11వ వేతన ఒప్పంద కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి
మంచిర్యాల , పెన్ పవర్సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్(బిఎంఎస్ )ఆధ్వర్యంలో మందమర్రి ఏరియా కేకే ఓసిలో ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా యాదగిరి సత్తయ్య అధ్యక్షులు గ పాల్గొని కార్మికులనుద్దేశించి మాట్లాడారు. ఈ సంవత్సరం జూన్ 30న 10వ వేతన ఒప్పందం ముగియనున్న నందున జులై 1న 11వ వేతన ఒప్పందం అమలులోకి రావలిసి ఉన్నందున 11వ వేతన ఒప్పంద కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు ట్రాన్స్ కో జెన్ కో నుండి 15 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ఆరు సంవత్సరాల నుండి పన్నుల రూపేణా రాష్ట్ర ప్రభుత్వానికి 15011 కోట్ల రూపాయలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సీఎస్ఆర్ నిధుల కింద రూపాయలు 230 కోట్ల రూపాయలు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ కొరకు 2739 కోట్ల రూపాయలు మొత్తంగా 17980 కోట్ల రూపాయలు పన్నుల రూపేణా వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికుల అలవెన్సులు పై ఆదాయపన్ను రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతియేటా ఆదాయపన్ను 250 కోట్ల రూపాయలు పన్నుల నుండి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి తద్వారా సింగరేణి కార్మికులకు రియంబర్స్మెంట్ ఇవ్వాలని కోరారు. ఆరు జిల్లాల లో 120 గ్రామాలు , పదిహేను పట్టణాలు అభివృద్ధికి సంక్షేమా కార్యక్రమాలకు ఖర్చు చేయాలని నిధుల దుర్వినియోగం వెంటనే నిలిపివేయాలని సంబంధిత గ్రామాలకు పట్టణాలకు కార్మికుల సంక్షేమానికి గ్రామాల అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.బిఎమ్మెస్ కేంద్ర ఉపాధ్యక్షులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న నాయకులు డొనికెల రమేష్ గౌడ్, మొట పోతుల శ్రీనివాస్, పెండం సత్యనారాయణ, మండల రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment