రామలింగేశ్వర ఆలయానికి పంచలోహ ఉత్సవ విగ్రహాల బహుకరణ
నెక్కొండ,పెన్ పవర్
నెక్కొండ లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నెక్కొండ కు చెందిన ప్రముఖ వ్యాపారి నంగునూరి శివయ్య-సావిత్రి దంపతులు శ్రీపార్వతీ పరమేశ్వరుల పంచలోహ ఉత్సవ విగ్రహాలను బహుకరించారు. శివయ్య తన 60వ జన్మదినం షష్టిపూర్తి ఉత్సవ సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల పంచలోహ ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకుల చేతులమీదుగా అందించారు .ఎనిమిదేళ్ల క్రితం అందించిన పంచలోహ విగ్రహాలు గత ఏడాది ఆలయం నుంచి చోరీకి గురవ్వగా వాటి స్థానంలో కొత్త విగ్రహాలను గురువారం అందించారు.అలాగే ఆలయానికి రంగులు కూడా వేయించారు.గురువారం ఆలయ మండపంలో ఉత్సవ మూర్తులకు దాన్య,జల,పుష్ప అధివాసాల అనంతరం పంచామృత అభిషేకాలు, విశేష పూజలు జరిపారు.విగ్రహ దాతల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించారు.


No comments:
Post a Comment