Followers

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన.. 

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం.. 

రూ.19 లక్షలతో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే.. 


కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని రింగ్ బస్తిలో రూ.19 లక్షలతో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను సోమవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ తో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా‌ టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  నాయకత్వంలో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో నిధుల కొరత లేకుండా ప్రతి బస్తీ, కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ శాశ్వత పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వేణు యాదవ్, జైహింద్, మారయ్య, హజ్రత్ అలీ, బాబు గౌడ్, రుద్ర అశోక్, పాపుల్ గౌడ్, మల్లారెడ్డి, యాదగిరి, సంతోష్ పటేల్, రూప్ సింగ్, వెంకటేష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ ఆన్ లైన్ కరాటే చాంపియన్ షిప్ ని గెలిపించిన మత్యకార ముత్యాలు

 అంతర్జాతీయ ఆన్ లైన్ కరాటే చాంపియన్ షిప్ ని గెలిపించిన మత్యకార ముత్యాలు 

పరవాడ, పెన్ పవర్

అంతర్జాతీయ ఆన్ లైన్ కరాటే చాంపియన్ షిప్ ని ఫిబ్రవరి 2 తేదీ నుండి 10 తేదీ వరకు  తెలంగాణ రాష్ట్రం లోని మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ లో నిర్వహించారు.మొదటిసారిగా ఆన్ లైన్ లో నిర్వహించిన  అంతర్జాతీయ  ఈ-కటా  కరాటే ఛాంపియన్ షిప్ లో మత్స్యకార గ్రామం ముత్యాలమ్మపాలెంలో గల బ్రూస్ లీ రాజ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కి చెందిన 48 మంది విద్యార్థులు కటా & టీమ్ కటా & వెపన్ కటా విభాగాలలో పాల్గొనగా,76 బంగారు పథకాలు & 30 రజత పతకాలు గెలుచుకుని ప్రదమ స్థానంలో నిలిచారు.చాంపియన్ షిప్ లో మొత్తం 106 మెడల్స్ సాధించి ఓవరాల్ చాంపియన్ షిప్ కప్ భారతదేశం కైవసం  చేసుకుంది.ఈ పోటీలలో ఛాంపియన్ షిప్ గెలుపుతో మత్యకార యువ కిశోరాలు ప్రధాన విజేతలు గా నిలిచారు.ఈ పోటీల్లో దాదాపు 25 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముత్యాలమ్మపాలెం గ్రామం సర్పంచ్ మరియు మాజీ వైస్ ఎమ్.పి.పి .పరవాడ ,  పంచాయతీ రాజ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ & డైరెక్టర్ ఆఫ్ బ్రోమ అకాడమీ చింతకాయల సుజాత ముత్యాలు, మరియు చైర్మన్ ఆఫ్ బ్రోమ అకాడమీ మైలపిల్లి అప్పన్న ధనలక్ష్మి, అకాడమీ ఫౌండర్ మరియు చీఫ్ కోచ్ సిహాన్ అప్పలరాజు, ప్రెసిడెంట్ సాంబాబు ని క్రీడాకారులు మర్యాద పూర్వకంగా కలిసి ఛాంపియన్ షిప్ ట్రోపిని,మెడల్స్ ని అందించారు.విద్యార్థులను మరియు విజేతల బృందాన్ని అకాడమీ సభ్యులు అభినందించారు.చాంపియన్ షిప్ లో విద్యార్థులు కనబరిచిన ప్రతిభను చూసి చింతకాయల సుజాత ముత్యాలు 10,000/- రూపాయల నగదు ని బహుమానంగా అకాడమీ చీఫ్ కోచ్ సిహాన్ అప్పల రాజు గారికి అందించారు.ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ సుజాత ముత్యాలు, చైర్మన్  మైలిపిల్లి అప్పన్న ధనలక్మి,ఎమ్.ఎస్.కే.డి.ఏ.వి.పి ప్రెసిడెంట్ ఎర్రబాబు,జనరల్ సెక్రెటరీ అప్పలరాజు,అకాడమీ ప్రెసిడెంట్ సోంబాబు, మరియు అకాడమీ ఫౌండర్&చీఫ్ కోచ్ షిహాన్ ఆర్జిల్లి అప్పలరాజు,సిలంబమ్ స్పెషలిస్ట్ సోంబాబు, జాయింట్ సెక్రటరీస్ శివ, శివాజి,అకాడమీ టీం మేనేజర్ శైలజ  పాల్గొన్నారు.

మాస్క్ దరిద్దాం.. కరోనాను తరిమేద్దాం అంటూ జైపూర్ పోలీసుల ప్రచారం

 మాస్క్ దరిద్దాం.. కరోనాను తరిమేద్దాం అంటూ జైపూర్ పోలీసుల ప్రచారం


మంచిర్యాల , పెన్ పవర్

 మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపూర్ సెంటర్ నందు ప్రతి వారం ఏర్పాటు చేసే వార సంత నందు జైపూర్ పోలీస్ లచే మాస్క్ మీద అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలి. ఎవ్వరు కూడా అనవసరంగా బయట తిరగకుండా అవసరమైన సమయంలో మాత్రమే బయటకి రావాలి బయటికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మాస్కు ధరించే రావాలి. తరుచూ శానిటైజ్ చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బయటి నుండి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఏది ముట్టు కోకుండా, మీ చేతులు శుభ్రం చేసుకొని ఇంట్లోకి వెళ్లాలి. మాస్కులు ధరించని వారిపై 188 ఐపిసి 51(బి) డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్* ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచడం జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించోద్దని మరొకసారి ప్రలందరికి జైపూర్ పోలీసుల తరుపున విజ్ఞప్తి చేశారు.

.

కనుమరుగవుతున్న ప్రాచీన కళలు

 కనుమరుగవుతున్న ప్రాచీన కళలు......! జానపదులను కాపాడుకుందాం

కళలు, సాహిత్యం వికసించినది భరతభూమిలోనే

సంగీతం ప్రకృతి ఇచ్చిన వరం.

పల్లెల్లో గ్రామీణ సంస్కృతి కానరాక, పల్లె జానపదులు లేక పల్లె తల్లి ఘోషిస్తుంది.




నెల్లికుదురు, పెన్ పవర్

భారతదేశం సకల భిన్న సంస్కృతులకు, కళలకు, కళాకారులకు, జానపదాలకు, పుట్టనిళ్ళు అనేది ప్రపంచమెరిగిన సత్యం. కానీ నేడు దేశంలో సంస్కృతి,ప్రాచీనకళలు కాలానుగుణంగా వస్తున్న మార్పులకు తన ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి నేడు తటస్థిస్తున్నది. గొప్ప సంస్కారం నాగరికత, కళలు ఎంతో ప్రాచీన కాలంనుండి భారతదేశం కలిగివున్నదని మరియు సాహిత్యం కూడ వికసించినది ఈ నేలలోనే అని 'ప్రాచీన  వాజ్మయఆధారాలు తెలియజేస్తున్నాయి "సంస్కృతి అనేది దిగుమతి చేసుకునే వస్తువుయితే దానిని మనం భారతదేశం నుండే దిగుమతి చేసుకుందాం "అని సర్ థామస్ మన్రో ఆనాడు బ్రిటిష్ వారికీ సూచించాడట, అంటే మనదేశం లో సంస్కృతి, నాగరికత,అన్నీ జిజ్జ్ఞాస అనే అంతర సూత్రంలో బందించి ఉన్నాయన్నమాట దీనికి ఉదాహరణగా మన దేశంలో ఉన్న దేవాలయాల పై పూర్వీకులు సంగీత నృత్య శిల్పాలను శిల్పకరించడమే. సంగీతం ప్రకృతి నుండి జన గానంగా ఆవిర్బవించింది. ప్రకృతి లోని జంతుజాలంనుండి మానవుడు సంగీతం నేర్చుకున్నాడు, అనేది వాస్తవం, సంగీతం లో ఉన్న సప్తపదాలు స, రి, గ, మ, ప, ద, ని, స అనేవి జంతువులనుండి వచ్చే శబ్దాలను అనుకరించినవే అని సంగీత మేధావులు తమ రచనలలో పొందుపరిచారు. ఇలా ప్రకృతి నుండి మానవుడు'రాగం 'అనే శ్రావ్యాన్ని ప్రతిపాధనగా తీసుకొని, లయను సూచించే కాలమాణమును 'తాళం 'గా తీసుకొని సంగీత స్వప్తస్వరాలకు  నాంది పలికాడు. జానపదాలుగా మారి పల్లెల్లోకి విస్తరించిన విధానం పూర్వపు రోజులల్లో సంగీతం ను దేవతార్చనకు ఉపయోగించేవారని, అదే సంగీతం భక్తి గీతాలు, జాతీయగీతాలు, విప్లవగీతాలు, "జానపదగీతాలు"గా పరిణతి చెందిoదని సామవేదం సూచిస్తుంది. ఇలా పరిణతి చెందిన సంగీతం జానపద పాటలుగా మారి విస్తరించాయి. జనపదమున నివసించేవారు "జానపదులు"వారు పాడుకొను పాటలు  "జానపదాలు ". ఇవి దేశం లోని మారుమూల పల్లె, ప్రాంతాలలోకి విస్తరించి గ్రామీణ కళాకారుల బ్రతుకులలో సహజీవనం అయింది. ఇలా అన్నీ పల్లెలలోకి, విస్తరించిన జానపద సంగీతం దేవుళ్ళ పురాణ, ఇతిహసాలు, కులదేవుళ్ళ చరిత్రలు, బావ మరదళ్ళ మధ్య ఉన్న సన్నిహిత్య సంబంధాలను జానపద పాటలుగా మార్చి, వివిధ ప్రాంతాలలో యక్షగానం, ఒగ్గుకథ, బుర్రకథ, చెక్క భజన, కోలాటం, జడకొప్పు, తోలు బొమ్మలాట, హరిదాసు, బహిండ్ల కథ, లాంటి జానపద కళారూపాలను ప్రదర్శిస్తూ జానపద పదాలను లయబద్దంగా అల్లుకొని పాడే పాటలు ఇప్పటికీ వినసొంపుగా ఉంటాయి. ఇలాంటి ప్రాచీన కళలను నమ్ముకొని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో బ్రతుకు జీవనం గడిపే కుటుంబాలు చాలా ఉన్నాయి, అట్టి కళాకారులకు ఉపాధి కూడా ఉండేది. కానీ నేడు నిత్యం ప్రాచీన  దేశ సంస్కృతి, కళలను, ఆరాద్యించే  గ్రామీణ, పల్లెటూర్ల లోకి విదేశీ సంస్కృతి, నాగరికత విస్తరించి ప్రాచీన కళలను వెక్కిరిస్తుంది. ఒక జాతి నిర్మాణానికి అవసరమైన ఆకారాలను జానపదకళలు అందిస్తాయని అనడంలో అతిశయోక్తి లేదు, కానీ ఈ రోజులలో గ్రామాలలోని కళావైభవం, గ్రామీణ సంస్కృతి కానరాక, పల్లెల్లో జానపదులు లేక పల్లె తల్లి ఘోషిస్తుంది. ఇకనైనా ప్రభుత్వం, ప్రజలు, గ్రామీణ కళలను, సంస్కృతిని ఆరాధించి జానపద కళాకారులను ఆశీర్వదించకపోతే జానపద కళలు కాల గర్భంలో కలిసి కనుమరుగై భవిష్యత్ తరాలకు తెలియని చరిత్రగా మిగులుతాయి అనడంలో సందేహం లేదు.,....

మాస్క్ పెట్టు..లేదా.. ఫైన్ కట్టు

 మాస్క్ పెట్టు..లేదా.. ఫైన్ కట్టు..

పేద ప్రజలకు, బాటసారులకు,దినసరి కూలీలకు మాస్కులు పంపిణీ చేస్తున్న సామాజిక కార్యకర్త.. 

నాడు సామాజిక దూరాన్ని పాటించాలని పదే పదే ప్రచారం..నేడు ప్రచారంతో పాటు మాస్కుల పంపిణీ 

సామాజిక సేవతో మన్ననలు పొందుతున్న సోషల్ వర్కర్ కొత్త లా రవిందర్ ముదిరాజ్.. 



కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

ఎలాంటి విపత్తులు ఏర్పడినా అక్కడ ఆసామాజిక కార్యకర్త తనవంతు సహాయ సహకారాలు అందింస్తూనే ఉంటాడు‌.. అతనే సామజిక కార్యకర్త కోలా రవిందర్ ముదిరాజ్.. గత కరోనా లాక్ డౌన్ సమయంలో ఎన్నో సేవలందించిన ఆయన ఇపుడు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద.. అడ్డాకూలీల వద్దకు చేరుకొని ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తున్నారు.. రోడ్డుపై వెళ్తున్న బాటసారులకు రవిందర్ బాసటగా నిలుస్తున్నాడు. కుత్బుల్లాపూర్ సూరారం గ్రామనికి చెందిన కోలా రవిందర్ ముదిరాజ్ ఎన్నో యేండ్లుగా సామాజిక సేవచేస్తుంటాడు.. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు నడుంబిగించి ప్రజలను చైతన్యపర్చారు.. భూగర్భజలాలు నీటి నిల్వలు పెంచడానికి ప్రతి ఇంటిలో వర్షపునీటిని ఒడిసిపట్టడానికి ఇనుకుడు గుంతల ఏర్పాటుకు అవగాహన కల్పించాడు.. ఇపుడు సూరారం ఎక్స్ రోడ్డులో నిలబడి వచ్చే పోయే వారికి మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని కోరుతున్నారు.. మాస్కులు లేని బాటసారులకు మాస్కును ధరించాలని, కరోన వైరస్ ఉగ్ర రూపం దాలుస్తుందని, సామాజిక దూరం పాటించి, నిబందనలు పాటించాలని రవిందర్ సూచిస్తున్నారు.. మాస్కులు ధరించకుంటె జరిమానాలు.. మాస్కులు దరించని వారికి జరిమానాలు తప్పవని తెలంగాణ ప్రభుత్వం జీవోజారీ చేయడంతో ప్రజలజు కొంత ఇబ్బందిగా మారినా..తప్పని పరిస్థితి అందుకే సామాజిక కార్యకర్త రవిందర్ ముదిరాజ్ సోమవారం సూరారం ఎక్స్ రోడ్డులో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలబడి మాస్కులు దరించని వారికి ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు.. వైరస్ విజృంభణ గురించి తెలియజేస్తూ సామాజిక దూరం పాటించాలని, వివరించారు.. ఆటొలను నిలిపి మాస్కులు పంపిణీ చేశారు..మాస్కులు లేని పాదచారలకు, దినసరి కూలీలకు మాస్కులను ఇచ్చారు..ఫైన్ వద్దు.. మస్కులే ముద్దు అని ప్రచారం చేస్తూ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి మన ప్రయత్నం మనం చేయాలని సామాజిక కార్యకర్త రవిందర్ ముదిరాజ్ సూచించారు..

టిఎస్ఐఐసిలో ట్రక్ పార్కింగ్ అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

టిఎస్ఐఐసిలో ట్రక్ పార్కింగ్ అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే... 


కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని టిఎస్ఐఐసిలో 2.5 ఎకరాల స్థలంలో జీడిమెట్ల మిని గూడ్స్ వెహికిల్ అసోసియేషన్ ఫేస్-4 కొరకు కేటాయించిన ట్రక్ పార్కింగ్ స్థలంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రహరీ గోడ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం చేపట్టబోయే డ్రైవర్ రూము, మరుగుదొడ్ల నిర్మాణ పనులు మొదలగు వసతులపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, వార్డు సభ్యుడు సిద్ధిక్, నాయకులు ఫెరోజ్, జీడిమెట్ల మిని గూడ్స్ వెహికిల్ అసోసియేషన్ ఫేస్-4 ప్రెసిడెంట్ ఐలయ్య యాదవ్, జెనరల్ సెక్రెటరీ కలీల్, మనయ్య, కుమార్, సాదిక్, సద్దాం, నాగిరెడ్డి, సికిందర్, సురేష్, సిలార్ తదితరులు పాల్గొన్నారు.

అగ్నిమాపక సిబ్బంది సేవలు అనిర్వచనీయం

 అగ్నిమాపక సిబ్బంది సేవలు అనిర్వచనీయం: ఎమ్మెల్యే కేపి వివేకానంద్ 

జీడిమెట్ల, పెన్ పవర్ 

అగ్నిమాపక వారోత్సవాల గోడపత్రికను విడుదల చేసిన ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద.. తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ సేవల జీడిమెట్ల ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను సోమవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్  తన నివాసం వద్ద అగ్నిమాపక అధికారులు, సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది సేవలు అనిర్వచనీయమని అన్నారు. అగ్ని ప్రమాదాలు, విష వాయువుల వ్యాప్తి మొదలైన సంఘటనలు జరిగినప్పుడు వీరి సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కూకట్ పల్లి సైదులు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జీడిమెట్ల వి.సుభాష్ రెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కూకట్ పల్లి వై.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...