Followers

కొవ్వూరు మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

 కొవ్వూరు మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

పెన్ పవర్, కొవ్వూరు

బుధవారం జరిగే పురపాలక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల పరిశీలకులు శ్రీకేష్ లత్కర్ ఐఏఎస్ పేర్కొన్నారు.కొవ్వూరు లోని సంస్కృత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఎలక్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఆయన మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని పేర్కొన్నారు.ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా జరగడానికి పటిష్టమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు.పట్టణంలోని పది వార్డులకు 19 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.సమస్యాత్మక కేంద్రాలుగా పదింటిని గుర్తించామన్నారు ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును విలువైనదిగా భావించి తప్పనిసరిగా వినియోగించుకోవాలి అన్నారు.గత గ్రామ పంచాయతీలో జిల్లాలో 82% ఓటింగ్ ను నమోదు చేయడం విశేషమన్నారు. అదే పోలింగ్ శాతాన్ని మించేలా పురపాలక ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.పోలింగ్ ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ఆర్డీవో డి. లక్ష్మారెడ్డి, పురపాలక కమిషనర్ కె. టి. సుధాకర్, వివిధ శాఖల అధికారులు ఆయన వెంట ఉన్నారు.

శాసనమండలి ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలి..

 శాసనమండలి ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలి..

శామీర్ పెట్ లోని బ్యాలెట్ బాక్సుల గోడౌన్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి

మేడ్చల్ ,పెన్ పవర్



మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు సక్రమంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. మంగళవారం జిల్లాలోని శామీర్ పెట్ లో గల ఎమ్మెల్సీ ఎన్నికల గోడౌన్ ను అక్కడ ఉన్న భద్రత వ్యవస్థను కలెక్టర్ పరిశీలించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు  జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసిందని ఇప్పటికే సరిపడా సిబ్బందిని నియమించిన జిల్లా ఎన్నికల అధికారులు మిగతా ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు.. ఈ నేపథ్యంలో సరిపడా బ్యాలెట్‌ బాక్సులను కూడా సిద్ధం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి 250   కరీమ్ నగర్  జిల్లా నుండి  218 బ్యాలెట్‌ బాక్సులను కూడా జిల్లాకు తీసుకువచ్చారు .ఈ సందర్భంగా జంబో బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ముందుగానే వాటిని జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. అలాగే బ్యాలెట్ బాక్సులను ఆయా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్ళేందుకు అవసరమైన 41 రూట్లలో రవాణా ఏర్పాట్లను చేయడంతో పాటు సిబ్బందికి బస్సులను ఏర్పాటు చేసి వారు ఎన్నికల కేంద్రాలకు వెళ్ళేందుకు తగిన బందోబస్తు కల్పించాలని కలెక్టర్ శ్వేతా మహంతి సూచించారు.. ఎన్నికల కేంద్రాల్లో సిబ్బందికి అవసరమైన అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంచాలని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే అన్ని సమకూర్చాలని కలెక్టర్ అన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ విద్యాసాగర్, డీఆర్వో లింగ్యానాయక్, తహశీల్దార్, ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

[18:17, 3/9/2021] +91 94404 28241: Next

పద్మజ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

 పద్మజ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

కూకట్ పల్లి,పెన్ పవర్

ఎంతో కష్టతరమైన శస్త్ర చికిత్సను కూకట్ పల్లి కె.పి.హెచ్.బి కాలనీ రోడ్ నెంబర్ ఒకటిలో ఉన్న పద్మజ హాస్పిటల్ వైద్యులు దాదాపు పన్నెండు గంటల పాటు శ్రమించి విజయవంతంగా పూర్తి చేశారు. కరోనాతో కోలుకున్న కడప జిల్లాకి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తికి రోగనిరోధక శక్తి తగ్గడంతో  న్యూకార్ మైకోసిస్ అనే వ్యాధి పై దవడకు, ముక్కుకు సోకింది. దీనితో ఆయన పైధవడను తొలగించారు. సెకండ్ స్టేజ్ లో పద్మజ హాస్పిటల్ డాక్టర్ అమర్ రఘు నారాయణ్ (ప్లాస్టిక్ సర్జన్) ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం ఎంతో శ్రమించి వైద్యం చేశారు. పైదవడను రిస్కుతో కూడుకున్న ఆపరేషన్ 3డి టెక్నాలజీతో శస్త్రచికిత్స చేశారు. చికిత్స అనంతరం ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి కదలకుండా మత్తు మందు ఇచ్చి రెండు రోజుల పాటు వెంటిలేటర్ పై ఉంచారు. ఆసుపత్రి యాజమాన్యం సహకారంతో నామామత్ర ఫీజులతో చికిత్స చేయడం జరిగిందని, సునీల్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.

కేయూ లో జర్నలిస్టుల పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి....!

 కేయూ లో జర్నలిస్టుల పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి....!

జర్నలిస్టుల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ....!!

 పెన్ పవర్,మరిపెడ 


 కాకతీయ యూనివర్సిటీలో వార్త కవరేజ్  చేయడానికి వెళ్లిన రాజ్ న్యూస్ రిపోర్టర్ రాము కెమెరామెన్ బిక్షపతిలపై టిఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ప్రశాంత్ అతని అనుచరులు దాడి చేయడం  హేయమైన చర్య ఆని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆ  దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో మరిపెడ మండలం జర్నలిస్టుల ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ రహదారి పైన స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నల్ల బ్యాడ్జీలతో ధరించి ప్లే కార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యవారధిగా ఉంటూ ఫోర్త్ ఎస్టేట్ గా పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం సిగ్గుచేట్టు ఆని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై దాడులు చేస్తే సహించేది లేదని ఎంతటి వారైనా శిక్షలు తప్పవని వారు హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మరిపెడ తాసిల్దార్ రమేష్ బాబుకు అందజేశారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు గాడి పల్లి శ్రీశైలం ,జిన్నా లచ్చ న్న, గండి విష్ణు, వీరాంజి, చంద్రశేఖర్ , పి వేణు , బోడ నాగేందర్ ,మచ్చ రాజేష్, దోమల శ్రీనివాస్, కారంపొడి వెంకటేశ్వర్లు, రియాజ్ పాష, మెరుగు సంజీవ, గండి నాగరాజ్, అయినాల రాజేష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

పన్నాల ను సత్కరించిన అంగన్వాడీ సిబ్బంది

 పన్నాల ను సత్కరించిన అంగన్వాడీ సిబ్బంది 

తార్నాక ,పెన్ పవర్

 మల్లాపూర్ కార్పొరేటర్ గా రెండోసారి గెలుపొందిన పన్నాల దేవేందర్ రెడ్డి ని  మల్లాపూర్ అంగన్వాడీ సిబ్బంది పూలమొక్కను బహూకరించి , శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా పన్నాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్,  టిఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో   ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంగన్వాడి సిబ్బందికి పెద్ద పీట వేస్తూ వారి వేతనాలు పెంచారని గుర్తు చేశారు. పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. సరైన సమయానికి పౌష్టికాహారాన్ని గర్భిణీ స్త్రీలకు మరియు పిల్లలకు అందించాన్నారు. కరోనా కష్టకాలంలో అంగన్వాడీ సిబ్బంది ముందుండి గర్భిణీ స్త్రీలకు పిల్లలకు సేవలందించారు. అంగన్వాడీ సిబ్బంది సేవలను టిఆర్ఎస్ ప్రభుత్వం గుర్తిస్తుంది అని అన్నారు

గర్భిణీలకు వైద్యపరీక్షలు

 గర్భిణీలకు వైద్యపరీక్షలు

 పెన్ పవర్,కరప

స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ ఆభయాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్.శ్రీనివాస్ నాయక్, డాక్టర్ సోమిరెడ్డి శిరీష వైద్యపరీక్షలు నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. జిల్లా పబ్లిక్ నర్సింగ్ ఆఫీసర్ ఎస్.ఉషశ్రీ మాట్లాడుతూ ప్రతినెల గర్భణీలు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకుంటూ, వైద్యుల సలహాలు పాటిస్తే సుఖప్రసవాలు జరుగుతాయన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీహెచ్సీ సిబ్బంది గర్భిణీలకు రక్తపరీక్షలు, బీపీ, షుగరు టెస్ట్లు నిర్వహించి, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. హైరిస్క్ గర్భిణీలను గుర్తించడం జరిగిందని, వారిపట్ల ప్రత్యేకశ్రద్ధ తీసుకుని, వైద్యపరీక్షలు నిర్వహిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని వైద్యసిబ్బంది తెలిపారు. ఎంపీ హెచ్ ఓ కె.కిశోర్, వైద్య సిబ్బంది ఎస్.మల్లిఖార్జున్, టీబీటీ సుందరి, సత్యవతి, ఉషాకుమారి తదితరులు పాల్గొన్నారు.

ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ కన్వీనర్ గా తోట శ్రీనివాస్

 ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ కన్వీనర్ గా తోట శ్రీనివాస్

తార్నాక, పెన్ పవర్ 

ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ కన్వీనర్ గా తోట శ్రీనివాస్ నియమితులయ్యారు.  ఈనెల 6, 7వ తేదీలలో 39వ ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర మహాసభలు కామారెడ్డి లో నిర్వహించారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నియామక సందర్భంగా రాష్ట్ర టెక్నికల్ సెల్ కన్వీనర్ గా ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి తోట శ్రీనివాస్ ని నియమించారు. శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నందు పరిశోధన విద్యార్ధిగా ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్  మాట్లాడుతూ  ఇంతటి అవకాశం ఇచ్చిన ఏబీవీపీ రాష్ట్ర ప్రముఖ బృందానికి ధన్యవాదాలు తెలిపారు.  రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతానని, అదుపు తప్పిన ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా కార్యచరణ చేపడతామన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...