Followers

బడ్జెట్ లో విద్యారంగానికి తీరని అన్యాయం

 బడ్జెట్ లో విద్యారంగానికి తీరని అన్యాయం: ఏబీవీపీ



కూకట్ పల్లి, పెన్ పవర్

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యా రంగానికి తీరని అన్యాయం జరిగిందని, అందుకు నిరసనగా శుక్రవారం జవహర్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తీవ్రమైన అన్యాయం జరగడం పట్ల ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతు గతంలో విద్యారంగానికి బడ్జెట్లో పది శాతం నిధులు కేటాయించేవారని, ఆ పది శాతం నిధులు కూడా విద్యారంగాన్ని అభివృద్ధి చేయలేకపోయానని, అలాంటిది ఇప్పుడు కేవలం ఐదు శాతం నిధులు విడుదల చేయడం నిజంగా బాధాకరమని అన్నారు. ఐదు శాతం నిధులు ప్రకటించడంతో విశ్వవిద్యాలయాల అభివృద్ధి పట్ల మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు పడినట్లు అయిందని అన్నారు. ఇప్పటికే విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరగక, కనీస మౌలిక వసతులు లేక, అనేక ఇబ్బందులను విద్యార్థులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే నూతన వసతిగృహాలు, నూతన కోర్సులను ప్రారంభించే ధైర్యం చేయలేక విశ్వవిద్యాలయ అధికారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ఈబడ్జెట్ ద్వారా వచ్చే డబ్బులతో కనీసం అధ్యాపకుల జీతాలకు కూడా సరిపడని పరిస్థితి నెలకొందని అన్నారు.  జగిత్యాల జె.ఎన్.టి.యు, మంథని, సుల్తాన్పూర్ లలో కూడా కనీస అభివృద్ధిని చేయలేని పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వం ఈ బడ్జెట్ పట్ల పునరాలోచించి విశ్వవిద్యాలయాల పట్ల తమ చిత్తశుద్ధిని వ్యక్తం చేసే విధంగా ఏదైనా పథకాన్ని ప్రారంభించి విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాలని, అదే విధంగా తగిన నిధులను కేటాయించి విశ్వవిద్యాలయాలను కాపాడాలని కోరారు. ఈకార్యక్రమంలో విద్యార్థి నాయకులు జవ్వాజి. దిలీప్, చింతకుంట సాయికుమార్, తమిళనాడు జ్యోతి, రుత్విక్, వర్షిత్, రోహిత్, సూర్య, రామకృష్ణ, శివానంద్ తదితరులు పాల్గొన్నారు.

ఆస్తిపన్ను వసూళ్లను ముమ్మరం చేయాలి

 ఆస్తిపన్ను వసూళ్లను ముమ్మరం చేయాలి

విజయనగరం,పెన్ పవర్

 నగరంలో ఆస్తిపన్ను వసూళ్లను ముమ్మరం చేయాలని రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ఎస్ వర్మ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చాంబర్లో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ  పెండింగ్ లో ఉన్న బకాయిలను,మొండి బకాయిలను యుద్ధప్రాతిపదికన వసూలు చేయాలని ఆదేశించారు. ఈ విషయమై ప్రతిరోజు సిబ్బంది నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కచ్చితంగా పన్ను వసూలు చేయాలని అన్నారు. దీనిపై పర్యవేక్షణ బాధ్యతలను ఆయా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు  తీసుకోవాలని చెప్పారు. లేనియెడల సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, సాయి, తదితరులతోపాటు  వార్డు కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.

కేసీఆర్ కి పాలాభిషేకం చేసిన ఎంపీపీ

 కేసీఆర్ కి పాలాభిషేకం చేసిన ఎంపీపీ....

పెన్ పవర్, మేడ్చల్

మెడ్చల్ మండల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద మండలాలకు నిధులు కేటాయించినందుకు గాను స్థానిక ఎంపీపీ పద్మజగన్ రెడ్డి అధ్యక్షతలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ జెడ్పిఛైర్పెర్సన్ మల్లిపెద్ది శరత్ చంద్ర రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి చేయుటకు కేసీఆర్ విడుదల చేసిన నిధులకు గాను అన్ని గ్రామాల్లో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేసుకోవచ్చని, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గా తీర్చిదిద్దే విధంగా నిధులు కేటాయించారని సంతోషం వెక్తంచేశారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో ఎంపిటిసి, గోపని వెంకటేష్, రఘు , ప్రకాష్ , హేమలత , అంకిత రావి మరియు కో ఆప్షన్ మెంబెర్ రుక్సానా పాషా , టిఆర్ఎస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని..కోలగట్ల వీరభద్రస్వామి

 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని..కోలగట్ల వీరభద్రస్వామి

విజయనగరం,పెన్ పవర్ 

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని స్థానిక శాసనసభ్యులు, ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. శుక్రవారం 7వ వార్డులో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఆయన పర్యటించారు. స్థానిక వార్డు సభ్యులు పొంతపల్లి మాలతి, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి  దాసన్నపేట లోని యాత వీధిలో ఆయన పర్యటించారు. ఆ ప్రాంతంలో ప్రధాన సమస్య గా ఉన్న పైప్ లైన్లు,  రహదారుల సమస్యపై స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు. అలాగే స్థానికంగా ఉన్న మరుగుదొడ్ల సమస్య పై స్థానికులు విన్నవించారు. వాటి పరిష్కారానికి వేనువెంటనే కోలగట్ల సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ద్యేయంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

ఎన్నికల అనంతరం కూడా వార్డుల్లో పర్యటించి స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు.  సమస్యలను స్థానిక నాయకులకు, వార్డు సభ్యులకు వివరించి అవి పరిష్కారం అయ్యే విధంగా చూడాలని స్థానికులకు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు  కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దడమే తమ అభిమతమని అన్నారు. దాసన్నపేట లో ఎంతోకాలంగా నీటి ఎద్దడి ఉండేదని తమ హయాంలో వాటర్ ట్యాంక్ నిర్మించి ప్రజల నీటి కష్టాలు తీర్చామన్నారు. వేసవిలో కూడా నీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఏడవ వార్డు సభ్యురాలు మాలతీ మాట్లాడుతూ  తనను  కార్పొరేటర్ గా  ఎన్నుకున్న ప్రజలకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి గారి నేతృత్వంలో వార్డులలో సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.  ప్రజలకు ఏ అవసరం ఉన్నా నేరుగా తమ వద్దకు వచ్చి విన్నవించుకోవచ్చని అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు సంఘంరెడ్డి బంగారు నాయుడు స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు కోరాడ సూర్య ప్రభావతి,బోడసింగి ఈశ్వరరావు, పొంతపల్లి గోపి, నగరపాలక సంస్థ డిఈ అప్పారావు,పారిశుద్ధ్య పర్యవేక్షకులు,తదితరులు పాల్గొన్నారు.

యునైటెడ్ వే ఆప్ కోచింగ్ సెంటర్ ప్రారంభం

 యునైటెడ్ వే ఆప్ కోచింగ్ సెంటర్ ప్రారంభం

కూకట్ పల్లి, పెన్ పవర్

శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయశంకర్ నగర్ లో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ కోచింగ్ సెంటర్ ను డివిజన్ కార్పొరేటర్  దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్విన్ కాలనీ డివిజన్ లో పేద పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ద్వారా తర్పిదు నివడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈశిక్షణ భవిష్యత్తులో వారికి వారి కుటుంబాలకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. పేద విద్యార్థులకు ఇలాంటి ఉచిత కోర్సులు అందజేయడానికి ముందుకు వచ్చిన యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ శ్రీచందన (సేల్ ఫోర్స్), కిరణ్మయి పెండ్యాల బోర్డ్ మెంబర్,  సీనియర్ మేనేజర్ భూషణ్, ప్రితిక మరియు సెంటర్ ఇంచార్జి కందూరు రాములుని ఆయన అభినందించారు. ఈసంస్థకు ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అతిథులకు బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో నాయకులు బోయ కిషన్, జర్నలిస్ట్ కరీమ్, డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్, వార్డు మెంబర్ కాశీనాధ్ యాదవ్, ఏరియా కమిటీ మెంబర్ శౌకత్ అలీ మున్న, గుడ్ల శ్రీనివాస్, కటిక రవి, యాదగిరి, మహేష్, దేవేందర్, భాస్కర్, సాయి గౌడ్, ప్రకాష్ మరియు సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్మ్ హౌజ్ కాదు అధికార నివాసం

 ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్మ్ హౌజ్ కాదు అధికార నివాసం...ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల నియంవాలి ఉల్లగించరు ..

ఓటర్లను ప్రభావితం చేసే విధంగా పీ ఆర్ సి లీక్ ఇవ్వడం పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల కమిషన్ నోటీస్ లు ఇవ్వాలి..

ఎన్నికల ఫలితాలు ఎవరి పక్షగంలో వచ్చిన రద్దు అవుతుంది

పెన్పవర్,  జగిత్యాల

29% శాతం పీ ఆర్ సి ప్రకటిస్తామని లీక్ ఇచ్చారు. ఎవరు గెలిచినా ఈ ఎన్నిక చెల్లదు...ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించి, ప్రగతి భవన్ లో ఉద్యోగసంఘాలతో పిఆర్సీపై చర్చించి, ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఈ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని ప్టటభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పట్టభద్రులను ప్రభావితం చేసి, ఎన్నికల సమయంలో పిఆర్సీపై ప్రకటన చేయడం ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదా అన్నారు. అంతేకాకుండా సిఎం కెసిఆర్ అవినీతి, నల్లధనాన్ని వెలికితీయనంతవరకు ఏ ఎన్నికలైనా ఇతరులు ఎవరూ గెలవలేరన్నది నగ్న సత్యం.  ఈ ఎన్నికలు బిజెపి కి ఇది గుణపాఠం కావాలి, వారు కెసిఆర్ అవినీతిపై ప్రకటనలు క్లేం ప్రగల్బాలేనన్నారు. శుక్రవారం ఆయన తన తన నివాసగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.  మాట్లాడారు.

దూలపల్లి అడవిలో భారీ అగ్ని ప్రమాదం

 దూలపల్లి అడవిలో భారీ అగ్ని ప్రమాదం

ఎగిసిపడిన మంటలు సుమారు 15 ఎకరాల అడవి దగ్ధం అయినట్టు అంచనా

కాలీపోయిన వెదురు పొదలు రక్షణ చర్యలు చేపడతామన్న మేడ్చల్ జిల్లా డిఎఫ్ఓ వెంకటేశ్వర్లు

కొంపల్లి మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్లతో నీటి సరపరా చేసి మంటలు ఆర్పారు

జీడిమెట్ల ఫైర్ ఇంజన్లతో సిబ్బంది సకాలంలో స్పందించారు డిఎఫ్ఓ

ఆకతాయిలు చేసి ఉంటారని భావిస్తున్న అటవీశాఖ అధికారులు

అసాంఘీక కార్యకలాపాలకు నిలయంగా సంభందిత ఫారెస్ట్

విచ్చల విడిగా ఖాళీ మద్యం బాటిళ్ళు అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం

ఇకమీదట అడవిలోకి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు:ఎఫ్ఆర్ఓ శ్రీదేవి

కుత్బుల్లాపూర్,పెన్ పవర్

హైదరాబాదు శివారులో ఉన్న దూలపల్లి ఫారెస్ట్ అకాడమిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. ప్రమాదానికి కారణం ఆకతాయిల పనే అయిఉంటుందని భావించిన అధికారులు..కావాలనే నిప్పు అంటించి ఉంటారని అటవీశాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఈ అటవీ ప్రాంతం కొంపల్లికి వెళ్ళే రహదారి ప్రక్కనే ఉండడంతో.. బహిరంగంగా మధ్యం సేవించే వారు మధ్యం సేవించి అనంతరం ఈప్రమాదానికి కారణం కావచ్చని అటవీ అధికారులు భావిస్తున్నారు.. మైసమ్మగూడాలోని కళాశాల విద్యార్థులు కూడా అయి ఉండవచ్చని.. పలుమార్లు విద్యార్ధులను పట్టుకొని కౌన్సింగ్ కూడా ఇచ్చామని.. దూలపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారిని శ్రీదేవి తెలిపారు..అగ్ని ప్రమాదంలో సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయని డిఎఫ్ఓ వెంకటేశ్వర్లు, దూలపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారిని శ్రీదేవి తెలిపారు.. కొంపల్లి మున్సిపల్ కమీషనర్ రఘు,మున్సిపల్ చైర్మెన్ శ్రీశైలం యాదవ్, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.. గండిమైసమ్మ దుండిగల్ మండల రెవెన్యూ అధికారులు ఆర్ఐ శణ్ముఖం, విఆర్ఓ రజిత అగ్ని ప్రమాదం సంభవించిన స్థలానికి వచ్చి పరిశీలించి పంచనామ చేశారు.. సంఘటనపై తహసీల్దారు భూపాల్ కు రిపోర్ట్ చేస్తామని ఆర్ఐ షణ్ముఖం తెలిపారు.

అసాంగీక కార్యకలాపాలకు ఆనవాళ్లు మధ్యం బాటిళ్లు అగ్ని ప్రమాదం సంభవించిన ఈప్రాంతంలో పెన్సింగ్ రక్షణ లేక పోవడంతోనే ఆకతాయిలకు ఈప్రదేశం అడ్డాగా మారిందని పలువురు అబిప్రాయం తెలియజేస్తున్నారు.ఈ ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.. నగర శివారులోని అడవుల సుందరీకరణ, రక్షణ చర్యలలో భాగంగా ఇప్పటికే బహుదూర్ పల్లి, దూలపల్లి, బౌరంపేట వద్ద ఇనుప జాలి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు.. అటవీ లోపల నడక మార్గాలను కూడా సుందరీకరణగా తీర్చి దిద్దుతున్నామని, ఈప్రాంతంలో విచ్చలవిడిగా మధ్యం సేవిస్తున్నట్లు మధ్యం బాటిళ్ళు పడేసి ఉన్నాయని, అధికారుల పర్యవేక్షణ రోజంతా ఉన్నప్పటికీ రాత్రి సమయంలో మధ్యం సేవిస్తున్నట్లు అటవీప్రాంతం ప్రమాద స్థలంలో ఉన్న ఆదారాలు చెపుతున్నాయి.. వీటన్నింటికి చెక్ పెట్టడానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటామని డిఎఫ్ఓ వెంకటేశ్వర్లు తెలిపారు.

వేసవి ప్రారంభం కావడంతో ఎండు ఆకులతో అటవీప్రాంతం నిండి ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించి చెట్లు దహనం అయ్యాయని..అటవీ సిబ్బంది సమాచారంతో సంఘటనా స్థలానికి కొంపల్లి మున్సిపల్ సిబ్బంది సకాలంలో స్పందించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరపరా చేసి మంటలను అదుపులోకి తేవడంలో మున్సిపల్ సిబ్బంది తీవ్ర కృషి చేశారని అటవీ అధికారులు తెలిపారు.. పైర్ సిబ్బంది కూడా సహకరించారని, మంటలను అదుపులోకి తెచ్చారని అటవీ అధికారులు అన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...