రాజరాజేశ్వరి ఆలయంలో ఎడ్ల బండ్ల పోటీలు
గొల్లపల్లి,పెన్ పవర్
గొల్లపెల్లి మండలం లొత్తునూర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో మూడు రోజులపాటు జాతర మహోత్సవం జరుగగా ఆలయ ఆవరణంలో ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించిగా పోటీలలో పన్నెండు బండ్లు పాల్గొనగా వీరిలో మొదటి బహుమతి షేక్ బాష్ మియా గెలుపొందగా,వీరికి గౌడ సంఘము పావుతులం బంగారం,రెండవ బహుమతి మదాసు వెంకటశివ గెలుపొందగావీరికి సామాల పెద్ద గంగారాం ఎనిమిది తులాల వెండి, మూడవ బహుమతి నలిగేటి కార్తిక్ లు గెలుపొందగా ఓరగంటి మల్లేష్ నాలుగు తులాల వెండిని దాతలు గెలుపొందినవారికి అందజేశారు.భక్తులకు మైదం సురేష్-ఉమ దంపతులు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేశ్వరి,ఎంపిటిసి సంతోషి-మారుతి, పుట్టపాక సత్యం,బండి సత్యం, పొన్నం స్వామి,బిసగొని మల్లేశం, బోనాల రత్నయ్య ఆకుల రాజు ఎమ్.తిరుపతి లక్ష్మికాంతం, తిరుపతి,చంద్రయ్య,కొండయ్య రవి స్వాములు గ్రామా ప్రజలు తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment