Followers

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రాణించాలి

 జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రాణించాలి

విజయనగరం,పెన్ పవర్ 

విజయనగరం పట్టణంలోని గిరీశం పాఠశాలలో చదువుతూ, కరాటేలో విశేష ప్రతిభ కనబర్చి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్ధులను జిల్లా ఎస్పీ బి. రాజకుమారి మార్చి 15, సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్ లోని చండీఘర్ యూనివర్సిటీలో ఈ నెల 20 నుండి 26 వరకు జరగనున్న జాతీయ కరాటే చాంపియన్ పోటీలకు పట్టణంలోని గిరీశం పాఠశాల విద్యార్ధులు ఎం. రేవంత్ సుశీలాష్, వి. లక్ష్మీనారాయణలు ఎంపికైనట్లుగా గిరీశం పాఠశాల ప్రిన్సిపాల్ పి. ధనుంజయరావు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుండి నలుగురు విద్యార్ధులు ఎంపిక కాగా, వారిలో ఇద్దరు తమ పాఠశాలకు చెందిన విద్యార్ధులు ఉన్నారన్నారు. ప్రస్తుతం కోచ్ పి. సాగర్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్ధులు జిల్లా ఎస్పీ బి.రాజకుమారిని జిల్లా పోలీసు కార్యాలయంలో కలిసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి. రాజకుమారి విద్యార్ధులు ఎం. రేవంత్ సుశీలాస్, వి. లక్ష్మీ నారాయణలను అభినందించి,శుభాకాంక్షలు తెలిపారు. చండీఘర్ లో ఈ నెల 20 నుండి జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించి, విజయనగరం జిల్లాకు మంచి పేరును తీసుకొని రావాలన్నారు. గతంలో కూడా శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో కూడా ఈ విద్యార్థులు పాల్గొని, పతకాలను సాధించినట్లుగా పాఠశాల చైర్మన్ ఎ. ఏడుకొండలు జిల్లా ఎస్పీ బి. రాజకుమారికి తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, డిసిఆర్ బి సిఐ బి.వెంకటరావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...