Followers

నూతనంగా నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ ను త్వరలోనే అందుబాటులోకి తెస్తాం

 నూతనంగా నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ ను త్వరలోనే అందుబాటులోకి తెస్తాం

మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య...

తొర్రూరు, పెన్ పవర్

అన్నారం రోడ్డులో నూతనంగా నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య అన్నారు. గురువారం ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ నందు కమిషనర్ గుండె బాబు,స్థానిక వార్డు కౌన్సిలర్ రోజాతో కలిసి, బోర్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... తొర్రూరు పట్టణ ప్రజల కోసం అన్నారం రోడ్డులో నూతనంగా నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ పట్టణ వాసుల కోసం నిర్మించడం జరిగిందన్నారు. త్వరలోనే దీనిని అందుబాటులోకి తెస్తామని, అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు మాడుగుల నట్వర్, ఏన్నమనేని శ్రీనివాసరావు, కొలుపుల శంకర్, తెరాస నాయకులు దొంగరి శంకర్, బిజ్జల అనిల్, జె సింగ్ నాయక్, రవి జంప్పా తదితరులు పాల్గొన్నారు.

నిషేధిత గుట్క ప్యాకెట్లు పట్టివేత

 నిషేధిత గుట్క ప్యాకెట్లు పట్టివేత

రాజన్న సిరిసిల్ల , పెన్ పవర్

ప్రభుత్వం నిషేధించిన   1,20,000/- రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం ఎస్పీ  రాహుల్ హెగ్డే  ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు చంద్రంపేట గ్రామంలో ఎల్లంకి శ్రీనివాస కిరాణా షాపులో తనిఖీ చేయగా నిషేధిత గుట్కా లభ్యమైంది. నిషేధిత గుట్కా విలువ అందాజ ఒక లక్ష ఇరవై వేల రూపాయల (1,20,000/-) విలువ గలదు. తగు చర్య నిమిత్తం సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో ఎల్లంకి శ్రీనివాస్ మరియు నిషేధిత గుట్కా ను అప్పగించారు.  ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు, అంబర్ ప్యాకెట్లు, అమ్మడం మరియు ఇండ్లల్లో దాచి పెట్టడం నేరం మరియు గ్రామాలలో  గుట్కా, మద్యం, ఎవరైనా అమ్మితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపినారు. గ్రామాలలోని ప్రజలు మరి యువకులు ఏదైనా సమాచారం ఉంటే  డయల్ 100 కు, స్థానిక పోలీస్ అధికారులకు  సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు  గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ టాస్క్ లో టాస్క్ఫోర్స్ ఎస్.ఐ వెంకటేశ్వర్లు, రాంరెడ్డి సిబ్బంది తిరుపతి బాబు రమేష్, తిరుపతి పాల్గొన్నారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే వారిపట్ల కటిన చర్యలు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే వారిపట్ల  కటిన చర్యలు

ఎల్లారెడ్డిపేట సి ఐ మొగిలి

రాజన్న సిరిసిల్ల ,  పెన్ పవర్

ఎల్లారెడ్డిపేట పోలీస్ సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిథిలో నీ అన్ని గ్రామాలలో ప్రజలకు శాంతి భద్రతలను కాపాడటమే  ధ్యేయంగా పని చేస్తానని ఎల్లారెడ్డిపేట సి ఐ కే. మొగిలి, తెలిపారు. ఎల్లారెడ్డిపేట సి ఐ గా బదిలీ పై  వచ్చిన సి ఐ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టి గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అమలు చేస్తూనే , చట్టాన్ని ఉల్లంఘించే వారిపట్ల కటినంగా వ్యవహరిస్తామని  సి ఐ హెచ్చరించారు. నిషేధిత గుట్కా, గంజాయి, బెల్లం విక్రయాలను అరికడతామని  సేవించే, విక్రయించే వారిని గుర్తించి కటినంగా శిక్షిస్తామని సి ఐ తెలిపారు. అక్రమ ఇసుక రవాణా దారులపై  కటినంగా వ్యవహరిస్తామని  అన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, ఈవ్ టీజింగ్ కు పాల్పడే వారి పట్ల కూడా కటినంగా వ్యవహరించి వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి కటిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే గ్రామాలలో అనుమానిత వ్యక్తులు సంచరించినా, దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారి ఆచూకీ తెలిసిన నిర్భయంగా పోలీసుల కు సమాచారం ఇవ్వాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన , గ్రామాలలో  అక్రమంగా బెల్ట్  షాపులు నిర్వహించిన ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసేవారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అలాగే కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వున్నందున గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , ప్రతి ఒక్కరూ  విధిగా  మాస్క్ ధరించాలని కోరారు. భౌతిక దూరం పాటించి కరోనా నిభందనలు  పాటించి కరోనా  కట్టడికి సహకరించాలని  సి ఐ మొగిలి,  కోరారు.

మాస్కులు ధరించకపోతే జరిమానా విధిస్తాం

 మాస్కులు ధరించకపోతే జరిమానా విధిస్తాం. ఎంపీఓ గౌస్.

తొర్రూరు, పెన్ పవర్

 కరోనా నియంత్రణ చర్యలు పకడ్బందీగా అమలు చేస్తామని, మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తామని, ఎంపీఓ గౌస్ తెలిపారు. గురువారం మండలంలోని నాంచారి మడూరు గ్రామ పరిధిలో  మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారికి పంచాయతీ రాజ్ సిబ్బంది జరిమానా విధించారు. ఒక్కొక్కరికి రూ. 100 చొప్పున 13 మందికి రూ.1300 జరిమానా విధించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.... కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తలు మరువకూడదన్నారు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు భౌతికదూరం పాటించాలన్నారు. మాస్కు ధరించడం, కొవిడ్‌ నిబంధనలు పాటించడం, ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి, మాస్కు ధరించడం తప్పనిసరన్నారు. ప్రజలు గుంపులుగా ఉండవద్దన్నారు.  45 ఏళ్ల వయస్సు గల వారు కరోనా నియంత్రణకు టీకా వేసుకోవాలన్నారు. వ్యాక్సిన్ పై అపోహలు నమ్మవద్దన్నారు. ఈ తనిఖీల్లో కార్యదర్శి ఉషారాణి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సీ ఎం ఆర్ ‌ఎఫ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ..

 సీ ఎం ఆర్ ‌ఎఫ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ.. 



కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం అని ఎమ్మెల్యే కే పి వివేకానంద్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 57 మందికి ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.22.68 లక్షల విలువ గల చెక్కులను చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కేపి వివేకానంద లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటూ, ఆపద సమయంలో సీఎంఆర్‌ఎఫ్‌ పథకం ద్వారా ఆదుకుంటున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ మానవతా దృక్పథంతో సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనేక మంది సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా లబ్ధి పొందుతున్నారని, ప్రభుత్వం ద్వారా ఎల్వోసీ కూడా అందించడంతో ఎంతో మంది బాధితుల ప్రాణాలు నిలుస్తున్నాయని అన్నారు. అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన నియోజకవర్గ ప్రజలు సీఎంఆర్‌ఎఫ్‌ పథకంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం

సంతబొమ్మాళి, పెన్ పవర్

ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం. ఎంపీడీవో విశ్వేశ్వరరావు. నేడు జరగనున్న ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి సంతబొమ్మాళి మండలంలో ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తూ సర్వం సిద్ధం చేశామని సంతబొమ్మాళి మండలం ఎంపీడీవో విశ్వేశ్వరరావు తెలిపారు. మండల ఎన్నికల ప్రత్యేక అధికారిగా మత్స్యశాఖ డి డి శ్రీనివాస రావు  పర్యవేక్షణ నిర్వహిస్తారని తెలిపారు. మండలంలో 12 రోడ్లు ఏర్పాటు చేసినట్లు, నాలుగు జోనల్ గా విభజించి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 67 మంది పీ వివో లు, 268  మంది ఏపీవో లు ఎన్నికల్లో పాల్గొని విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఇప్పటికే ఆయా రోడ్లకు వాహనాలు మెటీరియల్లో పూర్తిస్థాయి బందోబస్తు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

"జీతాలు వేయండి..మహాప్రభో"

 "జీతాలు వేయండి..మహాప్రభో"

మహారాణి పేట, పెన్ పవర్

ప్రమాదకర కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి పని చేస్తుంటే జీతాలు కూడా ఇవ్వడం లేదని తీవ్ర వేదన ఐదు నెలలుగా జీతాల్లేక కుటుంబాలతో పస్తులు.“జీతాలు చెల్లించండి మహా ప్రభో” అంటూ ప్రభుత్వ ఘోషా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు ఆకలి కేకలు పెడుతున్నారు. ఐదు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఘోషా ఆస్పత్రి ముంగిట ఏపీ మెడికల్  కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ధర్నా కార్యక్రమం చేపట్టింది.ఐదు నెలలుగా జీతాలు లేకపోవడంతో పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని. 

యూనియన్ ప్రధాన కార్యదర్శి జె.డి. నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రమాదకర కరోనా పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వకపోవడంతో వారు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.చేతిలో పైసా లేకపోవడంతో కుటుంబాలతో పస్తులు ఉంటున్నారని విచారం వ్యక్తం చేశారు.దిక్కుతోచని స్థితిలో పారిశుద్ధ్య కార్మికులు ఉంటే ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే వారికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.లేకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...