Followers

సర్పంచ్ గా పదవీభాద్యతలు చేపట్టిన నక్కా వెంకట అనురాధ

 సర్పంచ్ గా పదవీభాద్యతలు చేపట్టిన నక్కా వెంకట అనురాధ

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి  పంచాయతీ లో  పంచాయతీ కార్యదర్శి వీరన్న ఆధ్వర్యంలో శనివారం నూతన సర్పంచ్ నక్కా వెంకట అనురాధ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసి, కేటాయించిన కుర్చీలో కూర్చోండి, పదవీభాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్ అనురాధ మాట్లాడుతూ  రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ఆశీస్సులతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరుస్తానని తెలియజేశారు. జరగబోయే జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు పంచాయతీ కి ఇచ్చినట్లు అత్యధిక మెజారిటీతో వైసీపీ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి బిసి సీనియర్ నాయకులు నక్కా చిట్టిబాబు, తాళ్లపూడి  వైసీపీ నాయకులు, గ్రామ వాలంటీర్లు, పంచాయతీ సిబ్బంది, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయురాలు ఆకస్మిక మృతి

 ఉపాధ్యాయురాలు ఆకస్మిక మృతి

పెన్ పవర్,ఆలమూరు 

 ఆలమూరు మండలం జొన్నాడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న  కడలి నిశిత ఆకస్మిక మృతి చెందారు. ఈమె  ఆలమూరు మాజీ ఎంపీటీసీ,  ప్రముఖ న్యాయవాది  కాండ్రేగుల భీమశంకరం గారి అర్ధాంగి. ఆలమూరు మండలం మడికితో పాటు అనేక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేసి ఎందరో విద్యార్థులకు ఉన్నత బాటలు వేసిన ఈమె మృతి పట్ల ఎంఈఓ రామచంద్ర రావు, ఎంపీడీవో జేఏ ఝాన్సీ, పలు ఉపాధ్యాయ సంఘాలు, పలువురు ఉపాధ్యాయులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నారు.

రహదారులు లేని కొండరెడ్ల గిరిజన గ్రామాలకు వైద్య శిబిరాలు

 రహదారులు లేని కొండరెడ్ల గిరిజన గ్రామాలకు వైద్య శిబిరాలు 

 వి.ఆర్.పురం,పెన్ పవర్ 

వరరామచంద్రపురం  మండలం  జీడిగుప్ప   పి హెచ్ సి పరిధిలో  నివసిస్తున్న కొండరెడ్ల గిరిజన మారుమూల  గ్రామాలు   కొల్లూరు, కొండేపూడి, తుమ్మిలేరు గ్రామాలలో  ఉచిత  వైద్య  శిబిరాలు  ఏర్పాటు  చేసి గిరిజనులకు  మందుల  ఇవ్వటం  జరిగింది, మండలంలో  మూడు గ్రామాల కు రహదారి లేని కారణంగా  ఆ  ప్రదేశానికి బోటు ద్వారా వెళ్లి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కొండరెడ్ల  గిరిజన ప్రజలకు116  మంది కి వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసినారు.ఈకార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ. పద్మజ  ,రేఖపల్లి   పి హెచ్ సి  వైద్యాధికారి  సందీప్ నాయుడు, లక్మిపురం వైద్యాధికారిని  స్వప్నికారెడ్డి , రేఖపల్లి, జీడిగుప్ప, సంబంధించిన  ఏఎన్ఎంలు సూపర్వైజర్ శ్రీనివాస రావు  గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

అవ్వకు సాయం చేసిన సెయ్యి

" అవ్వకు సాయం చేసిన సెయ్యి "

సల్లగుండు సారూ అని దీవించిన అవ్వ...

" ట్రాఫిక్ కానిస్టేబుల్ లింగమూర్తి గౌడ్ మానవతామూర్తి "


రామగుండం, పెన్ పవర్ 

భానుడి ఎండ దాడికి భగభగ మండిపోతున్న అగ్ని గుండం రామగుండం. అలాంటి మండే ఎండలో గోదావరిఖని పట్టణంలోని మున్సిపల్ కార్పోరేషన్ టీ జంక్షన్ వద్ద ఎండలో రోడ్డు దాటాడానికి ఇబ్బంది పడుతున్న ఓక వృద్దురాలైన ఓ అవ్వని అక్కడే విధులు నిర్వహిస్తున్న లింగమూర్తి గౌడ్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డు దాటుతున్న ఆ అవ్వని గమనించి తన మానవతా దృక్పధంతో అవ్వని రోడ్డు దాటించి ఎక్కడకి వెళ్లాలని అడిగి తెలుసుకుని తనూ ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్ళాలని తెలూపగా ఆటోను పిలిపించి ఎక్కించి ఆ అవ్వను హాస్పిటల్ దగ్గరగా దింపమని ఆటో డ్రైవరుకు రిక్వెస్ట్ చేసి చెప్పి మరీ ఎక్కించి పంపించగా అయ్యా, సారూ నువ్ సల్లగుండాలే బాంచన్ అని ట్రాఫిక్ కానిస్టేబుల్ కి అవ్వ దివెనలు అందించింది. ఇది చూసిన అక్కడి జనం ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన పనిని అలాగే ఉండి పోయారు తనూ చేసిన ఆ మంచి పనికి వాహనదారులు, పాదాచారులు హర్షం వ్యక్తం చేయడమే కాకుండా ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు లింగమూర్తి గౌడ్ పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. 

హుషారుగా రన్ ఫర్ జీజస్...

 హుషారుగా రన్ ఫర్ జీజస్...

వేల సంఖ్యలో పాల్గొన్న క్రైస్తవ ప్రజలు,  నాయకులు...

సామర్లకోట, పెన్ పవర్

క్రీస్తు లేచెను జయహో జయహో అంటూ క్రైస్తవ ప్రజలు నినాదిస్తూ రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహభరితంగా, హుషారుగా సామర్లకోట పట్టణంలో నిర్వహించారు. ఈనెల 4వ తేదీ ఆదివారం యేసుక్రీస్తు పునరుత్థాన పండుగను గుర్తు చేసుకుంటూ ఆయన సమాదిని గెలిచి సజీవుడుగా తిరిగి లేచారనే వార్తను లోకానికి చాటి చెబుతూ సామర్లకోట మండల పాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 6 గంటలకు రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సిబిఎం హైస్కూలు గ్రౌండ్స్ లో ఈ కోర్యక్రమాన్ని వైకాపా నాయకులు, రాష్ట్ర కార్మిక నాయకులు దవులూరి సుబ్బారావు జెండా ఊపి ప్రారంబించారు.

 అనంతరం వేలాది మంది క్రైస్తవ ప్రజలు, పాస్టర్లు, నాయకులు పాల్గొనగా స్థానిక ప్రతిపాడు సెంటరు, పోలీసు స్టేషన్, ఫెన్షన్ లైను, మెహర్ కాంప్లెక్స్, మఠం సెంటరు మీదుగా స్టేషన్ సెంటరు రింగు సెంటరుకు ర్యాలీ చేరుకుంది. అక్కడ ప్రజల మానవహారాన్ని నిర్వహించగా ప్రతి ప్రధాన సెంటర్లలో నాయకులు దవులూరి సుబ్బారావుతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ ఊభా జాన్ మోజెస్, అంతర్జాతీయ వర్తమానికులు, యువర్ ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత డా. ఈలి సత్య సువార్త రాజులు పాల్గొని యేసుక్రీస్తు శుభ శుక్రవారం రోజున సిలువలో మరణించి మూడో రోజున ఆదివారం మరణాన్ని గెలిచి తిరిగి లేచిన సంగతులను వివరించారు.అనంతరం కార్యక్రమం పిఠాపురం రోడ్డు మీదుగా గాంధీబొమ్మ సెంటరు, బళ్ళమార్కెట్ సెంటరు, పాత పోలీసు స్టేషన రోడ్డు మీదుగా సాగి స్థానిక ఆంధ్ర భాప్టిస్టు చర్చిలో ముగిసింది.


 అనంతరం ఆంధ్ర భాప్టిస్టు చర్చి సహకారంతో నిర్వహించిన అల్పాహాఇర కార్యక్రమంతో రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమాల్లో ఇంకా అసోసియేషన్ అధ్యక్షులు పాము సువర్ణకుమార్, కార్యదర్శి కెఎన్ సూర్యోదయ కుమార్, కోశాధికారి కె రామ్మోహనరావు, బాప్టిస్టు ఫీల్డ్ కౌన్సిల్ అధ్యక్షులు సల్లూరి కళ్యాణ్, కాపా నాయకులు గంగిరెడ్డి కృష్ణమూర్తి, కొన్ని లర్లు పెట్టా సత్యన్నారాయణ, పాలిక కుసుమచంటిబాబు, పాగా సురేష్ కుమార్, జట్ల మోహన్, ఈ సామ్యుల్ విక్టర్ సన్, ప్రతిభ పాఠశాల డైరెక్టర్ ఎస్.వివిజి ప్రకాశ్, కాకినాడ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ స్పర్జన్ రాజు, నాయకులు దూది రాజబాబు, అసోసియేషన్ నాయకులు ఎంఎ జేమ్స్, వి జాన్, మోజెస్, బెంజిమేన్, వల్లూరి నోవాహు, దాన ప్రకాశ్, టౌన్ యూత్ నాయకులు ఎండివి ప్రసాద్, బి రామారావు, యు చంద్రశేఖర్, భారీ సంఖ్యలో మండల పరిధిలోని క్రైస్తవ ప్రజలు పాల్గొన్నారు.

నూతన సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురామారావు ప్రమాణ స్వీకార మహోత్సవం

నూతన సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురామారావు ప్రమాణ స్వీకార మహోత్సవం

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం గ్రామ పంచాయతీ లో కార్యదర్శి కే.వి.యస్.రాజు సమక్షంలో శనివారం నూతన సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురామారావు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసి, కేటాయించిన కుర్చీలో కూర్చోండి, పదవీభాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్ పరశురామారావు మాట్లాడుతూ  రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ఆశీస్సులతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరుస్తానని తెలియజేశారు. జరగబోయే జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు పంచాయతీ కి ఇచ్చినట్లు అత్యధిక మెజారిటీతో వైసీపీ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి అభ్యర్థులు కొమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు, రావిపాటి లక్ష్మణరావు, వైసీపీ నాయకులు శీర్ల బ్రహ్మానందం, సూలా పోసియ్య, కాళ్ళ రమణ, వేగేశ్వరపురం వైసీపీ నాయకులు, గ్రామ వాలంటీర్లు, పంచాయతీ సిబ్బంది, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

భారత వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ

 భారత వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ

ఆలిండియా అంబెడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో  వర్ధంతి వేడుకలు

మందమర్రి, పెన్ పవర్

భారతీయ వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ అని ఆలిండియా అంబెడ్కర్ యువజన సంఘం పట్టణ కన్వీనర్ మొయ్య  రాంబాబు అన్నారు. శనివారం అంబెడ్కర్ చౌరాస్తా లో ఛత్రపతి శివాజీ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 17 ఏళ్ల వయసులోనే మొదటి యుద్దం చేసి బీజాపూర్ ప్రాంతాన్ని కైవసం చేసుకున్నారని, గెరిల్లా యుద్ద వ్యూహాలకు ప్రసిద్ధి శివాజీ అని తెలిపారు. ప్రజల ప్రభువుగా పరిపాలన చేసి అందరి మన్ననలు పొందారని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఎం.డి.ఖళీమోద్దీన్, ఉప్పులేటి నరేశ్, జూపాక సంపత్, జిన్నారపు రవి, కోండిళ్ల శ్రీనివాస్, కల్వల శంకర్, తడిగొప్పుల రవిరాజ్, పంబాల శ్రీనివాస్, నెరేళ్ల వెంకటేష్, తడిగొప్పుల నందు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...