Followers

విద్యుత్ కేవీ ఘాతానికి యువకుడు మృతి

 విద్యుత్ కేవీ ఘాతానికి యువకుడు మృతి

సీతానగరం, పెన్ పవర్

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం లంకూరు గ్రామానికి చెందిన తారాజుల.గండ్డి పోసియ్య (వయస్సు 32) అను యువకుడు  సీతానగరం లంక పొలాల్లో దాళవ గడ్డపాయ సమీపం నందు వ్యవసాయం పని చేస్తుండగా 11/కె.వి వైరు  షార్ట్ సర్క్యూట్ కావడంతో ఘటనా స్థలంలో నే యువకుడు మృతి చెందడంతో కుటుంబీకులు గ్రామస్తులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వై.సుధాకర్ వైద్య పరీక్షల నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.

.బ్రాహ్మణ కొత్తపెల్లి గ్రామం ను సందర్శించిన డి పి వో

బ్రాహ్మణ కొత్తపెల్లి గ్రామం ను  సందర్శించిన డి పి వో

పల్లె ప్రకృతి వన  నిర్మాణం పట్ల సంతృప్తి


నెల్లి కుదురు, పెన్ పవర్

మహుబూబబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్త పల్లి లోని పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటిక, నర్సరీ, మరియు నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ను  జిల్లా పంచాయతీ అధికారి రఘవరుణ్ నెల్లికుదురు ఎం పి వో పార్థసారధి గౌడ్ తో కలిసి  గురువారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాలలో పెరుగుతున్న ప్రతి మొక్కను అశ్రద్ధ చేయకుండా మొక్కలపై అవగాహన కలిగి పెంచాలన్నారు. మరియు గ్రామం లోని సెగ్రీగెషన్ షెడ్ చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో డి పి వో వెంట గ్రామ సర్పంచ్ చింతకుంట్ల యాకయ్య, ఉప సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్, వార్డ్ సభ్యులు బొల్లు మురళి, కారం ప్రశాంత్, పిడుగు మంజుల యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

16 న చార్లి చాప్లిన్ 132 వ జయంతి...వైజాగ్ ఫిల్మ్ సొసైటీ

 16 న చార్లి చాప్లిన్ 132 వ జయంతి...వైజాగ్ ఫిల్మ్ సొసైటీ

మహారాణి పేట, పెన్ పవర్

ఈ నెల 16 న ప్రపంచ ప్రముఖ హాస్య నటుడు దివంగత చార్లి చాప్లిన్ 132 వ జయంతిని నిర్వహించాలని వైజాగ్ ఫిల్మ్ సొసైటీ  అధ్యక్షులు ఆచార్య ఎన్.ఎ.డి పాల్ మరియు కార్యదర్శి నరవ ప్రకాశరావు ఏ. యు. హెచ్.ఆర్.డి. సెంటర్ లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ప్రపంచ సినీ జగత్తులో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న చాప్లిన్ జీవితం నేటి తరానికి ఆదర్శం కాగలదని నమ్మకం తో వైజాగ్ ఫిల్మ్ సొసైటీ గత 10 ఏళ్ల గ చాప్లిన్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తొంది. ఈ కార్యక్రమం లో చాప్లిన్ మొదటిసారిగా పూర్తి నిడివి గల మూఖి చిత్రం ధి కిడ్ ప్రదర్సిస్తారు. ఈచిత్రము విడుదలయి నేటికీ 100 సంవత్సరాలు పూర్తి ఐయ్యింది .ఈ ఉత్సవం 16 న (శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు  ఏ.యు. హెచ్.ఆర్.డి లో జరుగుతుంది ఏయు విసి మరియు ఆచార్య ఎన్.ఎ.డి.పాల్,నటుడు ఏస్.కె.మిశ్రో, తదితరులు పాల్గొంటారు.  ప్రవేసము ఉచితము. వివరాలకు నరవ ప్రకాశరావు 9032477463 సంప్రదించగలరు.

శ్రీ శ్రీ శ్రీ సత్య పొలమాంబ అమ్మవారి "పరస"( జాతర )

 శ్రీ శ్రీ శ్రీ సత్య పొలమాంబ అమ్మవారి "పరస"( జాతర )

మహారాణి పేట, పెన్ పవర్

శ్రీశ్రీశ్రీ సత్య పొలమాంబ అమ్మవారి దేవాలయం, ఏ.వి.యన్ కాలేజ్ దగ్గర,విశాఖపట్నం.స్వస్థిశ్రీ చంద్రామాన శ్రీ ప్లవనామ సంవత్సర చైత్ర చతుర్దశి అనగా తేదీ 26-4-2021 సోమవారం ఉదయం తొల్లెళ్ళు,మరియు అమ్మవారికి "జలభిషేఖం"  ( ఉదయం  7:30ని.ల నుండి ) జరపబడును. మరియు చైత్ర పూర్ణిమ మంగళవారం అనగా తేదీ 27-04-2021 స్వాతి నక్షత్ర యుత వృషభ లగ్నమందు అమ్మవారికి "పరస"( జాతర  ) కార్యక్రమం జరపబడును.అమ్మవారి అలంకరన మరియు కుంకుమ పూజలు జరపబడును.కావున భక్తులు యావణ్ణంది ఈ కార్యక్రమములో పాల్గొని అమ్మవారి తీర్ధ ప్రసాధములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులగుదురని కోరుచున్నాం.సాయంత్రం భజన కార్యక్రమం జరుగును.ఈ కార్యక్రమముని ఆలయ కమిటీ సభ్యులు ( ధర్మకర్త - ఉమ మహేశ్వర రావు, గౌరవ అధ్యక్షులు - పైడ కొండ, అధ్యక్షలు - (బుజ్జి),వైస్ ప్రెసిడెంట్ - సన్నీ బాబు, సెక్రటరీ - గోపి, క్యాషియర్-రవి,జాయింట్ సెక్రటరీ- సురేష్, ఈశ్వర రావు (చంటి) లక్షమోజీ.

మేయర్ దంపతులకు వేద పండితుల ఆశీర్వచనం

 మేయర్ దంపతులకు వేద పండితుల ఆశీర్వచనం

మహారాణి పేట, పెన్ పవర్

విశాఖ మహానగర మేయర్ దంపతులకు వేద ఆశీర్వచనం నగరపాలక సంస్థ మేయర్ చాంబర్లో మహా నగర విశాఖ మేయర్ జి హరి వెంకట కుమారి, శ్రీనివాస్ దంపతులకు వేద ఆశీర్వచనం జరిగింది. ఉత్తరాంధ్ర  వైఖానస యూత్ ఫోరం అధ్యక్షులు శ్రీమాన్ పి.రంగనాథఆచార్య స్వామి వారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఉపాధ్యక్షులు శ్రీమాన్ ఆర్ సింగరాచార్య స్వామి  వివిధ ఆలయాల అర్చకులు వేద మంత్రాలతో  నగర మేయర్ దంపతులను ఘనంగా ఆశీర్వదించారు అనంతరం సింగరా చార్య స్వామివారు మాట్లాడుతూ పుష్కర కాలం తర్వాత ఏర్పాటైన తొలి కౌన్సిల్ సమావేశం నగర మేయర్గా మీ అధ్యక్షతన జయప్రదంగా జరగాలని  మీ పరిపాలన కాలంలో మీ అధ్యక్షతన విశాఖనగరం సర్వాంగసుందరంగా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త యమ్.వి రాజశేఖర్, పి.రామకృష్ణమాచార్యులు, ఎన్.శ్రీధర్ రామసద్గుణ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.

26వార్డు జగ్గారావు బ్రిడ్జ్ వద్ద చలివేంద్రం ప్రారంభించిన కె.కె రాజు

 26వార్డు జగ్గారావు బ్రిడ్జ్ వద్ద చలివేంద్రం ప్రారంభించిన కె.కె రాజు

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

విశాఖ ఉత్తర నియోజకవర్గం 26వార్డు అక్కయ్యపాలెం జగ్గారావు బ్రిడ్జ్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద కె.కె రాజు యువసేన సునీల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు పాల్గొని ముందుగా వై.యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పులా మాల వేసి నివాళులర్పించారు.

అనంతరం చలివేంద్రంను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో 26వార్డు ఇంచార్జ్ పీలా వెంకటలక్ష్మీ,పోతు సత్యనారాయణ,కొణతాల రేవతిరావు,అమ్మాజీ, బి.గోవింద్,సింగలమ్మ, కె కె.రాజు యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందించిన లింగాల సర్పంచ్

 ఆర్థిక సహాయం అందించిన లింగాల సర్పంచ్

కన్నెపల్లి,  పెన్ పవర్

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం లోని లింగాల గ్రామనికి చెందిన చీర పల్లి బాపు తండ్రి రాజం వయసు 60 సం, బుధవారం అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న లింగాల సర్పంచ్ లక్ష్మీ తిరుపతి. మృతుని కుటుంబాన్ని పరామర్శించి వీరి కుటుంబానికి రెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో గతంలో చనిపోయిన వారి కుటుంబాలకు  కూడా రెండు వేల  రూపాయల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు . ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...