Followers

బాధితుల కుటుంబాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది

 బాధితుల కుటుంబాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది

ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్

చిన్నగూడూరు,  పెన్ పవర్

చిన్నగూడూరు.స్థానిక మండల కేంద్ర లోని  పగిడిపల్లి గ్రామానికి చెందిన జర్నలిస్ట్ కుటుంబ సభ్యులైన భూపతి బాలమల్లు,గంధసిరి వెంకటమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ శుక్రవారం వారిని పరామర్శించడం జరిగింది.భాదిత కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.అదే విధంగా కొద్ది రోజుల క్రితమే ఇదే గ్రామానికి చెందిన దేశగాని యాదగిరి అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను  పరామర్శించి ఓదార్చి, మనోధైర్యాన్ని ఎమ్మెల్యే కల్పించారు. ఈ పరామర్శలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మూల మురళీధర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు గంధసిరి వెంకన్న, మండల కో ఆప్షన్ సభ్యులు మీర్జా మోసిన్ బేగ్, సర్పంచ్ భానోతు శీరిషామంగీలాల్, గ్రామ పార్టీ అధ్యక్షుడు చేగోణి రవింధర్ జర్నలిస్టుల గంధసిరి శ్రీపాల్, భూపతి కాశయ్య గౌడ్,  గంగన్న, వెంకటయ్య, వెంకట్ రెడ్డి, ఉప్పలయ్య, తదితరులు ఉన్నారు.

అగ్నికి ఆహుతి అయిన మొక్కజొన్న పంట

 అగ్నికి ఆహుతి అయిన మొక్కజొన్న పంట 





పెన్ పవర్,  బయ్యారం

 మహబూబాబాద్ జిల్లా బయ్యారం  మండలం లోని జగత్ రావు పేట గ్రామ పంచాయతీ పరిధిలో బోటి మీది తండా గ్రామం మొక్కజొన్న చేనులు నిప్పు పడి కాలిపోవడం జరిగింది మాలోతు రఘు ఎకరం నర 1.20 మరొక రైతు బానోతు రంగయ్య ఎకరం నర1.20 ఎలా కాలిపోయిందని అడిగి తెలుసుకోవడం జరిగింది కష్టపడి పంట అగ్నికి ఆహుతి ఇవ్వడం తో కుటుంబసభ్యులు బంధుమిత్రుల రోదనలు ఆకాశాన్నంటాయి.

ఆత్మ బలిదానం చేసుకున్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధికి నివాళులు

 ఆత్మ బలిదానం చేసుకున్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధికి నివాళులు


కూకట్ పల్లి, పెన్ పవర్ 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమొస్తే ఉద్యోగాలు, ఉపాధి వస్తుందని 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రై ఏడూ సంవత్సరాలు అవుతున్నా ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదనే ఆవేదనతో కాకతీయ విశ్వవిద్యాలయంలో మార్చి 26వ తేదీన పురుగుల మందు తాగిన కేయూ విద్యార్థి బోడ సునీల్ నాయక్ చికిత్స పొందుతూ నిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ శుక్రవారం  జేఎన్టీయూహెచ్ మెయిన్ గేట్ దగ్గర జెఎన్టియుహెచ్ బంజారా విద్యార్థి సంఘం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ బోడా సునీల్ నాయక్ ఫోటోకి నివాళులు అర్పించి, ఆత్మ శాంతి కలగాలని దేవుని ప్రార్ధించారు. అనంతరం వారు మాట్లాడుతూ సునీల్ నాయక్ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్సగ్రెసియా మరియు ఒక ఉద్యోగం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలను తక్షణమే ప్రారంభించాలని కోరుతూ ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులులను ప్రభుత్వం ఆదుకోవాలని, రాష్ట్రంలో అన్ని యూనివర్శీటీలను ప్రారంభించి విద్యాసంస్థలలో కోవిడ్ -19 నిబంధనలు అమలు చేస్తూ, కరోన నివారణ చర్యలకు నిధులను  కేటాయించాలని కోరారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని ఈసందర్భంగా డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో  బంజారా విద్యార్థి సంగం అధ్యక్షుడు లకవత్ భాను ప్రకాష్ , ఎస్.ఎఫ్.ఐ నాయకుడు సాయి కిరణ్, కూకట్ పల్లి ఎస్ఎఫ్ఐ సెక్రెటరీ రాజేష్ చౌహాన్, బంజారా సంగం వర్కింగ్ ప్రెసిడెంట్ పత్లోత్ రాజు నాయక్, విజేందర్ నాయక్, అబినాష్, సునీల్ నాయక్, అనిల్, ప్రేమ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.

ఏకశిలా రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుబాష్ రెడ్డి

 ఏకశిలా రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుబాష్ రెడ్డి

వినుయోగదారులకు నాణ్యమైన ఆహరం, సరసమైన ధరలకు అందించాలి - ఎమ్మెల్యే

ఇసిఐఎల్ లో పసందైన రాయలసీమ రుచులు


పెన్ పవర్,  మల్కాజిగిరి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ నియోజకవర్గం  చర్లపల్లి  డివిజన్  ఈసీఐఎల్ చౌరస్తా లో  శుక్రవారం ఏకశిలా మల్టీ క్యూషన్ రెస్టారెంట్(రాయలసీమ రుచులు), బంక్విట్ హాల్ ను ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డ, మాజీ పార్లమెంట్ సభ్యులు సముద్రాల వేణుగోపాలచారి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప్పల్ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి మాట్లాడుతూ  నాణ్యమైన ఆహారం సరసమైన ధరలకు అందించి ప్రజల మెప్పు పొందాలని ఆకాంక్షించారు.  ఏకశిలా రెస్టారెంట్ యజమాని బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రీతి లోకేష్ రెడ్డి లు మాట్లాడుతూ ఈసీఐఎల్ ప్రజలకు పసందైన రాయలసీమ రుచులకు ఏకశిలా రెస్టారెంట్ లో రాగిముద్ద, నాటుకోడి పులుసు, తలకాయ మాంసం, పాయ మొదలగు ప్రత్యేక రాయలసీమ వంటకాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్ర రెడ్డి, కాప్రా సర్కిల్ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి రామ్మోహన్, జెర్రీ పోతుల  ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, సింగిరెడ్డి దన్ పాల్ రెడ్డి, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, పాజ్జురి పావని మణిపాల్ రెడ్డి, టిఆర్ఎస్  సీనియర్ నాయకుడు బండారి లక్ష్మారెడ్డి, సోలిస్ ఆస్పత్రి యజమాని రామాంజనేయులు, నాయకులు కాసం మహిపాల్ రెడ్డి, బైరి రామ్ చందర్ గౌడ్, కొత్త అంజిరెడ్డి, బేతాళ బాల రాజు, నేమురీ మహేష్ గౌడ్,  జోనడ్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేములవాడ లో విజృంభిస్తున్న కరోనా

 వేములవాడ లో  విజృంభిస్తున్న కరోనా...

 ఒక్కరోజు  32 కేసులు నమోదు...

వేములవాడ, పెన్ పవర్

వేములవాడలో రోజు రోజుకు  కరోనా విజృంభిస్తుంది. కరోనా సెకండ్ వెవ్  వేగంగా వ్యాప్తి చెందుతోంది. వేములవాడ ప్రాథమిక అరోగ్య కేంద్రం పరిధిలో శుక్రవారం 203 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 32 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని  మండల వైద్యాధికారి మహేష్ రావు తెలిపారు. వేములవాడ మండల పరిధిలోని మల్లారం గ్రామంలోనే 21 మందికి కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ఒక్కసారిగా గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. రోజు రోజుకు  పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో పట్టణంతో పాటు చుట్టూ గ్రామాల  ప్రజల భయబ్రాంతులకు లోనవుతున్నారు. తాజాగా  మల్లారం గ్రామంలో 21, జయరమ్ గ్రామంలో రెండు, మర్రిపల్లి గ్రామంలో ఒకటి, పట్టణంలోని సుబ్రహ్మణ్య నగర్ ఒకటి,  గుర్రంవానిపల్లి మూడు,  పార్వతీపురం లో ఒకటి, సుబ్రహ్మణ్యంనగర్ లో ఒకటి, గాంధీ నగర్ లో ఒకటి,  మార్కెట్ ఏరియా లో ఒకటి , రామ్ మందిర్ వీధిలో ఒకటిగా  కేసులు నమోదైనట్టు స్పష్టం చేశారు. రోజురోజుకు కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భౌతిక దూరం పాటించాలని, మాస్కూలు ధరించాలని  వైద్యాధికారులు, పోలీస్ అధికారులు ప్రతి రోజు హెచ్చరిస్తున్నా కూడా ప్రజలు నిబందలు పాటించకపోవడం వల్లనే కేసుల సంఖ్య అధిమవుతోంది. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండి వైరస్ ప్రబలకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

కిటకిటలాడిన రాజన్న ఆలయం

 కిటకిటలాడిన రాజన్న ఆలయం..



వేములవాడ, పెన్ పవర్

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం శివ కళ్యాణ మహోత్సవాల సందర్భంగా కిటకిటలాడింది. హరిహరి నామ స్మరణతో మార్మోగింది. శుక్రవారం తెల్లవారుజాము  నుంచి ఆలయంలో భక్తుల  సందడి కనిపించింది.రాజన్నకు కోడే  మొక్కు చెల్లించుకున్న భక్తులు ...అంతర ఆలయంలోని స్వామి వార్లను,అమ్మవారిని దర్శించుకుని తరించారు. రాజన్నను దర్శించుకున్న డిఎస్పి దేవారెడ్డి దంపతులు. వేములవాడ శ్రీ  పార్వతి రాజరాజేశ్వర స్వామిని శుక్రవారం డిఎస్పి దేవారెడ్డి దంపతులు దర్శించుకున్నారు.అంతర ఆలయంలోని స్వామివార్లకు, అమ్మవారికి ప్రత్యేక పూజలను చేసుకొని సేవించారు. నాగిరెడ్డి మండపంలో దేవారెడ్డి దంపతులను అర్చక స్వాములు  ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

 ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం - మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు

లక్షెట్టిపెట్, పెన్ పవర్

ప్రజా సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం హజీపూర్ మండలంలోనీ టికన్నపల్లి గ్రామం నుండీ పెద్దంపేట్ గ్రామం వరకు ఆర్ అండ్ బీ నిధులు నుండీ కోటి 23లక్షల రూపాయల వ్యయంతో రోడ్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసిఆర్ అధ్వర్యంలో గ్రామల అభివృద్ధికీ ఏ రాష్ట్రంలో లేని విధంగా పెద్దపీట వేస్తూ అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తుందన్నారు.గ్రామ స్వరాజ్యం కొరకు గాంధీజి కన్న కలలను ముఖ్యమంత్రి కేసిఆర్ నిజం చేస్తున్నారనీ గుర్తుచేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చెందాలన్నా ఉద్ద్యేశాంతో గ్రామాల్లో చెత్తను సేకరించేందుకు ట్రాక్టర్, ట్రాలీ, అలాగే పల్లే ప్రకృతి వనలు, డంపింగ్ యార్డ్లు, వైకుంఠ దామలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ దేనాని కొనియాడారు. గత ఫిబ్రవరి ఈ నెలలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు భట్టి విక్రమార్క తమ పర్యటనలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి నీరు వచ్చి చేరుతుందని అబద్ధపు మాటలు మాట్లాడారన్నారు. దిగువలో ఉన్న మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు లోకి నీరు వచ్చి చేరుతుంటే  అబద్ధాల మాటలు చెబుతూ కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, బాధతో ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు గురించి మాట్లాడడం జరిగిందన్నారు. అనంతరం హాజీపూర్ పల్లె పకృతి వనంను,నర్సరీని పరిశీలించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45సంవత్సరాలు నిండిన వారికి  కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందపల్లి స్వర్ణలత శ్రీనివాస్,వైస్ ఎంపీపీ బెతూ రమాదేవి రవి, తెరాస పార్టీ మండల అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, సర్పంచ్ మల్లేశ్వరి దుర్గయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పూస్కూరి శ్రీనివాస్ రావు, పీఏసీఏస్ చైర్మన్ లు ఆయా గ్రామాల సర్పంచులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...