Followers

బస్ షెల్టర్ కు, 5 రూ. భోజనం సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి

 బస్ షెల్టర్ కు, 5 రూ. భోజనం సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి.. 

కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు, కాలనీ వాసులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుభాష్ నగర్ లోని లాస్ట్ బస్టాప్ వద్ద బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని, 5 రూపాయల భోజనం సౌకర్యం కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే వివేకానందకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.. ప్రజల సౌకర్యార్థం బస్ షెల్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే త్వరలోనే రూ.5 భోజనం సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడప శేషు, పద్మజ రెడ్డి, శ్రీకాంత్, నాగిరెడ్డి, పద్మలత రెడ్డి, నాని, అడప శేఖర్, బద్రి, సురేష్ తదితరులు పాల్గొన్నారు..

టైర్ పంచర్ బోల్తాపడ్డ ట్రాలీ

టైర్ పంచర్  బోల్తాపడ్డ ట్రాలీ

ఎటపాక,పెన్ పవర్ 

మండల పరిధిలోని రాయనపేట గ్రామ జాతీయ రహదారిపై టైర్ పంచర్ ట్రాలీ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి  వెళ్తే భద్రాచలం వైపు నుంచి కుంట  మట్టి పెంకులు లోడుతో వెళుతున్న ట్రాలీ పంచర్ అయ్యి  రాయన పేట గ్రామం వద్ద బోల్తా పడిన ఘటనలో  ట్రాలీ లో ప్రయాణిస్తున్న కొందరికి స్వల్ప గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రచారంలో దూసుకుపోతున్న అందుగుల పాప

 ప్రచారంలో దూసుకుపోతున్న అందుగుల పాప

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలో వైసిపి ఎంపిటిసి అభ్యర్థిని అందుగుల పాప శుక్రవారం ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి, అఖండమైన మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  ఏఎంసి ఛైర్మన్ వల్లభశెట్టి శ్రీనివాసరావు, అభ్యర్థిని  భర్త అందుగుల రవి, వైసిపి నాయకులు వల్లభశెట్టి చిన్ని, కోనాల వీర్రాజు, భరత్, సువర్ణరాజు, మరపట్ల శ్రీను, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో పలువురు వైసిపి లో చేరికలు

 నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో పలువురు వైసిపి లో చేరికలు

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం ప్రక్కిలంక రావిపాటి కళ్యాణ మండపంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత గురువారం జెడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులకు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించడానికి సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా తాళ్లపూడి వైసిపి బిసి సీనియర్ నాయకులు నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో తాళ్లపూడి నుండి తెలుగుదేశం సీనియర్ బిసి నాయకులు మరియు ప్రముఖ వస్త్ర వ్యాపారి వుడతా రామకృష్ణ, తెలుగుదేశం బిసి యువజన నాయకులు వుడతా వీరేంద్ర కుమార్, తాళ్లపూడి కాపు సంఘం అధ్యక్షులు వనిమిరెడ్డి శ్రీను, మరియు 20 మంది సభ్యులు వైసిపి లో జాయిన్ అవ్వడం జరిగింది. వీరందరికి మంత్రి వనిత పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపూడి మండల వైసిపి నాయకులు, అధికారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

దారి దోపిడీ కేసుకు పోలీసులకు ప్రశంసా పత్రాలు

 దారి దోపిడీ కేసుకు పోలీసులకు ప్రశంసా పత్రాలు

మోతుగూడెం,పెన్ పవర్

మోతుగూడెం పోలిస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం నవంబరు నెల అరో తేదిన చింతూరు నుండి మారేడుమిల్లి వెల్లే ఘాట్ రోడ్డులో జరిగిన దారి దోపిడీ కేసును చాలా వేగంగా ఛేదించడం జరిగింది, అందుకు గాను చింతూరు సబ్ డివిజన్ పోలీసులకు ప్రశంసా పత్రాలు వచ్చాయి, ఈ దారి దోపిడీ జరిగిన అనంతరం రెండు రోజుల్లో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి ఎనిమిది మందిలో ఏడుగురు గురు ముద్దాయిలను చింతూరు డీఎస్పీ ఖాదర్ భాషా నేతృత్వంలో చింతూరు సీఐ యువ కుమార్ తనదైన శైలిలో కేసును ఛేదించడంతో పాటు ఏడుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ఈ కేసును ఛేదించినందుకు గాను చింతూరు డీఎస్పీతో పాటు చింతూరు సీఐ యువయువకూమర్, చింతూరు ఎస్సై సురేష్ బాబు గతంలో మోతుగూడెం ఎస్సైగా పనిచేసిన సుబ్బారావులకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ వీరందరికీ ప్రశంసా పత్రాలు అందజేశారు.

సచివాలయం మరియు వై ఎస్ ఆర్ విలేజ్ క్లినిక్ ప్రారంభోత్సవం

 సచివాలయం మరియు వై ఎస్ ఆర్ విలేజ్ క్లినిక్ ప్రారంభోత్సవం

పెన్ పవర్, కొవ్వూరు

కొవ్వూరు నియోజకవర్గం ధర్మవరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి డాక్టర్ తానేటి వనిత కొవ్వూరు నియోజకవర్గం ధర్మవరం గ్రామంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా  మొదలు పెట్టిన గ్రామ సచివాలయ  ప్రక్రియలో భాగంగా ధర్మవరం గ్రామం నందు గ్రామ సచివాలయ బిల్డింగు మరియు వై.ఎస్.ఆర్ విలేజ్ క్లినిక్ బిల్డింగ్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం వై.ఎస్.ఆర్.సీ.పీ ముఖ్యనాయకులు ముళ్ళపూడి కాశీ విశ్వనాథ్ గారు ,అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా ఘాటు పొలమ్మ 13వ త్రయోదశ వార్షికోత్సవం

ఘనంగా ఘాటు పొలమ్మ 13వ త్రయోదశ వార్షికోత్సవం

సంతబొమ్మాలి,పెన్ పవర్

మండలంలో ఆకాశ లక్కవరం గ్రామంలో అసిరి తల్లి, ఘాటు పొలమ్మ 13వ త్రయోదశ వార్షికోత్సవం  ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా హోమం, మరియు కుంకుమ పూజలు గ్రామ పెద్ద భాస్కర్ రావు చేతులమీదుగా నిర్వహించగా, పరపటి రాము అన్నదాన కార్యక్రమాన్ని, కరువులు అప్పలకొండ పూజా కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. 

పూజారి మామిడి లక్ష్మీ గణపతి శర్మ మాట్లాడుతూ  ఈ హోమం గ్రామ  సంరక్షణ మరియు కరోనా బారిన పడకుండా అందరూ క్షేమంగా ఉండాలని ఈ హోమం, కుంకుమ పూజలు జరిపించమని, ప్రతి ఒక్కరు జాగ్రత్త లు పాటించాలని తెలిపారు. అనంతరం పిల్లలతో నాటిక కార్యక్రమాన్ని వేయించి పెద్దల్లో  అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుగ్గు  రామిరెడ్డి, పరపటి వసంత రావ్, భానుచందర్, రాజు, ఎర్రయ్య సంజీవ్, పాపారావు, సోమేశ్, భాస్కర్ రావు, గురుమూర్తి, మాకులు, కామేష్ , రామారావు అప్పన్న, వీరన్న, వసంత్, బీమా తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...