Followers

అధికారులు కాకమ్మ కథలు మానుకోవాలి

అధికారులు కాకమ్మ కథలు మానుకోవాలి 

 గూడెం కోత్తవీధి,పెన్ పవర్ 

రెవెన్యూ అధికారులు,గిరిజనేతరలు కుమ్మక్కై అక్రమ కట్టడాలకు సపోర్ట్ చేస్తున్న రెవెన్యూ అధికారులు పై చర్యలు తీసుకోవాలని, అధికారులు కాకమ్మ కబుర్లు చెప్పుకుంటున్న అధికారులు మానేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజుబాబు అన్నారు,గత రెండేళ్లుగా ఆదివాసీ జెఏసి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం నడుపుతూ ఆదివాసీ చట్టాలు, హక్కులు సక్రమంగా అమలు కావడం లేదని, వాటిని సక్రమంగా అమలు చేయాలని ఆదివాసీ జెఏసి నాయకులు పాడేరు డివిజన్ అధికారికి, మండల రెవెన్యూ అధికారులను కలిసి వినతిపత్రాలు, ఇచ్చినప్పటికీ స్పంందించక‌‌‌ గిరిజనేతరలకు సపోర్ట్ చేస్తుందా అని, ఎన్నోసార్లు వినతిపత్రాలు, విజ్ఞప్తిలు చేస్తూ ఆదివాసీ గిరిజనుల ఆవేదనలు, వేదనలు, వాదనలు వినిపిస్తున్నా జిల్లా అధికారులు గానీ, పాడేరు డివిజన్ అధికారులు గానీ, మండల రెవెన్యూ అధికారులు గానీ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు,ఈ మధ్య ముడు రోజుల క్రితం ఒక్కసారిగా పాడేరు ఐటీడీఏ పీవో గిరిజనుల హక్కులు, చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని అనడం ఆశ్చర్యానికి గురి చేసిన, ఆయన మీద ఆదివాసీలకు కొంత నమ్మకం ఉందని, గతంలో ఆయన సబ్ కలెక్టర్ గా చింతపల్లిలో మాట్లాడిన మాటలకు చాలా మంది ఆదివాసీలు తమ హక్కులను చట్టాలను కాపాడుకోవాలని ముందుకు వచ్చారని, కానీ అధికారులు నుండి మాత్రం కొంచెమైనా సహాకారం లేదని ఆదివాసీల భూములు ఆక్రమణకు గురైతే పట్టించుకోవడమే కాదు,తమ శాఖకు కేటాయించిన భూముల ఆక్రమణ జరుగుతున్న పట్టించుకోని అధికారులు ఐదవ షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోనే ఉన్నారని ఇదే అధికారులు నాన్ షెడ్యూల్ ప్రాంతానికి వెళితే అక్కడ సక్రమంగా పని చేస్తున్నారని మైదాన ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలే కాదు, చిన్న చిన్న ప్రహారీ గోడలు కూడా కూల్చే అధికారులు ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలోని మాత్రం చట్టాన్ని అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఎందుకు ఉన్నారో తెలియడం లేదన్నారు, ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరలకు రాజకీయ నాయకులు అండదండలతో ఒత్తిళ్లు కూడా పెద్దగా ఉండనప్పటికీ జిల్లా అధికారులు, పాడేరు డివిజన్ అధికారులు, మండల అధికారులు సక్రమంగా చట్టాలను అమలు చేయలేకపోతున్నారని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో, పాడేరు సబ్ కలెక్టర్ అధికారులు ఆదివాసీ చట్టాలను, హక్కులను సక్రమంగా అమలు చేయాడానికి ప్రయత్నం చేస్తారని ఆదివాసీ తరపున ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు, అక్రమ భావనల పై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజుబాబు డిమాండ్ చేశారు.

కోదండ రామునికి లక్ష తులసి పూజ

 కోదండ రామునికి లక్ష తులసి పూజ   

 పెన్ పవర్,కందుకూరు

 పట్టణంలోని  పెద్ద బజార్ లో ఉన్న కోదండ రామాలయం లో మాఘ మాసం సందర్భంగా కోదండ రామునికి మంగళవారం ఆలయ అర్చకస్వాములు  రాజా స్వామి, పవన్ స్వాములు లక్ష తులసి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామ నామం జపిస్తూ స్వామివారికి తులసీ దళాలను అందజేశారు. మరి కొంత మంది మహిళా భక్తులు విష్ణు సహస్రనామం జరిపించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ లక్ష తులసి పూజ భక్తులకు కనువిందు చేసింది. పూజ అనంతరం తీర్థప్రసాదాలు వినియోగం జరిగింది.సాయంత్రం శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ మురారి శెట్టి వెంకట సుబ్బారావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ఐ సి డబ్ల్యు డి సంస్థ ద్వారా గ్రామీణ మహిళలకు చేయూత

 ఐ  సి డబ్ల్యు డి సంస్థ ద్వారా గ్రామీణ మహిళలకు చేయూత

తాళ్ళూరు,పెన్ పవర్

తాళ్ళూరు మండలం లోని నాగంబొట్లపాలెం గ్రామంలో క్రాస్ సంస్థ మరియ ఐ  సి డబ్ల్యు డి ఎస్ సంస్థ సారధ్యంలో గ్రామీణ వికాస్ బజార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్రాస్ సంస్థ ప్రతినిధి కృపా సత్య మాట్లాడుతూ గ్రామీణ మహిళల అభివృద్ధి కొరకు గ్రామీణ వికాస్ బజార్లు ఎర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. అలాగే గ్రామంలోని మహిళలకు పది మంది గ్రూప్ కలిపి పది వేల రూపాయల చొప్పున వంద మందికి సూక్ష్మ రుణాలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. వీటిని నిత్యావసర సరుకుల రూపంలో ఇచ్చి వాయిదా పద్ధతిలో వడ్డీ లేకుండా చెల్లించాలని గ్రూపు సభ్యులకు తెలిపారు. గ్రామంలోని మహిళలు లోను పొందడం ద్వారా ఉపాధి అవకాశాలు  మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలు అభివృద్ధి కోసం క్రాస్ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని ఆయన ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో క్రాస్ సంస్థ ప్రతినిధి కృపా సత్యం సర్పంచ్ చిమాట  సుబ్బారావు, వైస్సార్సీపీ నాయకులు సోము అనిల్ రెడ్డి,కె.నరసింహా రెడ్డి,కల్పనా ,గోపి కృష్ణ ,మోపురి విజయలక్ష్మి ,కె.వాణి, తదితరులు పాల్గొన్నారు.

రెండు జిల్లాల వారధి ప్రమాదాలకు దారి

 రెండు జిల్లాల వారధి ప్రమాదాలకు దారి

కరీంనగర్,పెన్ పవర్

పెద్దపల్లి-కరీంనగర్ జిల్లాలను కలుపుతూ సుల్తానాబాద్  మండలానికి సమీపం నీరుకుల శివారు హుస్సేన్ మియా వాగుపై ఉన్న బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ రెండువైపులా ప్రమాదాలకు అవకాశాలు ఏర్పడ్డాయి.రోడ్డు నిర్మాణం చేయకపోవడంతో వాహనాలు ఒక్కసారిగా కిందకు జారే పరిస్థితులు ఉన్నాయి. బ్రిడ్జి పైకి ఎక్కాలన్నా దిగాలన్నాభయపడాల్సిన పరిస్థితులున్నాయి.పాలకులు, అధికారులు దీనిపై దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.


కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డకి కనుక

 కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డకి కనుక 

గొల్లపల్లి,పెన్ పవర్

  గొల్లపల్లి మండలంలో  పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా  3కోట్ల 20లక్షలతో సిసి రోడ్లు, వైకుంఠదామం, చెక్ డ్యాం, పనులకు మంగళవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభోత్సవం చేసి శంకుస్థాపన చేశారు.అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి మంజూరు అయిన 10లక్షల 16వేల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. 5,94,500విలువ గల సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులను 19మందికి అందజేశారు. అనంతరం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈ ఈ  శ్రీనివాస్ డి ఈ సౌమ్య ఏయ్ ఆదిత్య ఎంపీడీవో జనార్ధన్ తాసిల్దార్ నవీన్ ఎంపీపీ నక్క శంకరయ్య  జడ్పీపిటిసి గోస్కుల జెలెందర్ పిఏసిఎస్ చైర్మన్ సుమన్ రావు తెరాస పార్టీ  అధ్యక్షుడు రమేష్  మార్కెట్ కమిటీ చైర్మన్ లింగారెడ్డి ఉప సర్పంచ్ మారం రాజశేఖర్ మండల అర్జనేజర్ సెక్రటరీ పడల జెలెందర్ జనుప వెంకటేష్   వినోద్ నవీన్  ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు  పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన సదస్సు

 ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన సదస్సు 

పెన్ పవర్,మరిపెడ 

మహబూబుబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండలంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని డాక్టర్ అరుణ దేవి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమాన్నికి ముఖ్య ఉద్దేశం ఆయుష్మాన భారత, నేషనల్ హెల్త్ పోగ్రామ్, ట్రైనింగ్ చేయడం గురించి అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటేశ్వరి, సమ్మయ్య, సునంద,శోభా,సుదర్శన్, వెంకటేశ్వర్లు, సుధాకర్, ఏ నేమ్స్, ఆశాలు తదితరుల పాల్గొన్నారు.

రహదారి విస్తరణ కోసం భూములు కోల్పోతున్నవారికి పరిహారాన్ని చెల్లించాలి

 రహదారి విస్తరణ కోసం భూములు కోల్పోతున్నవారికి  పరిహారాన్ని చెల్లించాలి

కరీంనగర్,పెన్ పవర్

జగిత్యాల నుంచి కోదాడ జాతీయ రహదారి ఎంఎచ్ 563 నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న త్యాగదనులకు కచ్చితమైన పరిహారాన్ని చెల్లించాలని, రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని బీసీ విద్యార్థి సంఘం నాయకులుమంగళవారం రోజునా  కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి  కి వినతి పత్రం సమర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంతలతో ప్రయణయోగ్యంగా లేకుండా ఉన్న  జాతీయ రహదారి పునః నిర్మాణం కోసం ఎన్నో ప్రజా ఉద్యమాల ద్వారా రహదారి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయడం పట్ల ఎంతగానో సంతోషిస్తున్నామనీ, అట్టి రహదారి విస్తరణ నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని, అట్టి రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న త్యాగదనులకు కచ్చితమైన పరిహారాన్ని చెల్లించాలని  అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి లేంకల్ అనిల్, కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జి బోయినపల్లి సాయి చంద్, పట్టణ కన్వీనర్ బీరుపుర్ వివేక్, జిల్లా ఉపాధ్యక్షులు దుబాసి ప్రణీత్, పట్టణ ఉపాధ్యక్షులు శివ కుమార్, అజయ్, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రవణ్, నాయకులు చుక్క సాయి తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...