Followers

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన సదస్సు

 ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన సదస్సు 

పెన్ పవర్,మరిపెడ 

మహబూబుబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండలంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని డాక్టర్ అరుణ దేవి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమాన్నికి ముఖ్య ఉద్దేశం ఆయుష్మాన భారత, నేషనల్ హెల్త్ పోగ్రామ్, ట్రైనింగ్ చేయడం గురించి అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటేశ్వరి, సమ్మయ్య, సునంద,శోభా,సుదర్శన్, వెంకటేశ్వర్లు, సుధాకర్, ఏ నేమ్స్, ఆశాలు తదితరుల పాల్గొన్నారు.

రహదారి విస్తరణ కోసం భూములు కోల్పోతున్నవారికి పరిహారాన్ని చెల్లించాలి

 రహదారి విస్తరణ కోసం భూములు కోల్పోతున్నవారికి  పరిహారాన్ని చెల్లించాలి

కరీంనగర్,పెన్ పవర్

జగిత్యాల నుంచి కోదాడ జాతీయ రహదారి ఎంఎచ్ 563 నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న త్యాగదనులకు కచ్చితమైన పరిహారాన్ని చెల్లించాలని, రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని బీసీ విద్యార్థి సంఘం నాయకులుమంగళవారం రోజునా  కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి  కి వినతి పత్రం సమర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంతలతో ప్రయణయోగ్యంగా లేకుండా ఉన్న  జాతీయ రహదారి పునః నిర్మాణం కోసం ఎన్నో ప్రజా ఉద్యమాల ద్వారా రహదారి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయడం పట్ల ఎంతగానో సంతోషిస్తున్నామనీ, అట్టి రహదారి విస్తరణ నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని, అట్టి రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న త్యాగదనులకు కచ్చితమైన పరిహారాన్ని చెల్లించాలని  అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి లేంకల్ అనిల్, కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జి బోయినపల్లి సాయి చంద్, పట్టణ కన్వీనర్ బీరుపుర్ వివేక్, జిల్లా ఉపాధ్యక్షులు దుబాసి ప్రణీత్, పట్టణ ఉపాధ్యక్షులు శివ కుమార్, అజయ్, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రవణ్, నాయకులు చుక్క సాయి తదితరులు పాల్గొన్నారు.

శివకళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న మంత్రి ఈటల

 శివకళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న మంత్రి ఈటల 

జమ్మికుంట,పెన్ పవర్

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని ఆబాది జమ్మికుంట శ్రీ మహాదేవ లింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రోజునా జరిగిన శివకళ్యాణం మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న ఈటల రాజేందర్, ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ని పురోహితులు వేద మంత్రాలతో ఘనంగా ఆహ్వానించారు, అనంతరం పూజా కార్యక్రమాలు చేయించి వారికి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం ఈటల మాట్లాడుతూ శివయ్య  ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకునే బోలా శంకరుడు అని అన్నారు, ప్రతి సంవత్సరం శివరాత్రి వేడుకల్లో పాల్గొంటున్నానని అన్నారు,  ఆలయ అభివృద్ధికి తోడ్పడతానని  అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, శ్రీరామ్ శ్యామ్, ఆలయ కమిటీ, వార్డు కౌన్సిలర్ లు, నాయకులు మరియు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పెంచిన గ్యాస్, డిజిల్, పెట్రోల్, ధరలను వెంటనే తగ్గించాలి

 పెంచిన గ్యాస్, డిజిల్, పెట్రోల్, ధరలను వెంటనే తగ్గించాలి


బెల్లంపల్లి రూరల్, పెన్ పవర్

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డిజిల్,నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా మంగళవారం బెల్లంపల్లి కొత్త బస్టాండ్ చౌరస్తాలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య,ఎంసీపీఐయూ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లాకార్యదర్శి సబ్బని కృష్ణ మాట్లాడుతూ కేంద్ర  రాష్ట్రప్రభుత్వలు ప్రజా వ్యతిరేకపాలనసాగిస్తున్నాయని,ప్రజలపైనధరలభారాన్నిమోపుతున్నాయని,పూర్తిగా కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ము కాస్తున్నాయని,ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని,అందుకే అన్నివర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు పెంచినగ్యాస్,డీజిల్,పెట్రోల్,నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని లేనియెడల దశలవారి ఆందోళన  చేపడతామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో సబ్బని విజయలక్మి, బర్ల స్రవంతి,కాంపెల్లిరాధ,కిరణ్మయి, పద్మ,పసులేటి వెంకటేష్,కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వేణుగోపాలచారి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వేణుగోపాలచారి

పెన్ పవర్,పొన్నలూరు 

పొన్నలూరు గ్రామానికి చెందిన వాకాని వేణు గోపాలా చార్యులు నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో నెల్లూరు హాస్పిటల్ కి కారులో వెళుతుండగా కొడవలూరు వద్ద కారు అదుపు తప్పి డివైడర్ ను డికొట్టి ప్రక్క రోడ్డు పైకి దూసుకెళ్లింది.ఎదురుగా వస్తున్న ఇంద్ర బస్సు ఆ కారును డీ కొనడంతో పూజారి వేణుగోపాల్ అక్కడికక్కడే మరణించాడు.వేణు గోపాలా చార్యులు పొన్నలూరులో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం లో పూజరిగాను ,కందుకూరు పామూరు రోడ్డు నందు ఉన్న రామాలయానికి పూజారి గాను పనిచేస్తున్నారు. అను నిత్యం అందరితో కలిసి మెలసి మంచిగా ఉండే వేణు గోపాలా చార్యులు మృతి చెందడంతో పొన్నలూరు గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.గ్రామ ప్రజలు ,వారి కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.ఇతని తో పాటు ఆ వాహనంలో గ్రామంలోని మరొక పూజారి మణికంఠ ,సుధాకర్ ,డ్రైవర్ వెంకటేశ్వర్లు లకు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు.పోలీస్ వారు కేసు నమోదు చేసి ప్రమాదానికి జరిగిన కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.

తాళ్ళపూడి మండల టైలర్స్ యూనియన్ తరపున దేశాబత్తుల దావీదు కు ఆర్థిక సాయం

 తాళ్ళపూడి మండల టైలర్స్ యూనియన్ తరపున దేశాబత్తుల దావీదు కు ఆర్థిక సాయం

తాళ్ళపూడి,పెన్ పవర్

తాళ్ళపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన టైలర్స్ యూనియన్ సభ్యులు దేశాబత్తుల దావీదు రోడ్ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబం ఇతనిపై ఆధారపడి ఉంది. ఇతను టైలరింగ్ వృత్తిపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి తాళ్ళపూడి మండల టైలర్స్ వెల్ఫేర్ సొసైటీ తరపున 25 కేజీల బియ్యం, 1000 రూపాయల నగదు ఆర్థిక సాయం చేయడం జరిగింది. దావీదు మాట్లాడుతూ ఆపదలో ఉన్న సహాయం చేసిన తమ టైలర్స్ యూనియన్ సబ్యులకు కృతజ్ఞతలు తెలిపి, మనలో ఎవరికైనా కష్టం కలిగితే ఇదేవిధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాళ్ళపూడి మండల టైలర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మరియు వైసిపి మండల యువజన విభాగం అధ్యక్షులు వంబోలు పోసిబాబు, టైలర్స్ వెల్ఫేర్ సొసైటీ  కార్యదర్శి యలమర్తి సుబ్రహ్మణ్యం, కోశాధికారి షేక్ కరిముల్లా, మలకపల్లి గ్రామ టైలర్స్ అధ్యక్షులు కుప్పాల గణపతి మరియు టైలర్స్ పాల్గొన్నారు.

టిఆర్ఎస్ పార్టీఎమ్మెల్సీ అభ్యర్థి ని గెలుపించాలి

 టిఆర్ఎస్ పార్టీఎమ్మెల్సీ అభ్యర్థి ని గెలుపించాలి

వికారాబాద్,పెన్ పవర్

వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని పాలేపల్లి గ్రామంలో ని పట్ట బద్రులు తమ ఓటు ను టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణీదెవికి మీయెక్క ఓటు వేసి గెలిపించాలని వికారాబాద్ జిల్లా గ్రంథాలయం డ్తెరెక్టర్ బంగ్లా యదయ్యగౌడ్ కోరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చెస్తున్నా అభివృద్ధి పనులను ఆయన వివరించారు. కార్యక్రమాలు ఉప్పరి తిరుపతయ్య ,ఉప సర్పంచ్ రమేష్, మాజీ సర్పంచ్ హనుమంతు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...