Followers

ముస్లిం మైనారిటీల సమస్యల పరిష్కారానికి తప్పక కృషి చేస్తాను..సబిరా బేగం

 ముస్లిం మైనారిటీల సమస్యల పరిష్కారానికి తప్పక కృషి చేస్తాను..సబిరా బేగం


విశాఖపట్నం, పెన్ పవర్

77 వ వార్ద్ మైనారిటీ అధ్యక్షులు దావూద్ ఆధ్వర్యంలో ఇస్లాంపేటలో సన్మానసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పరేషన్ కు డైరెక్టర్లుగా నియమితులైన సబిరా బేగం (బీసీ షేక్ కోర్పొరేషన్), 53వ వార్డ్ కార్పొరేటర్ భర్కత్ ఆలి,షేక్ మున్ని, బషీరున్నిష,కాప్సన్ మెంబర్ గా నియమితులైన షరీఫ్, 77వ వార్డ్ కార్పొరేటర్ బట్టు సూర్యకుమారి,66వ వార్డ్ కార్పొరేటర్ ఇమ్రాన్,39వ వార్డ్  కార్పొరేటర్ సాదిక్  ముఖ్య అతిథులుగా హాజయ్యారు.వారికి పుష్ప గుచ్చలు అందచేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. 

బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ సబిరా బేగం వారికి పేరు పేరునా  ధ‌న్య‌వాదాలు తెలుపుతూ వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగ మాటల ప్రభుత్వం కాదని ఇది చేతల ప్రభుత్వమని మైనారిటీల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వం ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని,జగనన్న ప్రభుత్వం మైనారిటీలకు పెద్ద పీట వేసిందన్నారు. ముస్లిం మైనారిటీలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  పెద్దలు సర్దార్ మాస్టర్,అబ్దుల్ సుభన్,ముస్తఫా,గాఫ్ఫార్, అదిల్,షకిర్,నూర్ తాజ్ యూత్,అజాద్ యూత్ యువకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ప్రమాదం జరిగితే కానీ పట్టించుకోరా

 ప్రమాదం జరిగితే కానీ పట్టించుకోరా

కన్నెపల్లి,  పెన్ పవర్

మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలంలోని మెట్టు పల్లి గ్రామంలో లో అంగడి సంత రోడ్డు వద్ద ప్రమాదకరంగా మిషన్ భగీరథ పైపు గేట్ వాల్ పెద్ద గుంత ఏర్పాటు చేశారు. గత రెండు నెలల నుండి మెట్టుపల్లి పాలక వర్గానికి చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. మెయిన్ రోడ్డు పక్కన ఉండటం చేత ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇచ్చే క్రమంలో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని వాహనదారులు .ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రమాదాలు జరగక ముందు గేట్ వాల్ తొలగించి కొంత ని పూడ్చి సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు ప్రజలు అధికారులను పాలకవర్గాన్ని కోరుతున్నారు.

అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర

అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర 

అనకాపల్లి, పెన్ పవర్

ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం లో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర సందర్భంగా గురువారం, దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఉత్సవ ప్రత్యేక అధికారి ఎస్.జ్యోతి మాధవి ఆలయంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. రాతి దేవాలయ ప్రతిపాదించిన మ్యాప్  ఆమె అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  శ్రీ నూకాంబిక ఉత్సవాలు ఈ నెల 10 తారీకు నుండి మే 11 వరకు నెల రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి అని తెలియజేశారు. కరొన వ్యాధి రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ఆలయానికి వచ్చే భక్తులు అందరూ మాస్కు ధరించి రావాలని ఆమె తెలియజేశారు. మాస్క్ లేని ని భక్తులకు ఆలయంలో ప్రవేశం లేదని, ఆలయానికి వచ్చే భక్తులకు సిబ్బంది శానిటైజర్ చేయాలని ఆమె అన్నారు. ఉష్ణోగ్రత మిషన్ ద్వారా భక్తులకు చెక్ చేసి 100 లోపు ఉన్న వారిని ఆలయంలోకి పంపిస్తామని అని తెలియజేశారు. ఆలయము చుట్టూఉన్న వ్యాపారస్తుల అందరూ మాస్కులు, శానిటైజర్ వాడాలని లేనియెడల పోలీసు, రెవెన్యూ సిబ్బంది సహకారంతో  తొలగించబడుతుంది అని తెలియజేశారు, క్యూలైన్లలో ద్వారా వచ్చే భక్తులు దూరం పాటించి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఉత్సవాల్లో సమన్వయ కమిటీతో ఇటీవలే మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని,పోలీసు,రెవెన్యూ,ఆరోగ్యశాఖ,విద్యుత్ శాఖలవారు ఉత్సవాల్లో స్టాల్స్ఏర్పాటు చేస్తారని తెలియజేశారు.పోలీస్ ఔట్ పోస్ట్ ఈ నెల రోజుల పాటు జరిగే ఉత్సవాలకు విద్యుత్ శాఖ అధికారులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆమె విద్యుత్ శాఖ సిబ్బందితెలియజేశారు. జి.వి.ఎమ్.సి, సిబ్బంది, త్రాగునీరు,పారిశుద్ధ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని  తెలియజేశారు. ఆలయంలో జరుగుతున్న ఉత్సవ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు,ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ సిబ్బందికి సూచించారు. కరోణా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆమె తెలియజేశారు.అత్యవసర సమయములో 104,108 వెహికల్ కూడా ఉంటాయని తెలియజేశారు. ఆమె వెంట,జిల్లా ఖోఖో సంఘం అధ్యక్షులు దాడి జైవీర్, ఆలయ ఇంచార్జి ఈ ఓ, బి.ఎల్.నగేష్,దేవాదాయ శాఖ అధికారులు శ్రీనివాసరాజు,సైదులు తదితరులు పాల్గొన్నారు.

ఐక్య ఉద్యమాలతో మోడీ విధానాలను త్రిప్పి కొడదాం

ఐక్య ఉద్యమాలతో మోడీ విధానాలను త్రిప్పి కొడదాం

మహారాణిపేట,పెన్ పవర్

ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావుల రవీంద్రనాధ్ మోడీ నాయకత్వంలో వున్న కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఇక్క ఉద్యమాలతో త్రిప్పి కొడదామని, తద్వారా ప్రభుత్వరంగ సంస్థలను రక్షించుకుందామని ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావుల రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు.జివియంసి గాంధీ విగ్రహం వద్ద 7వ రోజు రిలే నిరాహారదీక్షలను ఆయన ప్రారంభించారు. ముఖ్య అతిధిగా రవీంద్రనాథ్ పాల్గొని మాట్లాడుతూ సరేంద్రమోడీ ప్రభుత్వం కార్మికులకు ఉన్న చట్టాలను 4 లేబర్ కోడ్ గా మార్చి యజమానులకు నేరుగా సహకరిస్తుందని ఎద్దేవా చేసారు. దేశంలో వుండే సంపదను అంబానీ, అధాని చేతుల్లో పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని, అందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు రక్షణరంగం, రైల్వే, బిఎస్ఎన్ఎల్, ఆయిల్ రంగ పరిశ్రమలు,ఇన్యూరెన్స్ బ్యాంకులు వంటి ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా కార్పోరేట్స్ కి కట్టబెడుతుంది. రైతులకు నష్టదాయకమైన నల్ల చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయరంగాన్ని నాశనం చేయడానికి పూనుకుందన్నారు. ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డల్లీలో రైతు పోరాడుతున్న దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులు గత 60రోజుల నుండి పోరాటం చేస్తున్నా నిమ్మకు నీరెత్తునట్లుగా వ్యవహరిస్తుందన్నారు. కార్మికులు కర్షకులు మోడీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఐక్య ఉద్యమాలు చేపడతామన్నారు. ఈ నెల 18న ఢిల్లీలో పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న రైతు నాయకులు విశాఖకు వచ్చి స్టీల్ ప్లాంట్ కార్మికులకు తమ మద్దతు ఇవ్వబోతున్నారని తెలిపారు.ఈ దీక్షా శిబిరంలో వేదిక ఛైర్మన్ ఎం.జగ్గునాయుడు అధ్యక్షత వహించారు.వేదిక కమిటీ సభ్యులు సీఐటీయూ అధ్యక్షులు  కుమార్, వామనమూర్తి, రెహ్మన్, మన్మథరావు, సురేష్, ప్రియాంక, సిబటియు నగర కార్యదర్శి పి.మణి, ఎన్. సుబ్బారావు, వై.రాజు దీక్షలో కూర్చున్న వారికి పూలదండలు వేసి ప్రారంభించారు 7వ రోజు దీక్షలో ఆరిలోవ సిబటియు కార్యదర్శి వి. నరేంద్రకుమార్, బద్వా కార్యదర్శి ఎస్.రంగమ్మ నాయకత్వంలో సిఐటియు, ఏఐటీయూసీ ,బద్వా సభ్యులు నాగరాజు, భూలోకరావు, అప్పారావు, రాంబాబు,రమణ, బాబురావు శాంతి, శ్రీదేవి, గౌరిలతో పాటు ప్రజా నాట్యమండలి కళాకారులు కళారూపాలు ప్రదర్శించి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

యాండ్రపు ఫాతిమా రాణి ని కలిసిన 41వ వార్డు వై.ఏస్.ఆర్.సి.పి, యువత

 యాండ్రపు ఫాతిమా రాణి ని కలిసిన 41వ వార్డు వై.ఏస్.ఆర్.సి.పి, యువత 

మహారాణి పేట, పెన్ పవర్

జివియంసి 98 వార్డులకు ప్రతిష్టాత్మకమైన కో ఆప్షన్ మెంబర్ గా ప్రతిపాదించబడిన మాజీ ఉడా ఛైర్మన్ యాండ్రపు మరియదాసు  కోడలు యాండ్రపు ఫాతిమా రాణి ని 41వ వార్డు వై.ఏస్.ఆర్.సి.పి, యువత  మర్యాదపూర్వకముగా కలవటం జరిగినది.ఈ కలయికలో అబివృద్దిలో యువత దే ప్రధాన స్థానమని వారియొక్క విశేష విచక్షణా జ్ఞానాలతో అభివృద్దిలొ పాలు పంచుకోవాలని ఆమె వారిని కోరారు. కార్యక్రమంలో గర్బాపు శేఖర్,పిల్లి గోవింద్,యాండ్రపు జీవన్,లక్ష్మణ్,బ్రహ్మాజి,జక్కాన బాలు,కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

సంకల్ప సభను జయప్రదం చేయండి

 సంకల్ప సభను జయప్రదం చేయండి

మందమర్రి,  పెన్ పవర్

వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో మార్చి 9న ఖమ్మం పెవిలియన్ మైదానంలో జరుగు సంకల్ప సభకు జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ నాయకులు ముల్కల రాజేంద్ర ప్రసాద్, షేక్ అజీమోద్దీన్ కోరారు. గురువారం మందమర్రి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం నెలకొల్పేందుకు చలో ఖమ్మం సంకల్ప మహాసభకు జిల్లాలోని వైయస్సార్ అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో దొరల పాలన అంతమై వైయస్ షర్మిల నాయకత్వంలో రాజన్నరాజ్యం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుద్దాల ప్రభుదేవ్, రాజు, అజయ్, చరణ్, నవీన్, ధనుష్ తదితరులు పాల్గొన్నారు.

ఒడిశా అధికారులు నాయకులపై కేసు నమోదు చేయండి..భీశెట్టి

 ఒడిశా అధికారులు నాయకులపై కేసు నమోదు చేయండి..భీశెట్టి

విజయనగరం,పెన్ పవర్

  ఆంధ్ర, ఒడిశా రాష్ట్రల మధ్య దశాబ్దాలుగా వివాదం ఉన్న కొఠియా గ్రూపు గ్రామాల్లో ప్రాదేశిక ఎన్నికలు జరగనివ్వ బోమని వీరంగం సృష్టిస్తున్న ఒడిశా అధికారులు,నాయకులు పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేసులు నమోదు చెయ్యాలని లోక్సత్తాపార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి డిమాండ్ చేశారు,గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ  ఒడిశా ప్రభుత్వం కి ప్రతిసారి ఇది అలవాటుగా మారిపోయిందని పంచాయతీ ఎన్నికల్లో ఇదే తీరున వ్యవహరిస్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిందని, స్టేటస్కో కి వ్యతిరేకంగా ఒడిశా ప్రభుత్వం రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని భీశెట్టి మండిపడ్డారు ముక్యంగా గంజాయిభద్ర పట్టుచెన్నూరు,పగులు చెన్నూరు ప్రజలు ఓట్లు వెయ్యకుండా ముందురోజునే గ్రామ సరిహద్దుల్లో రాళ్లు పేర్చడం, సరిహద్దు ప్రాంతాల్లో కరోనా ఉందనే నెపంతో కర్ఫ్యూ విధించడం మంచిపద్దతి కాదని సాలూరు మండలం లోని గిరిజన ప్రాంతాల్లో 16 ఎంపీటీసీ సెగ్మెంట్లు, ఒక జెడ్పీ టీసీ  స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయని ఒడిశా అధికారులు నాయకులు 21 వివాదస్పద గ్రామాల్లోని ఎన్నికలు జరగకుండా అల్లర్లు సృష్టించుతున్నారని  సుప్రీంకోర్టు సూచనలను కూడా పట్టించుకోకుండా నడవడాన్ని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకోవాలని భీశెట్టి డిమాండ్ చేశారు,

పిఓ కూర్మనాధ్ సాహసం అద్భుతం!!

     కీలక మైన ప్రాదేశిక ఎన్నికల్లో ఒడిశా ప్రభుత్వం వేసిన సరికొత్త ఎత్తుగడలు చిత్తు చేస్తూ కోఠియా పరిధిలోని కీలకమైన గ్రామాల్లోని గిరిజనులు ను పోలీసులు సహాయం తో చైతన్య పరుస్తూ గిరిజనులు ఓట్లు వేసేలా చర్యలు చేపట్టడం గొప్ప సాహాసమని లోక్సత్తాపార్టీ నుండి పోలీసులను ఐటిడిఏ ప్రోజెక్టు అధికారి కూర్మనాధ్ ని అభినందిస్తున్నామని అన్నారు,ఒడిశా రాష్ట్రం తో కోఠియా విష్యమై అమీ తుమి తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ని భీశెట్టి కోరారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...