Followers

జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ లో భాగంగా దోమతెరలు పంపిణీ

జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ లో భాగంగా దోమతెరలు పంపిణీ

 గోకవరం,పెన్ పవర్

గోకవరం మండలం, కామరాజుపేట గ్రామంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం లో భాగంగా గ్రామ సర్పంచ్ అడపా వెంకటరావు  చేతుల మీదుగా ప్రజలకు దోమ తెరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజమండ్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ సిహెచ్. శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఎంతో ఖరిదైన, నాణ్యమైన మందుపూసిన దోమ తెరలు ప్రభుత్వం ద్వారా ఉచితంగా ప్రజలకు ఇస్తున్నాము అని, వాటిని ఎలా వాడుకోవాలో వివరించి చెప్పినారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ వార్డు సభ్యులు శ్రీమతి కటారి వీరమణి , కర్రి శ్రీను ప్రజా నాయకులు గోంతిన అర్జున  జి. కొతపల్లి పి.హెచ్.సి ఎం పి హెచ్ వో వైస్ రాయుడు, సూపర్వైజర్ వై. అరుణమ్మ,  రేఖ, హెల్త్ అసిస్టెంట్ లు అప్పారావు, శ్రీనివాస్, రాజు, మస్తాన్, ఏఎన్ఎం లు ఎస్ కె మణి, శాంతకుమారి, ఆశ లు, శివపార్వతి,   జ్యోతి, బాపిలక్ష్మి, మీనాకుమారి మరియు ప్రజలు పాల్గొన్నారు.

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పని సరి

 ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పని సరి...

వృత్తి నిబద్ధతకు మారుపేరు రామలింగారెడ్డి..ఎమ్మెల్యే వివేకానంద..


కుత్బుల్లాపూర్, పెన్ పవర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీ మేదిని రామలింగారెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి శుక్రవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ వృత్తి నిబద్ధతకు మారుపేరు రామలింగారెడ్డి అని, ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పని సరని అన్నారు. 23 ఏళ్లుగా విద్యాపరంగా రామలింగారెడ్డి ఎన్నో సేవలు అందించారని, ఎంతో మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన ఘనత వారికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆంజనేయులు, ప్రధానోపాధ్యాయులు ఖాజా పాశ, ఉపాధ్యాయులు లక్ష్మయ్య, రామ్మోహన్ రెడ్డి, విజయ రాణి, దానయ్య, గోపాల్, శ్రీనివాస్, స్థానిక వార్డు సభ్యులు ఇందిర రెడ్డి, నాగ శేఖర్ గౌడ్, పెద్ది మల్లేశం, యేసు తదితరులు పాల్గొన్నారు.

అట్టాడ అప్పలనాయుడు కి పతంజలి పురస్కారం భీశెట్టి

అట్టాడ అప్పలనాయుడు కి పతంజలి పురస్కారం భీశెట్టి

విజయనగరం,పెన్ పవర్

సీనియర్ పాత్రికేయుడు  ఆధునిక తెలుగు సాహితీరంగాన్ని మెరిపించి,మురిపించిన స్వర్గీయ కాకర్లపూడి నరసింహ యోగ పతంజలి(కే.ఎన్. వై.పతంజలి) 69వ జయంతి సందర్భంగా ఈ నెల 29 న జామి మండలం అట్టాడ బి.ఎన్. ఆర్.అశ్రమం లో నిర్వహించే సభలో ప్రముఖ రచయిత, పాత్రికేయుడు అట్టాడ అప్పలనాయుడు కి పతంజలి పేరున పురస్కారం అందచెయ్యడం జరుగుతుందని కె.ఎన్.వై.పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ప్రకటించారు శుక్రవారం గురజాడ అప్పారావు గృహంలో విలేకరులతో మాట్లాడుతూ తమ సంస్థ ప్రతి సంవత్సరం పతంజలి పేరుతో ప్రముఖులకు పురస్కారం అందచేస్తుందని గత సంవత్సరం కరోనా వలన పురస్కారం అందించ లేకపోయామని ఈ సంవత్సరం విజయనగరం జిల్లా వాసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచిరచయతగా పేరుతెచ్చుకున్న అభ్యుదయ రచయిత అనేక కథలు,నవలలు రాస్తూ సమకాలీన సమస్యలు పై ఎప్పటికప్పుడు పత్రికల్లో  స్పందించే అట్టాడ అప్పలనాయుడు ని కమిటీ ఎంపిక చేసిందని భీశెట్టి తెలిపారు గతంలో పతంజలి పేరున దేవిప్రియ,మోహన్,జి.ఆర్.మహర్షి,సతీష్ చందర్,చింతికింది శ్రీనివాస్   లకు పురస్కారాలు అందించామని 29 సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమంలో సాహిత్య అభిమానులు, పతంజలి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు,ఈ సమావేశంలో పతంజలి సాంస్కృతిక వేదిక కార్యదర్శి ఎన్.కె.బాబు,ప్రతినిధులు బండ్లమూడి నాగేంద్రప్రసాద్,వాడ్రేవు శ్రీనివాసరావు(కోరుకొండ బుజ్జి) తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల ముందు ప్రచారంలకు పాలుపడితే ఊరుకునేది లేదు

 ప్రభుత్వ పాఠశాలల ముందు ప్రచారంలకు పాలుపడితే ఊరుకునేది లేదు...

పెన్ పవర్, మేడ్చల్

 మేడ్చల్ మండలంలోని నూతనకల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఢిల్లీ వరల్డ్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఫ్లేక్సీలు ఎలాంటి  అనుమతులు లేకుండా పెట్టడంతో శుక్రవారం ఉదయం పాఠశాలను సందర్శించిన ఎస్ఎంసి చైర్మన్ వెంకట్ రెడ్డి ఫ్లెక్సీలు చూసి ప్రధానోపాధ్యాయులు గౌరీశంకర్ ఆధ్వర్యంలో తొలగించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల ముందు ఇతర  ప్రైవేటు పాఠశాలలకు సంబంధించినటువంటి ప్రచారాలకు పాల్పడితే సహించేది లేదని ప్రాథమిక పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ వెంకట్ రెడ్డి వాపోయారు.

స్థానిక సుజాత కన్వెన్షన్ హాల్లో అభినందన పూర్వక కార్యక్రమం

 స్థానిక సుజాత కన్వెన్షన్ హాల్లో అభినందన పూర్వక కార్యక్రమం

విజయనగరం,పెన్ పవర్

నగరపాలక సంస్థ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక సుజాత కన్వెన్షన్ హాల్లో అభినందన పూర్వక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎస్ ఎస్ వర్మ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రకారం ప్రతి ఒక్కరూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా కచ్చితమైన ఏర్పాట్లు చేసేందుకు కృషి చేసిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా పత్రిక మరియు మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నగరపాలక సంస్థ  సహాయ కమిషనర్ ప్రసాదరావు మాట్లాడుతూ  కమిషనర్ పద నిర్దేశనం లో సిబ్బందంతా చేసిన కృషి  మరువలేనిదన్నారు. ఇదే ఒరవడితో మున్ముందు మరిన్ని విజయాలు సాధించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన తహసిల్దార్ ప్రభాకర్రావు మాట్లాడుతూ ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ సలహాలు, సూచనలతో నగర పాలక సంస్థ అధికారులు చేసిన కృషి శ్లాఘనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిబ్బంది, వార్డు కార్యదర్శులు,  పత్రిక మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

బడ్జెట్ లో విద్యారంగానికి తీరని అన్యాయం

 బడ్జెట్ లో విద్యారంగానికి తీరని అన్యాయం: ఏబీవీపీ



కూకట్ పల్లి, పెన్ పవర్

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యా రంగానికి తీరని అన్యాయం జరిగిందని, అందుకు నిరసనగా శుక్రవారం జవహర్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తీవ్రమైన అన్యాయం జరగడం పట్ల ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతు గతంలో విద్యారంగానికి బడ్జెట్లో పది శాతం నిధులు కేటాయించేవారని, ఆ పది శాతం నిధులు కూడా విద్యారంగాన్ని అభివృద్ధి చేయలేకపోయానని, అలాంటిది ఇప్పుడు కేవలం ఐదు శాతం నిధులు విడుదల చేయడం నిజంగా బాధాకరమని అన్నారు. ఐదు శాతం నిధులు ప్రకటించడంతో విశ్వవిద్యాలయాల అభివృద్ధి పట్ల మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు పడినట్లు అయిందని అన్నారు. ఇప్పటికే విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరగక, కనీస మౌలిక వసతులు లేక, అనేక ఇబ్బందులను విద్యార్థులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే నూతన వసతిగృహాలు, నూతన కోర్సులను ప్రారంభించే ధైర్యం చేయలేక విశ్వవిద్యాలయ అధికారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ఈబడ్జెట్ ద్వారా వచ్చే డబ్బులతో కనీసం అధ్యాపకుల జీతాలకు కూడా సరిపడని పరిస్థితి నెలకొందని అన్నారు.  జగిత్యాల జె.ఎన్.టి.యు, మంథని, సుల్తాన్పూర్ లలో కూడా కనీస అభివృద్ధిని చేయలేని పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వం ఈ బడ్జెట్ పట్ల పునరాలోచించి విశ్వవిద్యాలయాల పట్ల తమ చిత్తశుద్ధిని వ్యక్తం చేసే విధంగా ఏదైనా పథకాన్ని ప్రారంభించి విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాలని, అదే విధంగా తగిన నిధులను కేటాయించి విశ్వవిద్యాలయాలను కాపాడాలని కోరారు. ఈకార్యక్రమంలో విద్యార్థి నాయకులు జవ్వాజి. దిలీప్, చింతకుంట సాయికుమార్, తమిళనాడు జ్యోతి, రుత్విక్, వర్షిత్, రోహిత్, సూర్య, రామకృష్ణ, శివానంద్ తదితరులు పాల్గొన్నారు.

ఆస్తిపన్ను వసూళ్లను ముమ్మరం చేయాలి

 ఆస్తిపన్ను వసూళ్లను ముమ్మరం చేయాలి

విజయనగరం,పెన్ పవర్

 నగరంలో ఆస్తిపన్ను వసూళ్లను ముమ్మరం చేయాలని రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ఎస్ వర్మ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చాంబర్లో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ  పెండింగ్ లో ఉన్న బకాయిలను,మొండి బకాయిలను యుద్ధప్రాతిపదికన వసూలు చేయాలని ఆదేశించారు. ఈ విషయమై ప్రతిరోజు సిబ్బంది నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కచ్చితంగా పన్ను వసూలు చేయాలని అన్నారు. దీనిపై పర్యవేక్షణ బాధ్యతలను ఆయా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు  తీసుకోవాలని చెప్పారు. లేనియెడల సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, సాయి, తదితరులతోపాటు  వార్డు కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...