కౌన్సిల్ మొదటి సమావేశంలోనే ధాటిగా ప్రసంగించి అందరి దృష్టిని ఆకర్షించిన కందులనాగరాజు
మహారాణి పేట, పెన్ పవర్
విశాఖ ఉక్కును ప్రవేటీకరణ కు వ్యతిరేకంగా అన్నిరాజకీయపక్షాలు కలిసి పోరాటం చెయ్యాలని జీవీఎంసీ కార్పొరేటర్ కందులనాగరాజు పిలుపునిచ్చారు.శుక్రవారం అల్లిపురం నుంచి జీవీఎంసీ వరకూ విశాఖ ఉక్కును ప్రవేటీకరణ చేయవద్దంటూ పాదయాత్ర గా వచ్చి గాంధీవిగ్రహానికి పూలమావేసి నివాళులు అర్పించారు.అనంతరం జీవీఎంసీ కౌన్సిల్ మొదటిసమావేశానికి హాజరైయ్యారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేసుకుంటూ పాదయాత్ర చేసారు.కౌన్సిల్ లో మాట్లాడుతూ విశాఖ ఉక్కు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని,కౌన్సిల్ వేదికగా ప్రవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేద్దామని ప్రతిపాదించారు.విశాఖ ఉక్కుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని,లక్షలాది కుటుంబాలు విశాఖ ఉక్కుపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. కౌన్సిల్ మొదటి సమావేశంలోనే ధాటిగా ప్రసంగించి అందరి దృష్టిని ఆకర్షించారు.


No comments:
Post a Comment