Followers

కార్మికుడు మృతి చెందడంతో కుటుంబానికి టిఆర్ఎస్కెవి ఆధ్వర్యంలో చెక్కును అందజేశారు

 కార్మికుడు మృతి చెందడంతో కుటుంబానికి టిఆర్ఎస్కెవి ఆధ్వర్యంలో చెక్కును అందజేశారు


పెన్ పవర్,మేడ్చల్

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని పారిశ్రామికవాడాలో గల రాణి ఇంజన్ వాల్వ్ కంపెనీకి చెందిన నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందడంతో నాగేశ్వరరావు కుటుంబానికి కార్మికులు మరియు యాజమాన్యం ఇవ్వాల్సిన డ్యూటీ డబ్బులు చెల్లించడంలో గత సంవత్సర కాలంగా యాజమాన్యం జాప్యం చేస్తుందని ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన టిఆర్ఎస్కెవి అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ రెడ్డి యజమానులతో మాట్లాడి మృతి చెందిన నాగేశ్వరరావు కుటుంబానికి రావాల్సిన డబ్బులు వెంటనే ఇవ్వాలని తెలియజేశారు. కార్మికుల పై తమ కుటుంబం ఆధారపడి ఉంటుందని చనిపోయిన వెంటనే రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని ఇకముందు కంపెనీ యాజమాన్యం జాప్యం చేయడానికి వీలు లేదని యాజమాన్యానికి మర్రి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. వెంటనే కంపెనీ యాజమాన్యం స్పందించి నాగేశ్వరరావుకు రావాల్సిన డబ్బులు ఇవ్వడానికి సోమవారం నాడు  యాజమాన్యం ఏర్పాటు చేయడం జరిగింది. రూపాయలు 7,88,903-/- చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్కెవి జిల్లా అధ్యక్షుడు మరియు యూనియన్ అడ్వైజర్ ప్రభాకర్ కంపెనీ జనరల్ మేనేజర్ పోలినాయుడు హాజరయ్యారు.  ఈ సందర్భంగా మృతిడు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు సంవత్సర కాలంగా ఇవ్వని డబ్బులను రాజశేఖర్ రెడ్డి మా సమస్యను అర్థం చేసుకొని డబ్బులు ఇప్పించడం చాలా ఆనందంగా ఉందని ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఆఫీస్ రమేష్ నాగరాజు నరసింహ చారి రాజేశ్వరరావు యాదగిరి సుదర్శన్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్యే క్రాంతి

 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్యే క్రాంతి 

తార్నాక,పెన్ పవర్ 

పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలలలో భాగంగా జరుగుతున్న ప్రచారాన్ని అందోల్ ఎమ్మెల్యే పర్యవేక్షించారు. ఈ సందర్బంగా నాయకులు, కార్యకర్తలతో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల గురించి చర్చించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె టిఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభి వాణిదేవి ని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డివిజన్ లో ఓటర్లను ముందుగా గుర్తించి వారికి టిఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి వివరించి మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థిగా సురభి వాణి దేవి గురించి ఓటర్లకు వివరించి, ఓటు వేయాలని విజ్ఞప్తి చేయవలసిందిగా సూచించారు.  ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పట్టభద్రులు, ఉద్యోగస్తులు కలిసి టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సురభి వాణికి, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్, తెరాస గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్, ముత్యం రెడ్డి, సుగుణాకర్, విట్టల్ యాదవ్, శ్రీలత, ప్రీతీ రెడ్డి, సువర్ణ, రాజబాబు, తుంగ తిరుపతి, కట్ట బుచ్చన్న, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆదిత్యలో భక్తి శ్రద్ధలతో సరస్వతీ, సాయిబాబా ఆలయాల తృతీయ వార్షికోత్సవ వేడుకలు

 ఆదిత్యలో భక్తి శ్రద్ధలతో సరస్వతీ, సాయిబాబా ఆలయాల తృతీయ వార్షికోత్సవ వేడుకలు

గండేపల్లి,పెన్ పవర్

  గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ప్రాంగణంలో గల ఆధ్యాత్మిక వేదిక సరస్వతీ దేవి, శిరిడి సాయి బాబా ఆలయాల తృ తీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా  అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆదిత్య విద్యా సంస్థల అధినేత డా.నల్లమిల్లి శేషారెడ్డి శ్రీమతి లక్ష్మీ రాజ్యం దంపతులు పాల్గొని పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతీ దేవి,సాయి బాబా వారికి  ప్రత్యేకంగా అష్టోత్తర కలశాలతో అభిషేకాలు నిర్వహించారు. హోమాలు, ప్రత్యేక హారతులు తదితర పూజలు నిర్వహించారు.సా.4-00కు కళాశాల ప్రాంగణంలో శిరిడీ సాయి మరియు సరస్వతి దేవి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.రా.7-00 గం.లకు అమ్మవారికి పుష్పాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు శ్రీ రామ్ శర్మ ప్రసాద్ శర్మ లు పూజాకార్యక్రమాలు వేదోక్త మంత్రాలతో పూజా విధులు నిర్వహించారు.ఈకార్యక్రమంలో ఆదిత్య కుటుంబ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

చివరి రోజు ప్రచారం లో హోరెత్తించిన కమలం...

చివరి రోజు ప్రచారం లో హోరెత్తించిన కమలం...

విశాఖ తూర్పు,పెన్ పవర్

జనసేన , బి.జె.పి. ఉమ్మడి పార్టీ 18 వ వార్డు  అభ్యర్థిని ద్వారాపురెడ్డి ఎం ఎల్. అరుణ కుమారి చివరి రోజు ఎన్నికల  ప్రచారాన్ని భారీగా ర్యాలీ తో హోరెత్తించారు. డప్పు వాయిద్యాలతో , ప్రజలను చైతన్య పరిచే జానపద గీతాల డాన్స్ లతో ప్రచారాన్ని ముందుకు నడిపారు.  ప్రజలు నిజంగా వార్డు అభివృద్దే కోరుకుంటే తనకే తప్పక ఓటు వేసి గెలిపించాలని ఆరుణ కుమారి కోరారు. .ప్రచారంలో వార్డు ప్రజలు అడుగడుగునా హారతులు పట్టారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా అరుణ కుమారికి మద్దత్తుగా వార్డులోని మహిళలందరూ ఈ ప్రచారంలో పాలుపంచుకున్నారు. ఈ ప్రచారానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన జనసేన పార్టీ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.... టి.డి.పి. మరియు వై.సి.పి. పార్టీ లు రెండూ అవినీతి పుట్టలని, కార్పొరేషన్ కు  సంవత్సర ఆదాయం  4 వేళా కోట్లు వస్తుందని  ఆ  సొమ్మంతా తోడు దొంగలై తినేస్తున్నారని , ఆ సొమ్మును కాజేయ డానికి  ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి ఓటుకు నోటు ఇచ్చి మీ చేత ఓటు వేయించు కుంటున్నారని దుయ్యబట్టారు.” విద్యావంతు రాలైన స్త్రీ తన ఇంటిని ఏ విదంగా చక్క దిద్దుకో గలదో అదేవిదంగా విద్యావేత్త అయిన అరుణకుమారీకి  ఓటు వేస్తే తప్పక తన వార్డును అభివృద్ధి పధంలో నడిపించ గలదని “ మన అందరి బ్రతుకులూ బాగుపడాలంటే అవినీతి పార్టీ లను తరిమి కొట్టాలని , ఎటువంటి ప్రలోభాలకు లోను కావద్దని ప్రజలకు హితవు చెప్పారు. 

మన అభ్యర్థి అరుణ కుమారికి ఓటేస్తే పవన్ కు ఓటేసినట్లే అని. ఆమె గెలిస్తే పవన్ గెలిచి నట్లే అని ...కనుక కమలం గుర్తు పై ఓటేసి, అందరితో వేయించి అత్యధిక మెజారిటీ తో మన అభ్యర్థి అరుణ కుమారీ కి   అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తూయున్నాను అన్నారు. ఈ ప్రచారంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త కె. సుబ్రహ్మణ్యం , కావూరి కరుణాకర్ , వార్డు  అధ్యక్షులు  శ్యామ్  కుమార్ , ఉపాధ్యక్షులు  బాబ్జి , వాసుపల్లి  ధనరాజ్ , వాసుపల్లి  శివ,ఆర్. సాయి కృష్ణ ,జనరల్ సెక్రటరీ రమాదేవి ,లీలావతి , లలితకుమారి రామారావు , చక్రవర్తి , నూకరాజు ,డాక్టర్ శ్రీదేవి , యశోద , శ్యామల , లావణ్య ,మరియు  జనసేన ,బి. జె. పి. కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రధాన పార్టీలకు చుక్కలు చూపిస్తున్న స్వాతంత్ర్య అభ్యర్థి

 ప్రధాన పార్టీలకు చుక్కలు చూపిస్తున్న స్వాతంత్ర్య అభ్యర్థి

మహారాణి పేట, పెన్ పవర్

36వ  వార్డులో  ఎన్నికల వేడి  పీక్ స్టేజ్ కు  వెళ్ళింది ఎన్నికల ప్రచారంలో  బాగం గా  వార్డు లో స్వతంత్ర్య అభ్యర్థి శ్రీమతి కొప్పుల స్వర్ణలత ఆధ్వర్యంలో... స్థానిక సత్యనారాయణ స్వామి గుడి నుంచి మంతవరి వీధి , రంగిరీజు వీధి , రెల్లి వీధి, గోదారి గోతులు, పంజా జంక్షన్, గన్నేరు వీధి, గాంధీ పేట ప్రచారం చేస్తూ స్థానికులు కు మీ యొక్క అమూల్యమైన  ఓటు ను కుట్టు మెషిన్ గుర్తు పై వేసి అఖండ మెజారిటీ తో  గెలిపించవలసిందిగా కోరుకుంటూ పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ కార్పొరేటర్ అభ్యర్థిని శ్రీమతి కొప్పుల స్వర్ణలత ,  మాజీ కార్పొరేటర్  కొప్పుల వెంకట్రావు  ఆధ్వర్యంలో భారీగా వందలాది మంది కార్యకర్తలు, మహిళలు, యూత్, ముస్లిం సోదరులు మాదీనా ఎస్.కే. భాను,వెంకటరత్నం,పద్మ,నర్సింగరావు,సూర్యప్రకాష్ ,జోరీగల గణేష్, లక్ష్మయ్య(సాయి రామ్),గంట్యాడ కనక రాజు, సి.హెచ్.అప్పలరాజు,ఓ.అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

5వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని మొల్లి హేమలతకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు

 5వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని మొల్లి హేమలతకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు

పెన్ పవర్,మధురవాడ

జీవీఎంసీ ఐదోవార్డ్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకె మొదటి ప్రాధాన్యత ఇస్తానని వార్డు టిడిపి అభ్యర్థిని మొల్లి హేమలత స్పష్టంచేశారు. జివిఎంసి ఎన్నికల ప్రచారంలో చివరి రోజు సోమవారం టిడిపి జిల్లా కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో  వార్డ్ పరిధిలోని స్వతంత్రనగర్, నగరంపాలెం, బొట్టవాణిపాలెం,గణేష్ నగర్, అయ్యప్పనగర్, సద్గురుసాయినాథ్ కాలనీ, శివశక్తి నగర్ వైయస్సార్ కాలనీ,సాయిరామ్ కాలనీ, మారికవలస కాలనీ బోరవాణి పాలెం,పరదేశి పాలెం, డ్రైవర్స్ కాలనీ, వికలాంగులకాలనీ తదితర ప్రాంతాలలో విస్తృత పర్యటన చేసి ప్రచారం నిర్వహించారు.వార్డు పరిధిలో అందరినీ పేరుపేరునా పలకరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డుప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చుకోవడం కోసం కృతనిశ్చయంతో ఉన్నామని మొల్లి హేమలత పేర్కొన్నారు. వాటర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని నిత్యం వారికి సేవ చేసుకుంటూ ఉంటానని తెలిపారు.

టిడిపి పట్ల ప్రజల్లో మంచి ఆదరణఉందని తప్పకుండా జీవీఎంసీ 5వార్డు పరిధిలో టీడీపీ జెండాను ఎగురవేస్తాముఅని ఆశాభావం వ్యక్తం చేశారు.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారత సాధించడానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమాజంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నదని గుర్తించి ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే మగవాళ్లతో సమానంగా విద్యా,ఉద్యోగాల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకు వచ్చారని 5వార్డ్ ప్రజలకు హేమలత వివరించారు.స్వయంసహాయక సంఘాల సభ్యులకు ప్రతి సభ్యులకు పదివేల రూపాయలు ఇచ్చారని,బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టుమిషన్లు ఇచ్చి ఇంటి వద్ద టైలరింగ్ పనులు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని,ఒంటరి మహిళలకు వికలాంగులకు చేనేత కార్మికులకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నారని ఆమె గుర్తు చేశారు.ఈ సందర్భంగా జిల్లా టిడిపి కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ టిడిపి హయాంలో విశాఖ అభివృద్ధి చెందిందని అదేవిధంగా వార్డు అభివృద్ధి జరగాలంటే టీడీపీ ని గెలిపించాలని ఆయన ప్రజలకు కోరారు.సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కోరాడ రాజబాబు,వార్డు పరిధిలో తెలుగుదేశం నాయకులు, టిడిపి అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

ఐక్య పోరాటం ద్వారానే స్టీల్ ప్లాంట్ ని రక్షించుకోగలం ..

ఐక్య పోరాటం ద్వారానే స్టీల్ ప్లాంట్ ని రక్షించుకోగలం ..

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణమూర్తి 

విశాఖపట్నం,పెన్ పవర్ 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని బీజేపీ నాయకులు రాష్ట్రంలో డప్పు కొట్టగా, దీనికి విరుద్ధంగా పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ ఉక్కులో వంద శాతం పెట్టుబడులను ఉపసంహరిస్తామని ప్రకటన చేయడం బీజేపీ ద్వంద వైఖరి మరోమారు బట్టబయలు అయ్యిందని  సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణమూర్తి సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో విమర్శించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేసారు. రాజకీయ పార్టీలు సమైక్యంగా ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టాలని, రాజకీయాలకు అతీతంగా పోరాటం సాగించినప్పుడే విశాఖ స్టీల్‌ప్లాంట్ ని ప్రైవేటీకరణ నుంచి రక్షించుకోగలమని స్పష్టం చేశారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...