అవినీతి ఊబిలో సత్యవేడు సబ్ రిజిస్టర్ కార్యాలయం
చేయి తడపందే భూ రిజిస్ట్రేషన్లు కావుసబ్ రిజిస్టర్ కార్యాలయంలో సర్వ సాధారణం గా మారుతున్న కాసులదందా
భూరిజిస్ట్రేషన్ కోసం భూవిలువలో దాదాపు ఒక శాతం ఆమ్యామ్యాలు సమర్పించుకోవాలి సిందే
భూములకు సంబంధించిన ఈసీలు కావాలన్న అదనంగా కాసులు ఇవ్వాల్సిందే .
సత్యవేడు సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారుల తీరు ఇది
పెన్ పవర్,సత్యవేడు
చిత్తూరు జిల్లా సత్యవేడు సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతి ఊబిలో కూరుకుపోతున్నట్టు సర్వత్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి .భూముల క్రయవిక్రయాలలో రిజిస్ట్రేషన్ అధికారుల చేయితడపందే భూరిజిస్ట్రేషన్ కావడం గగనమే అవుతుందని పలువురు కొనుగోలుదారులు చెబుతున్నారు .దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కాసుల దందా సర్వసాధారణంగా మారిపోతున్న వైనం కనిపిస్తోంది .ముఖ్యంగా భూ క్రయవిక్రయాలలో కొనుగోలుదారులు భూ విలువలో దాదాపు ఒక శాతం సొమ్మును సంబంధిత సబ్ రిజిస్ట్రేషన్ అధికారులకు ఆమ్యామ్యాలుగా సమర్పించుకుంటే తప్ప భూరిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి ఉండదు . పైగా భూ కొనుగోలుకు సంబంధించి రికార్డు పరంగా అన్ని సక్రమంగా ఉన్న కాసులు ఇవ్వకుంటే మాత్రం లేనిపోని కొర్రీలు పెట్టి వాటిని పక్కన పెట్టడం రిజిస్ట్రేషన్ అధికారులకు అందవేసిన చేయిగా మారుతోంది .ఉదాహరణకు 10 లక్షల రూపాయల విలువ చేసే భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే నిబంధనల మేరకు స్టాంప్ డ్యూటీ ఆరున్నర శాతం అరవై ఐదు వేల రూపాయలు ,రిజిస్ట్రేషన్ ఫీజు ఒక శాతం పదివేల రూపాయలు , యూజర్ చార్జీలు 250 రూపాయలను ఆన్లైన్ చలానా ద్వారా భూ కొనుగోలుదారుడు చెల్లించాల్సి ఉంటుంది . దీంతోపాటు సబ్ రిజిస్ట్రేషన్ అధికారులకు ఆదనంగా ఒక శాతం పదివేల రూపాయలను లంచంగా సమర్పించుకోవాలిసిందే .అలాగే భూక్రయ విక్రయాలు సంబంధించిన ఈసీల మంజూరులో 1983 నుంచి ఇప్పటివరకు వందల 520 రూపాయలు తీసుకోవాల్సి ఉండగా 750 ,అదే 1993 నుంచి అయితే రెండు వందల ఇరవై రూపాయలు చెల్లించాల్సి ఉండగా మూడు వందల యాభై రూపాయలు చెల్లించే పరిస్థితి వస్తోంది .ఈతంతు పూర్తిగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కనుసన్నల్లో జరుగుతున్నట్టు ఆరోపణల మిన్నంటుతున్నాయి .సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దళారుల ప్రమేయాన్ని నివారించడంతోపాటు అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఆన్లైన్ పద్ధతిని అమల్లోకి తెచ్చిన ప్రయోజనం లేకపోతోంది .సత్యవేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల హవా కొనసాగుతోంది .ఇద్దరు రాజశేఖర్లు కార్యాలయంలోనే తిష్టవేసి భూ క్రయవిక్రయాల సంబంధించిన అవసరమైన విషయాలను ఎప్పటికప్పుడు ఇటు రిజిస్ట్రేషన్ అధికారులకు ,అటు కొనుగోలుదారులకు అందిస్తూ చక్రం తిప్పడం రివాజుగా మారింది .రిజిస్టర్ కార్యాలయంలో కాసుల దందా యథేచ్ఛగా కొనసాగుతున్న సంబంధిత అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . సత్యవేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొనసాగుతున్న కాసులదందా వ్యవహారంపై సంబంధిత సబ్ రిజిస్టర్ అధికారిని కోమలదేవిని వివరణ కోరగా అటువంటిది ఏది తన దృష్టికి రాలేదన్నారు . ఏదైనా జరిగితే చర్యలు తప్పకుండా తీసుకోవడం జరుగుతుందన్నారు .ఏది ఏమైనా సత్యవేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొనసాగుతున్న ఆమ్యామ్యాలు వ్యవహారాన్ని కట్టడి చేయడానికి సంబంధిత ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకొని భూ కొనుగోలుదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పలువురు కోరుతున్నారు .

No comments:
Post a Comment