Followers

బత్తిన సుబ్బారావు జీవితాన్ని నేటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి

బత్తిన  సుబ్బారావు జీవితాన్ని నేటి రాజకీయ  నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి

కోరుకొండ, పెన్ పవర్

మాజీమంత్రి , నిస్వార్థ  సేవా భిలాషి బత్తిన సుబ్బారావు జీవితాన్ని నేటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని వైసిపి  రూరల్ కోఆర్డినేటర్ నాగేశ్వర్ విజ్ఞప్తి చేశారు. రూరల్ మండలం కోలమూరు గ్రామంలో సోమవారం బత్తిన సుబ్బారావు 25 వ వర్ధంతి సభ బత్తిన చంద్రమౌళి అధ్యక్షతన  జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగేశ్వర్ మాట్లాడుతూ, సుబ్బారావు నిస్వార్థ సేవ ,వ్యక్తిత్వం ,జీవనశైలి తో రాష్ట్ర ,జాతీయ స్థాయిలో గొప్ప పేరు గడించారని అన్నారు.  ఇప్పటివరకు ఏ రాజకీయనాయకుడు చేయని విధంగా రైతాంగానికి సాగునీరు పేదలకు ళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత బత్తిన సుబ్బారావుదే నన్నారు. సభాధ్యక్షుడు చంద్రమౌళి మాట్లాడుతూ చంద్రబాబు మాట్లాడుతూ..పేదరికంలో పుట్టి  రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదిగి రాష్ట్ర మంత్రిగా నిస్వార్థ సేవలందించిన బత్తిన సుబ్బారావు  పేరు ప్రఖ్యాతలు ఈనాటికీ  మరువ లేమన్నారు .  ఎంతో మంది ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పని చేసి స్థానిక రైతుల కోసం ఆరోజుల్లోనే వెంకటనగరం పంపింగ్ స్కీం అమలు చేసిన నిస్వార్థపరుడని న్నారు. తొలుత బత్తిన సుబ్బారావు  విగ్రహానికి ,డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైసిపి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ వైసిపి నాయకులు ఆకుల వీర్రాజు, తాడికొండ విష్ణుమూర్తి, పడాల ప్రసాదు, ఆలీ విజయ్ కుమార్,సభాధ్యక్షులు బత్తిన చంద్రమౌళి,దొడ్డే రాఘవులు, ఉల్లంగి నవీన్,ఉల్లంగి జానుబాబు,ఉల్లంగి చంద్రయ్య,బత్తిన కొండబాబు, బత్తిన రమణ, బత్తిన నాగరాజు,నూక తట్టి బ్రహ్మయ్య, జి.కన్నయ్య ,మద్ద ఏసు, మద్ద సూరి,పోలినాటి గంగాధర్,మెల్లం బచ్చయ్య , చిన్నం విక్టర్, బత్తిన గంగరాజు, నూక తోట్టి నూకతట్టి రూపులు, కన్నయ్య గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్థిక సాయం

 మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్థిక సాయం

తాళ్లపూడి, పెన్ పవర్

ఆదివారం 4-4-2021 తారీఖున తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలో క్యాన్సర్ తో బాధపడుతున్న నక్కా శ్రీనుబాబు భార్య నక్కా భాను కి  మానవత స్వచ్ఛంద సేవా సంస్థ, తాళ్లపూడి శాఖ తరపున రూ. 4,000, సెక్రెటరీ జోడాల వెంకటేశ్వరరావు రూ.500, ఈసి సభ్యులు అంకెం సురేష్ రూ.1000, డెంటిస్ట్ డాక్టర్ గోళ్ళ సాగర్ రూ.500, మరొక  డెంటిస్ట్ డాక్టర్ విజయ్ రూ.500, చి" మాస్టర్ పి.యస్వంత్ రూ.500 మొత్తం కలిపి రూ. 7,000 వైద్యం నిమిత్తం ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో అధ్యక్షులు బారనాల శంకరరావు, ఉపాధ్యక్షులు తుంపూడి నాగ భూషణగుప్త, గజ్జరం సర్పంచ్ గండి రాంబాబు, సభ్యులు మల్లిపూడి శోభన్ బాబు, గ్రామ పెద్దలు వల్లభని శ్రీహరి, బోడిగడ్ల గోవింద్,  అంబేడ్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

సమాదుల తోట స్థల కేటాయింపునకు కృషి...

 సమాదుల తోట స్థల కేటాయింపునకు కృషి...

సామర్లకోట, పెన్ పవర్

సామర్లకోట పట్టణంలో క్రైస్తవుల సమాదులతోటకు స్థలం లేనందున అధనంగా స్థలాన్ని కేటాయించేందుకు గానూ త్వరలో కౌన్సిల్లో తీర్మానించి స్థలాన్ని కేటాయించేందుకు కృషి చేయనున్నట్టు వైఎస్సార్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్మిక సంఘ నాయకులు దవులూరి సుబ్బారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉభా జానామోజెన్లు హామీ ఇచ్చారు. పట్టణంలో యేసుక్రీస్తు పునరుత్థాన పండుగ  సందర్భంగా స్థానిక ఆంద్ర బాప్టిస్టు చర్చిలో జరిగిన ప్రత్యేక ఆరాధన కార్యక్రమంలో వారు ముఖ్య అతిధులుగా విచ్చేసి పాల్గొన్నారు. ఈ  సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవ సమాదుల తోటలో స్థలాలు సమాదులతో నిండుకుని ఉన్న కారణంగా స్థలం కొరత ఉన్నట్టు ఎంతో కాలంగా తమ దృష్టికి వస్తున్నందున ఈ సారి కౌన్సిల్లో అతి త్వరలోనే దీనిపై చర్చించి తీర్మానించి అదనంగా స్థలాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. సజీవుడైన యేసుక్రీస్తును ఆరాదించు కునేందుకు సమాదుల తోటను అతి సుందరంగా తీర్చిదిద్ది ఏ కోణంలోనూ ఇది శ్మశానవాటిక అనే భావన రాకుండా ఎంతో సుందరంగా తీర్చి దిద్దడంతో పాటు కుటుంబాలు పండగ వాతావరణంలో కుటుంబ సభ్యులందరితో వెళ్ళి ప్రార్థనలు నిర్వహించడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. క్రైస్తవ మనోభావాలు దెబ్బతినకుండా, మరణించిన వారికి నిర్మించే సమాదుల కొలతల విషయంలో ప్రత్యేక నిబందనలు పాటించే విధంగా రానున్న రోజుల్లో ప్రణాళికలు రూపొందించు కోవాలన్నారు. అయితే సమాదుల తోట స్థల సమస్యను పరిష్కరిస్తామని వారు ఈ సందర్భంగా క్రైస్తవ ప్రజలకు హామీ ఇచ్చారు. అంతర్జాతీయ వర్తమానికులు డా. ఈలి సత్య సువార్త రాజు నాయకులు, వైస్ చైర్మన్, కౌనిర్లరందరి క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాగా పట్టణ, మండల పరిధిలోని అన్ని చర్చిల్లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు యేసు పునరుత్థాన పండుగ ఆరాధనలు భక్తి శ్రద్ధలతో జరుపుకుని ఆనందించారు. ఈ కార్యక్రమాల్లో వార్డు కౌన్సిలర్లు పిట్టా సత్యన్నారాయణ, పాలిక కుసుమచంటిబాబు, జట్లా మోహన్, పాగా సురేష్ కుమార్, సేపేని సురేష్ లు, మండల పాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు పాము సువర్ణకుమార్, కార్యదర్శి సూర్యోదయ కుమార్, మోహనరావు, సెంటినరీ, లూథరన్ సంఘాల దైవజనులు, ఇతర పాస్టర్లు మాట్లాడారు. ఈ సమాదుల పండుగ కార్యక్రమంలో ఇంకా బాప్టిస్టు ఫీల్డ్ కౌన్సిల్ అధ్యక్షులు సల్లూరి కళ్యాణ్, వైకాపా నాయకులు దూది, రాజబాబు, ఇరుసుమళ్ళ సాయి, మాగావు గోపి, సంగినీడి భావన్నారాయణ, చర్చి నాయకులు బిఎస్ వందనం, టి సూర్యారావు, టి అన్నపూర్ణ డానియేలు, అధిక సంఖ్యలో క్రైస్తవ కుటుంబాలు పాల్గొన్నారు.

మంత్రి వనిత ఎన్నికల ప్రచారం

 మంత్రి వనిత ఎన్నికల ప్రచారం

తాళ్లపూడి, పెన్ పవర్

ఆదివారం జెడ్పిటిసి మరియు ఎంపిటిసి ఎన్నికల ప్రచారనికి విచ్చేసిన రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి  డాక్టర్ తానేటి వనిత కు  మండల వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల ప్రచారం రావూరుపాడు నుండి మొదలుపెట్టారు. జెడ్పిటిసి అభ్యర్థి పోశిన శ్రీలేఖ, తాళ్లపూడి మండలంలో ప్రతీ గ్రామంలోని  ఎంపీటీసీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రావూరుపాడు గ్రామం నుండి మొదలు పెట్టి మండలం అంతా బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి తానేటి వనిత ప్రభుత్వం అందించే   అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ తమ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుకి వేయాలని ఓట్లను అభ్యర్థించారు. అనంతరం పెద్దేవం వైస్ ప్రెసిడెంట్ తోట రామకృష్ణ  మాట్లాడుతూ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో పెద్దేవం గ్రామానికి ఎంపిపి లేదని మంత్రి వనితమ్మ ఆశీస్సులతో పెద్దేవం గ్రామానికి ఎంపిపి ఇస్తున్నందుకు గ్రామ ప్రజల తరఫున మంత్రి వనితకు కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో  తాళ్లపూడి మండల వైయస్సార్సిపి నాయకులు,  కార్యకర్తలు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల నియమావళిని తుచతప్పకుండా పాటించాలి

 ఎన్నికల నియమావళిని తుచతప్పకుండా పాటించాలి

పెన్ పవర్,పెద్దాపురం

ఎంపిటిసి, జడ్పీటీసులు పోటీలో ఉన్న అభ్యర్థులు అమ‌ల్లో ఉన్న ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని తుచ‌త‌ప్ప‌కుండా అనుస‌రించాల‌ని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎంపీడీవో రమణారెడ్డి  స్ప‌ష్టం చేశారు. సోమవారం పెద్దాపురం ఎంపీడీవో కార్యాలయంలో పెద్దాపురం మండలంలో పోటీ చేస్తున్న ఎంపీటీసీ ,జడ్పిటిసి అభ్యర్థులకుసమావేశం పెద్దాపురం మండల స్పెషల్ ఆఫీసర్  వెంకటేశ్వరరావు  సమక్షంలో జరిగింది ఈ కార్యక్రమంలోమండల అసిస్టెంట్ టర్నింగ్ అధికారి ఎంపిడిఓ రమణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకుఅభ్యర్థులు,ఎన్నికలఅధికారులుఎన్నికలమార్గదర్శకాలను పాటించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎలక్షన్ అబ్జర్వర్ చిరంజీవి నియమావళి మానిటరింగ్ సిబ్బంది రఘుపతి, శ్రీనివాస్  స‌మావేశం లో మాట్లాడుతూ తూ ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి, పోలింగ్ కేంద్రాలు, ఓట‌ర్ల జాబితా, ఎన్నిక‌ల ప్ర‌చారం, ఎన్నిక‌ల ఏజెంట్లు, వివిధ ర‌కాల ఫారాలు, బ్యాలెట్ పేప‌ర్లు త‌దిత‌రాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఫొటో గుర్తింపు కార్డులు, ఇతర అంశాలపై వివరించడం జరిగింది. ఈ సంద‌ర్భంగా ఏ ఆర్ ఓ (ఎంపీడీవో) రమణా రెడ్డి  మాట్లాడుతూ ఎన్నిక‌ల ప్ర‌క్రియను శాంతియుత వాతావ‌ర‌ణంలో విజ‌యవంతంగా పూర్తిచేసేందుకు అభ్య‌ర్థులు స‌హ‌క‌రించాల‌ని కోరారు. 

ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌లు ప‌ర్య‌వేక్ష‌ణ‌కు క‌లెక్ట‌రేట్‌లో ప్ర‌త్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారని,. ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఉప‌యోగించే లౌడ్‌స్పీకర్ల‌కు ముంద‌స్తు అనుమ‌తి తీసుకోవాల‌న్నారు. వాహ‌నాల వినియోగానికి  అనుమ‌తులు తీసుకోవాలని తెలిపారు, అదే విధంగా స‌మావేశాలు, ర్యాలీల‌కు పోలీసు అధికారుల నుంచి ముంద‌స్తు అనుమ‌తులు తీసుకోవాల‌ని తెలిపారు. క‌ర‌ప‌త్రాలు వంటి వాటిని ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళికి లోబ‌డి ఉండేలా చూసుకోవాల‌ని సూచించారు. ఎన్నిక‌ల ‌నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు రిటర్నింగ్ అధికారికి దృష్టికి తీసుకురావ‌చ్చ‌ని ఎంపీడీవో వివ‌రించారు.ఏప్రిల్ 8 పోలింగ్‌ ఉద‌యం 8 గం. నుంచి సాయంత్రం 5గం. వ‌ర‌కు పోలింగ్ జ‌రుగుతుంద‌ని, కౌంటింగ్ ఏప్రిల్ 10 ఉదయం 8గంటలు ప్రారంభిస్తారని ఏఆర్‌వో వెల్లడించారు. ఈ స‌మావేశం లో అభ్య‌ర్థులు వెలిబుచ్చిన సందేహాల‌ను ఏఆర్‌వో రమణా రెడ్డి నివృత్తి చేశారు.. ఈ కార్యక్రమంలో జోనల్ ఆఫీసర్ అప్పారావు వీరబాబు అప్పలరాజు రూట్ అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఆశీస్సులు అందుకున్న నూతన మేయర్ గొలగాని హరి వెంకటకుమారి దంపతులు

ఆశీస్సులు అందుకున్న నూతన మేయర్ గొలగాని హరి వెంకటకుమారి దంపతులు

పెందుర్తి, పెన్ పవర్

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గొలగాని హరి వెంకటకుమారి దంపతులు విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వాముల ఆశీస్సులు అందుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పీఠం ప్రాంగణంలో నెలకొన్న దేవతామూర్తులను దర్శించుకున్నారు. విశాఖ నగర అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని పీఠాధిపతులు ఇరువురూ మేయర్ కు సూచించారు.

డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వాసుపల్లి

 డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వాసుపల్లి 

మహారాణి పేట, పెన్ పవర్

స్వాతంత్య సమర యోధుడు,సామాజిక సమానత్వం కోసం,అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన రాజకీయ,సామాజిక విప్లవ యోధుడు, మాజీ ఉప ప్రదాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా 27వార్డ్ అశోక్ నగర్,ఆసీల్ మెట్ట,జీవీఎంసీ జోన్ 2 కార్యాలయం ఆవరణంలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్.

ఈ సందర్భంగా అంగన్వాడీ పిల్లలకు ఎస్సీ నాయకుడు సిటీ సెక్రెటరీ ఈతలపాక శ్యామ్ ప్రసాద్ ప్లేట్స్ మరియు గ్లాసులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో 27 వార్డ్ ప్రెసిడెంట్ నీలాపు సర్వేశ్వర రెడ్డి,సిటీ సెక్రెటరీ ఈతలపాక శ్యామ్ ప్రసాద్,స్టేట్ బిసి డైరెక్టర్లు సంకాబక్తుల ప్రసాద రావు,సనపల రవీంద్ర, 37వార్డ్ కార్పోరేటర్ చెన్నా జానకిరామ్,డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...