ఆర్డీవో కి, కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించిన జనసేన పార్టీ
మహారాణి పేట, పెన్ పవర్
బుధవారం నాడు 42 వార్డు లో పోలింగ్ అధికారులు అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ కలిసి పోలింగ్ బాక్స్ లు పోలింగ్ ఏజెంట్లు ముందు సీల్ వేయకుండా అవకతవకలు జరిగాయని ఆ రోజే అర్ధరాత్రి రెండు వరకు, జిల్లా నాయకులు జనసేన లీగల్ విభాగం, మరియు జనసైనికులు ధర్నా చేసి జరిగిన అన్యాయాన్ని ఆర్.డి.ఓ, కి తెలియజేయడం జరిగింది.ఈరోజు పూర్తి రిపోర్ట్ అలాగే వినతి పత్రం ఆర్డీవో కి, కలెక్టర్ కి అందించి న్యాయం జరగాలని ఏవైతే బూతుల్లో అవకతవకలు జరిగాయో ఆ బూతుల్లో రీ పోలింగ్ జరగాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యంగా జనసేన పార్టీ లీగల్ విభాగం నుండి రేవతి పూర్తి సహకారం అందించి మద్దతు తెలిపారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మద్దతుగా నిలిచి సహకరించిన సుందరపు విజయ్ కుమార్ కి హృదయపూర్వక ఉషాకిరణ్ విశాఖపట్నం నియోజకవర్గం ఇంఛార్జి ధన్యవాదాలు తెలిపారు.


No comments:
Post a Comment