లో ప్రతి చోట గ్రామదేవతల తీర్థ మహోత్సవాలు జాతరలు  అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని  అందువల్ల భక్తి శ్రద్ధలు  గ్రామం సుభిక్షంగా ఉంటుందని  అన్నారు. తీర్థ మహోత్సవాలు కారణంగా భక్తులు బంధువులు స్నేహితులు కలుసుకోవడం విందులు వినోదాలు చేసుకోవడం జరుగుతుందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల వల్ల తీర్థ మహోత్సవాలకు ఆదరణ  కలుగుతుందన్నారు. ఎడ్లబండ్ల పోటీలు గుర్రపు పందాలు  నిర్వహించడం వల్ల పోటీతత్వం పెరుగుతుందన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి  నిరంతరం కృషి చేస్తుందన్నారు. రహదారులు  డ్రైనేజీలు  లింకు రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులకు మెరుగుపరచాలని కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. పేద ప్రజల సంక్షేమమే  వైయస్ జగన్ లక్ష్యం అని  అమ్మ ఒడి జగనన్న చేయూత  తదితర  సంక్షేమ పథకాలు  పేద ప్రజలకు చేరువ అవుతుందని అన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో  వైయస్ జగన్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి   అభివృద్ధికి చేయూతనివ్వాలని  ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు  అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...