Followers

బైంసా అల్లర్ల పై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి.

 బైంసా అల్లర్ల  పై  ఉన్నత  స్థాయి విచారణ జరిపించాలి.

త్వరలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలుస్తాను

 ఎంపీ సోయం బాపు రావు

 ఆదిలాబాద్ , పెన్ పవర్

ఈ నెల ఏడున ఆదివారం రాత్రి బైంసా లో జరిగిన అల్లర్ల ఘటన లో విద్రోహ శక్తులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలనీ ఈ ఘటనా పై ఉన్నత  స్థాయి విచారణ జరిపించాలని ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపు రావు అన్నారు.బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకులతో కలిసి ఎంపీ సోయంబాపు రావు  డీజీపీ మహేందర్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు.  ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ  తన నియోజకవర్గమైన బైంసా లో తరచూ ప్రణాళిక బద్దంగా ఒక వర్గం విద్వేషాలు సృష్టిస్తూ దాడులు జరుపుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. అధికార తెరాస పార్టీ నాయకుల అండతో  ఎంఐఎం   నేతలు  కుట్రలు పన్నుతూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని అన్నారు. ఈ అల్లర్ల విషయమై  త్వరలోనే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలుస్తానని ఎంపీ సోయం  బాపు రావు పేర్కొన్నారు. డి జి పి ను కలిసిన వారిలో నిజామాబాద్ ఎంపీ అరవింద్, పెద్దపెల్లి మాజీ ఎంపీ వివేక్,  తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...