శివనామస్మరణతో హోరెత్తిన రామలింగేశ్వరాలయం
నెక్కొండ,పెన్ పవర్
నెక్కొండలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో గురువారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు .ఆలయ అర్చకులు బివిఎన్ శాస్త్రి ఆధ్వర్యంలో అనుముల గోపాల కృష్ణమూర్తి శర్మ ,బూర్గుపల్లి శ్రావన్ శాస్త్రి ,శేష పవన్ కుమారాచార్యులు,వరప్రసాద్ శర్మ,సహజల్ యోధన్ శాస్ట్రీ ఆధ్వర్యంలో పూజాధి కార్యక్రమాలు సాగాయి .ఉదయం ఆరు గంటల నుంచే ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. మధ్యాహ్నం దాకా మహాశివుడికి పంచామృత అభిషేక కార్యక్రమాలు సాగాయి .ఉత్సవ మూర్తులకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం నిర్వహించే కల్యాణానికి ముస్తాబు చేశారు. గర్భగుడిలో ప్రతిష్టుతులైన పరమశివుడికి రుద్రాభిషేకాలు, మంటపంలో కొలువుదీరిన పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులకు అష్టోత్తర శతనామ కార్యక్రమాలు సాగాయి .ఓం నమ శివాయ ,నమః పార్వతి పతయే హరహర మహాదేవ,శంభో శంకర నామస్మరణతో ఆలయ ప్రాంగణం హోరెత్తాయి.సాయంత్రం నిర్వహించే శివకల్యాణం కల్యాణ క్రతువుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమంలో విగ్రహ దాతలు నంగునూరి శివయ్య-సావిత్రి దంపతులు, శ్రీరామలింగేశ్వర సేవా సమితి సభ్యులు డింగరిపవన్,ఆనంతులమురళీధర్,తాటిపెల్లి శివకుమార్,దోర్నాల ధర్మారెడ్డి, దొడ్డ విజయ్, పొక్కుల దనిష్ఠతదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment