బీజేపీ కి ఆజాది మహోత్సవ్ నిర్వహించే అర్హత లేదు...
అనకాపల్లి,పెన్ పవర్
బీజేపీ కి ఆజాది మహోత్సవ్ నిర్వహించే అర్హత లేదు.ఆనాడు బ్రిటిష్ పాలన పై పోరాటం చేస్తే ఈనాడు కార్పొరేట్ కి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి.జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం.75 వ స్వాతంత్ర్య దినోత్సవాల లో భాగంగా కేంద్రం ఎంతో గొప్పగా ఆజాది అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్నారని, దేశాన్ని కార్పొరేట్ చేతులలోకి అప్పగిస్తున్న బీజేపీ కి ఆ అర్హత లేదని జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం విమర్శించారు. సోమవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆనాడు బావితరాల భవిష్యత్ కోసం ఎందరో మహానుభావులు పోరాటాలు చేస్తే వారి ప్రాణ త్యాగాలకు స్వాతంత్ర్య వచ్చిందని కానీ నేడు వారి త్యాగాలను అవమానించేలా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థల కు కారు చౌకగా అమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నష్టాల్లో ఉన్న సంస్థల ను లాభాల బాట ఎలా తీసుకురావాలో ఆలోచనలు చేయకుండా కారు చౌకగా అంబానీ, అదాని లాంటి కార్పొరేట్ దిగ్గజాల కు అప్పనంగా అమ్మేస్తున్నారని లాభాల్లో ఉన్న విమాన యాన, బ్యాంకింగ్, రైల్వే, ఎల్ ఐ సి, స్టిల్ ప్లాంట్, పోర్టులు, టెలికాం రంగ సంస్థలను ప్రైవేటీకరణ వైపు తీసుకు వెళ్తున్నారని విమర్శించారు. అన్నీ ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే రేపు మన భావితరాల భవిష్యత్ కార్పొరేట్ సంస్థల చేతిలో నలిగిపోవాల్సిందే అని ఆందోళన వ్యక్తం చేశారు. బానిస బతుకులకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న స్వాతంత్రాన్ని మళ్ళి ప్రైవేటీకరణ తో బానిస బతుకులు గా మారేందుకు బిజెపి ప్రభుత్వం మార్గాలను సుగమం చేస్తున్నాయని,ఇలాంటి దుర్మార్గపు చర్యలను నిరసిస్తూ యువతతో పాటు యావత్ భారతదేశం పిడికిలి బిగించి పోరాడాలని జై అనకాపల్లి సేన తరపున కొణతాల సీతారాం పిలుపునిచ్చారు.

No comments:
Post a Comment