Followers

లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం

లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం

మందమర్రి,  పెన్ పవర్ 

లోక్ అదాలత్ ల ద్వారా కేసులను పరిష్కరించకుంటే సత్వర న్యాయం చేకూరుతుందని మందమర్రి పట్టణ ఎస్సై లింగంపల్లి భూమేష్ పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 10 శనివారం మంచిర్యాల జిల్లా కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. లోక్ అదాలత్ కార్యక్రమాల గురించి ప్రజలు అవగాహన పెంచుకోవాలని, లోక్ అదాలత్ లో న్యాయమూర్తులు ఇరువర్గాల సమస్యను రాజీ మార్గంలో పరిష్కరిస్తారని, పై కోర్టుకు వెళ్లే సమస్య ఉండదని ఆయన పేర్కొన్నారు. మందమర్రి పోలిస్ స్టేషన్ పరిధిలో నమోదైన పిట్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, రాజీకి ఆమోదయోగ్యమైన క్రిమినల్ కేసులతో పాటు సివిల్, నష్ట పరిహారం కోసం దాఖలైన కేసులను పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు. మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగపరచు కోగలరని ఆయన తెలిపారు.

వికలాంగుల జేఏసీ జిల్లా కో కన్వీనర్ గా రాజశేఖర్

 వికలాంగుల జేఏసీ  జిల్లా కో కన్వీనర్ గా రాజశేఖర్

 ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్

  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మేడిశెట్టి రాజశేఖర్ ను బుధవారం  వికలాంగుల జేఏసీ జిల్లా కన్వీనర్ కాసారపు పరశురాములు  నియమించారు.  ఈ సందర్భంగా మేడిశెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల సాధనే లక్ష్యంగా పోరాడతానని అన్నారు. అలాగే దివ్యాంగులకు రావాల్సిన పథకాలు విద్య వైద్యం ఉపాధి మరియు సంక్షేమ పథకాల్లో దివ్యాంగుల హక్కులు సాధించే దిశగా దశలవారీగా పోరాటం చేయుటకు సంకల్పించి తెలంగాణ రాష్ట్రంలో కలిసివచ్చిన సంఘాలతో కూడా పోరాటం చేస్తామన్నారు.  తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు కాసారపు పరుశరాములు గారికి స్టీరింగ్ కమిటీ చైర్మన్ ముత్తినేని వీరయ్య మొగిలి లక్ష్మయ్య అడివయ్య సతీష్ మండేపల్లి రవి లకు కృతజ్ఞతలు తెలిపారు.

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 

మాస్కులు ధరించకపోతే 500 రూపాయల జరిమానా. 

సర్పంచ్ కడెం యాకయ్య.

తొర్రూరు, పెన్ పవర్

రెండోసారి కరోన విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, మాస్కులు ధరించని వారికి 500 రూపాయల జరిమానా విధించబడుతుందని, సర్పంచ్ కడెం యాకయ్య, ఎంపీటీసీలు డోనుక ఉప్పలయ్య, ముద్థం విక్రమ్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామములో గ్రామ పంచాయతీ అవరణలో రెవెన్యూ శాఖ వారి ఆధ్వర్యంలో కరోనా వ్యాధి నివారణ పై అవగాహన కలిగించేందుకు, గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఎంపీటీసీలు మాట్లాడుతూ... కరోనా సెకండ్ వెజ్ విజృంభిస్తున్న నేపద్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండి, మాస్కులు, శానిటైజర్, భౌతిక దూరం పాటించాలని, అన్నారు. 45 సంవత్సరాలు పై బడినవారు తప్పనిసరిగా కరోనా టీకాలు వేయించుకోవాలని, అన్నారు. కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం గ్రామంలో కరోనా వైరస్ నివారణ, టీకా తీసుకోవడం పై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డుసభ్యులు,పంచాయతీ కార్యదర్శి లెనిన్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, ఆశ వర్కర్లు, గ్రామ ప్రజలు, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జ్యోతి నగర్ కమ్యూనిటీ హల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

 జ్యోతి నగర్ కమ్యూనిటీ హల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

రూ75లక్షల వ్యయంతో కమ్యూనిటి హల్ 

నా సొంత కర్చులతో 10ఏసిలు, సిసిటివి కెమెరాలు ఎమ్మెల్యే ఏర్పాటు చేస్తాం




పెన్ పవర్,  మల్కాజిగిరి

గౌతంనగర్ డివిజన్ లోని జ్యోతి నగర్ కమ్యూనిటీ హల్ ను 75 లక్షల వ్యయంతో నిర్మణించారు. శుక్రవారం రోజున మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మట్లాడుతూ జ్యోతినగర్ కమ్యూనిటీ హల్ నిర్మణం 75లక్షలతో పూర్తి అయిందని, కాంపౌండ్ వాల్ నిర్మణించాలేదని వాటికి 10లక్షల వ్యయంతో నిర్మణం చేస్తాం అన్నారు. హల్ లో నా సొంతంగా కర్చులతో 10 ఏసిలు, కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. మల్కాజిగిరి నియోజక వర్గాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు. ఈ వేదికలో చిన్నారులు భరతనాట్యంతో చిన్నారులు ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమంలో స్దానిక కార్పొరేటర్, జ్యోతి నగర్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ దంపతులు...

 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ దంపతులు...

ఆదిలాబాద్,  పెన్ పవర్ 

మావలా గ్రామానికి చెందిన బి.గంగారెడ్డి  ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందడంతో శుక్రవారం ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్  రంగినేని మనీషా పవన్ రావు దంపతులు  బాధిత కుటుంబాలను  పరామర్శించారు. మృతి కి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వీరి వెంట స్థానికులు, టిఆర్ఎస్ నాయకులు  ఉన్నారు.

మాస్క్ ధరించకపోతే జరిమానా తప్పదు

 మాస్క్ ధరించకపోతే  జరిమానా తప్పదు... బేల ఎస్ఐ

సాయన్న

 బేలా,  పెన్ పవర్

 కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు  ధరించాలని,  మాస్కు ధరించకపోతే జరిమానా తప్పదని బేల ఎస్ఐ సాయన్న అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక పెట్రోల్ బంకులో మాస్కో వివాహం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి, సోషల్ డిస్టెన్స్ పాటించి, శానిటైజర్ వాడి కరోనా మహమ్మారి తో ప్రజలు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

మహనీయుల జీవిత చరిత్రలను స్పూర్తిగా తీసుకోవాలి

 మహనీయుల జీవిత చరిత్రలను స్పూర్తిగా తీసుకోవాలి...

 ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న 

రాంజీ గోండ్ కు ఘనంగా నివాళ్ళు సమర్పించిన ఎమ్మెల్యే జోగు రామన్న

 ఆదిలాబాద్,  పెన్ పవర్

 స్వాతంత్ర పోరాటంలో ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన మహనీయుల జీవిత చరిత్రలను స్పూర్తిగా తీసుకుంటూ వారి ఆశయాలను సాధించే దిశగా పాటు పడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. శుక్రవారం గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలిచే రాం జీ గోండ్ 164 వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే  రాథోడ్ బాపూరావు తో కలిసి ఆయన పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదుట గల రాం జీ గోండ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. అదే విధంగా గోండుల స్వేచ్చా జెండాను ఎగురవేశారు. ఈ మేరకు జోగురామన్న మాట్లాడుతూ హక్కుల సాధనకు అసువులు బాసిన రాం జీ గోండ్ త్యాగాలు మరవలేనివని అన్నారు. 1957 తిరుగుబాటులో సైతం కీలక పాత్ర పోషించారని, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. అటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుంటూ వారి ఆశయ సాధనకు పాటు పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ గోడం నగేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, ఆదివాసి నాయకులూ, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...