Followers

వైజాగ్ ఫిల్మ్ సొసైటీ గౌరవ అద్యక్షునిగా ఎన్.ఏ.డి.పాల్

 వైజాగ్ ఫిల్మ్ సొసైటీ గౌరవ అద్యక్షునిగా ఎన్.ఏ.డి.పాల్ 

మహారాణి పేట, పెన్ పవర్

ఇటీవల ఏ.యు హెచ్.ఆర్.డి. సెంటర్ సంచాలకులు గా నియమితులైన అచార్య పాల్  వైజాగ్ ఫిల్మ్ సొసైటీ( వి.ఎఫ్.ఏస్) గౌరవ అధ్యక్షులుగా నియమితులయ్యరు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఏ.యు, హెచ్.ఆర్.డి సెంటర్ లో కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేసి వైజాగ్ ఫిల్మ్ సొసైటీ సభ్యులు పాల్ ను కలసి అబినందనలు తెలిపారు. పాల్ మాట్లాడుతూ  సొసైటీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. సొసైటీ ద్వారా మంచి సినిమాలు ప్రదర్శించడంతో పాటు చిత్ర పరిశ్రమ ప్రగతికి సమంతర సినిమాలు నిర్మాణాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ఎయు విసి  ప్రధాన పొషకులుగా  వ్యవహరిస్తున్నరు. పాల్ ను కలిసిని వారిలో నరవ ప్రకాశరావు, పివి.రమణ,జి.సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.

స్టీల్ ప్లాంట్ కు సొంత ఘనులు కేటాయించాలి... ఐ.ఎన్.టి.యు.సి

 స్టీల్ ప్లాంట్ కు సొంత ఘనులు కేటాయించాలి... ఐ.ఎన్.టి.యు.సి

మహారాణి పేట, పెన్ పవర్

ఎంతో మందికి  ఉపాధి కల్పిస్తున్న  విశాఖ  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని  ఐ.ఎన్.టి.యు.సి నేత మంత్రి రాజశేఖర్ పేర్కొన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆదివారం సాయంత్రం ఆర్కే బీచ్ లో ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.వి.జె.ఎఫ్. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే కేంద్రంపై పెద్దఎత్తున ఉద్యమించ నున్నట్లు పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వ సంస్థలను కొంతమంది పారిశ్రామికవేత్తల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రైవేటీకరణ చేస్తే బిజెపి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని  హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత కన్నుల్లో కేటాయించాలన్నారు ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఐ.ఎన్.టి.యు.సి నేతలు మస్తాన్ రావు,పైడ్రాజు,నాగభూషణం,రామారావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు.

వైల్డ్ డాగ్ చిత్రం విజయోత్సవ వేడుకలు

వైల్డ్ డాగ్ చిత్రం విజయోత్సవ వేడుకలు

అనకాపల్లి,పెన్ పవర్

నేడు అనకాపల్లి పట్టణంలో షిరిడి సాయి పర్తిసాయి థియేటర్లో కింగ్ అక్కినేని నాగార్జున గారు నటించిన వైల్డ్ డాగ్ చిత్రం అద్భుత విజయం సాధించిన సందర్భంగా  ఉత్తరాంధ్ర కింగ్ నాగార్జున ఫ్యాన్స్ అధ్యక్షుడు మళ్ళ సురేంద్ర ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.ముందుగా కేక్ కట్ చేసి  ఏ పాత్ర అయినా సరే న్యాయం చేయగల వ్యక్తి అక్కినేని నాగార్జున గారు అని ఇంత వయసులో కూడా ఒక (పోలీస్) నేషనల్ ఇన్విటేషన్ ఏజెంట్ అధికారిగా నాగార్జున గారి అద్భుతమైన పాత్రలో నటించి దేశపతి నేపథ్యంలో సాగిన చిత్రం ప్రజల దోచుకున్నారు అని తెలియజేశారు.

ఈ సందర్భంగా థియేటర్ లో ఉన్న ప్రేక్షకులకు అందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేపట్టారు.ఈ కార్యక్రమంలో  అక్కినేని అభిమానులు సిహెచ్ అవతార్ (అవ్వ), గోల్డ్ వాసు, యల్లపు శ్రీనివాస్, జొన్నాడ సురేష్, నీలకంఠం, మనో శీను, ఎస్, భాను చందర్ అఖి, దీపు, చందు, బండి రాజా, రాంబిల్లి బాలాజీ, రాంబిల్లి మురళి, నీలగిరి శీను,  చంటి తేజ,ఆది, రవి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

నిత్య సహాయ మాత ఆలయంలో ఘనంగా గుడ్ ఫ్రైడే ప్రార్థనలు

 నిత్య సహాయ మాత ఆలయంలో ఘనంగా గుడ్ ఫ్రైడే ప్రార్థనలు

ఆరిలోవ,పెన్ పవర్

 12వ వార్డు నిత్య సహాయ మాత ఆలయంలో గుడ్ ఫ్రైడే (శుభ శుక్రవారం) ఆరాధన  ఘనంగా నిర్వహించారు గత నలభై రోజుల గా ఉపవాస ప్రార్థనల  నిర్వహిస్తూ  గుడ్ ఫ్రైడే రోజున  క్రీస్తు సిలువ ధ్యానం,ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఆలయం లో గల 14 పరిశుద్ధ స్థలాలలో సిలువ ధ్యానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఫాదర్ యర్రా వేలాంగిని రమేష్ కుమార్ ఆలయ విచారణకర్త. ఫాథర్కె వి ఎస్ ప్రసాద్. ఫాథర్ సిమ్మా విజయ భాస్కర్. పి ఐ బాల రాజు . తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి రైల్వేస్టేషన్ ను మోడల్ స్టేషన్ గా మార్చండి

 అనకాపల్లి రైల్వేస్టేషన్ ను మోడల్ స్టేషన్ గా మార్చండి

నర్సిపట్నం స్టేషన్ లో రత్నాచల్ కు హల్ట్ ఇవ్వండి

విశాఖ ద్వారాకనగర్,పెన్ పవర్ 

రైల్వే బోర్డ్ మెంబర్ బొడ్డు శ్రీరామ్మూర్తి  గురువారం  అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బీశెట్టి సత్యవతిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా బొడ్డు  శ్రీరామ్మూర్తి  అనకాపల్లి  రైల్వేస్టేషన్  ను మోడల్ స్టేషన్ గా తీర్చి దిద్దాలని , అదనంగా మరి కొన్ని ప్లాట్ ఫారాలను నిర్మించాలని , ప్రయాణికులను అనుకూలంగా  ఎస్కేలేటర్ లను నిర్మించాలని , లక్ష్మీ దేవి పేట వద్ద అసంపూర్ణంగా ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి ను పూర్తిచేయాలని , రత్నాచల్  సూపర్ ఫాస్ట్  ట్రైన్  కు  యలమంచిలి  స్టేషన్  లో హల్ట్ ఇవ్వాలని , ఈ విషయంలో ఆనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు  డాక్టర్  బీశెట్టి  వెంకట  సత్యవతమ్మ  సెంట్రల్ రైల్వే మంత్రి  పియూష్  గోయల్  కు  అభ్యర్ధన  పత్రాన్ని సమర్పించారని ,ముఖ్యంగా ఈ  వేసవిలో స్టేషన్ లో మంచినీటి సమస్య రాకుండా చూడాలని ,  ప్రయాణికులకు ఏ లోటూ రాకుండా అన్నివిధాల సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి  చేసారు. అంతేకాకుండా రైల్వే బోర్డ్ సమావేశం గురించి చర్చించారు. అందుకు ఆమె రైల్వే బోర్డు సమావేశం ఈ నెల మొదటి వారంలో ఉంటుందని బోర్డ్ మెంబర్లతో కూలంకషంగా సమస్యల పై  చర్చిస్తానని తెలియజేసారు. ఈ సమావేశంలో ఓరుగంటి నెహ్రూ బాబు,జ్యోతుల రమేశ్,బొడ్డు సునీల్ పొల్గొన్నారు.

భజన మందిరం ప్రారంబించిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి

 భజన మందిరం ప్రారంబించిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి

సీనియర్ సిటిజన్స్ సేవలో ముందు నడుస్తున్న కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్.



పెన్ పవర్,  మల్కాజిగిరి 

కుషాయిగూడలోని బొంతు శ్రీదేవి, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి చర్లపల్లి, ఏఎస్ రావు నగర్ డివిజన్  కార్పొరేటర్ లు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ సీనియర్ సిటిజన్స్ కోసం చేపడుతున్న సేవా కార్యక్రమాలలో కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుంటుందని చర్లపల్లి, ఏఎస్ రావు నగర్ డివిజన్ ల కార్పొరేటర్ లు బొంతు శ్రీదేవి, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి లు పేర్కొన్నారు. కుషాయిగూడలో బుధవారం రాత్రి భజన మందిర్ ఆవరణలో కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్, సీనియర్ సిటిజన్ భవనాలను మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి,వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డిలతో కలిసి కార్పొరేటర్లు శ్రీదేవి, శిరీష లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలు సర్వతోముఖాభివృద్ధి సాధించడంలో సంక్షేమ సంఘాల పాత్ర క్రియాశీలక మయిందన్నారు. డివిజన్ పరిధిలోని కాలనీల అభివృద్ధిలో భాగంగా కుషాయిగూడ కు మరింత ప్రాధాన్యతను కల్పిస్తూ అభివృద్ధి ఫలాలు అందజేస్తామన్నారు. కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ వారు వయోవృద్ధుల కోసం చేపడుతున్న అనేక కార్యక్రమాలు వారిలో మనోధైర్యాన్ని నింపేలా ఉన్నాయని కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి,సింగిరెడ్డి శిరీష రెడ్డి లు ఈ సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ సేవలను కొనియాడారు. మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి మాట్లాడుతూ కుషాయిగూడ గ్రామంలో శిధిలావస్థకు చేరుకున్న భజన మందిర్ స్థానంలో తన హయాంలో అవసరమైన నిధులను విడుదల చేయించి కొత్త భవనం నిర్మాణం చేయించడం జరిగిందన్నారు. తన ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేసుకున్న భజన మందిరం కుషాయిగూడ గ్రామ వాసులకు వయోవృద్ధులకు ఉపయోగపడడం చాలా సంతోషంగా ఉందన్నారు. కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కుషాయిగూడ గ్రామానికి చెందిన అనేక మంది యువత ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పరిచే చర్యలు తీసుకుంటున్నామన్నారు. యువత కోసం దాదాపు 35 లక్షల రూపాయల వ్యయంతో అధునాతన జిమ్ వ్యాయామ శాలను ఏర్పాటు చేయనున్నట్లు సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ముందుగా కుషాయిగూడ గ్రామానికి చెందిన పలువురు వయోవృద్ధుల ను కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, సింగిరెడ్డి శిరీష లు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో  కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు చక్రపాణి గౌడ్ పబ్బ చంద్రశేఖర్, చిత్తుల విష్ణు గౌడ్, రాగుల వాసుదేవ ముదిరాజ్,  పంజాల బాబు గౌడ్, చెన్నోజు వరప్రసాద్, చిత్తుల కిషోర్ గౌడ్, బాల్ నరసింహ, బ్రహ్మచారి, శ్రీకాంత్ యాదవ్, నర్సింగ్ రావు, నర్సింగ్ గౌడ్, శంకర్ గౌడ్, దినేష్, సన్నీ, నందు, చల్ల సురేష్, వీరబ్రహ్మం, సాయి కిరణ్, మణికిరణ్, నాయకులు గణేష్ ముదిరాజ్, కాసుల సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కోవిడ్ 19 సహాయ కేంద్రం ఏర్పాటు

 భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో  కోవిడ్ 19 సహాయ కేంద్రం ఏర్పాటు

తాండూర్, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలో యువ మోర్చా మండల అధ్యక్షులు చజనాల రాహుల్ ఆధ్వర్యంలో  కోవిడ్ 19 వాక్సిన్ సహాయక కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపెల్లి భాస్కర్ గౌడ్, జిల్లా కార్యదర్శి ఏముర్ల ప్రదీప్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణి చేస్తున్న కరోనా టీకా గురించి ప్రజలకు అవగాహన కల్పించి, కరోనా టీకా తీసుకోవడం కోసం ఆరోగ్య సేతు అప్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయించడం జరిగిందని అన్నారు.ప్రజలు ఎలాంటి అపోహ పడకుండా కోవిడ్ 19 వాక్సిన్ తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో  యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి వినోద్,బీజేపీ మండల అధ్యక్షులు రామగోని మహీదర్ గౌడ్, మండల ఇంచార్జి రెవెల్లి రాయలింగు,అసెంబ్లీ నాయకులు చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, మండల్ ప్రధాన కార్యదర్శి విష్ణు, భరత్,జిల్లా కార్యవర్గ సభ్యులు విజయ్, మండల ఉపాధ్యక్షులు పుట్ట కుమార్,సీనియర్ నాయకులు తుకారాం,మహిళా మోర్చా అధ్యక్షురాలు సీతాలు యువ మోర్చా నాయకులు గాయత్రి, పులి సాయి రాజు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...