Followers

చర్లపల్లి డివిజన్ లో వీధి కుక్కలు రెచ్చిపోయి కాటేస్తున్నాయి

 చర్లపల్లి డివిజన్ లో వీధి కుక్కలు రెచ్చిపోయి కాటేస్తున్నాయి...




పెన్ పవర్,  మల్కాజిగిరి

 కుషాయిగూడలో ఒకే రోజు ఓ మహిళ సహా పదవ తరగతి విద్యార్థిని కాటేసిన వీధి కుక్కలు. భయం గుప్పిట డివిజన్ ప్రజలు చర్యలు తీసుకోవడంలో ఉదాసీనత కనబరుస్తున్న వన్యప్రాణి విభాగం అధికారులు. ప్రజాప్రతినిధులు అధికారులు దయచూపండి అన్ని వేడుకున్న వారు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడ పసిపిల్లలపై వీధి కుక్కలు కాటేసిన ఘటనలు మరవక ముందే మారోసారి జరిగింది. కుషాయిగూడ బస్టాండ్ లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణను చూసుకునే గజ్వేల్ నరసమ్మ రోజు మాదిరిగానే గురువారం ఉదయం వచ్చి టాయిలెట్స్ దగ్గర పనులు చూసుకుంటుండగా వీధి కుక్క రెచ్చిపోయి దారుణంగా కరిచింది. శివ సాయి నగర్ కు చెందిన కాసుల సురేష్ కుమారుడు ఈసీఐఎల్ నారాయణ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న కాసుల సృజన్ కుమార్, ఉదయం స్కూల్ కు నడుచుకుంటూ వెళ్తుండగా పోచమ్మ గుడి వద్ద మరో వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఒకే రోజు వీధి కుక్కలు ఇద్దరిపై  దారుణంగా దాడి చేసిన సంఘటనతో స్థానికులు భయాందోళనలకులో నవుతున్నారు. నెల రోజుల వ్యవధిలో శివ సాయి నగర్ కు చెందిన మోక్ష అనే నాలుగేళ్ల చిన్నారి వెంకన్న అనే వ్యక్తిని సోనియా గాంధీ నగర్ చెందిన మహిత అనే పదకొండేళ్ల బాలికను అదేవిధంగా చర్లపల్లి భరత్ నగర్ కు చెందిన నుంజున్ అనే చిన్నారిపై వీధికుక్కలు తెగబడి కాటేసాయి. అయినా  వన్యప్రాణి విభాగం అధికారులు తమకేమి పట్టనట్టుగా చూస్తూ వ్యవహరించడం పట్ల చర్లపల్లి డివిజన్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్ స్పందించి చర్లపల్లి డివిజన్ లో వీధికుక్కల స్వైర విహారం పై దృష్టి సారించి భయాందోళనకు లోనవుతున్న ప్రజలకు అండగా నిలవాలని చర్లపల్లి కాలనీ వాసులు కొరుతున్నారు.

కన్నెపల్లి లోని దాంపూర్ లో వేటగాళ్ల ఉచ్చులో పడి రైతు మృతి

 కన్నెపల్లి లోని దాంపూర్ లో వేటగాళ్ల ఉచ్చులో పడి రైతు మృతి

కన్నెపల్లి, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని దాంపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని పొలాల్లో అటవీ జంతువుల కోసం వేటగాళ్లు వేసిన ఉచ్చుకు ఓ రైతు ప్రాణాలు గాల్లో కలిసాయి.కుటుంబసభ్యులు,పోలీసులు సమాచారం ప్రకారం బుధవారం రాత్రి గ్రామానికి చెందిన రైతులు మేకల శంకర్, నారాయణ ఇద్దరూ కలిసి కట్టెలు అమ్మడానికి ఎడ్లబండిలో విగాం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో వారు దారి తప్పడంతో,ఎడ్ల బండి దిగి దారి వెతుకుతుండగా పత్తి చేను వద్ద వేటగాళ్ళు అమర్చిన కరెంట్ తీగలకు తగిలి శంకర్  అక్కడికక్కడే మృతి చెందాడు.వెంటనే తేరుకున్న నారాయణ గ్రామానికి వెళ్లి గ్రామస్థులకు సమాచారం అందించాడు. తాండూరు సీఐ బాబూరావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.అనంతరం శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉచ్చు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

ఘనంగా మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి పుట్టిన రోజు వెడుకలు

 ఘనంగా మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి పుట్టిన రోజు వెడుకలు

వికారాబాద్ , పెన్ పవర్

పరిగి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి జన్మ దినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హర్ష రెడ్డి మాట్లాడుతూ పరిగి నియోజకవర్గం టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి నా యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ప్రతి ప్రతి టిఆర్ఎస్ కార్యకర్త పరిగి నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేయాలని. హరీశ్వర్ రెడ్డి కోరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని ఇంటికి ఒక్క పథకం చొప్పున లబ్ధి పొందారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ అశోక్ ముందు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఆంజనేయులు, పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుసంజయ్ కుమార్ పై దాడి అమానుషం

 బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుసంజయ్ కుమార్ పై దాడి అమానుషం 

మా గద్దెలు కూలుస్తే మిమ్మల్ని గద్దె దింపుతాం..

నెల్లికుదురు , పెన్ పవర్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర  అధ్యక్షులు బండి సంజయ్ పై దాడికి యత్నించడం అమానుషమని బిజెపి మండల అధ్యక్షుడుకారుపోతుల చంద్రమౌళి గౌడ్ అన్నారు.గురువారంమహుబూబాద్ జిల్లా నెల్లికుదురు మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలోఆయన  మాట్లాడుతూ.. సంజయ్ పై భౌతిక దాడులకు దిగడం సరికాదన్నారు.మతాన్ని విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. మండలంలోని సంధ్యతండాలో కొంత మంది గుర్తుతెలియని దుండగులు  బిజెపిగద్దెను కూల్చడం బాధాకరమన్నారు. తమపార్టీ గద్దెలు కూలుస్తే రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీని గద్దె దింపుతామని హెచ్చరించారు.అగ్రకుల అహంకారంతో సీతారాంపురం సర్పంచ్ భర్త చంద్రారెడ్డి తమ పార్టీ కార్యకర్త తాడూరు సంపత్ పై దాడి చేయడం సిగ్గుచేటన్నారు.టిఆర్ఎస్ పార్టీ తమఎదుగుదలనుచూసి ఓర్వలేక కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తుందని విమర్శించారు.కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని,పార్టీ కార్యకర్తలు మనకు మనకు గా తొందరపడవద్దని సంయమనంగా ఉండాలని సూచించారు.  ఈ సమావేశంలోరత్తిరాంతండఎంపిటిసి గుగులోత్ మదన్ లాల్,జిల్లా కార్యదర్శి నెలకుర్తివెంకట్ రెడ్డి,పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు,పంజాలదేవరాజ్ గౌడ్,ఎడ్ల మహేష్  బీజేవైఎం మండలఅధ్యక్షులు తాళ్లపల్లివాసుగౌడ్,నాయకులు బాదావత్ సురేష్,పాలబిందెల మహేష్,శీలంనరేష్, గుగులోత్ నరేష్ తోపాటు పలువురు పాల్గొన్నారు.

సీపీఐ ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం

 సీపీఐ ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం

మందమర్రి,పెన్ పవర్

పట్టణ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక వేంకటేశ్వర ఆలయం ఏరియాలో గడప గడప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యా వర్గ సభ్యులు భీమనాధుని సుదర్శన్, కౌన్సిల్ సభ్యులు సలెంధ్ర సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం నిర్వహించి విరాళాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు. కాలనీలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పాలకవర్గం లేక సమస్యలను పట్టించుకోవడం లేదని, అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నరని అన్నారు. ప్రజా సమస్యలపై సీపీఐ నిరంతర పోరాటం చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిట్టపల్లి పౌలు, రాయబారపు వెంకన్న,కొల్లూరి నాగరాజు, పేసరి రాజయ్య, రాయబారపు జనార్ధన్, బియ్యాల పద్మ, ఎండి రసూల్, బస్తి వాసులు పాల్గొన్నారు

చిన్న గూడూరు లో కానరాని పారిశుధ్య పనులు..

 చిన్న గూడూరు లో కానరాని పారిశుధ్య పనులు..

పంచాయితీ సెక్రటరీ తీరుపై పలు విమర్శలు..

ప్రజలతో వ్యవహారశైలి సరిగా లేదని సెక్రెటరీపై స్థానికుల ఆరోపణలు..

కలెక్టర్ ఆదేశాలను లెక్క చేయని మండల పంచాయితీ అధికారులు..




చిన్నగూడూరు, పెన్ పవర్

స్థానిక మండల కేంద్రంలోనీ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలను చెత్తరహిత గ్రామాలుగా మార్చాలని ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం చిన్న గూడూరు పంచాయతీ అధికారుల మరియూ పాలకవర్గం నిర్లక్ష్యంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. డంపింగ్ యార్డ్ ఉన్నా పంచాయితీ అధికారుల నిర్లక్ష్యంతో చెత్త తరలించి కృతిమ ఎరువు తయారీ లేదని గ్రామాల్లోని వీధులలో ఎక్కడపడితే అక్కడ చెత్త కనిపిస్తూ అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుందనీ. డంపింగ్ యార్డ్ నిర్మాణం పూర్తయిన చెత్త తరలింపు లో నిర్లక్ష్యం వహిస్తూ పారిశుధ్యం పై దృష్టి సారించాల్సిన సర్పంచ్ మరియూ పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామంలోని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దుర్వాసనతో ప్రజల ఇబ్బందులు..

డంపింగ్ యార్డులను ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించినా గాని సిబ్బంది గ్రామంలో సేకరించిన చెత్తను సరిగా డంపింగ్ యార్థుకు తరలించక పోవడంతో నామ మాత్రపు చెత్త సేకరణతో గ్రామంలోని వీధుల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసనతో దుర్గంధం వెదజల్లుతూ చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. అని మండల కేంద్ర ప్రజలు వాపోతున్నారు. సేకరించిన చెత్తను తడి పొడి చెత్త విడిగా కంపోస్ట్ గా మార్చుకోవాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు ఫలితంగా పరిసర ప్రాంత ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన డంపింగ్ యార్డ్ అలంకారప్రాయంగా మిగిలిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలోని రామాలయం వెనకాల రోడ్డు కనీసం నడవలేని పరిస్థితిలో పిచ్చి మొక్కలు ముళ్ల పొదలు పెరిగి అధ్వాన్నంగా ఉన్నయని ప్రజలు వాపోతున్నారు 

నిరుపయోగంగా చెత్త రిక్షాలు..

గ్రామాల్లో చెత్తను తరలించేందుకు ఏర్పాటుచేసిన చెత్త రిక్షాలు నిరుపయోగంగా పాడై పోతున్నాయి గత ఏడాది పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి పంచాయతీ కి ట్రాక్టర్లను చెత్త తరలించేందుకు పంపిణీ చేసింది. ప్రభుత్వం అయినా గాని పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చెత్త తరలింపులో నిర్లక్ష్యం చేస్తున్నారనీ మండల కేంద్ర ప్రజలు వాపోతున్నారు అంతేకాకుండా వివిధ కాలనీల్లో చెత్తను పంచాయతీ సిబ్బంది తగలబెట్టడంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది ఇలా ఉండగా అకేరు ఒడ్డునే మన ఊరు మన నర్సరీ నిర్మాణం చేపట్టారు గత సంవత్సరం ఆకేరు వాగు ఉప్పొంగి నర్సరీ మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ చిన్న గూడూరు పర్యటనకు వచ్చినప్పుడు పలువురు గ్రామ ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళటంతో అక్కడ నుంచి నర్శరిని వెంటనే తరలించాలని ఎంపీడీవో గారికి పంచాయితీ అధికారులను ఆదేశించారు కానీ కలెక్టర్ ఆదేశాల ను సైతం లెక్క చేయకుండా అంతా ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరు పలువురిని ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి ప్రజలు బహాటంగే చర్చిచుకుంటున్నరు. కొంత మంది ప్రజలు సదరు పంచాయితీ సెక్రటరీ పై మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కి పిర్యాదు చేసినప్పటికీ చర్యలు శూన్యమని గ్రామ పంచాయితీ కార్యాలయానికి వచ్చిన వారితో సదరు పంచాయితీ సెక్రటరీ తన నోటి దురుసు తనంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పారిశుధ్యం పై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

టి ఎస్ ఆర్టీసి కి బడ్జెట్ లో నిదులు కేటాయించిన నందుకు కృతజ్ఞతలు

 టి ఎస్ ఆర్టీసి కి బడ్జెట్ లో నిదులు కేటాయించినందుకు కృతజ్ఞతలు

వికారాబాద్జిల్లా, పెన్ పవర్

 తెలంగాణ బడ్జెట్ లో టి ఎస్ ఆర్టీసి    కి 1500 కోట్లు కేటాయించి అదేవిధంగా మరో1500 కోట్లు పదిహేను వందల కోట్లు బడ్జెటేతరంగా ఇస్తామని చెప్పడం చాలా సంతోషకరమనిదీనికి  ముఖ్యమంత్రి కి తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్  తరపున గౌరవ ముఖ్యమంత్రి కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు  రాష్ట్ర మజ్దూర్ యునియని ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తెలిపాడు  అదేవిధంగా టిఎస్ ఆర్టీసి ని     ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగుల  పిఆర్ సి   తో పాటు ఆర్టీసి వారికి కూడా సమానంగా వేతనాలు ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రకటించాలని ముఖ్యమంత్రి ని ప్రధాన కార్యదర్శి కె హనుమంతు ముదిరాజ్, అధ్యక్షులు సుధాకర్  కోరారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...