Followers

ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ గెలుపు కోసం కదిలిన కాంగ్రెస్ వాదులు.

 ఎమ్మెల్సీ  అభ్యర్థి రాములు నాయక్  గెలుపు కోసం కదిలిన కాంగ్రెస్ వాదులు.

కురవి ,పెన్ పవర్

మండల కేంద్రంలోని  నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు నారాయణ రాజేంద్ర కుమార్  , మాజీ జెడ్పిటిసి అంబటి వీరభద్రం ఆధ్వర్యంలో మంగళవారం కార్యాలయాలు, విద్యాసంస్థలు, విద్య వంతులను కలిసి ఓటును అభ్యర్థించారు, టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న  మోసాన్ని ఎండగడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే మీ అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యత రాములు నాయక్ కే వేసి గెలిపించాలని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని వారు ప్రచారంలో భాగంగా విద్యావంతులను కోరారు. అదే విధముగా వివిధ గ్రామాలలోని బాధ్యులు గెలుపే లక్ష్యంగా పట్ల పట్టభద్రుల ఇళ్ల లోనికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ఓటు వేయవలసిందిగా కోరారు. అదే విధముగా సుధనపల్లి, కండికొండ తదితర గ్రామాల్లో పట్టభద్రుల ఇండ్లలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు బండి శ్రీనివాస్, వార్డు సభ్యులు బలగాని శ్రీనివాస్, తరాల వీరభద్రం, అవిరె మోహన్ రావు,అంగడి నర్సయ్య, కామిండ్ల వీరన్న, బాదే వీరభద్రమ్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అంటున్న రాజవర్ధన్ రెడ్డి

 బిజెపి బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అంటున్న రాజవర్ధన్ రెడ్డి

 పెన్ పవర్,మరిపెడ 

మరిపెడ మండలంలోని పట్టభద్రుల ఎన్నికల ప్రచారం భాగంగా మంగళవారం రోజున ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాల కాలేజీలో ఉపాధ్యాయ సిబ్బంది ని గాడ్యుయేట్ ఓట్ల  ప్రచారంలో బీజేపీ నాయకులు కలవడం జరిగింది. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు  రాజవర్ధన్ రెడ్డి పాల్గొని అనంతరం మాట్లాడుతూ ఉద్యోగులకు పిఆర్ సి రావాలన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్ రావాలన్న   బీజేపీ అభ్యర్థి  గుజ్జుల ప్రేమిందర్ రెడ్డి  మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే తెలంగాణ మలిదశ ఉద్యమనేత బీజేపీ నాయకుడు బుల్లెట్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా కెసిఆర్ పరిపాలన సాగుతున్నదని కుల  కుటుంబ రాజకీయం చేస్తున్న  కెసిఆర్ ఉద్యమ ద్రోహిగా మిగిలిపోతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బాధరబోయిన  రాఘవులు, వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు భూక్యా శ్రీనివాస్, భద్రిసెనాగౌడ్, పెంటయ్య, వెంకట చారి,  పండు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

మరొకసారి అవకాశం ఇవ్వండి

 మరొకసారి అవకాశం ఇవ్వండి: ఎమ్మెల్సీ రామచంద్రరావు

కూకట్ పల్లి,పెన్ పవర్

ఎమ్మెల్సీ ఎన్నికలు  సమీపిస్తున్న వేళ బీజేపీ అభ్యర్థి రామచందర్ రావు స్పీడ్ ని పెంచారు. కూకట్ పల్లి కోర్టు బార్ అసోసియేషన్ లో మంగళవారం విరమల్ల. కేశవరావు ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయవాదులతో చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల గొంతుగా మారేందుకు మరొక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈసారి పెద్ద ఎత్తున  గ్రాడ్యుయేట్ అయిన న్యాయవాదులు ఓట్లు నమోదు చేసుకోవడం జరిగిందని, గత కొన్ని రోజులుగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, జడ్చర్ల, నాంపల్లి కోర్టులతో పాటు కూకట్ పల్లి కోర్ట్ ని కూడా సందర్చించడం జరిగిందని, కూకట్ పల్లి కోర్టును త్వరగా నిర్మించాలని కౌన్సిల్ లో మాట్లాడటం జరిగిందని, హైకోర్టు విభజన, న్యాయమూర్తుల పంపకాలలో సైతం స్పందించడం జరిగిందని, లాయర్లకు అందాల్సిన సంక్షేమ పథకాలుపై  న్యాయశాఖ మంత్రికి కూడా వినతిపత్రం అందజేసమని తెలిపారు. అలాగే వామన్ రావు దంపతుల హత్య  లాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని చేస్తున్న ఆందోళనకు తాను పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు రామచంద్రరావు తెలిపారు. కేంద్రానికి ఈ విషయంపై సిఫార్సు చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో న్యాయవాదులు నరేందర్ రెడ్డి, శ్రీకర్ రావు, రఘు, దేవ్, ధర్మేష్, యాదయ్య, శివగౌడ్, మహిళ న్యాయవాదులు, మరియు జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు

గౌడవెల్లి లో అంగరంగ వైభవంగా మల్లన్న జాతర జరిగింది..

 గౌడవెల్లి లో అంగరంగ వైభవంగా మల్లన్న జాతర జరిగింది..

పెన్ పవర్,మేడ్చల్

మండల పరిధిలోని గౌడ వెల్లి గ్రామంలో మల్లన్న జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణం, అగ్ని గుండాలు నిర్వహించారు. కొండపోచమ్మ కు యాదవ్ మహిళలు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించారు. జాతర సందర్భంగా ఎంపీపీ పద్మజగన్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అప్పమ్మాగారి పద్మజగన్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. ప్రతియేటా వైభవోపేతంగా జాతరను నిర్వహిస్తున్న యాదవ సంఘం సభ్యులను ఎంపీపీ ప్రశంసించారు. స్వామివారు గ్రామస్తులు అందరికీ సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెంటమ్మ, టిఆర్ఎస్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి  లహరి రెడ్డి, యాదవ సంఘం నాయకులు యాదగిరి యాదవ్, దయానంద్ యాదవ్, సింహాలు యాదవ్, వెంకటేష్ యాదవ్, యాదయ్య యాదవ్, ఐలయ్య యాదవ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ కృష్ణ యాదవ్, మాజీ ఎంపిటిసి నవనీతా రాంరెడ్డి, వార్డ్ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు  పాల్గొన్నారు.

సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా గ్రామదేవతల వేడుకలు

సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా గ్రామదేవతల వేడుకలు

వి.మాడుగుల,పెన్ పవర్

 సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా గ్రామ దేవతల  వేడుకలు శోభిల్లుతూ ఉన్నాయని ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు అన్నారు. మంగళవారం మాడుగుల ఇలవేల్పు ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం శ్రీ మోదకొండమ్మ తీర్థ మహోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎడ్ల బళ్ళ పందాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పల్లెల్లో ప్రతి చోట గ్రామదేవతల తీర్థ మహోత్సవాలు జాతరలు  అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని  అందువల్ల భక్తి శ్రద్ధలు  గ్రామం సుభిక్షంగా ఉంటుందని  అన్నారు. తీర్థ మహోత్సవాలు కారణంగా భక్తులు బంధువులు స్నేహితులు కలుసుకోవడం విందులు వినోదాలు చేసుకోవడం జరుగుతుందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల వల్ల తీర్థ మహోత్సవాలకు ఆదరణ  కలుగుతుందన్నారు. ఎడ్లబండ్ల పోటీలు గుర్రపు పందాలు  నిర్వహించడం వల్ల పోటీతత్వం పెరుగుతుందన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి  నిరంతరం కృషి చేస్తుందన్నారు. రహదారులు  డ్రైనేజీలు  లింకు రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులకు మెరుగుపరచాలని కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. పేద ప్రజల సంక్షేమమే  వైయస్ జగన్ లక్ష్యం అని  అమ్మ ఒడి జగనన్న చేయూత  తదితర  సంక్షేమ పథకాలు  పేద ప్రజలకు చేరువ అవుతుందని అన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో  వైయస్ జగన్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి   అభివృద్ధికి చేయూతనివ్వాలని  ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు  అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కేసును చేధించిన కూకట్ పల్లి పోలీసులు

 కేసును చేధించిన కూకట్ పల్లి పోలీసులు

కూకట్ పల్లి,పెన్ పవర్


నిర్లక్ష్యంగా ఆటో తోలుతూ ఓవ్యక్తిని ఢీకొట్టి హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సింది పోయి కొన ప్రాణంతో ఉన్న వ్యక్తిని డంప్ యార్డులో పడేసి వెళ్లిన ఘటన కూకట్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మంగళవారం కూకట్ పల్లి పోలీసు స్టేషన్లో ఏసిపి సురేందర్ రావు విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మియపూర్ జనప్రియ నగర్ లో నివసిస్తున్న కాకర.రామకృష్ణ జనవరి ఆరో తేదీన ఫైనాన్స్ డబ్బులు కట్టడానికి వెళ్లి కనిపించకుండా పోయాడు. రామకృష్ణ సోదరుడు చుట్టుపక్కల ఆచూకీ కోసం గాలించిన లాభంలేకపోవడంతో మియపూర్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు.    అయితే ఫైనాన్స్ డబ్బులు కట్టడానికి వెళ్లిన రామకృష్ణను మియపూర్ రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద రోడ్డు దాటుతుండగా న్యూ హఫీజ్ పెట్ కు చెందిన సయ్యద్ షేర్ అలీ అనే వ్యక్తి  ఆటోతో ఢీ కొట్టాడు. దీనితో స్థానికులు అలీని పట్టుకుని తీవ్రంగా గాయపడిన రామకృష్ణ ని  హాస్పిటల్ కి తీసుకువెళ్ళమంటే సరే అని తన ఆటోలో ఎక్కించుకుని వెళ్ళాడు. అయితే రామకృష్ణను హాస్పిటల్ కు తీసుకెళ్తే తనమీద కేస్ అవుతుందని, వైద్య ఖర్చులు కూడా తనే భరించాల్సి వస్తుందనే భయంతో కోన ప్రాణంతో ఉన్న రామకృష్ణను కైతలాపూర్ డంపింగ్ యార్డ్ లో పడేసి వెళ్ళిపోయాడు. డంపింగ్ యార్డ్ లో రామకృష్ణ మృతదేహాన్ని చూసిన పోలీసులు ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించి రెండు నెలల పాటు శ్రమించి ఆటో డ్రైవర్ అలీని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి ఒక ఆటోను, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ కు తరలిస్తునటు తెలిపారు. రెండు నెలల పాటు నిరంతరం శ్రమించి కేసును చేధించిన పోలీసు సిబ్బందిని ఆయన ప్రశంసించారు. ప్రజలు కూడా ప్రయాణం చేసే సమయంలో రోడ్డు మీద ఎవరైనా గాయపడినట్లు గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని, లేదా వెంటనే వారిని దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లి వారి ప్రాణాలు కాపాడాలని ఆయన అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సింగ్ రావు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

వాడపల్లి వెంకన్నకు 85 వేల మూడు వందల రూపాయలు విరాళం

వాడపల్లి వెంకన్నకు 85 వేల మూడు వందల రూపాయలు విరాళం






పెన్ పవర్,ఆత్రేయపురం 

ఆత్రేయపురం మండలం  వాడపల్లి గ్రామంలో  వెంచేసియున్న కలయుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి అలివేలు మంగ పద్మావతి  సమేత  ఇక్కడ కొలువై ఉన్నాడు స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఆ స్వామివారి అన్నప్రసాదం ట్రస్ట్ కు  తాడేపల్లిగూడెం గ్రామానికి చెందిన పడాల ప్రశాంత్ రెడ్డి 15000/-రూపాయలు విరాళం జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నున్నా చైతన్య కుమార్ నీరజ దంపతులు ఆస్వామి వారికి 25000/- విరాళం రావులపాలెం గ్రామానికి చెందిన కొత్త నాగ సత్య శివ గణేష్ కుమార్ సాయి శరణ్యదంపతులు ఆ వెంకన్న కు 25116/-విరాళం రాజమండ్రి చెందిన కుమార్ ఎంటర్ప్రైజెస్ 10116/- విరాళం పశ్చిమ గోదావరి జిల్లా వేగేశ్న ఉమా వెంకట సుబ్బరాజు లీలా మహా లక్ష్మి దంపతులు 10116 రూపాయలు విరాళంగా ఇచ్చారు వీరిని దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్త మండలి సభ్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ అర్చకులు ఆ ఏడుకొండల స్వామి చిత్రపటానిఇచ్చి  కృతజ్ఞతలు తెలియజేశారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...