Followers

రాష్ట్ర ప్రభుత్వం పంట పొలాలకు నష్ట పరిహారం చెల్లించాలి

రాష్ట్ర ప్రభుత్వం పంట పొలాలకు  నష్ట పరిహారం చెల్లించాలి ..

రోడ్డు పై  ధర్నా చేస్తున్నా  రైతులు 

గంభీరావుపేట,  పెన్ పవర్ 

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తాపనగర్ గ్రామం లో  బుధవారం రోడ్డు పై  రైతుల ధర్నా  చేశారు.  రైతులు ఆరు కాలం  శ్రమించి కష్టపడ్డ ఫలితం లేకుండా పోయిన పంట పొలాలకు  నష్ట పరిహారం  చెల్లించాలని  ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు. రోడ్డెక్కిన  రైతులకు  మద్దతుగా  ముందుకు వచ్చి న బారతీయ జనతా పార్టీ  నాయకులకు   రైతులు  తరుపున  కృతజ్ఞతలు  తెలిపారు. కార్యక్రమం లో బిజెపి జిల్లా  అధికార ప్రతినిది  ప్రసాద్ రెడ్డి బిజెపి మండల అధ్యక్షుడు గంట అశోక్, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ కాంత్ యాదవ్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్, మండల అధ్యక్షులు కోడే రమేష్ , ఓ బి సి  మోర్చా మండల అధ్యక్షులు మేకర్తి శ్రీనివాస్  మండల ఉపాధ్యక్షులు దేవేందర్ యాదవ్,  బిజెపి  సీనియర్  నాయకులు ప్రత్తి స్వామి, శేఖర్ యాదవ్, పర్శరాములు యాదవ్,  బండ దేవయ్య, రాజా  రమేష్,  వెంకట్రావు,  నరేష్   బిజెపి నాయకులు  పెద్దలు తదితరులు  పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట మండలంలో విజృంభించిన కరోనా

 ఎల్లారెడ్డిపేట మండలంలో విజృంభించిన  కరోనా

20 కరోనా పాజిటివ్ 

84 మందికి  నెగిటివ్ 

మండల వైద్యాదికారి డాక్టర్ ధర్మానాయక్ వెల్లడి

ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్ 

ఎల్లారెడ్డిపేట మండలంలో కరోనా విజృంభించింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో బుధవారం  104 మందికి కరోనా నిర్ధారణ కోసం పరీక్షలు చేయగా 20   కరోనా పాజిటివ్  రాగా 84 మందికి నెగిటివ్ వచ్చినట్టు మండల వైద్యాదికారి డాక్టర్ ధర్మానాయక్ తెలిపారు. గర్జనపల్లి లో 5 గురికి.ఎల్లారెడ్డిపేటలో నలుగురికి .గొల్లపల్లి లో నలుగురికి. తిమ్మాపూర్ లో ఇద్దరి కి.నారాయణ పూర్ లో ఓకరికి. బండలింగంపల్లిలో ఓకరికి. ఆల్మాస్ పూర్ లో ఓకరికి  కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు  నిర్దారణ అయ్యిందన్నారు. కరోనా నిర్దారణ అయిన వ్యక్తులు  కంట్రోల్ అయ్యేంతవరకు  కుటుంబ సభ్యులకు దూరంగా మాస్కులు దరించి ఉండాలని . ప్రతి రోజు గోరువెచ్చని నీటినే తాగాలనీ ఆయన పిలుపునిచ్చారు. కరోనా సోకినట్టు అనుమానం ఉన్న వ్యక్తులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోనీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లో సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ధర్మానాయక్ కోరారు. ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లో కోవీడ్ వాక్సినేషన్  కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. బుధవారం 47 మందికి కరోనా వాక్సిన్ వేసినట్లు డాక్టర్ ధర్మానాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 45 సంవత్సరాల వయస్సు పై బడిన ప్రతి ఒక్కరికీ ( దీర్ఘకాలిక వ్యాదులతో సంబంధంలేకుండా ) వాక్సిన్  ఇవ్వబడుతుందన్నారు.  లబ్దిదారులు అందరు కూడా ఆధార్ కార్డ్ తో రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా సద్వినియోగపర్చుకోవాలనీ ధర్మానాయక్ కోరారు.

పినవేమలి హత్య కేసు మిస్టరీని ఛేదించిన రూరల్ పోలీసులు

పినవేమలి హత్య కేసు మిస్టరీని ఛేదించిన రూరల్ పోలీసులు

విజయనగరం,పెన్ పవర్

విజయనగరం రూరల్ పిఎస్ పరిధిలోని పినవేమలి గ్రామంలో ఫిబ్రవరి 17న జరిగిన హత్య కేసు మిస్టరీని విజయనగరం రూరల్ పోలీసులు ఛేదించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ఏప్రిల్ 7, బుధవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. విజయనగరం మండలం పినవేమలి గ్రామానికి చెందిన కెంగువ రవి మరియు అదే గ్రామానికి చెందిన బాలి పైడిరాజుల మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయన్నారు. ఇరువురు ఒకే మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉండడం, దీని విషయమై ఇరువురి మధ్య విభేదాలు వచ్చినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడయ్యిందన్నారు. బాలి పైడిరాజు మరియు అతని స్నేహితులందరూ కలసి ఒకసారి పార్టీ చేసుకోవడం, తరువాత కెంగువ రవి మరియు అతని స్నేహితులు మరోసారి పార్టీ జరుపుకోవడం జరిగిందని, ఈ రెండు పార్టీలకు ఇరువురు కూడా హాజరయ్యారన్నారు. కెంగువ రవిని చంపాలనే ఉద్దేశ్యంతో బాలి పైడిరాజు ఫిబ్రవరి 17 రాత్రి ఒక పథకం ప్రకారం కెంగువ రవిని పార్టీకని గ్రామ పొలిమేరల్లోకి తీసుకొని వెళ్ళి, ఇరువురు పార్టీ చేసుకున్నారు. 

తదనంతరం, మద్యం మత్తులో ఉన్న కెంగువ రవిని బాలి పైడిరాజు గొంతు నులిపి హత్య చేసాడు. తరువాత శవాన్ని మాయం చేయాలన్న ఉద్దేశ్యంతో పైడిరాజు తన స్నేహితులైన జొన్నవలసకు చెందిన గారి నారాయణరావు అలియాస్ నాని (ఎ-2), సారిక గ్రామానికి చెందిన కింతాడ ఉదయ కిరణ్ (ఎ-3) మరియు విటి అగ్రహారంకు చెందిన ఇమంది సత్యనారాయణ (ఎ-4)ల సహాయం కోరగా, వారంతా సంఘటనా స్థలంకు చేరినారు. వారంతా సంఘటనా స్థలంకు చేరుకున్న తరువాత కెంగువ రవి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకుగాను చొక్కా తాటి మట్టలతో శవంను చెట్టుకు వ్రేలాడదీయగా, శవం బరువుకు క్రింద పడిపోవడం జరిగిందని నిందితులు విచారణలో వెల్లడించారు. (ఎ-2) అయిన గారి నారాయణరావు శవం కాళ్ళును కట్టేసి, శవంకు బరువును కట్టి,బావిలో పడేసినట్లయితే శవం ఎప్పటికీ బయటకు తేలదని సలహా ఇవ్వడంతో, వారందరూ కెంగువ రవి కాళ్ళును కట్టేసి, బరువుకు ఇటుకలను కట్టి, శవంను బావిలో పడేయం జరిగిందన్నారు. కెంగువ రవి తండ్రి అప్పలనాయుడు తన కుమారుడు గత ఫిబ్రవరి 17 రాత్రి నుండి కనిపించడం లేదని విజయనగరం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు మిస్సింగు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అనంతరం, పినవేమలి గ్రామ పొలిమేరల్లోని బావిలో ఒక పురుషుని శవం ఉన్నట్లుగా పశువుల కాపర్లు తెలపడం, సదరు శవం కెంగువ రవిదిగా నిర్ధారించి, బావి బయటకు తీయడం జరిగింది. రవి శవం కాళ్ళు కట్టి ఉండడంతో ఇది హత్యగా భావించి, మిస్సింగు కేసును హత్య కేసుగా మార్పు చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పోలీసు జాగిలాలతో సంఘటనా స్థలంను పరిశీలించగా, నిందితులు మద్యం సేవించిన దాఖలాలు, ఒకచెట్టు వద్ద రవి షర్టు లభించాయన్నారు. ఈ కేసులో అనుమానితులను విచారణ చేయడం, సరైన ఆధారాలు లేకపోవడంతో విడిచి పెట్టడం జరిగేది. అయితే, ఇటీవల కాలంలో బాలి పైడిరాజు తిరుపతి వెళ్ళినట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు, ఎవరితో కలసి బాలి పైడిరాజు తిరుపతి వెళ్ళాడన్నది విచారణ చేయగా, బాలి పైడిరాజు కుటుంబ సభ్యులతో కాకుండా అతని స్నేహితులైన గారి నారాయణరావు, కింతాడ ఉదయ కిరణ్ మరియు ఇమంది సత్యన్నారాయణలు కలిసి తిరుపతి వెళ్ళడంతో పోలీసులు అనుమానించి, వారిని మరోసారి విచారణ చేయడంతో నిందితులు నేరం  చేసినట్లుగా అంగీకరిచారన్నారు. ఈ కేసు విచారణలో విజయనగరం డిఎస్పీ పి.అనిల్ కుమార్ నేతృత్వంలో రూరల్ సిఐటిఎస్ మంగవేణి, ఎస్ఎ నారాయణరావు, ఎఎస్ఎ త్రినాధరావు, కానిస్టేబుళ్ళు షేక్ షఫీ, సాయి శంకర్‌లను జిల్లా ఎస్పీ బి. రాజకుమారి అభినందించి, వారికి ప్రోత్సాహక నగదు బహుమతిని అందజేసారు. ఈ మీడియా సమావేశం విజయనగరం డిఎస్పీ పి. అనిల్ కుమార్, రూరల్ సీఐ టిఎస్ మంగవేణి, ఎస్బీ సిఐ ఎన్.శ్రీనివాసరావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

స్మార్ట్ వార్డ్ గా 12వ వార్డు తీర్చిదిద్దుతా.. అక్కరమాని రోహిణి

స్మార్ట్ వార్డ్ గా 12వ వార్డు తీర్చిదిద్దుతా.. అక్కరమాని రోహిణి

అరిలోవ, పెన్ పవర్

తూర్పు నియోజకవర్గం 12వ వార్డు న్యూశాంతినగర్ లో రోడ్లు మెట్లు మార్గానికి, సెక్టార్3   నెహ్రూ నగర్ రోడ్డు పనులకు6 లక్షల తో శంకుస్థాపన చేసిన వార్డ్ కార్పొరేటర్ అక్కరమాని రోహిణి. అమ్మ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధికి దూరంగా ఉన్న ఈవార్డు నేను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సాయశక్తులా కృషి చేస్తానని దానిలో భాగంగానే 22 లక్షల రూపాయలతో వాటిలో అభివృద్ధి పనులకు  శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో వార్డు అభివృద్ధికి, సంక్షేమానికి, పెద్ద పీట వేస్తామని 98 వార్డులలో 12వ వార్డును స్మార్ట్ వార్డ్ గాతీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి వార్డు అధ్యక్షులు కన్నెటి సుబ్బారెడ్డి . సత్తి మందారెడ్డి. ఒమ్మి పైడిరాజు. తాత బాబు  సుజాత. మోహన్. సూర్య రావు తదితరులు పాల్గొన్నారు.

10 న ఆర్ .కె .మీడియా హౌస్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు

 10 న ఆర్ .కె .మీడియా హౌస్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు 

విశాఖపట్నం, పెన్ పవర్

మీడియా ప్రమోషన్ రంగం లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న  ఆర్ కె మీడియా హౌస్ ఆధ్వర్యంలో ఈనెల 10న  ఉగాది పురస్కారాలు కార్యక్రమాన్ని రియల్ ఎస్టేట్  రంగం లో తనదైన ముద్ర వేసుకున్న డ్రీమ్  షెల్టర్స్ ఇన్ఫోమాటిక్స్ సౌజన్యం తో నిర్వహిస్తున్నారు.  ఈనెల  10 వ  తేదీన హోటల్ మేఘాలయలో సాయంత్రం ఆరు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.ఈ సందర్భగా ఉగాది పురస్కారాలు  పోస్టర్ ను డ్రీమ్ షెల్టర్స్ ఇన్ఫోమాటిక్స్ చైర్మన్ కె. రవిశంకర్  బుధవారం ఆవిష్కరించారు.ప్రతి ఏటా  వినూత్న కార్యక్రమాలు తో ప్రజలు మన్ననలను అందుకుంటున్న ఆర్ కె మీడియా హౌస్ ఈ సంవత్సరం  ఉగాది పురస్కారాలు కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అని రవి శంకర్ అన్నారు.ఈ కార్యక్రమం లో తమని భాగస్వామ్యం చేయడం ఆనందం గా ఉందని  అన్నారు. భవిష్యత్ లో ఆర్ కె మీడియా హౌస్ మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాక్షించారు. ఆర్కే మీడియా హౌస్ మేనేజింగ్ డైరెక్టర్ బి. రవికాంత్ మాట్లాడుతూ  వివిధ రంగాలలో ప్రతిభావంతులైన వ్యక్తులను పురస్కార గ్రహీతలుగా  ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఆర్ కె మీడియా హౌస్ కు దేశం లోనే కాకుండా విదేశాలలో కూడా వినియోగదారులు ఉన్నారని చెప్పారు. .డిజిటల్ మీడియా ,విజువల్ పబ్లిసిటీ రంగం లో గత ఐదు సంవత్సరాలు గాఅనేక సేవలు అందిస్తున్నాం అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్ షెల్టర్స్ఇన్ఫోమాటిక్స్  మార్కెటింగ్ డైరెక్టర్ హరి కుమార్ , ఆర్కే మీడియా హౌస్ ప్రతినిధులు చందు, వాసుపల్లి కుమార్  ఇతర సభ్యులు పాల్గొన్నారు.

ఆనందమయమయిన అరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం

 ఆనందమయమయిన అరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం

మహారాణి పేట, పెన్ పవర్

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రజారోగ్య వేదిక మరియు ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ సంయుక్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఆనందమయమయిన అరోగ్య కరమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం అనే నినాదం తో ప్రజారోగ్యం ప్రభుత్వాల బాధ్యత అని అధ్యక్షత వహించిన టి.కామేశ్వరరావు మాట్లాడుతూ జి.డి.పి లొ కనీసం 5% కేటాయించాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ చాలా సంవ్సరాలుగా సూచిస్తుంది అని తెలియజేశారు దీనిలో భాగంగా సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టారు మొదటి సంతకం రిటైర్డ్ డి.ఎమ్ ఎండ్ హెచ్.ఒ డాక్టర్. పి.రామారావు చేసి ప్రారంబించారు అనంతరం పి.ఏ.వి. నాయకులు డాక్టర్.వై.ఎల్.ఎన్.రావు. సంతకం చేసి మాట్లాడుతూ ప్రభుత్వం భాధ్యత వహించాలండం పూర్తిగా సమర్థనీయమని తెలియజేశారు.

ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ నాయకులు చంద్రమౌళి మాట్లాడుతూ ప్రభుత్వం బడ్జెట్ ప్రభుత్వ రంగం లోనే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు, పి.పి.సి నాయకులు హుస్సేన్  మాటలాడుతూ ఇప్పుడున్న పిస్థితుల్లో కొవిడ్, నాన్ కోవిడ్, కు వ్యాక్సినేషన్ పూర్తి వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వమే అందిచాలి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏ.పి.ఎమ్.ఏస్.ఆర్.యు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్  ఉపాధ్యక్షులు కేశవ్ సహయకర్యధర్సి జగన్  పెద్దమొత్తంలో మెడికల్ రేప్స్,ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు, సంతకాల కార్యక్రమంలో ప్రజలు భాగా స్పందించి పాల్గొన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి విధులు నిర్వహించండి

 ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి విధులు నిర్వహించండి

సమయ పాలన పాటించండి

సజావుగా పోలింగ్ సామగ్రి పోలింగ్ కేంద్రాలకు తరలించండి

సి.సి.కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ

ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్

పార్వతీపురం, పెన్ పవర్

ఎం.పి.టి.సి, జెడ్.పి.టి.సి  ఎన్నికలు ఈ నెల 8వ తేదీన పోలింగ్ , 10వ తేదీన కౌంటింగ్ కు సంబంధించి ఎటువంటి అవాంతరం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. బుధవారం ఎం.పి.టి.సి, జెడ్.పి.టి.సి ఎన్నికల నిర్వహణకు సంబంధించి   పార్వతీపురం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం మండలాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను సందర్శించారు. ప్రతి ఒక్కరు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరిస్తూ విధులు నిర్వహించాలన్నారు. పి.ఓలు, ఎ.పి.ఓలు,  పోలింగ్ సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రానికి సంబంధించిన పోలింగ్ సామగ్రి సరి చూసుకోవాలని సూచించారు. అనంతరం  స్ట్రాంగ్ రూమ్ భద్రత, సి.సి.కెమెరాల పనితీరు, కౌంటింగ్ కేంద్రం సంబంధిత అధికారులతో పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారి పనుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి చేపట్టవలసిన పనులకు సంబంధించి పలు సూచనలు అందించారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ  సమయపాలన పాటించి ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని అన్నారు. సి.సి.కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని అన్నారు. ముందుగా ప్రాజెక్ట్ అధికారి మండలాల్లో పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాలలో పోలింగ్ సిబ్బందికి అల్పాహారం, భోజన ఏర్పాట్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం మండలాల తహసీల్దార్లు, ఎం.పి.డి.ఓ లు ఎన్నికల విధులకు హాజరైన పి. ఓలు, ఎ.పి. ఓలు పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...