పద్మజ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
కూకట్ పల్లి,పెన్ పవర్
పద్మజ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
కూకట్ పల్లి,పెన్ పవర్
కేయూ లో జర్నలిస్టుల పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి....!
జర్నలిస్టుల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ....!!
పెన్ పవర్,మరిపెడ
పన్నాల ను సత్కరించిన అంగన్వాడీ సిబ్బంది
తార్నాక ,పెన్ పవర్
మల్లాపూర్ కార్పొరేటర్ గా రెండోసారి గెలుపొందిన పన్నాల దేవేందర్ రెడ్డి ని మల్లాపూర్ అంగన్వాడీ సిబ్బంది పూలమొక్కను బహూకరించి , శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా పన్నాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంగన్వాడి సిబ్బందికి పెద్ద పీట వేస్తూ వారి వేతనాలు పెంచారని గుర్తు చేశారు. పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. సరైన సమయానికి పౌష్టికాహారాన్ని గర్భిణీ స్త్రీలకు మరియు పిల్లలకు అందించాన్నారు. కరోనా కష్టకాలంలో అంగన్వాడీ సిబ్బంది ముందుండి గర్భిణీ స్త్రీలకు పిల్లలకు సేవలందించారు. అంగన్వాడీ సిబ్బంది సేవలను టిఆర్ఎస్ ప్రభుత్వం గుర్తిస్తుంది అని అన్నారుగర్భిణీలకు వైద్యపరీక్షలు
పెన్ పవర్,కరపస్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ ఆభయాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్.శ్రీనివాస్ నాయక్, డాక్టర్ సోమిరెడ్డి శిరీష వైద్యపరీక్షలు నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. జిల్లా పబ్లిక్ నర్సింగ్ ఆఫీసర్ ఎస్.ఉషశ్రీ మాట్లాడుతూ ప్రతినెల గర్భణీలు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకుంటూ, వైద్యుల సలహాలు పాటిస్తే సుఖప్రసవాలు జరుగుతాయన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీహెచ్సీ సిబ్బంది గర్భిణీలకు రక్తపరీక్షలు, బీపీ, షుగరు టెస్ట్లు నిర్వహించి, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. హైరిస్క్ గర్భిణీలను గుర్తించడం జరిగిందని, వారిపట్ల ప్రత్యేకశ్రద్ధ తీసుకుని, వైద్యపరీక్షలు నిర్వహిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని వైద్యసిబ్బంది తెలిపారు. ఎంపీ హెచ్ ఓ కె.కిశోర్, వైద్య సిబ్బంది ఎస్.మల్లిఖార్జున్, టీబీటీ సుందరి, సత్యవతి, ఉషాకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ కన్వీనర్ గా తోట శ్రీనివాస్
తార్నాక, పెన్ పవర్
ఓయూ లో ముమ్మురంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
తార్నాక , పెన్ పవర్
ఉస్మానియా యూనివర్సిటీ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలప్రచారం జోరుగా సాగుతుంది. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఓయూ పరిధిలోని ఉద్యోగస్తులను, విద్యార్థులను కలిసి టీఆర్ఎస్ అభ్యర్థులు సురభి వాణి దేవి, మరియు పల్లా రాజేశ్వర్ రెడ్డి లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని విద్యార్ధి నేతలు కోరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ శ్రేణులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ విద్యార్ధి నేతలు చటారి దశరథ్, శ్రీకాంత్ గౌడ్, జంగయ్య, కాటం శివ, బొల్లు నాగరాజు, రమేష్ గౌడ్, రవీందర్, రాజు, సురేష్, రాజేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారం
చిన్నగూడూరు, పెన్ పవర్
స్థానిక మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా మంగళవారం నాడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి చెందే విధంగా అడుగులు వేస్తుందని దానికి సీఎం కేసీఆర్ కారణమని తెలిపారు. ఇందులో భాగంగా డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు డీఎస్ రెడ్యానాయక్ మరియు ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ గుడిపూడి నవీన్ రావు, డోర్నకల్ యువజన నాయకులు డి ఎస్ రవి చంద్ర ఆదేశాల మేరకు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించడం జరిగింది అని అన్నారు. మండల తెరాస యూత్ అధ్యక్షులు దుండి మురళి, బాదావత్ సురేష్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్, హై స్కూల్ కార్యాలయాలలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారాన్ని చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ నాయకులు గుదే నవీన్ ,గుదే ఉపేందర్, మండల యూత్ సభ్యులు శమ కురి మనోహర్, డానియల్, రవి, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...