Followers

గర్భిణీలకు వైద్య పరీక్షలు

 గర్భిణీలకు వైద్య పరీక్షలు...

ఇంద్రవెల్లి, పెన్ పవర్

 ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక వైద్యులు శ్రీకాంత్, నీలోఫర్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం గర్భిణీల‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీహెచ్ఓ రాథోడ్ బాబులాల్ తెలిపారు. ఐటిడిఎ ఆధ్వర్యంలో గర్భిణీల‌కు పోషకాహారం తోపాటు పండ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరుపుకోవాలని సూచించారు. గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది జ్యోతి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా హరిరామ జోగయ్య జన్మదిన వేడుకలు

ఘనంగా హరిరామ జోగయ్య జన్మదిన వేడుకలు 

రాజమహేంద్రవరం, పెన్ పవర్

మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ హోమ్ మంత్రి , కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి  హరిరామజోగయ్య 85వ జన్మదిన వేడుకలు సోమవారం రాజమండ్రి లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక గౌతమి జీవకారుణ్య సంఘంలోని సుమారు 100 మంది వృద్దులకు పండ్లు పంపిణి చేసారు.ఈ సందర్భంగా వృద్దులు హరిరామజోగయ్య  నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దీవించారు. ఈ కార్యక్రమంలో కాపుసంక్షేమ సేన రాజమండ్రి పార్లమెంటరీ అధ్యక్షులు చోడిశెట్టి చంద్రశేఖర్ , కార్యదర్శి పల్లెల వెంకట్ , రాజమండ్రి సిటీ నియోజకవర్గ అధ్యక్షులు చింతం వీరబాబు , అరిగెల దొరబాబు,న్యాయవాది మాదారపు మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయండి

 బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు  కృషి చేయండి

రాజమహేంద్రవరం, పెన్ పవర్

మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ ఆశయాల సాధనకు కృషి మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  నాయకులు రౌతు సూర్యప్రకాశరావుపిలుపునిచ్చారు. సోమవారం రాజమండ్రి, తాడితోట లోని ఏ.సీ.వై రెడ్డి కాలనీలో బాబూ జగ్గజీవన్ రామ్ యువజన కమిటీ అధ్యక్షుడు శ్రీ మంతుల రమణ ఆద్వర్యంలోని ఏర్పాటు చేసిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్గజీవన్ రామ్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబు జగ్జీవన్ రావు ఆశయసాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెల్లుబోయిన  సూర్యనారాయణమూర్తి, స్థానిక నాయకులు పోసుపో ప్రసాద్, వైరాల రాజు ,రొడ్డ కొండబాబు తదితరులు పాల్గొన్నారు.

సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నందు దోమతెరలు పంపిణీ

 సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నందు దోమతెరలు పంపిణీ

గోకవరం, పెన్ పవర్

మండల కేంద్రమైన గోకవరం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్  నందు  విద్యార్థులుకు సోమవారం  దోమతెరలను పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమంను రాజమండ్రి డివిజన్ మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్   సి.హెచ్.శ్రీనివాసరాజు మరియు ఎంపి.హెచ్.ఈ.ఓ.వైఎస్  రాయుడు సమక్షంలో వార్డెన్లు కుంచె దానవబాబు,  ద్వారా పిల్లలలకు దోమతెరలు పంచి పెట్టడం జరిగింది.మరియు కృష్ణుని పాలెం నందుగల సోషల్  వెల్ఫేర్  హాస్టల్ నందు విద్యార్థులు లకు అందరికీ మలేరియా మరియు కోవిడ్ శా0పిల్స్ తీసి పరీక్షలకు పంపడంమైనది.  వీటిని రిజల్ట్ కొరకు కాకినాడ పంపడమైనది. ఈ కార్యక్రమం లో కార్యక్రమంలో సి.హెచ్.ఓ మేరికృప హెల్త్ సూపర్ వైజర్ అశోక్ వర్ధన్   హెల్త్ అసిస్టెంట్స్ పవన్,రమణ, ధనరాజు ఏ.ఎన్.ఎమ్. వై.గంగాభవని పాల్గొన్నారు.

ఎఫ్.సి.ఐ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించిన అన్నదాతలు..

 ఎఫ్.సి.ఐ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించిన అన్నదాతలు..

అదానీ, అంబానీల నుండి భారత ఆహార సంస్థను కాపాడండి..

రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ధర్నా..

 పెన్ పవర్ తాడేపల్లిగూడెం

 రైతుల పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయాలి.  అంబానీ,అదానీల నుండి భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ)ని  కాపాడాలంటూ సంయుక్త కిసాన్ మోర్చా దేశ వ్యాపిత పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో తాడేపల్లి గూడెంలోని ఎఫ్.సి.ఐ జిల్లా కార్యాలయాన్ని సోమవారం అన్నదాతలు ముట్టడించారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం,కౌలు రైతుల సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో కేంద్ర సాగు చట్టాలు రద్దు చేయాలంటూ ధర్నా చేపట్టారు ఎఫ్ సి ఐ కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు రైతులు ఆందోళనతో ఎఫ్ సి ఐ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు ఎఫ్ సి ఐ కార్యాలయం వద్దకు అన్నదాతలు వెళ్లకుండా పోలీసులు బారీ గేడ్లు అడ్డుగా పెట్టడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అప్ ల్యాండ్ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ సిఐటియూ అప్ ల్యాండ్ జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, డెల్టా కార్యదర్శి పి.వి.ప్రతాప్,బి.కె.ఎం.యూ జిల్లా కార్యదర్శి కళింగ లక్ష్మణరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డెల్టా ఉపాధ్యక్షులు బళ్ల చినవీరభద్రం,అప్ ల్యాండ్ జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు, కాంగ్రెస్  జిల్లా నాయకులు మారినీడి బాబ్జి కౌలు రైతుల సంఘం జిల్లా కోకన్వీనర్ కొర్ని అప్పారావు తదితరులు మాట్లాడారు 1964లో ఏర్పడిన ఎఫ్ సి ఐ రైతులకు దేశ ప్రజలకు ఎంతో మేలు చేసిందని అన్నారు రైతుల నుండి పంటలను సేకరించడం దారిద్ర్యరేఖకు దిగువనున్న ప్రజలకు చౌకధరలకు అందించడం లక్ష్యంగా పనిచేస్తున్న ఎఫ్ సి ఐ ని కేంద్ర సాగు చట్టాల పేరుతో నిర్వీర్యం చేయడం దారుణం అని విమర్శించారు 412 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాలు నిల్వ చేయగలిగిన గోదాములను లక్షల కోట్లు విలువ గలిగిన ఎఫ్ సి ఐ ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడం దారుణమని విమర్శించారు కేంద్ర బిజెపి ప్రభుత్వం అప్రజాస్వామికంగా తెచ్చిన మూడు సాగు చట్టాలలో ఆహార భద్రత చట్టం ఒకటని, ఈ చట్టం అమలులోకి వస్తే ప్రజల ఆహార భద్రతకు తీవ్ర ముప్పు వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు కార్పొరేట్ కంపెనీలు రైతుల నుండి కారుచౌకగా పంటల కొనుగోలు చేసి వాటిని నిల్వ చేసుకుని ఎప్పుడైనా అమ్ముకునే వీలు  కల్పించడం వలన నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రూపాయలు లాభాలు కట్టబెట్టేందుకు కేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతుల పంటలకు మద్దతు ధరలు కల్పించకుండా శాంతకుమార్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తున్నారని చెప్పారు శాంతకుమార్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతుల నుండి ఆహార ధాన్యాల సేకరణ నిలిపివేసి చౌక దుకాణాల ద్వారా ఇచ్చే రేషన్ స్థానంలో నగదు బదిలీ ప్రవేశపెడతారని చెప్పారు ఎఫ్ సి ఐ ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వం చర్యలు వెంటనే విడుదల చేయాలని రైతు వ్యతిరేక సాగు చట్టాలను రద్దు చేయాలని కోరారు రైతుల పంటలకు మద్దతు ధరలు అమలు జరిగేలా మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తేవాలని డిమాండ్ చేశారు అన్నదాతల పోరాటానికి అందరూ అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు, జక్కంశెట్టి వెంకటలక్ష్మి, గన్నాబత్తుల నాగేశ్వరరావు, పి.గోవింద్, సత్తి కోదండరామిరెడ్డి, మడక రాజు,కరెడ్ల రామకృష్ణ, బాల బొమ్మల శ్రీనివాస్, టి వెంకటేశ్వరరావు, గోపిశెట్టి సూర్యనారాయణ, కొండపల్లి గణేశ్వరరావు, కంకటాల బుద్ధుడు, వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, రౌతు ఎల్లమ్మ, రామనాథం మురళీ తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్ బూత్ లు పరిశీలన

 పోలింగ్ బూత్ లు పరిశీలన

తాళ్లపూడి, పెన్ పవర్

 సోమవారం ఎన్నికల ఆర్డర్ ప్రకారం రూట్ అధికారి జోడాల వెంకటేశ్వరరావు, జోనల్ అధికారి జి.రుచిత ఇద్దరు కలిసి వాళ్ళ  జోన్లలోని అనగా తాడిపూడి, పోచవరం, అన్నదేవరపేట, గజ్జరం, పైడిమెట్ట, ప్రక్కిలంక గ్రామాల్లో తిరిగి ఆయా పోలింగ్ బూత్ లలో కనీస సౌకర్యాలు మరియు పోలింగ్ కేంద్రాల నంబర్లు అన్నీ ఉన్నాయో, లేదో అని పరిశీలన చేశారు. వీరితో పాటు ఆయా పంచాయతీల సెక్రటరీలు, గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

కొవ్వురులో బాబు జగజ్జివన్ రావు వేడుకలు

 కొవ్వురులో బాబు జగజ్జివన్ రావు వేడుకలు

పెన్ పవర్, కొవ్వూరు

దళితుల అభ్యున్నతి కోసం పాటు పడిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రావ్ అని రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమ తి డాక్టర్ తానేటి వనిత అన్నా రు. సోమవారం ,కొవ్వూరు పట్ట ణం లో బాబు జగజ్జివన్ రావు  పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా మంత్రి వారి క్యాంపు  కార్యాలయం లో, కొవ్వూరు  బజార్ లో ఉన్న బాబు జగ జ్జివన్ రావు  విగ్రహాలకి, కొవ్వూరు మెరక వీధి సెంటర్ లో బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహానికి మంత్రి పూల మాల తో  ఘన నివాళులు అర్పించా రు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూఆయన అడుగు జాడల్లో దేశం అభివృద్ధి పధం లో ముందుకు సాగేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని చె ప్పారు. అంటరానితనం రూపు మాపేందుకు ఎంతో కృషి చేసిన మహనీయులనీ అన్నారు.   ఆ యన ఉన్నత చదువులు చది వి బాగా కష్టపడి సమాజ అ భ్యున్నతికి కృషి చేయడం వల న అనేక పదవులు వరించాయ న్నారు.  ఆయన 50 ఏళ్ల రాజ కీయ ప్రస్థానం లో ఎన్నో మంచి పనులు చేశారన్నారు. ఆయన చేపట్టిన అన్ని పదవులకు న్యా యం చేశారన్నారు.  ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తె చ్చారని,  ఆయా రంగాల ప్రజ ల కు మేలు జరిగే కార్యక్రమా లు చేపట్టి అందరిలో మహనీ యునిగా నిలిచారని చెప్పారు.  సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఉన్నత పదవులు, ఉన్నత స్థాయి పేరు ప్రఖ్యాతులు ఉరికినే  ఎవరికీ అంత సుల భంగా రావన్నారు.  బాబు జగ జ్జీవన్ రామ్ ఉప ప్రధాని గా ఉండి, మంచి సంస్కరణ లు తీసుకువచ్చారని, ఎక్కడా రాజీపడకుండా  చిత్తశుద్ధితో కష్టపడి పనిచేసారన్నారు. కొవ్వూరు పట్టణం లో ఏమయినా ప్రజలకు సమస్య లు ఉంటే వార్డు కౌ న్సిలర్లు, మునిసిపల్ చైర్మన్ వారి దృష్టికి తీసుకు వెళ్లాలని మంత్రి అన్నారు. అటువంటి గొప్ప వ్యక్తుల మహానుభావుల జీవితాలను  ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకో వాలన్నారు .  ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్ పర్సన్ భావన రత్నకుమారి, మాజీ ఎమ్మెల్యే, టి.వి.రామారావు అక్షయ పాత్ర శ్రీనివాస రవీంద్ర, ఆర్. భాస్కర రావు, వరిగేటి లలిత కుమారి, బత్తి. నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...