Followers

భక్తులకు సకల సౌకర్యాలు కల్పించండి

 భక్తులకు సకల సౌకర్యాలు కల్పించండి

పెన్ పవర్, ఆలమూరు 

 ఉభయ గోదావరి జిల్లాల ఆరాధ్య దైవమైన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చింతలూరులో వేంచేసియున్న శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని  రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, రామచంద్రాపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి తెలిపారు. నెల రోజులు పాటు జరిగే జాతరపై బుధవారం ఆలయ ప్రాంగణంలో ముఖ్య శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా సబ్ కలెక్టర్, డీఎస్పీలకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం వారు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నెల 11వ తేదీ రాత్రి జాతరతో ప్రారంభమయ్యు మే 11వ తేదీ వరకు జరిగే అమ్మవారి తీర్థం, జాతర మహోత్సవం సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తమ చిన్నారులతో వస్తారని, కోవిడ్-19 నిబంధనలను అమలు చేస్తూ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించాలని వారు అన్నారు. 

అలాగే జాతర సందర్భంగా ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన బారికేడ్లను, రూట్ మ్యాప్ లను, తీర్థంకు కేటాయించిన స్థలాన్ని   పరిశీలించారు. ప్రతిరోజూ (శానిటేషన్) బ్లీచింగ్ చేయించాలని పంచాయితీ అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తులకు మంచినీటిని ఏర్పాటు చేయాలని అందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. జాతరలో ఎటువంటి అగ్ని ప్రమాదాలకు తావులేకుండ అగ్నిమాపక అధికారులు తగు జాగ్రత్తలు వహించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో మద్యం దుకాణాలలో అమ్మకాలు ఆపించాలని ఎక్సైజ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండపేట రూరల్ సిఐ కె మంగాదేవి, తహసీల్దార్ లక్ష్మీపతి, ఆలయ కార్య నిర్వాహక కార్యదర్శి ఏబీజే  రామలింగం, నామాల శ్రీనివాస్, మార్గాని ఏసు, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ పోచమ్మ, ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్, పంచాయితీ కార్యదర్శి పి సత్తిబాబు, ఆలయ సిబ్బంది నాగేశ్వర్రావు, పలువురు అధికారులు నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

హర్షం వ్యక్తం చేసిన గిరిజన నేత

హర్షం వ్యక్తం చేసిన గిరిజన నేత

నోడల్ ఏజన్సీ లో గిరిజన సంఘాల ప్రతినిధులకు అవకాశం కల్పించాలి 

ట్రైబల్ డెవలప్మెంట్ మిషన్(టిడియం) వర్కింగ్ ఛైర్మన్ ఓరుగంటి సుబ్బారావు

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

గిరిజన ప్రాంతాల్లో ఉండే చిన్నారులకు విద్యార్థి దశ నుంచే నైపుణ్యం పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం  చర్యలు తీసుకోవడం పట్ల ట్రైబల్ డెవలప్మెంట్ మిషన్(టిడియం) వర్కింగ్ ఛైర్మన్ ఓరుగంటి సుబ్బారావు హర్షం ప్రకటించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ మేరకు అధికారులకు ఆదేశించడం గిరిజన చిన్నారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక శ్రద్ధను తెలియపరుస్తుందన్నారు. ఇందుకోసం నైపుణ్యాభివృద్ధి శాఖ, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ ల ఆధ్వర్యంలో ఒక నోడల్ ఏజెన్సీ ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నదని, ఆ నోడల్ ఏజెన్సీ లో గిరిజన సంఘాల ప్రతినిధులకు సభ్యులుగా అవకాశం కల్పించాలని కోరారు. విద్యార్థులకు సాంకేతిక  ఆ పరిజ్ఞానాన్ని అందించే నైపుణ్య వికాసం పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఇంగ్లీష్, లైఫ్ స్కిల్స్,ఐటీ తదితర అంశాలతో పాటు నైపుణ్య వికాసం గురించి ఇంపాక్ట్ స్టడీ చేసి ఆ నివేదిక ఆధారంగా తగిన కార్యాచరణను సిద్ధం చేసి గిరిజన విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఇంగ్లీష్ భాష పై పట్టు సాధించేందుకు గిరిజన, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్లోదయం కార్యక్రమాన్ని ని ప్రారంభించటం అభినందనీయమని అన్నారు. ఈ ఆంగ్లోదయం కార్యక్రమాన్ని రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ట్రైబల్ డెవలప్మెంట్ మిషన్(టిడియం) వర్కింగ్ చైర్మన్ ఓరుగంటి సుబ్బారావు సూచించారు.

అలుపన కనకరెడ్డి ఆధ్వర్యంలో....పాప హోమ్ లో జాన్ వెస్లీ జన్మదిన వేడుకలు

 అలుపన కనకరెడ్డి ఆధ్వర్యంలో....పాప హోమ్ లో జాన్ వెస్లీ జన్మదిన వేడుకలు

మహారాణి పేట, పెన్ పవర్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జాన్ వెస్లీ జన్మదిన వేడుకలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 35వ వార్డు అధ్యక్షులు, అలుపన కనకరెడ్డి ఆధ్వర్యంలో, పాప హోమ్ లో పిల్లల మధ్య భారీ కేక్ కట్ చేసి అనంతరం పిల్లలకు  అల్పాహారం ఏర్పాటు  చేయడం  జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వార్డ్ అనుబంధ సంఘ ప్రెసిడెంట్ లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో జాన్ వెస్లీ జన్మదినోత్సవ వేడుకలు

 కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో జాన్ వెస్లీ జన్మదినోత్సవ వేడుకలు

మహారాణి పేట, పెన్ పవర్

వైయస్సార్సీపి రాష్ట్ర సీనియర్ నాయకులు జాన్ వెస్లీ పుట్టినరోజు వేడుకలు మంగళవారం డాబా గార్డెన్స్ లో ఉన్న  ప్రేమ సమాజంలో ఘనంగా జరిగాయి. 39వ వార్డు వైయస్సార్సీపీ  సీనియర్ నాయకురాలు,  జీవీఎంసీ జోన్-3 టి.ఎల్.ఎఫ్.అధ్యక్షురాలు కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో జాన్ వెస్లీ తో  జన్మదినోత్సవ కేకును కట్ చేయించారు.ఈ సందర్భంగా భారీ  అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.అనంతరం 29వ వార్డు భూపేష్ నగర్, నైట్ షెల్టర్ లో వున్న  అభాగ్యులకు జాన్ వెస్లీ చేతులమీదుగా దుప్పట్లు పంపిణీ,అన్నదానం కార్యక్రమాన్ని  చేపట్టారు. ఈ కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ రవీంద్ర భరత్,మైనార్టీ నాయకులు షరీఫ్ తో  పాటు 39 వ వార్డు వైసిపి నాయకులు,కార్యకర్తలు,ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గేటెడ్ కమ్యూనిటీ ల పేరుతో అక్రమంగా మూసివేసిన గేట్లను తక్షణమే తొలగించాలి

 గేటెడ్ కమ్యూనిటీ ల పేరుతో అక్రమంగా మూసివేసిన గేట్లను తక్షణమే తొలగించాలి.

గేటెడ్ కమ్యూనిటీ పేర్లతో మూనివేసిన అమూల్య హోమ్స్

పటించుకొని జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు

పెన్ పవర్,  మల్కాజిగిరి

అనుమతులు లేకున్నా అక్రమంగా గేటెడ్ కమ్యూనిటీ పేర్లతో మూసివేసిన రోడ్లను తక్షణమే తెరవాలని చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షుడు ఎంపల్లిపద్మా రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గేటెడ్ కమ్యూనిటీ పేర్లతో మూసివేసిన అమూల్య హోమ్స్ లో ఎదుట చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ఆధ్వర్యంలో స్థానికులు ధర్నా నిర్వహించి బైఠాయించారు. గేటెడ్ కమ్యూనిటీ ల పేరుతో రోడ్లను కబ్జా చేసి గేట్లను నిర్మించుకొని వాటిని సొంత అవసరాలకు నియోగించుకుంటున్న వైనంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  కాప్రా సర్కిల్ పరిధిలో గేటెడ్ కమ్యూనిటీ లో పేర్లతో రోడ్ల ఆక్రమణలకు పాల్పడుతూ నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలు లు, వ్యక్తులపై సంబంధిత శాఖల అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇకనైనా జిహెచ్ఎంసి, కాప్రా సర్కిల్ఉన్నతాధికారులు  స్పందించకపోతే ఈ ఆందోళనలు ఉద్యమ రూపం దాల్చుతాయని వారు హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో జమ్మిగడ్డ,  న్యూ వాసవి శివ నగర్ పరిసర కాలనీ వాసులు గగన్ కుమార్, మారబోయినచంద్రశేఖర్, అంజయ్య, లక్ష్మమ్మ, వెంకటమ్మ, వసంత, గీత , శ్వేతా, కల్పన,  దుర్గా రెడ్డి,  పరుశురాం, వెంకట్రావు, వలి తదితరులు పాల్గొన్నారు.

.ఉద్యోగాలు సాధించిన ఆస్పరెన్స్ అకాడమీ విద్యార్థులు

ఉద్యోగాలు సాధించిన ఆస్పరెన్స్ అకాడమీ విద్యార్థులు

మంచిర్యాల,  పెన్ పవర్

ఇటీవలే విడుదలైన సింగరేణి ఉద్యోగా ఫలితాల్లో స్థానిక మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆస్పరెన్స్ అకాడమీ నుండి 05గురు విద్యార్థులు ఉద్యోగులుగా ఎంపికైనారు. విజయం సాధించిన వారిలో ఎస్.రాజకుమార్,ఎస్.వినోద్ కుమార్,ఎం.శ్రీధర్, వి.సతీష్ కుమార్,జి.శరత్ కుమార్ లు ఉన్నారు.వీరిని శాలువతో సన్మానించారు. తొలి ప్రయత్నంలొనే విజయం సాదించడం ఎంతో ఆనందంగా ఉందని ఎంపికైన వారు పేర్కొన్నారు. సామాజిక సేవ అనే ఆంశంతో,పేదలకు కోచింగ్ ఇవ్వవడానికే ఆస్పరెన్స్ అకాడమీ ఉందని  డైరెక్టర్ నిహార్ వర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పరెన్స్ అకాడమీ డైరెక్టర్ నిహార్ వర్మ, ఉపాధ్యాయులు శ్రీకాంత్, సాయి కృష్ణ, గోపి, వేణు, రవీందర్ లు మరియ విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రశ్నిస్తే తప్పుడు కేసులు బనాయింపు

 ప్రశ్నిస్తే తప్పుడు కేసులు బనాయింపు

మందమర్రి,  పెన్ పవర్

మందమర్రి మండలం, పట్టణంలో  అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నా అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, రియల్ ఏస్టేట్ వ్యాపారం పై ప్రశ్నిస్తే స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ తన అధికార దర్పంతో, పట్టణ పోలీసులచే తప్పుడు కేసులు బనాయిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని మందమర్రి పట్టణానికి చెందిన హై కోర్ట్ అడ్వకేట్ ఎంవి. గుణ ఆరోపించారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో పలు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్న తనను స్థానిక టిఆర్ఎస్ నాయకులు, పోలీసులు అనేక పర్యాయాలు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇటీవల గిరిజన భూములను టిఆర్ఎస్ నాయకులు వారి బంధువుల చేత దొంగ పట్టా చేయించుకొని,1/70 చట్టాన్ని తుంగలో తొక్కి, స్వేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తుండగా, బాధితులకు అండగా పోరాటం చేస్తున్నందుకు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, పోలీసులు తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అరాచకాలు అధికమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసులను వెనక్కి తీసుకోకపోతే పిటిషన్ దారులు సైతం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని, ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల ప్రజా సంఘం కేంద్ర ప్రధాన కార్యదర్శి జయ వింద్యాల, జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు సహెరు భాను, పౌరహక్కుల ప్రజా సంఘం సభ్యులు విజయ్, ఫిరోజ్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...