మౌలిక వసతులు మెరుగుపరచటమే ఈ ప్రభుత్వ లక్ష్యం ..కె కె రాజు
విశాఖ ఉత్తరం, పెన్ పవర్
సీతమ్మపేట 25వ వార్డు పరిధిలో రెల్లి వీధి ప్రాంతాల్లో జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమీషనర్ సృజన మరియు అధికారులతో కలిసి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ విశాఖ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచటమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 25 వ వార్డు కార్పొరేటర్ సారిపల్లి గోవింద్, బి. గోవింద్,సoపగి శ్రీను,సురేష్,హరి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment