Followers

గోదావరిలో ప్రమాదవశాత్తూ హాస్టల్ విద్యార్థి మృతి

గోదావరిలో ప్రమాదవశాత్తూ  హాస్టల్ విద్యార్థి మృతి

రాజమహేంద్రవరం, పెన్ పవర్

 గోదావరి నది పుష్కర ఘాట్ లో  ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందిన హాస్టల్ విద్యార్థి  బొబ్బర్ల చంద్ర గణేష్ (16) కుటుంబానికి  ప్రభుత్వం రూ.10 లక్షలు సహాయ మందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక  మధు డిమాండ్ చేశారు. శుక్ర వారం ఉదయం రాజేంద్ర నగర్ లో ఉన్న కళాశాల వసతి గృహానికి సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జే. రంగ లక్ష్మీదేవి వస్తున్నారన్న సమాచారంతో సీపీఐ, సామాజిక హక్కుల వేదిక (ఎస్ సి, ఎస్ టి, బీసీ ఫోరం), ఏఐఎస్ఎఫ్ చేరుకుని జెడిని విద్యార్థులతో కలిసి ముట్టడించారు. విద్యార్ధి  కుటుంబాన్ని తక్షణం ఆదుకోవాలని కోరారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు  బలహీన వర్గాలకు చెందిన విద్యార్థి మృతి ఆ కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబానికి ప్రభుత్వం నుండి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇచ్చే విధంగా మీరు నోట్ తయారు చేయాలని ప్రభుత్వం నుంచి సహాయం చేయకపోతే వారి కుటుంబం  రోడ్డున పడుతుందని ఆయన అన్నారు.అంతేకాకుండా ఎన్నికల డ్యూటీలుకు హాస్టల్ వార్డెన్ లను హాస్టల్ సంక్షేమ అధికారులును వేయకూడదని ఇందులో ఏ.ఎస్.డబ్ల్యూ,ఓ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని మధు ఆరోపించారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్థాయిలో   మెజిస్ట్రేట్         విచారణ జరిపి ప్రభుత్వం నుండి సహాయం అందించాలని లేకుంటే జిల్లావ్యాప్తంగా ఆందోళన చేపడతామని విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని దీనికి కి విద్యార్ధి రాజానగరం నియోజక వర్గానికి చెందినవారు కావడంతో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సామాజిక హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు మరియు సిపిఐ నగర కార్యదర్శి నల్లా  రామారావు,  ఏఐఎస్ఎఫ్ కన్వీనర్ మహేష్ విద్యార్థులు రాజేష్ , కన్నా రావు,  సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

బ్యాలెట్ బాక్సులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు

బ్యాలెట్ బాక్సులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 ఆత్రేయపురం మండలం లో జరిగిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో  ఉపయోగించిన బ్యాలెట్ బాక్సులను  ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.  బుల్లి రాజు సహా ఎన్నికల అధికారులు ఎంపీడీవో నాతి  బుజ్జి తాహశిల్దార్ ఎం.  రామకృష్ణ ఆత్రేయపురం ఎస్సై జి.నరేష్ లు ఎన్నికలకు ఉపయోగించిన బ్యాలెట్ బాక్సులను అమలాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉన్న స్ట్రాంగ్ రూం లో  కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

కరోనా విపత్తు వేళ... విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న ఆర్యభట్ట స్కూల్ యాజమాన్యం

 కరోనా విపత్తు వేళ... విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న ఆర్యభట్ట స్కూల్ యాజమాన్యం..

ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కిన ఆర్యభట్ట స్కూల్ ను వెంటనే సీజ్ చేసి, యాజమాన్యం పై కేసు నమోదు చేయాలి.

మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు సిరికొండ విక్రమ్ కుమార్.



తొర్రూరు, పెన్ పవర్

మహబూబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో గల ఆర్యభట్ట హైస్కూల్ యజమాన్యం వారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క  నిబంధనలను తుంగలో తొక్కి, తరగతులను నిర్వహిస్తూ, స్కూల్ ఫీజులు వసూలు కోసం కరోనా నిబంధనలను పక్కన పెట్టి,శుక్రవారం పరీక్షలు నిర్వహిస్తున్న సమాచారాన్ని, మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు సిరికొండ విక్రమ్ కుమార్, మహబూబాద్ జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ గారికి,వాట్సప్ ద్వారా పిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు, డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వో లు విజిటింగ్ చేశారు. నివేదికను కలెక్టర్ గారికి పంపి, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా విక్రమ్ కుమార్ మాట్లాడుతూ... కరోనా సెకండ్ వేవ్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల లను తాత్కాలికంగా మూసివేస్తే, అట్టి నిబంధనలు ఉల్లంఘించి, కేవలం ఫీజుల వసూలు కోసం, విద్యార్థులను స్కూల్ కు పిలిపించి, పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఆయన ఆరోపించారు. ఫీజుల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడే పాఠశాల గుర్తింపును రద్దు చేసి, యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని, డిమాండ్ చేశారు.

సంధ్య మూర్తికి మాతృ వియోగం

సంధ్య మూర్తికి మాతృ వియోగం

రాజమహేంద్రవరం, పెన్ పవర్ 

సంధ్య సాయంకాల పత్రిక  ప్రకటనల మేనేజర్ పేరూరి సాంబమూర్తి(సంధ్య మూర్తి)కి మాతృ వియోగం కలిగింది. మూర్తి మాతృమూర్తి పేరూరి సుబ్బలక్ష్మి నేటి  ఉదయం కన్నుమూశారు. కొద్దికాలంగా అస్వస్థతతో ఉన్న సుబ్బలక్ష్మి ఉదయం 9 నుంచి10 గంటల సమయంలో స్ధానిక ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.ఆమె వయస్సు 60 సంవత్సరాలు. భర్త,ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మరణ వార్త తెలియగానే సంధ్య సాయంకాల పత్రిక సంపాదకులు డాక్టర్ ఎంటివి పట్టాభి రామారావు  భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు సానుబూతి తెలియజేశారు. సుబ్బలక్ష్మి పార్ధీవ దేహాన్ని వారి సొంత ఊరైన ఆలమూరు మండలం, పెనికేరు గ్రామానికి తరలించారు. ఆలమూరులో శుక్రవారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగాయి.

జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు

 జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు

తాళ్లపూడి, పెన్ పవర్

అన్నదేవరపేట గ్రామానికి చెందిన  పోశిన శ్రీకృష్ణ దేవరాయలు తాళ్లపూడి మండలంలో వైసీపీ నాయకులుగా మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి. ఈయన కుమార్తె పరిషత్ ఎన్నికల్లో జెడ్పిటిసి వైసీపీ అభ్యర్ధినిగా పోటీచేశారు. పరిషత్ ఎన్నికలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా పోషిన శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో నా వెన్నంటే ఉంటూ, ప్రచార సమయంలో కూడా ఏమి ఆశించకుండా, ఎండ వాన అని, రాత్రి పగలు అని తేడా తెలియకుండా నా అడుగులో అడుగువేస్తూ నా వెంట వస్తూ, చెప్పిన ప్రతి పని బరువు అనుకోకుండా  ఎంతో బాధ్యతగా, నిర్వర్తిస్తు ఎలక్షన్ అయ్యేవరకు కూడా  కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు , వైయస్సార్సీపీ  నాయకులకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు, నా రెండు చేతులు జోడించి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నానని తెలియజేశారు.

ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనాలు పాటించాలి

 ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనాలు పాటించాలి...! 

 తొర్రూర్ ఆర్డిఓ డీ కొమరయ్య మరియు డీఎస్పీ వెంకటరమణ

పెన్ పవర్, మరిపెడ

రెండో విడత కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫంక్షన్ హాల్ యజమాన్యం అప్రమత్తంగా, మరియు జాగ్రత్తగా ఉండాలని తొర్రూర్ ఆర్డిఓ డీ కొమురయ్య, డి.ఎస్.పి వెంకటరమణ లు సూచించారు. మరిపెడ తాహశిసిల్దార్ కార్యాలయంలో ఫంక్షన్ హాల్ యజమానులతో గురువారం ఆర్ డి ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆదేశాల మేరకు జిల్లాలో కరొన నివారణ చర్యలు కట్టుదిట్ట మైన చర్యలు తీసుకోవాలని నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎండకాలం లో పెళ్లిళ్లు ఇతర ఫంక్షన్లు చేసుకోవడానికి వివిధ ఫంక్షన్ హాల్ లో బుక్ చేయడం జరుగుతుంది. పెళ్లిళ్లు , ఇతర పరీక్షలు చేసుకునే వారు తప్పనిసరిగా శానిటేషన్, మాస్కులు, ఏర్పాట్లతో కూడిన పర్మిషన్ తీసుకోవాలని అధికారుల పర్మిషన్ లేనిది ఫంక్షన్ హాలు కిరాయికి ఇవ్వకూడదని ఇట్టి నిబంధనాలు ఉల్లంఘించిన వారిపై కో విడ్ చట్టం కింద కేసు నమోదు చేస్తామని అంతేగాక జరినామా తీసుకుంటామని పేర్కొన్నారు. తప్పని పరిస్థితుల్లో వంద మంది కంటే ఎక్కువ తో ఫంక్షన్లు నిర్వహించకూడదని తెలియజేశారు. ఈ సమావేశంలో తాహశిల్దార్ జి రమేష్ బాబు, మరిపెడ సీఐ ఎన్. సాగర్, మరిపెడ మున్సిపాలిటీ కమిషనర్ గణేష్ బాబు, ఎంపీడీవో సింగారపు కుమార్, సీనియర్ అసిస్టెంట్ నందా నాయక్, ఆర్ ఐ నజీముద్దీన్, ఫంక్షన్ హాల్ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు.

45 సంవత్సరాలు దాటిన వారు తప్పకుండా కరోనా టీకా వేయించుకోవాలి..

 45 సంవత్సరాలు దాటిన వారు తప్పకుండా కరోనా టీకా  వేయించుకోవాలి..

రాజన్న సిరిసిల్ల , పెన్ పవర్

వేములవాడ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రము  ను సందర్శించి డీఎం హెచ్ ఓ  తో మాట్లాడరు. ఈ సందర్భంగా మున్సిపాల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి-రాజు  మాట్లాడుతూ పట్టణంలో పెరుగుతున్న కరోనా కేసుల దృశ్య ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఖచ్చితంగా మాస్కు ధరించాలని ప్రజలు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వ ఆస్పత్రిలో 45 సంవత్సరాలు దాటిన వ్యక్తులు కరోనా టికా ఇప్పించు కోవాలని అన్నారు  అదేవిధంగా మున్సిపల్ నుండి అన్ని వార్డులలో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేష్ రావు , మున్సిపల్ కమిషనర్ శ్రీ శ్యామ్ సుందర్ రావు , గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...