పక్షి ప్రేమికురాలు గంధం రిషిత-వేసవి కాలంలో పక్షుల దాహం తీరుస్తున్న రిషిత--రిషిత ని పలువురు ఆదర్శంగా తీసుకోవాలి
లక్షెట్టిపెట్,పెన్ పవర్
పక్షి ప్రేమికురాలు గంధం రిషిత-వేసవి కాలంలో పక్షుల దాహం తీరుస్తున్న రిషిత--రిషిత ని పలువురు ఆదర్శంగా తీసుకోవాలి
లక్షెట్టిపెట్,పెన్ పవర్
విధులు బహిష్కరించిన న్యాయవాదులు-న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని కల్పించాలి-లక్షెట్టిపేట న్యాయవాదుల డిమాండ్
లక్షెట్టిపెట్,పెన్ పవర్
తెలంగాణ న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని వెంటనే కల్పించాలని లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేతిరెడ్డి భూమరెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం పట్టణంలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.అనంతరం పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు కృషి చేస్తున్న న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు 41-ఎ సీఆర్ పీసీనీ వెంటనే రద్దు చేయాలన్నారు.న్యాయవాదుల రక్షణ చట్ట సాధనకై ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. న్యాయవాదులకు రక్షణ చట్టం ఏర్పాటయ్యేదాకా పోరాటం సాగిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు, ప్రసన్నకుమార్,కారుకూరి సురేందర్,అక్కల శ్రీధర్,కొమ్మిరెడ్డి కుడెల్లి అశోక్,సత్తన్న,అఫ్జల్ బియాబానీ,ఎస్.ప్రదీప్ కుమార్,వేల్పుల సత్యం,రెడ్డిమల్ల ప్రకాశం,సుమన్,తదితరులు పాల్గొన్నారు.
కార్మికుడు మృతి చెందడంతో కుటుంబానికి టిఆర్ఎస్కెవి ఆధ్వర్యంలో చెక్కును అందజేశారు
పెన్ పవర్,మేడ్చల్
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని పారిశ్రామికవాడాలో గల రాణి ఇంజన్ వాల్వ్ కంపెనీకి చెందిన నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందడంతో నాగేశ్వరరావు కుటుంబానికి కార్మికులు మరియు యాజమాన్యం ఇవ్వాల్సిన డ్యూటీ డబ్బులు చెల్లించడంలో గత సంవత్సర కాలంగా యాజమాన్యం జాప్యం చేస్తుందని ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన టిఆర్ఎస్కెవి అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ రెడ్డి యజమానులతో మాట్లాడి మృతి చెందిన నాగేశ్వరరావు కుటుంబానికి రావాల్సిన డబ్బులు వెంటనే ఇవ్వాలని తెలియజేశారు. కార్మికుల పై తమ కుటుంబం ఆధారపడి ఉంటుందని చనిపోయిన వెంటనే రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని ఇకముందు కంపెనీ యాజమాన్యం జాప్యం చేయడానికి వీలు లేదని యాజమాన్యానికి మర్రి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. వెంటనే కంపెనీ యాజమాన్యం స్పందించి నాగేశ్వరరావుకు రావాల్సిన డబ్బులు ఇవ్వడానికి సోమవారం నాడు యాజమాన్యం ఏర్పాటు చేయడం జరిగింది. రూపాయలు 7,88,903-/- చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్కెవి జిల్లా అధ్యక్షుడు మరియు యూనియన్ అడ్వైజర్ ప్రభాకర్ కంపెనీ జనరల్ మేనేజర్ పోలినాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మృతిడు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు సంవత్సర కాలంగా ఇవ్వని డబ్బులను రాజశేఖర్ రెడ్డి మా సమస్యను అర్థం చేసుకొని డబ్బులు ఇప్పించడం చాలా ఆనందంగా ఉందని ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఆఫీస్ రమేష్ నాగరాజు నరసింహ చారి రాజేశ్వరరావు యాదగిరి సుదర్శన్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్యే క్రాంతి
తార్నాక,పెన్ పవర్
పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలలలో భాగంగా జరుగుతున్న ప్రచారాన్ని అందోల్ ఎమ్మెల్యే పర్యవేక్షించారు. ఈ సందర్బంగా నాయకులు, కార్యకర్తలతో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల గురించి చర్చించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె టిఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభి వాణిదేవి ని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డివిజన్ లో ఓటర్లను ముందుగా గుర్తించి వారికి టిఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి వివరించి మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థిగా సురభి వాణి దేవి గురించి ఓటర్లకు వివరించి, ఓటు వేయాలని విజ్ఞప్తి చేయవలసిందిగా సూచించారు. ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పట్టభద్రులు, ఉద్యోగస్తులు కలిసి టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సురభి వాణికి, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్, తెరాస గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్, ముత్యం రెడ్డి, సుగుణాకర్, విట్టల్ యాదవ్, శ్రీలత, ప్రీతీ రెడ్డి, సువర్ణ, రాజబాబు, తుంగ తిరుపతి, కట్ట బుచ్చన్న, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిత్యలో భక్తి శ్రద్ధలతో సరస్వతీ, సాయిబాబా ఆలయాల తృతీయ వార్షికోత్సవ వేడుకలు
గండేపల్లి,పెన్ పవర్గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ప్రాంగణంలో గల ఆధ్యాత్మిక వేదిక సరస్వతీ దేవి, శిరిడి సాయి బాబా ఆలయాల తృ తీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆదిత్య విద్యా సంస్థల అధినేత డా.నల్లమిల్లి శేషారెడ్డి శ్రీమతి లక్ష్మీ రాజ్యం దంపతులు పాల్గొని పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతీ దేవి,సాయి బాబా వారికి ప్రత్యేకంగా అష్టోత్తర కలశాలతో అభిషేకాలు నిర్వహించారు. హోమాలు, ప్రత్యేక హారతులు తదితర పూజలు నిర్వహించారు.సా.4-00కు కళాశాల ప్రాంగణంలో శిరిడీ సాయి మరియు సరస్వతి దేవి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.రా.7-00 గం.లకు అమ్మవారికి పుష్పాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు శ్రీ రామ్ శర్మ ప్రసాద్ శర్మ లు పూజాకార్యక్రమాలు వేదోక్త మంత్రాలతో పూజా విధులు నిర్వహించారు.ఈకార్యక్రమంలో ఆదిత్య కుటుంబ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చివరి రోజు ప్రచారం లో హోరెత్తించిన కమలం...
విశాఖ తూర్పు,పెన్ పవర్జనసేన , బి.జె.పి. ఉమ్మడి పార్టీ 18 వ వార్డు అభ్యర్థిని ద్వారాపురెడ్డి ఎం ఎల్. అరుణ కుమారి చివరి రోజు ఎన్నికల ప్రచారాన్ని భారీగా ర్యాలీ తో హోరెత్తించారు. డప్పు వాయిద్యాలతో , ప్రజలను చైతన్య పరిచే జానపద గీతాల డాన్స్ లతో ప్రచారాన్ని ముందుకు నడిపారు. ప్రజలు నిజంగా వార్డు అభివృద్దే కోరుకుంటే తనకే తప్పక ఓటు వేసి గెలిపించాలని ఆరుణ కుమారి కోరారు. .ప్రచారంలో వార్డు ప్రజలు అడుగడుగునా హారతులు పట్టారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా అరుణ కుమారికి మద్దత్తుగా వార్డులోని మహిళలందరూ ఈ ప్రచారంలో పాలుపంచుకున్నారు. ఈ ప్రచారానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన జనసేన పార్టీ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.... టి.డి.పి. మరియు వై.సి.పి. పార్టీ లు రెండూ అవినీతి పుట్టలని, కార్పొరేషన్ కు సంవత్సర ఆదాయం 4 వేళా కోట్లు వస్తుందని ఆ సొమ్మంతా తోడు దొంగలై తినేస్తున్నారని , ఆ సొమ్మును కాజేయ డానికి ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి ఓటుకు నోటు ఇచ్చి మీ చేత ఓటు వేయించు కుంటున్నారని దుయ్యబట్టారు.” విద్యావంతు రాలైన స్త్రీ తన ఇంటిని ఏ విదంగా చక్క దిద్దుకో గలదో అదేవిదంగా విద్యావేత్త అయిన అరుణకుమారీకి ఓటు వేస్తే తప్పక తన వార్డును అభివృద్ధి పధంలో నడిపించ గలదని “ మన అందరి బ్రతుకులూ బాగుపడాలంటే అవినీతి పార్టీ లను తరిమి కొట్టాలని , ఎటువంటి ప్రలోభాలకు లోను కావద్దని ప్రజలకు హితవు చెప్పారు. మన అభ్యర్థి అరుణ కుమారికి ఓటేస్తే పవన్ కు ఓటేసినట్లే అని. ఆమె గెలిస్తే పవన్ గెలిచి నట్లే అని ...కనుక కమలం గుర్తు పై ఓటేసి, అందరితో వేయించి అత్యధిక మెజారిటీ తో మన అభ్యర్థి అరుణ కుమారీ కి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తూయున్నాను అన్నారు. ఈ ప్రచారంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త కె. సుబ్రహ్మణ్యం , కావూరి కరుణాకర్ , వార్డు అధ్యక్షులు శ్యామ్ కుమార్ , ఉపాధ్యక్షులు బాబ్జి , వాసుపల్లి ధనరాజ్ , వాసుపల్లి శివ,ఆర్. సాయి కృష్ణ ,జనరల్ సెక్రటరీ రమాదేవి ,లీలావతి , లలితకుమారి రామారావు , చక్రవర్తి , నూకరాజు ,డాక్టర్ శ్రీదేవి , యశోద , శ్యామల , లావణ్య ,మరియు జనసేన ,బి. జె. పి. కార్యకర్తలు పాల్గొన్నారు.ప్రధాన పార్టీలకు చుక్కలు చూపిస్తున్న స్వాతంత్ర్య అభ్యర్థి
మహారాణి పేట, పెన్ పవర్
36వ వార్డులో ఎన్నికల వేడి పీక్ స్టేజ్ కు వెళ్ళింది ఎన్నికల ప్రచారంలో బాగం గా వార్డు లో స్వతంత్ర్య అభ్యర్థి శ్రీమతి కొప్పుల స్వర్ణలత ఆధ్వర్యంలో... స్థానిక సత్యనారాయణ స్వామి గుడి నుంచి మంతవరి వీధి , రంగిరీజు వీధి , రెల్లి వీధి, గోదారి గోతులు, పంజా జంక్షన్, గన్నేరు వీధి, గాంధీ పేట ప్రచారం చేస్తూ స్థానికులు కు మీ యొక్క అమూల్యమైన ఓటు ను కుట్టు మెషిన్ గుర్తు పై వేసి అఖండ మెజారిటీ తో గెలిపించవలసిందిగా కోరుకుంటూ పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ కార్పొరేటర్ అభ్యర్థిని శ్రీమతి కొప్పుల స్వర్ణలత , మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకట్రావు ఆధ్వర్యంలో భారీగా వందలాది మంది కార్యకర్తలు, మహిళలు, యూత్, ముస్లిం సోదరులు మాదీనా ఎస్.కే. భాను,వెంకటరత్నం,పద్మ,నర్సింగరావు,సూర్యప్రకాష్ ,జోరీగల గణేష్, లక్ష్మయ్య(సాయి రామ్),గంట్యాడ కనక రాజు, సి.హెచ్.అప్పలరాజు,ఓ.అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...