Followers

నాచారం డివిజన్ లో సమస్యల పరిష్కారానికి కృషి

నాచారం డివిజన్ లో సమస్యల పరిష్కారానికి కృషి : కార్పొరేటర్ శాంతి 

తార్నాక, పెన్ పవర్ 

నాచారం డివిజన్ లోని ప్రతి సమస్యపై దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేస్తున్నామని కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ తెలిపారు. డివిజన్ లోని డ్రైనేజ్ మెయిన్ లైన్ లలో లో పేరుకుపోయిన సిల్ట్ తొలగింపు పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ  హనుమాన్ నగర్ నుండి పనులు ప్రారంభించామని,  వర్షాకాలంలోపు నాచారంలోని అన్ని డ్రైనేజ్ లలో అలాగే ఓపెన్ నాలా లలో ఉన్న పూడిక తొలగిస్తామని కార్పొరేటర్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో గ్రేటర్ టిఆర్ఎస్ నాయకులు సాయిజన్ శేఖర్,  కట్ట బుచ్చన్న గౌడ్, సంతోష్, బాలమణి, కామేశ్వరి, సువర్ణ, సుగుణాకర్,  వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. 

నిరుపేదలకు ఆకలి తీరుస్తూన్నా ఎంఎస్ఎస్ఓ

 నిరుపేదలకు ఆకలి తీరుస్తూన్నా ఎంఎస్ఎస్ఓ

పుట్ పాత్ లపై నివసిస్తున్నా నిరుపేదలకు ఆహారం పంపిణి





పెన్ పవర్ , మల్కాజిగిరి 

హైదరబాద్ నగరంలో రాత్రి ఎక్కడ చూసిన ఆకలితో అలమటిస్తూ రోడ్డు ప్రక్కనే ఉన్న పుట్ పాత్ లపై ఉండడంతో వారికి అండగా మైనంపల్లి సోషన్ సర్వీస్ అర్గనైజేషన్ స్వచ్చంద సంస్థ చైర్మన్ మైనంపల్లి రోహిత్ ఆద్వర్యంలో స్వయంగా వంటలు చేయించి, పైరుగు అన్నం, పచ్చిపులుసు, థమ్ కా చికెన్, బటర్ మీల్క్, గులబి జాం, అరటి పండ్లు, తాగునీరు, ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి వాటిని ఉప్పల్ మెట్రోరైల్వే స్టేషన్ పూట్ పాత్ పై నివాసిస్తున్న నిరుపేదలకు ప్యాకింగ్ చేసిన ఆహరాన్ని పంపిణి చేసి ఆకలి తీర్చారు. మారో ప్రక్క సికింద్రాబాద్ లో కూడ నిరుపేదలకు రాత్రి 9.30లకు 350 మందికి పైగ ఆహారం అందించారు. ఈ సందర్బంగా ఎంఎస్ఎస్ఓ చైర్మన్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ ప్రతి రోజు ప్రత్యేకంగా వంటలు చేసి వాటిని రాత్రి 9గంటలకు ప్రత్యేక వాహనంలో వెళ్లి నిరుపేదలకు 350 మందికి పైగ ఆహర ప్యాకింగ్ బ్యాగ్ లను పంపిణి చేసి సేవలందిస్తున్నామన్నారు.

కరోనా అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్

 కరోనా అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్.. 

పెన్ పవర్,  బయ్యారం 

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని  రైతు వేదిక నందు జరిగిన మండలంలో కోవిడ్ -19 జాగ్రత్తలు - అందరికి వాక్సిన్ వేయించడం - కోవిడ్ నివారణ పై సమావేశం నందు ముఖ్య అతిధిగా హాజరైన *కుమారి అంగోత్ బిందు, గౌరవ చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్, మహబూబాబాద్ సమావేశంలో మాట్లాడుతూ ఒక సంవత్సరం క్రితం మొదలైన కోవిడ్ వైరస్ లాక్ డౌన్ నందు ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో దాదాపు తగ్గిపోయిందని తర్వాత సడలింపుతో  ప్రజలకు కోవిడ్ భయం తగ్గి విచ్చలవిడిగా గుంపులు గుంపులుగా ఉండడం, పార్టీలు, ఫంక్షన్ లు, ప్రజలను తిరిగి కోవిడ్ బారిన పడేలా చేశాయని రెండవ వేవ్ లో ఇది మరింత గా పెరిగి దేశంలో, రాష్ట్రంలో విస్తరిస్తున్న దని కాబట్టి మనం మరింత జాగ్రత్తలు తీసుకొని ఈ మహమ్మారిని అరికట్టవలసి ఉన్నదని, మండలంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయ వలసి ఉన్నదని ప్రతి సర్పంచ్ ఇతర ప్రజా ప్రతినిధులు ప్రతి గ్రామం నుంచి పదిమంది చొప్పున తీసుకువచ్చిన రోజుకు మూడు వందల చొప్పున వాక్సిన్ వేసినట్లయితే మండలంలోని అందరికి వేగంగా వాక్సిన్ వేయవచ్చని ఏ ప్రగతి సాధించాలన్నా ముందు ఆరోగ్యం బాగుండాలని కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు సర్పంచ్, వార్డ్ సభ్యులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా పనిచేసి మన మండలంను కరోనా రహిత మండలంగా చేసుకుందామని తద్వారా మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసుకుందామని  తెలిపారు ఈ కార్యక్రమం లో బయ్యారం PACS చైర్మన్ మూల మధుకర్ రెడ్డి,తహసీల్దార్ నాగ భవాని  ఎంపీడీఓ బి. వి. చలపతిరావు, ఎస్ ఐ జగదీష్, బయ్యారం  మెడికల్ ఆఫీసర్, గంధం పల్లి మెడికల్ ఆఫీసర్, సర్పంచ్ లు,పంచాయతీ కార్యదర్శులు  మండల అధికారులు తెరాస నాయకులు పాల్గొన్నారు

కట్టుకున్న ఇండ్లను కూల్చివేయడం సరికాదు

 కట్టుకున్న ఇండ్లను కూల్చివేయడం సరికాదు.

కూల్చిన స్థలంలోనే డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.



తొర్రూరు, పెన్ పవర్

ముందస్తు సమాచారం ఇవ్వకుండా, తాము నిర్మించుకున్న ఇళ్లను అధికారులు కూల్చివేయడం భావ్యం కాదని, నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని 304 సర్వే నెంబర్ లో నిర్మించిన ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ, గురువారం బాధితులు నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన తమకు న్యాయం చేయాలని, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, మునిసిపల్ కమిషనర్ గుండె బాబులకు వినతి పత్రం సమర్పించారు.కూలి పని చేసుకొని, పొట్ట పోసుకునే తమకు గూడు లేకుండా చేయొద్దని, వేడుకున్నారు.  నిర్మించిన ఇళ్లకు గాను గత కొంత కాలంగా పురపాలికకు ఇంటి పనులు చెల్లిస్తున్నామని, తెలిపారు. ఒక పక్క పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తూ.. మరోపక్క పేదలు తమ రక్తం, చెమటతో నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వమే కూల్చివేయడం సమంజసం కాదన్నారు. ఇల్లు తప్ప ఎలాంటి స్థిరాస్తులు లేని, తమకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రం అందించిన వారిలో బాధితులు మహంకాళి దేవేందర్,మంగళపల్లి యాకస్వామి, వేల్పుల మమత, మంగళపల్లి లక్ష్మీ, ఆకారపు కృష్ణ , ఇందుమతి, సోమయ్య, వెంకటయ్య, అన్నపూర్ణ, స్వరూప తో పాటు పలువురు బాధితులు ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతికి సానుభూతి తెలిపిన పరిగి ఎమ్మెల్యే

.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతికి సానుభూతి తెలిపిన పరిగి ఎమ్మెల్యే

వికారాబాద్, పెన్ పవర్

జిల్లా కుల్కచర్ల మండలం లోని మక్త వెంకటాపురం లో గత రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నాయకుడు ఉమ్లవత్ నాయక్ మృతి చెందాడు పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేశ్వర్ రెడ్డి మక్త వెంకటాపురం వెళ్లి చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించి. మృతి మృతుడి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ వి మనోహర్ రెడ్డి, కుల్కచర్ల మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కుల్కచర్ల జెడ్ పి టి సి రాందాస్ నాయక్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మానవత్వాన్ని చాటుకున్న దోమ ఎస్ఐ దేవంబొట్ల రాజు

మానవత్వాన్ని చాటుకున్న దోమ ఎస్ఐ దేవంబొట్ల రాజు

వికారాబాద్,  పెన్ పవర్ 

 మానవత్వాన్ని చాటుకున్న దోమ ఎస్ఐ దేవంబొట్ల రాజు దోమ మండలం  దాదాపూర్ గ్రామానికి చెందిన వడ్ల పెంటయ్య గత 2 సంవత్సరాల నుంచి పక్షవాతం తో కాళ్ళు, చేతులు, మెడలు చచ్చుబడి మంచానికి పరిమితం అయ్యారు. ఆయన దీన పరిస్థితిని చూసి మనసు చలించి మానవతా దృక్పథంతో పెంటయ్య కుటుంబానికి 5000/- ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్బంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ వడ్ల పెంటయ్య ఆరోగ్య పరిస్థితిని చూసి చాలా జాలేసింది, ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ కూడా రాకూడదన్నారు. పెంటయ్య కు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వారి కుటుంబ పరిస్థితిని గమనించి ఆయనకు ప్రతినెలా మందుల ఖర్చులకు అయ్యే డబ్బులను వారి బ్యాంక్ అకౌంట్లో వేస్తానన్నారు. అదేవిదంగా ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ జిల్లా అధ్యక్షులు సుందర్ గౌడ్ 2500/- రెండు వేల ఐదు వందల రూపాయలను వడ్ల పెంటయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ వడ్ల పెంటయ్య  ఆర్యోగ్య పరిస్థితిని తెలుసుకొని ఎస్ఐ రాజు, సుందర్ గౌడ్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఇంతకు ముందే ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సుందర్ గౌడ్ అతని ధీన స్థితిని   తెలుసుకొని  అతని పరిస్థితి ని వార్త పత్రికల ద్వారా అందరికి తెలిసేలా చేయడం వల్ల చాలా మందియ దాతలు సహాయం చేయడానికి ముందుకు వచ్చి వారికి తోచిన విదంగా వడ్ల పెంటయ్య  కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారన్నారు. ఇంకెవరయిన దాతలు ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేయగలరని కోరుచున్నాను. . ఈ కార్యక్రమంలో ఆర్.రాములు, IGA జిల్లా అధ్యక్షులు సుందర్ గౌడ్, తెరాస పార్టీ గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు చెన్నయ్య, వార్డ్ మెంబర్ ఎస్.బాబు గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్ సరళిని పరిశీలించిన సబ్ కలెక్టర్

పోలింగ్ సరళిని పరిశీలించిన సబ్ కలెక్టర్

గోకవరం, పెన్ పవర్ 

మండల పరిషత్, జడ్పిటిసి ఎన్నికల సందర్భంగా గోకవరం మండలం లోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఎన్నికల సరళిని రాజమండ్రి సబ్ కలెక్టర్ అనుపమ అంజలి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మండలములోని గుమ్మల్ల దొడ్డి, గోకవరం, తంటికొండ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి అక్కడ జరుగుతున్న ఓటింగ్ తీరును పరిశీలించారు. ఓటర్లకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలను తామే స్వయంగా పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆమె సిబ్బందితో మాట్లాడుతూ ఓటు వేయడానికి వచ్చిన ప్రజలకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా తర్వాత ంగా ఓటింగ్ పూర్తి చేయాలని అదే విధంగా దొంగ ఓట్లను వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సిబ్బందికి తెలిపారు. అదేవిధంగా రాజమండ్రి నార్త్ జోన్ డిఎస్పి కడలి.వెంకటేశ్వరరావు కూడా మండలంలోని వివిధ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...