విద్యార్థులు లే వర్కర్లు
గూడెం కోత్తవీధి పెన్ పవర్కరోనా తర్వాత స్కూలు రీజనింగ్ చేసిన నుండి మూడు నెలల గడిచిన తర్వాత హాస్టల్లో విద్యార్థులు, విద్యార్థినిలు చేత వేటి చాకిరీ చేయిస్తున్న ఉపాధ్యాయుల పై చర్యలు తీసుకోవాలని గిరిజనుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు, హాస్టల్లో ఉన్న కిచెన్ నుండి వచ్చే వ్యర్థం పదార్థాలు గంజి తో పాటు స్కూల్ ఎదురుగా ఉన్న డ్రైనేజీ లో మూడు నెలల పాటు వ్యర్థాలతో నిండిన మురుగు నీరు ఎటు వెళ్ళాక డ్రైనేజీ లో ఉండిపోవడంతో హాస్టల్ విద్యార్థులు సాయంత్రం భోజనం చేసిన తరువాత ఏడు గంటల సమయంలో అది రహస్యంగా హాస్టల్ విద్యార్థినిలతో సాయంత్రం వేళల్లో ఏడు గంటల మొదలుకొని రాత్రి 9 గంటల వరకు మోకాళ్ళ లోతు డ్రైనేజీ మురుగు కాలువలోకి దింపిన హాస్టల్ వార్డెన్,పి, డి మరియు సూపర్వైజర్,స్టిడికి వచ్చిన ఇంగ్లీష్ టీచర్,కలిసి దగ్గరుండి చదువుకోనే పిల్లలు చేత మురుగు డ్రైనేజీ లో దింపారు, పిల్లలు చేతులతో ఆ మురుగు వ్యర్థాలను ఎత్తించి పైన పడేశారు, స్కూలుకు అనేక నిధులు వచ్చినప్పటికీ ఆ నిధులను పక్కదారి పడుతున్నాట్లు విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు,చదువుకోనే చిన్న పిల్లలతో వెట్టి చాకిరి చేయిస్తున్న అధికారులు మాత్రం తమకు ఏమి తెలియనట్లు విచారిస్తున్నారు, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో, పాడేరు సబ్ కలెక్టర్ తక్షణమే స్పందించి చిన్న పిల్లలతో పని చేయించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

No comments:
Post a Comment