పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికే ఓటేయండి..కూనా శ్రీశైలంగౌడ్
కుత్బుల్లాపూర్,పెన్ పవర్
నిరంకుశత్వ పాలన కొనసాగిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటె దీటైన పార్టి భారతీయ జనతాపార్టీ అని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు కూనా శ్రీశైలంగౌడ్ పేర్కొన్నారు.. కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్టలోని ఎంకెఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ నాయకుల కార్యకర్తల పట్టభద్రుల సమ్మేళన కార్యక్రమం కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రామచంద్రరావును భారీ మెజారిటీతో గెలిపించాలని విద్యావంతులకు, మేధావులకు, పట్టభద్రులకు శ్రీశైలంగౌడ్ విజ్ఞప్తి చేశారు, అంతేకాకుండా టిఆర్ఎస్ నాయకుల ఆగడాలను జగద్గిరిగుట్టలో అంతమొందించాలంటె రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి ప్రతి విద్యావంతునీ ఓటు బిజెపి అభ్యర్థికి పడేలాగా కృషి చేయాలని ఆయన మనవి చేశారు. టిఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడాలంటె భీజేపికే ఓటు వేయాలని తెలిపారు.. కార్యక్రమంలో పలువురు జగద్గిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను బిజెపి పార్టీలోకి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గిరి వర్ధన్ రెడ్డి , మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి, శేఖర్ యాదవ్, పున్నారెడ్డి , సురేష్ రెడ్డి, నరేష్ రెడ్డి, సిద్ది రామ్ రెడ్డి, సుధా, అరుణ రెడ్డి, అరుణ్, నర్సింగ్, గణేష్ జా, మురళి, వరలక్ష్మి, హైమావతి, మాధవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment