సావిత్రి బాయి ఫూలే ఆశయాలను కొనసాగిద్దాం....
స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్
అదిలాబాద్ , పెన్ పవర్
అట్టడుగువర్గాలు, మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింప పడిన దేశంలో ఆనాటి సమాజ కట్టుబాట్లను ధిక్కరించి స్త్రీలకు పాఠశాలలు నిర్మించి పాఠాలు నేర్పిన విద్యాదేవత సావిత్రి బాయి పూలే అని స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సోన్ కాంబ్లే వికాస్ అన్నారు. బుధవారం స్థానిక అంభేడ్కర్ భవనములో స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే వర్థంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే స్త్రీల హక్కుల కోసం ఎంతగానో పోరాడారన్నారు. ప్రతి ఒక్కరూ ఆమె ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భీం ఆర్మీ అధ్యక్షుడు సందీప్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్ కాంభ్లే బాబారావు, వార్డు సభ్యులు థిట్టే నాగరాజ్, గాయక్ వాడ్ భారత్, స్వేరోస్ మండల నాయకులు జంధడే బాలాజీ, సూర్యవంశీ బాదల్, గాయక్ వాడ్ బాబాసాహెబ్, వాగ్మారే పండిత్, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment