Followers

ఓటమి ఎరుగని నాయకుడు బాబు జగ్జీవన్ రామ్

 ఓటమి ఎరుగని నాయకుడు బాబు జగ్జీవన్ రామ్...

 సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్రశేఖర్

బేలా,  పెన్ పవర్ 

 యాభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఓటమి ఎరుగని నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్రశేఖర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో భారతదేశ మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 113వ జయంతిని ఎమ్మార్పీఎస్ టీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆయా పార్టీల నాయకులతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని, నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు, ఓటమెరుగని నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. కేంద్రంలో అనేక పదవులు పొంది హరిత విప్లవం కోసం పోరాడిన వ్యక్తి అని కొనియాడారు. దళిత బడుగు బలహీన వర్గాల కోసం ఎనలేని కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని, 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 30 సంవత్సరాలు  మంత్రిగా  ఉన్నరాని అన్నారు.ప్రతి ఒక్కరు బాబు జగ్జీవన్ రామ్ ని ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో నడవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆడనేగేశ్వర పౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్,మాజీ జెడ్పీటీసీ సభ్యులు నక్లే రాందాస్, మాజీ సర్పంచులు దేవన్న, మాస్కె తేజ రావు, ఆయా పార్టీల నాయకులు ఫైజుల్ల ఖాన్, మురళీధర్ ఠాక్రె,దేవదాస్, అనిల్ గుండా వార్, ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రవీణ్ కదరపు, భీం సేన మండల అధ్యక్షులు రాహుల్ కాంబ్లే, అంబేద్కర్ సంఘం మండలాధ్యక్షుడు కోబ్రాగాడే గజానన్, ఎమ్మార్పీఎస్ టీఎస్ మండల అధ్యక్షులు యముర్ల దీపక్,గణేష్,రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

ప్రజల దాహార్తి తీర్చడానికే పోలీసుశాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలు

 ప్రజల దాహార్తి తీర్చడానికే పోలీసుశాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలు

విజయనగరం,పెన్ పవర్

జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో దిశా మహిళా పోలీస్ స్టేసన్ వద్ద చలివేంద్రం ప్రారంభించిన జిల్లా ఎస్పీ, రాష్ట్ర డిజిపి శ్రీ గౌతం సవాంగ్ గారి ఆదేశాలు ప్రకారం జిల్లా పోలీసుశాఖ తరుపున వేసవి కాలం దృష్ట్యా ప్రయాణికులు మరియు ఫిర్యాదిదారుల యొక్క దాహార్తిని తీర్చేందుకుగాను దిశా మహిళా పోలీసు స్టేషన్ ఆవరణంలో సోమవారంనాడు చలివేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి.రాజకుమారి మాట్లాడుతూ - ప్రస్తుతం జిల్లా లో వేసలి కాలం సందర్భంగా వేడి ఎక్కువగా ఉన్నందున ప్రయాణికులు, పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యాదు దారుల యొక్క దాహార్తిని తీర్చేందుకు దిశా మహిళా పోలీసు స్టేషన్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేసామన్నారు. జిల్లాలో 10 పోలీస్ స్టేషన్ పరిధిలోగల మహిళలపై జరిగే నేరాలకు సంబందించిన కేసులలో దిశా మహిళా పోలీస్ స్టేషన్ కు ప్రతిరోజు సుమారు 100 మంది వరకు ఫిర్యాదుదారులు వస్తున్నారని, వారి దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 

ఇదే విధంగా పోలీస్ కార్యాలయం ఆవరణంలో మరియు ఎత్తుబ్రిడ్జి దగ్గర కూడా త్వరలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ అన్నారు. అనంతరం దిశా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులకు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ళు, చల్లని త్రాగునీరుని జిల్లా ఎస్పీబి. రాజకుమారి అందజేశారు. ప్రజలందరు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేసవి కాలంలో త్రాగునీరు లేక పక్షి జాతులు అంతరించిపోతు, పర్యావరణంలో సమతుల్యం క్షీణిస్తున్నందున, వాతావరణంలో సమతుల్యం సాధించేందుకు దిశ పోలీసు స్టేషను ఆవరణంలో త్రాగు నీరు, ఆహారం లభించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా దిశ మహిళా పోలీసు స్టేషను ఆవరణంలో చిన్న చిన్న నీటి తొట్టెలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దిశా మహిళా పోలీసు స్టేషన్ డిఎస్పీ టి.త్రినాధ్, ఎస్ఐ శ్యామల మరియు దిశా మహిళా పోలీసు స్టేషన్ సిబ్బంది ఇతర అధికారులు పాల్గొన్నారు.

చదువు క్రీడల్లో ప్రతిభ కలిగిన యువకులను ప్రోత్సహించడానికి పోలీస్ శాఖ తోడుగా ఉంటుంది

 చదువు  క్రీడల్లో ప్రతిభ కలిగిన యువకులను ప్రోత్సహించడానికి పోలీస్ శాఖ  తోడుగా ఉంటుంది

....ఓఎస్డీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

...దేవాపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఓఎస్డీ 

...  రాణాలో ఉన్న మావోయిస్టు దళం కదలికల రిజిస్టర్ ను, రికార్డ్ లను పరిశీలన

...సమీప గ్రామాల యువత కి వాలీబాల్ కిట్స్ పంపిణీ

మంచిర్యాల , పెన్ పవర్

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లాలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ ఓఎస్డీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్  ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాణాలో ఉన్న మావోయిస్టు దళం కదలికల రిజిస్టర్ ను, రికార్డ్ లను పరిశీలించారు.మండల భౌగోళిక సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. మావో యిస్టు కదలికల గురించి ఆరా తీశారు.లక్ష్మిపూర్ , కుర్రెగాడ్ , మద్దిమడా , పెద్ద అరిదపెల్లి , గట్రాపల్లి , బుగ్గగూడెం గ్రామాల యువత కి వాలీబాల్ కిట్స్ అందజేశారు.ఈ సందర్బంగా ఓఎస్డీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్  మాట్లాడుతూ యువకులు ఉన్నత విద్య నేర్చుకోవాలని వారి తల్లిదండ్రుల కి మంచి పేరు తేవాలని ,  వారి గ్రామం,  జిల్లా, రాష్ట్ర స్థాయిలో గొప్పగా మంచి పేరు తీసుకొని వెళ్లాలని, చదువు  క్రీడల్లో ప్రతిభ కలిగిన యువకులను ప్రోత్సహించడానికి, పోలీస్ శాఖ , ప్రభుత్వం తోడుగా ఉంటుందని వారు పేర్కొన్నారు.మావోయిస్టుల సిద్ధాంతాలు నమ్మి వారి బాటలో వెళ్లి  తమ   బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు జీవితాన్ని కష్టాల పాలు చేసుకోవద్దని అన్నారు. గ్రామంలో ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఓఎస్డీ   యువకులతో అన్నారు. పోలీసు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి ప్రజలు తమ ప్రశాంతమైన జీవితాన్ని శాంతియుత వాతావరణంలో గడిపేలాగా చూడడమే పోలీసుల  ప్రధాన లక్ష్యం అని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యక్తుల పై నిఘా పెట్టమని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఓఎస్డీ  వెంట ఏసీపీ మహేష్, ఎస్ఐ విజేందర్ ఉన్నారు.

అట్టడగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు బాబు జగజ్జీవన్ రామ్

 అట్టడగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు బాబు జగజ్జీవన్ రామ్

విజయనగరం,పెన్ పవర్ 

జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారత ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు భారత ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏప్రిల్ 5, సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి, ఐపిఎస్., ముఖ్య అతిధిగా హాజరై, బాబూ జగజ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాల వేసి, పుష్పాలను సమర్పించి ఘనంగా నివాళు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి. రాజకుమారి మాట్లాడుతూ - జగజ్జీవన్ రామ్ భారత స్వాతంత్ర్యయ ఉద్యమంలో బ్రిటిష్ వావారికి వ్యతిరేకంగా పోరాడారన్నారు. మహాత్మా గాంధీ పిలుపునందుకొని స్వాతంత్ర్యయాన్ని సాధించేందుకు క్విట్ఇండియా, సత్యాగ్రహ ఉద్యమాలల్లో చురుకుగా పాల్గొని, జైలుకు వెళ్ళారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏర్పడిన భారత ప్రభుత్వంలో కేంద్ర కార్మిక, రక్షణ మరియు వ్యవసాయ శాఖామంత్రిగా, ఉప ప్రధానిగా సుదీర్ఘ కాలం పని చేసారన్నారు. దేశంలో అంటరాని తనాన్ని రూపు మాపేందుకు, అట్టడుగు ప్రజల అభ్యున్నతికి, వ్యవసాయ రంగం లో అభివృద్ధికి, హరిత విప్లవాన్ని సాధించేందుకు, దళితులకు ఓటు హక్కును కల్పించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసారన్నారు. భారత దేశానికి ఉప ప్రధానిగా పని చేసిన మహానీయున్ని జయంతిని జరుపుకోవడం, స్మరించుకోవడం, దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యతన్నారు. అటువంటి మహానీయున్ని ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా యువతకు, ప్రజలకు జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణ రావు, ఏఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, డిసిఆర్ బి సిఐబి.వెంకటరావు, ఎస్ బి సిఐ శ్రీనివాసరావు, ఆఱలు చిరంజీవిరావు, ఈశ్వరావు, పి.ఎం. రాజు మరియు ఇతర పోలీసు అధికారులు, డిపిఒ సిబ్బంది పాల్గొని, బాబూ జగజ్జీవన్ రామ్ చిత్ర పటానికి పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.

వీరుడా...నీకు వందనం...

 వీరుడా...నీకు వందనం...

మావోల ఘాతుకానికి..

నేల కొరిగిన వీరుడు..

విజయనగరం ధీరుడు..

సహచరులను రక్షించబోయి..

బుల్లెట్ వర్షానికి బలైన త్యాగ ధనుడు..

సీఆర్పీఎఫ్ కోబ్రా జవాన్ రౌతు జగదీష్ పోరాటం నిరూపమానం..

వీర జవాన్ మృతి పట్ల కన్నీరు పెట్టిన గాజుల రేగ..

దేశ భక్తిని తట్టి లేపే అశ్రునయనాలతో అంత్యక్రియలు..


విజయనగరం, పెన్ పవర్ 

 "వీరుడా నీకు వందనం..భరత మాత ముద్దు బిడ్డా  నీకు చేతులెత్తి చేస్తున్నాం అభివందనం. సాయుధులైన శత్రువులు నీ ఎదురుగ ఉన్నా వెన్ను చూపని నీ ధైర్య సాహాసాలకి..ప్రాణ త్యాగానికి యావత్ జాతి అర్పిస్తోంది ఘన నీరాజనం. గుళ్ల వర్షానికి నీ దేహం ఛిద్రమై రక్తమోడుతుంటే..ఆ రుధిరాభిషేకంలో అరుణ రూప దారియైన భరతమాత నిన్ను తన కౌగిట పట్టుకొని రోధిస్తుంటే ఆ విషాద క్షణాలను తలచుకున్న నీ మాతృమూర్తి హృదయం ఎంతగా రోదించిందో మరి. నీ పార్థివ దేహాన్ని చూసి నీ స్నేహితులు, సన్నిహితులు ఎంతగా తల్లడిల్లారో మరి. నిరుపమానమైన నీ దేశ భక్తి, ధైర్య సాహాసాలు, త్యాగనిరత ముందు మా ఈ కన్నీటి రోదన, వేదన, ఆవేదన ఏపాటివి. దేశ భక్తికి చిరునామాగా, ధైర్య సాహాసాలకి కొలమానంగా, త్యాగ నిరతకి నిరుపమానంగా..దేశం కోసం ప్రాణాలర్పించిన నీ మరణం మాకొక స్ఫూర్తి స్తూపం. వినీలాకాశంలో తారవై ధ్రువ తారవై ప్రకాశిస్తూ  అందుకో మా అశ్రునయనాల నివాళుల ముఖులిత నీరాజనం.." 

ఇవీ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన మావో దుశ్చర్య వల్ల ప్రాణాలు కోల్పోయిన విజయనగరం గాజుల రేగకి చెందిన వీర జవాన్ రౌతు జగదీష్ పార్దీవ దేహానికి ప్రజలు అర్పించిన ఆశ్రు నీరాజనాలు. ఘన నివాళులు. రౌతు జగదీష్ దేశమంటే భక్తి  దానికి తోడు కండలు తిరిగిన శరీరం, చురుకుగా కదిలే నైజం  ఆ లక్షణాలు అతడ్ని కోబ్రాదళానికి నాయకుడిగా ఎంపికయ్యేలా చేశాయి. విధుల్లో చేరినప్పటి నుంచి కోబ్రాదళం తరపున ఎన్నో కీలక ఆపరేషన్ ల్లో పాల్గొన్నాడు.. మావోయిస్టుల గుండెల్లో ధడ పుట్టించాడు. కానీ అతడి ధైర్య, సాహసాలు చూసిన విధికి కన్నుకుట్టినట్టు ఉంది. త్వరలో జీవితభాగస్వామితో పాటు ఏడు అడుగులు నడిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో విధి కన్నెర్ర చేసాంది. పెళ్లి వయసు వచ్చిన సమయంలో.. ఆ ముచ్చట తీరకుండానే మావోయిస్టుల రాపంలో మృత్యువై కాటేసింది. కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని మిగిల్చింది. జవాన్‌ మృతితో విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగ, మక్కువ మండలం కంచేడువలసలో పెను విషాదం అలముకుంది. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో  విజయనగరం జిల్లాకు చెందిన యువకుడు, సీఆర్పీఎఫ్‌ జవాన్‌ 27 ఏళ్ల రౌతు జగదీష్‌ వీరమరణం పొందాడు. జిల్లా పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. జగదీష్‌ది మక్కువ మండలం కంచేడువలస గ్రామం. ప్రస్తుతం రౌతు జగదీష్ కుటుంబం విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగలో నివసిస్తోంది. డిగ్రీ వరకు చదువుకున్న జగదీష్‌ 2014లో సీఆర్పీఎఫ్‌ జవాన్‌గా ఎంపికయ్యాడు. విధుల్లో చురుగ్గా మెలగడంతో కోబ్రాదళానికి లీడర్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అస్సాం క్యాంపులో పని చేస్తున్నాడు. శనివారం బీజాపూర్‌ జిల్లా అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్, కోబ్రా, డీఆర్‌జీ భద్రతా దళాలతో కలిసి కూంబింగ్‌ చేస్తున్న సమయంలో మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో మృతిచెందాడు. విధుల్లో చేరిన కొద్దికాలంలోనే మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. 

మృతుడి తండ్రి సంహాచలం కూలీకాగా, తల్లి రమణమ్మ గృహిణి. కాగా ఈ మధ్యనే అక్క సరస్వతికి వివాహమైనట్టు తెలుస్తోంది. అయితే జగదీష్ కు వచ్చే నెల 22న పెళ్లి నిశ్చమైంది. ఆ పెళ్లికోసం మరో వారం రోజుల్లో సెలవుపై రావాలి అనుకున్నాడు. దీంతో జగదీష్ కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉన్న సమమంలో పిడుగులాంటి వార్త ఆ ఇంటిని శోకసంద్రంలోకి నెట్టేసింది. కొండంత ఎదిగిన కొడుకు.. పేరు ప్రఖ్యాతలు సాధించాడనుకున్న బిడ్డ మృతి చెందాడన్న వార్తతో కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది.  చేతికి అందుకొచ్చాడు ఇంటి బరువు బాద్యతలు చూసుకుంటాడనుకున్న సమయంలో ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులిద్దరూ కన్నీరుమున్నీరవుతున్నారు. జగదీష్‌ మృతితో గాజులరేగ, అటు స్వస్థలం కంచేడువలస వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. గాజులరేగలో బ్లాక్‌ డే పాటించారు. పెళ్లి పల్లకీ ఎక్కుతాడనుకున్న ఆ జవాను మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందాడు. విషయం తెలిసిన మరుక్షణమే తల్లిదండ్రులు కుప్పకూలారు. ఈ ఘటనతో గాజులరేగలోని జగదీష్‌ ఇంటివద్ద తీవ్ర విషాద చాయలు అలముకున్నాయి. మరోవైపు జగదీష్ స్నేహితులు సైతం తీవ్ర దు:ఖంలో ఉన్నారు. వీర మరణం పొందిన స్నేహితుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ బ్లాక్ డే నిర్వహించారు. జగదీష్ అమర్ రహే.. అంటూ విజయనగరం పట్టణంలోని గాజుల రేగలో భారీ ర్యాలీ చేపట్టారు.

కినపర్తి గ్రామంలో సంవత్సరం గడిచిన అందని ఉపాధి నిధులు

కినపర్తి గ్రామంలో సంవత్సరం గడిచిన అందని ఉపాధి నిధులు

అడ్డతీగల, పెన్ పవర్ 

అడ్డతీగల మండల పరిధిలో గల దొరమామిడి పంచాయితీ లోని కినపర్తి గ్రామస్తులు ఉపాధి నిమిత్తం ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కి సంబంధించిన పని డబ్బులు సంవత్సరం గడిచిన రాని పరిస్థితి..వివరాలలోకి వెలితే జనవరి-2020 న ఉపాధి నిమిత్తం , గడవని పరిస్థితులలో పనికి వెళ్లిన ఆ ఊరి ప్రజలకు ఆ గ్రామ బి పి యమ్ అయిన కరుణా గారు, పాస్ పుస్తకాలు బతికించాలంటూ కొన్ని నెలలు, ఈ రోజు రేపు అంటూ ఒక్క కినపర్తి లొనే సంవత్సరం గా  4.50 లక్షల వరకు ఇవ్వని పరిస్థితి నెలకొంది..డ్యూటీ కి రాకపోవడం, ఫోన్ కి సైతం స్పందించక పోవడం, ఊరి ప్రజలకు సైతం పోస్టాపీస్ నుండి వచ్చే కాల్ లెటర్ నుండి ఇన్సూరెన్స్ కాగితాలు  వరకు సమయం దాటిన కొన్నాళ్ల తర్వాత  ఇవ్వడం జరుతుందని, కొన్ని సార్లు అయితే ఇవ్వటం లేదని వాపోతున్నారు. అడుగుదామని వెళ్లిన ఏరోజు డ్యూటీ కి వచ్చిన దాఖలాలు లేవని సంతకం పెట్టి ఇంటికి వెళ్ళిపోతున్నారని  అడిగితే ఈరోజు సెలవు పెట్టానని  రేపు వస్తానని  ఎల్లుండు వస్తానని చివరకి రావటం లేదన్నారు.దీనివల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కినపర్తి గ్రామ ప్రజలకు అందటం లేదని ఇలా అయితే లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన మాకు  డబ్బులు రాలేక, ఉపాధి పనులకు వెళ్లలేక, దిక్కు తోచని మమ్మల్ని ఆదుకోవాలని పత్రిక ముఖంగా అధికారులను, రాజకీయ నాయకులను విన్నవించుకున్నారు. ప్రజల పట్ల నిర్లక్ష్యంగా, చిన్నచూపు ధోరణితో, బాధ్యత  రాహిత్యంగా ఉన్న ఈ ఉద్యోగిపై సరైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బాధాకర హృదయంతో కోరడం జరిగింది.

ప్రచారంలో దూసుకు పోతున్న నాగేశ్వరరావు

 ప్రచారంలో దూసుకు పోతున్న నాగేశ్వరరావు 

మోతుగూడెం, పెన్ పవర్

మోతుగూడెం పంచాయతీ అభివృద్ధికై కృషి చేస్తానని అన్ని వేలాల అందరికీ అందుబాటులో ఉంటానని తెలుగు దేశం పార్టీ బలపరిచిన ఎంపిటిసి అభ్యర్థి వేగి నాగేశ్వరరావు(చిన్న) తెలిపారు, ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సోమవారం తెలుగుదేశం పార్టీ గ్రామ కార్యకర్తల ఆధ్వర్యంలో మోతుగూడెం గ్రామంలో బైక్ ర్యాలీని సోమవారం నిర్వహించారు ఈ ర్యాలీ మోతుగూడెం గ్రామ విధులలో సైకిల్ మరియు బైక్ లతో కొనసాగింది, ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ మోతుగూడెం పంచాయతీ అభివృద్ధి పథంలో నడవాలి అంటే, అన్ని వేలాల అందరికీ అందుబాటులో ఉండే వక్తి కావాలంటే తెలుగు దేశం పార్టీ బలపరిచిన ఎంపిటిసి అభ్యర్థి వేగి నాగేశ్వరరావు(చిన్న)ను గెలిపించలని అని కోరుతున్నారు, ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...